Wednesday, 11 March 2026

Blog

E-పేపర్

సంక్రాంతి పండుగ

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. *మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిది భోగి పండుగ (Bhogi 2026)* *ధనుర్మాసానికి ముగింపు.* *భక్తి శ్రద్ధలతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన గోదా దేవి శ్రీరంగనాథుడి పత్నిగా సౌభాగ్యానికి నోచుకున్న పుణ్య ఘట్టానికి సంకేతమే ఈ భోగి పండుగ (Bhogi Festival 2026).* *లేమి చీకట్ల నుంచి భోగ వికాసాల్లోకి దారిచూపే ఆ మంటలనే భోగిమంటలు అంటాం.* *రేపటి రోజు నుంచి ఆరంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలాన్ని నూతన జీవనానికి ఆహ్వాన చిహ్నంగా భావిస్తాం.* *మాట ద్వారా మనిషి ఆలోచనలను ఎలా గ్రహించవచ్చో…పండుగల ద్వారా ఒక జాతి ఆచారాలను గ్రహించడానికి పండుగలు అలాగ అనడంలో ఎలాంటి సందేహం లేదు.* *ప్రతి ప్రాంతంలో పండుగలు జరుపుకునే తీరు ఎన్నో ఆధ్యాత్మిక, ఆచార, సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తుంది. కాబట్టే పండుగలను జాతికి జీవనాడిగా చెబుతారు.* *వాటిని మన సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. అయితే ఈ పండుగల్లో మనుషులకు మాత్రమే కాదు జంతువులకు, ప్రకృతికి , ఈ సృష్టిలో సమస్త జీవజాలానికి భాగం పంచారు.* *పశుపక్షాదులు సైతం మానవ పరివారంలో భాగమే అన్నది ఈ పండుగల ద్వారా పెద్దలు మనకందించిన సందేశం.* *పైన చెప్పిన వాటన్నింటికీ చక్కటి ఉదాహరణ సంక్రాంతి పండుగ (Sankranti 2026).* END Uploaded Video:

E-పేపర్

కోడిపందాలు అడ్డుకుంటాం.

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం పరిధిలో కోడిపందాలు ఆపకపోతే మహిళలతో అడ్డుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా కోడిపందాలు నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేయాలి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ : ఖండవల్లి లక్ష్మీ. END

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎంపీ గారి ఆధ్వర్యంలో ఘనంగా vpr నేత్ర కంటి వైద్య శిబిరo

దుత్తలూరు Date :13-1-2026 దుత్తలూరు మండలం రెడ్లదిన్నె పంచాయతీ లొ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరo పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా స్థానిక పార్లమెంట్ సభ్యులువేమిరెడ్డి ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈరోజు రెడ్లదిన్నె గ్రామం లొ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ​ప్రముఖ కంటి ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని రోగులకు పరీక్షలు నిర్వహించారు. ​పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలను, మందులను అందజేశారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టీడీపీ దుత్తలూరు మండలం కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి గారు,తెలుగుదేశం కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తమ గ్రామానికి వచ్చి ఉచితంగా పరీక్షలు నిర్వహించినందుకు స్థానికులు ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు ఫోర్టు రోడ్డు వెంచర్‌లో కారులో వ్యక్తి అనుమానాస్పద మృతి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం ఫోర్టు రోడ్డు ఆపోజిట్‌లోని ఓ వెంచర్‌లో నిలిపి ఉన్న కారులో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా తడ మండలం భీమవారిపాలెం గ్రామానికి చెందిన దాన సుందరం రాజా (తండ్రి: దాన సుందరం) కారులో అపస్మారక స్థితిలో ఉన్నట్లు రైతులు గమనించి మనుబోలు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్లూస్ టీం సహాయంతో కారు తెరిచి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కామారెడ్డి

కామారెడ్డిలో సమ్మెపై వినతి పత్రాలు

కామారెడ్డి, 13 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : దసరా నుంచి సంక్రాంతి వరకు వేతనాలు రాకపోవడంతో ఎన్‌హెచ్‌ఎం (జాతీయ ఆరోగ్య మిషన్) కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తక్కువ జీతాలతో, ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ప్రజల ఆరోగ్య సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు పల్లెలు, సామాన్య ప్రజల వరకు చేరేలా చేస్తున్నా మని వారు తెలిపారు.ఈ బుధవారం జిల్లా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఎన్‌హెచ్‌ఎం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు డీఎంహెచ్‌ఓకు, బాన్సువాడ ఆర్‌ఎంఓ డాక్టర్ సుజాతకు వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న వేతన భత్యాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, జనవరి 14 నుంచి 21 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యారోగ్య సేవలు కొనసా గిస్తూ నిరసన తెలియజేస్తామని హెచ్చరించా రు.ఈ నెల 21 వరకు జీతాలు రాకపోతే 22వ తేదీ నుంచి సమ్మె తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించా లని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్‌హె చ్‌ఎం ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు ఆక్షేపించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా నాయ కులు తాళ్లపల్లి సుమన్, వెంకటరమణ, రాజు, శ్రీకాంత్, పద్మజ, అశ్విని, సుభాషిణి, శోభ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఒకే పోలీస్ కమీషనరేట్ పరిధిలోకి తేవాలి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఒకే పోలీస్ కమీషనరేట్ పరిధిలోకి తేవాలి రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్: పున్నమి న్యూస్ ప్రతినిధి : 14 జనవరి 2026 ముఖ్యమంత్రి , డిజిపి కి నివేదించిన మంచిరెడ్డి* ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని పోలీస్ స్టేషన్లను ఒకే పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి నివేదించారు.ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిజిపి బత్తుల శివధర్ రెడ్డి కి లేఖ రాశారు. 1. ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ ను మేడిపల్లి లేదా కుర్మిద్ద గ్రామాలలో ఏర్పాటు చేయాలి , దీనిని మహేశ్వరం ఎసిపి పరిధిలోకి మార్చకుండా ఇబ్రహీంపట్నం ఎసిపి పరిధిలోనే కొనసాగించాలి. 2. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ ను వనస్థలిపురం ఎసిపి పరిధి నుండి మినహాయించి ఇబ్రహీంపట్నం ఎసిపి పరిధిలోకి తేవాలి. 3. ⁠ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ను హైదరాబాద్ కమీషనరేట్ లో చేర్చడం సరికాదు , ఫ్యూచర్ సిటీ కమీషనరేట్ పరిధిలోనే కొనసాగించాలి. 4. ⁠ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని కుర్మిద్ద , మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేవిదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. భవదీయ *సత్తు వెంకటరమణారెడ్డి ,* జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ , రంగారెడ్డి జిల్లా

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన వైసీపీ యువ నేత పి. ఎం. కె రాజు

సీతారామపురం జనవరి(పున్నమి ప్రతినిధి ) వైఎస్ఆర్సిపి ని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని డిఆర్ ఉత్తమ్ హోటల్లో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి సంస్థాగత కమిటీల నిర్మాణంపై జరిపిన విస్తృతస్తాయి సమావేశంలో సీతారామపురం మండలానికి చెందిన వైసిపి యువనేత పాలగిరి ముద్దుకృష్ణమరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సిపి రీజనల్ కోఆర్డినేటర్, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: మాజీ జెడ్పిటిసి దుగ్గిరెడ్డి గురవారెడ్డి

సీతారామపురం జనవరి (పున్నమి ప్రతినిధి) ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ సీనియర్ నాయకుడు, సీతారామపురం మాజీ జెడ్పిటిసి దుగ్గిరెడ్డి గురవారెడ్డి తెలియజేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్, జగనన్న అభిమానులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని కోరుతున్నామన్నారు.

కామారెడ్డి

అన్నారం గ్రామంలో నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

కామారెడ్డి, 13 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, అన్నారం గ్రామంలోని డ్వాక్రా మహిళా సంఘం సభ్యులు, సీసీ శ్రీనివాస్, వోఏలులతో పాటు నూతన సర్పంచ్ లతా శ్రీనివాస్, ఉపసర్పంచ్ దయానంద్‌లను పాల కవర్గానికి మంగళవారం ఘన సన్మానం చేశారు. ఈ ఉత్సవాత్మక కార్యక్రమం గ్రామ ప్రజలలో ఉత్సాహాన్ని రేకెత్తించింది.కార్యక్రమంలో మద్దికుం ట లావణ్య, పద్మ, భవాని, లావణ్య గ్రామ సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నూతన పాలకుల పట్ల గ్రామస్తులు చూపిన ఈ మమత, గ్రామాభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తుందని అందరూ భావించారు. ఈ సందర్భంగా పాలకులు గ్రామ శ్రేయస్సు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సన్మానోత్సవం గ్రామంలో ఐక్యత, సహకార భావాన్ని మరింత బలపరిచింది. ప్రజల పాల్గొన్న ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ వ్యవస్థలో ప్రజాసమీక్షణకు ముఖ్యమైనదిగా నిలిచింది.

ఖమ్మం

అనారోగ్యంతో మృతి చెందిన సీపీఎం నాయకుడు కట్టా గాంధీకి బీజేపీ నేతల నివాళులు:

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) అనారోగ్య కారణాలతో మృతి చెందిన మధిర డివిజన్ సీపీఎం ప్రముఖ నాయకులు కట్టా గాంధీ గారి భౌతిక కాయానికి బీజేపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. కల్లూరు మండలం పోచారం గ్రామంలోని ఆయన స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియలకు బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఖమ్మం జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ హాజరై పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు కట్టా గాంధీ గారు ప్రజా సమస్యల పరిష్కారానికి, కార్మిక–రైతు ఉద్యమాలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.