Friday, 27 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

లాక్‌డౌన్‌ క్రాప్‌

లాక్‌డౌన్‌ క్రాప్‌ కొంత మంది జుట్టు పెంచుకుని అదొక ఫాషన్‌గా సరదాగా గడుపుతుంటారు. కానీ ఎక్కువ మంది జుట్టు పెరిగితే సరదాగా వుండలేరు. వారికి చిరాగ్గా వుంటుంది. ఎప్పుడెప్పుడు క్రాప్‌ చేయిస్తామా? అని ఎదురుచూస్తుంటారు. కాస్త తీరిక దొరికితే సోన్‌కి వెళ్లి, క్రాప్‌ చేయించుకుంటూ వుంటారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు, సెలూన్లు తెరిచి 20 రోజుల పైనే అయిపోయింది. మరో 20 రోజు సెలూన్లు తెరిచే పరిస్థితి లేదు. గ్రామాల్లో అయితే బార్బర్‌ ఇంటికి వచ్చి, క్రాప్‌ చేసే అవకాశం వుంటుంది. పట్టణాల్లో వీలు కాదు. అలా అని క్రాప్‌ పెంచుకుని లాక్‌డౌన్‌ అయ్యేదాకా వేచి వుండాంటే ఎక్కువ మంది జనానికి విసుగు, చిరాకూను. అందుకే హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్న నెల్లూరు నివాసి జి.వి.నాగరాజారావు ఇంట్లోనే తన భార్య సుధ సహకారంతో క్రాప్‌ శుద్ధంగా, సెలూన్లో లాగే చేయించుకుని, తల భారం తగ్గించుకున్నారు. గాంధీ చెప్పినట్లు మన పనులన్ని మనమే చేసుకునే రోజులు వచ్చాయి కరోనా వల్ల.  క్రాపుల్లో రకరకాల క్రాపులు ప్రాచుర్యంలో వున్న నేడు కొత్తగా ‘లాక్‌డౌన్‌క్రాప్‌’ కూడా చేరింది.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పుడోలెక్క

మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పుడోలెక్క కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఇలాంటి వైరస్​లు మరిన్ని పుట్టుకురావొచ్చు. అందుకే ఇప్పటిదాకా గడిపిన జీవితం వేరు.. ఇక నుంచి గడపాల్సిన జీవితం వేరు. పర్సనల్​గానే కాదు ఫ్యామిలీ మెంబర్స్​తో గడిపే లైఫ్​ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్​, రిలేటివ్స్​, కొలీగ్స్​తో రిలేషన్​ కూడా చేంజ్​ చేసుకోవాలి.  వీటన్నింటితో పాటు.. మన అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఇంటి నుంచే మొదలవ్వాలి లైఫ్​స్టైల్​ చేంజ్​ అనేది ముందుగా ఇంటి నుంచే మొదలవ్వాలి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా… ఇంట్లో ఉండాల్సి వస్తే, ఆ ఇల్లు ఆరోగ్యాన్నిచ్చేదిలా ఉండాలి. అంటే.. అవసరమైనప్పుడే ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా మార్పులు చేసుకోవాలి. ఎప్పుడూ మెడికల్​ షాపు​లోని మందులపైనే ఆధారపడకుండా ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచాలి. ఇల్లు ఎప్పుడూ పొడిగా ఉండాలి. వాటర్ లీకేజీ లేకుండా రిపేర్​ చేయించుకోవాలి. అలాగే స్థలం ఉంటే బాత్రూమ్​, వాష్​రూమ్​ వంటివి ఆరుబయట ఏర్పాటుచేసుకోవాలి. బ్రష్​ చేసుకునే సింక్​ వంటివి కూడా ఇంట్లో కాకుండా బయటే ఉంటే బెటర్​. ఇంట్లోని ఫ్లోర్​ను ఈజీగా క్లీన్​ చేసుకునేలా స్పేస్​ ఫ్రీగా ఉంచుకోవాలి. అవసరంలేని వస్తువులన్నింటిని అటకెక్కించాలి. కిరాణా లిస్ట్​ మారాలి ఇప్పటిదాకా కిరాణా లిస్ట్​ కేవలం వంటింటి సరుకులు, సబ్బులు, సర్ఫ్​లకే పరిమితమయ్యేది. ఇకపై ఆ లిస్ట్​లో హ్యాండ్​వాష్, శానిటైజర్​ వంటివి కూడా చేర్చాలి. ఇప్పుడు కరోనా కలకలం ఉంది కదా అని మాత్రమే చేతులు కడుక్కుంటే సరిపోదు. ఇకపై కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. అందుకే ఇంట్లో ఎప్పుడూ హ్యాండ్​వాష్​, బ్యాగ్​లో ఎప్పుడూ శానిటైజర్​ ఉంచుకోవాలి. ఫుడ్​ హ్యాబిట్స్ మారాలి కాలంతో సంబంధం లేకుండా వేడి వేడివి  మాత్రమే తినాలి. ఫ్రిజ్​లో పెట్టి తినే అలవాటు మార్చుకోవాలి. కేవలం రుచికోసమే కాకుండా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి అన్నిరకాల ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. జంక్​ ఫుడ్​, కూల్​ డ్రింక్స్​ వంటివాటికి వీలైనంత దూరంగా ఉండాలి.  తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, డ్రైఫ్రూట్స్​ వంటివి రెగ్యులర్​గా తినాలి. నిజానికి జంక్​ఫుడ్​తో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువే. ఫ్రిజ్​లో నీళ్లు తాగడం మానేసి వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అంతగా చల్లటి నీళ్లు తాగాలనుకుంటే కుండలో నీళ్లు తాగాలి. వర్కవుట్స్​ కంపల్సరీ శరీరానికి తగినంత ఇమ్యూనిటీ​ ఉంటే వైరస్​లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ దాదాపు తరిమికొట్టొచ్చు. అదే లేకపోతే మనం ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా లాభం ఉండదు. మరి ఈ ఇమ్యూనిటీ కోసం మంచి ఫుడ్​ మాత్రమే తీసుకుంటే సరిపోదు. శరీరంలోని ప్రతి వ్యవస్థ బలంగా మారేలా వర్కవుట్స్​ కూడా చేయాలి. ఇప్పటిదాకా అలవాటు లేకపోయినాసరే.. ఇక నుంచి వర్కవుట్స్​ హాబీగా మారాలి. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి కూడా ప్రాక్టీస్​ చేయాలి. వీటిని ఏదో ఒక మతానికి సంబంధించినవిగా చూడొద్దు.  *పర్సనల్​  హైజీన్​* వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎప్పుడూ అవసరమే. బిజీ షెడ్యూల్​ ఉందని స్నానం చెయ్యకుండా ఉండొద్దు. తరచూ కాళ్లు, చేతులు కడుక్కోవడం అనేది ఎప్పుడూ కంటిన్యూ చేయాలి. ఇంట్లోకి అడుగుపెట్టకముందే కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అంతేగానీ.. అలసిపోయి వచ్చామంటూ సోఫాలో అలాగే సాగిలపడొద్దు. వీలైతే ఆఫీస్​ నుంచి వచ్చాక కూడా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. అంతేకాకుండా తరచూ చేతులతో ముఖాన్ని, శరీర భాగాలను తాకే అలవాటు కూడా మార్చుకోవాలి. శుభ్రత ఇంటిని, పరిసరాలను మాత్రమే శుభ్రం  చేసుకుంటే సరిపోదు. వైరస్​లు, బ్యాక్టీరియాలబారిన పడకుండా ఉండాలంటే ఇంటితోపాటు ఇంట్లో ఉండే వస్తువులను, పర్సనల్​గా మనం వాడే వస్తువులను కూడా క్లీన్​ చేసుకోవాలి. ల్యాప్​టాప్​, ఫోన్​, వ్యాలెట్, హ్యాండ్​ బ్యాగ్​, కంప్యూటర్​, కీబోర్డ్, టీవీ రిమోట్​, రిస్ట్​ వాచ్​, బుక్స్​ వంటివి క్లీన్​ చేయడం గురించి ఆలోచించం. కానీ వీటిని ఎప్పటికప్పుడు క్లీన్​ చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి వీటివల్లే  వైరస్​ స్ప్రెడ్​ అవుతుంది. పిల్లలు, పెద్దల పట్ల పిల్లలు, పెద్దల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. ‘జ్వరమేకదా.. జలుబే కదా.. దగ్గు కామనే’.. అంటూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎప్పుడూ ఇలాగే వస్తుంది కదా, అదే తగ్గిపోతుందిలే అనే వైఖరి ఇకపై మారాలి.  అలాగని మెడికల్​ షాపు​ నుంచి ఏదిపడితే అది తెచ్చి వేయొద్దు. పిల్లలను శుభ్రంగా ఉంచడంతోపాటు వాళ్లకు బలమైనవి తినిపించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్​ను కలవాలి. ఎక్కువయ్యేదాకా ఆగడం మంచిదికాదు. పెద్దోళ్ల విషయంలో కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. అవుట్​డోర్​ మీటింగ్స్​ టైంపాస్​ కాకపోతే అలా బయటకి వెళ్లొస్తామంటూ వెళ్లిపోతారు. సెలవు దొరికితే షికార్లకు ప్లాన్​చేస్తారు. కొన్నిసార్లు నేరుగా కలవాల్సిన​ అవసరం లేకపోయినా వెళ్లి కలిసి వస్తారు. బ్యాంకులు, బిల్లుల చెల్లింపు వంటివాటి కోసం గంటల తరబడి లైన్లలో నిలబడతారు. నిజానికి ఇవన్నీ ఇంటి నుంచే చేసుకోవచ్చు. అందుకే ఇకపై అవుట్​డోర్​ మీటింగ్స్​ను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ఫోన్​, ఆన్​లైన్​ చాటింగ్​ ద్వారానే పూర్తయ్యేలా చేసుకోవాలి. తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్లొద్దు. సెల్ఫ్​ డిసిప్లిన్​ సెల్ఫ్​ డిసిప్లిన్​ తప్పనిసరి. అది ఇంట్లో ఉన్నా సరే.. బయటకెళ్లినా సరే. ఎక్కడైనా ‘క్యూ’లో నిలబడాల్సి వస్తే మనిషికి, మనిషికి మధ్య స్పేస్​ ఉండేలా నిలబడాలి. విదేశాల్లో ఈ కల్చర్​ ఉన్నా.. మనదేశంలో మాత్రం మీదపడి తోసుకోవడమే. అంతేకాదు.. తుమ్మినా, దగ్గినా దస్తీ​ అడ్డంగా పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా దూరంగా ఉండి మాట్లాడాలి. తుంపర్లు పడేలా మరీ దగ్గరగా ఉండొద్దు……….

Featured ఆంధ్రప్రదేశ్

అత్యంత విషాదకరంగా చెన్నైలో నెల్లూరు డాక్టర్‌ అంత్యక్రియలు…

‘‘విధి ఒక విషవలయం, విషాద కథ కది నిలయం’’ ` అన్నాడు ఒక సినీ కవి. ఇది నిన్న చెన్నైలో మరణించిన డా.క్ష్మీనారాయణ రెడ్డి విషయంలో అక్షరాల నిజమైంది. కరోనాతో జీవితాన్ని చాలించిన డాక్టర్‌ అంత్యక్రియు నిన్న అత్యంత విషాదకరంగా చెన్నైలో ముగిశాయి. డాక్టర్‌ కరోనాకు బలైపోవడం ఒక ఎత్తయితే ఆయన భార్యకు కరోనా వైరస్‌ సోకడంతో నెల్లూరులో చికిత్స పొందుతుండడం, బిడ్డ మరో చోట వుండడం, గుండెల్ని పిండేసే సంఘటను. భర్తను కడసారి చూచుకునే అదృష్టానికి ఆ భార్యా, బిడ్డా నోచుకోకపోవడం మరింత విషాదకరం. అలానే ఆయన మిత్రుల0తా చివరి చూపుకు నోచుకోకపోయారు. డాక్టర్‌ అంత్యక్రియలుకు హాజరుకాలేక కడసారి చూపుకు దూరమయ్యారు. డాక్టరు ఎన్నో ఆశలు, ఆశయాలతో వైద్య వృత్తిని చేపట్టి ఉంటారు. తన జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాలని, ఆరేళ్ల కుమారుడికి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలని ఎన్నో కలలు కనివుంటారు. చివరకు కరోనా కాలసర్పానికి బలైపోయారు. డాక్టరు అంత్యక్రియలకు చెన్నై కార్పొరేషన్‌ ముందు ససేమిరా అంది. ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు గనుక మేము చేయలేమని చెప్పిన స్మశాన సిబ్బంది, పార్థివ దేహాన్ని వదిలి వెళ్లిపోయిన సిబ్బంది హృదయవిదారకంగా మారిన పరిస్థితి. చివరకు రాష్ట్ర ఉన్నతాధికారుల జోక్యంతో పోరూరు స్మశాన వాటికలో అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వ హెల్త్‌ ప్రోటోకాల్‌ ప్రకారం కార్పొరేషన్‌ సిబ్బంది పూర్తి చేశారు. పగవాడికి కూడా ఇంత కష్టం వద్దురా బాబూ అనుకుంటున్నారు నెల్లూరు ప్రజలు.

Featured ఆంధ్రప్రదేశ్

” ఉచిత అంబులెన్స్ సర్వీసులు పెంచాలి”. – ప్రజా ఆరోగ్య వేదిక విజ్ఞప్తి.

 ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా మన దేశాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది. దాన్ని కట్టడి చేసే ప్రణాళికలో భాగంగా కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా “లాక్ డౌన్” ప్రకటించి పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఇలాంటి నిర్బంధ సందర్భాల్లో ఎవరికైనా అనారోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కేవలం ఒక్క 108 అంబులెన్స్ సేవలు తప్ప ఇతర ప్రైవేటు వాహనాలు అందుబాటులో లేవు. గుండెనొప్పితో అల్లాడిపోతున్నా , కాన్పు నొప్పులతో గిలగిలా కొట్టుకుంటున్నా దగ్గరలో ఆసుపత్రిలో అందుబాటులో లేక, దూరంగా పోవడానికి రవాణా సౌకర్యం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.          మన రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి. సుమారు 5.3 కోట్ల జనాభా కలిగి ఉన్నాం. ఇందులో 10 లక్షల జనాభా దాటిన మహా నగరాలు-2,    5 లక్షలు దాటిన నగరాలు-2,   3 లక్షలు దాటిన నగరాలు-4,   2 లక్షలు దాటిన పట్టణాలు-8,  1 లక్ష జనాభా దాటిన పట్టణాలు-17  ఉన్నాయి. కానీ వీటన్నింటికీ కలిపి మొత్తంగా చూస్తే 5 కోట్ల పైగా జనాభా గల మన రాష్ట్రంలో కేవలం 439 అత్యవసర సర్వీసు అంబులెన్సులు మాత్రమే  ఉన్నాయి. అంటే సగటున 1లక్షా 20 వేల మందికి  ఒకే ఒక్క అంబులెన్స్ సేవలందిస్తోంది. సాధారణ పరిస్థితుల్లో నైతే ఈ సంఖ్యతో ఏదో ఒక విధంగా నెట్టుకు  పోతున్నాం కానీ ప్రస్తుతం ఉన్న నిర్బంధ పరిస్థితుల దృష్ట్యా అవి రాష్ట్ర ప్రజల అవసరాలకు ఏమాత్రం  సరిపోవడం లేదు. 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో మరియు ఇతర వాహనాలు అందుబాటులో లేకపోవడంతో సమయానికి చేరుకోలేక పోవడం వల్ల   కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.          కావున ప్రభుత్వం  ఎపిడమిక్ వ్యాధుల చట్టం ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో  ఉన్న అంబులెన్స్ లను కూడా స్వాధీనం చేసుకుని రాష్ట్రం లోని ప్రతి మండలానికి కనీసం ఒక్క అంబులెన్స్ నైనా ఏర్పాటు చేయాలి. అలాగే 10 లక్షల జనాభా దాటిన 2 మహా నగరాలకు 10 అంబులెన్సులు,  3 నుంచి5 లక్షల  జనాభా కలిగిన 6 నగరాలకు 5 అంబులెన్స్లు , 1 నుంచి 3 లక్షల జనాభా గల పట్టణాలకు కనీసం 3 అంబులెన్సులు ఏర్పాటు చేయాలి.          అలాగే అత్యవసర పరిస్థితుల్లో సర్వీసు ఇవ్వడానికి ప్రభుత్వం కేవలం ఓలా క్యాబ్స్ కు  ఒక్క విశాఖ నగరంలో మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాకాకుండా  లక్ష జనాభా దాటిన అన్ని పట్టణాల్లోనూ అలాంటి సర్వీసులను అనుమతిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.    కనుక ప్రభుత్వం ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తోంది. డాక్టర్ యం.వి రమణయ్య రాష్ట్రఅధ్యక్షులు ప్రజా ఆరోగ్య వేదిక

Featured ఆంధ్రప్రదేశ్

డాక్టర్ లక్ష్మి నారాయణకు ఐ ఎం ఏ సంతాపం

గత వారంలో కరోనా వ్యాధి సోకి అస్వస్థకు గురైన నెల్లూరు నగరానికి చెందిన ఎముకలు కీళ్ల వైద్యులు డాక్టర్ పెనుకొండ లక్ష్మి నారాయణ రెడ్డి సోమవారం మరణించారు. రాష్ట్రములో కరోనాకు బలైన మొదటి వైద్యులు.  కరోనా సోకినప్పటికీ తన వృత్తి ఐన వైద్యాన్ని నిర్వహిస్తూ కరోనా సోకి మరణించారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో వున్నా అయన ఆరోగ్య పరిస్థితి మొన్న రాత్రి అకస్మాత్తుగా క్షీణించడంతో కృత్రిమ శ్వాస అందిస్తుండగా సోమవారం ఉదయం మృతి చెందారు. ఐ.ఎం.ఏ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ శోకతప్త హృదయంతో శ్రద్ధాంజలి ఘటిస్తుంది. వారి సేవలను ముఖ్యముగా ఇటువంటి ప్రతికూల సమయములో వారిని స్లాఘిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తుందని  ఐ.ఎం.ఏ. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్. వి.కె. ప్రసాద్ రెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పోలవరపు ఫణిధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  వైదులు, ప్రజలు జాగర్తలు పాటిస్తూ కరోనా నియంత్రణకు కృషి చెయ్యాలని ఐ.ఎం.ఏ కోరుకుంటుంది.

Featured ఆంధ్రప్రదేశ్

జగనన్నా ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లను వీడియొ కాల్స్కు స్పందించమని సలహా చెప్పండి

ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో డాక్టర్ల ఓపీలన్నీ బందయ్యాయి. దాదాపు అన్నీ ప్రయివేటు ఆసుపత్రులు మూసుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికే తొమ్మిది నెలల గర్భిణులు డెలివరి సమయం వచ్చినవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు భయాందోళనలో ఉన్నారు. దాదాపు మత్తు డాక్టర్లందరినీ ప్రభుత్వం హాండ్ ఓవర్ చేసుకోవడం సిజేరియన్లు చేయాలంటే ఓ ప్రక్క కరోనా కారణంతో లాక్ డౌన్ స్టాప్ రాలేకపోవడం ఇబ్బందులూ వినిపిస్తున్నాయి. చాలామంది రెగ్యులర్ పేషెంట్లకు డాక్టర్ల సలహా పొందే అవకాశం తక్కువైంది. కొందరి డాక్టర్ల ఫోనులు స్పందించడం కష్టంగా ఉంది అంటున్నారు. ఎమర్జన్సీ డెలివరీ లు సిజేరియన్లు కు ఆయా డాక్టర్లూ సరైన ఏర్పాట్లు చేసుకొని ఉండేలా చర్యలు తీసుకుంటూనే…చాలామంది కి డాక్టరు తో మాట్లాడితే అదో ఉపశమనం. ఈ రోజుల్లో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా పేషెంట్లకు రోజూలో ఏదో కొంత సమయం కేటాయించి వీడియో కాల్ ద్వారా అందుబాటులో ఉంటే చాలమంచిది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారూ తమసభ్యులకు ఇలా ఆదేశాలిస్తే మేలు అని ఈ విషయం ను నెల్లూరు వాసి నాగరాజరావు లాయరు సీఎం మరియు జిల్లా యంత్రాంగంకు ట్వీట్ చేయడం జరిగింది. డాక్టర్లు ఈ వీడియో కాల్ కన్సల్టేషన్ ఏర్పాటుకు సన్నధ్ధం అవడం ఎంతో లాభదాయకం.

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మరణం – 

లాక్ డౌన్ కు సహకరిద్దము భౌతిక దూరాన్ని పటిద్దాము కరోనా వైరస్ బారిన పడి చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నెల్లూరుకు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి కొద్ది సేపటి క్రితం చెన్నైలో కన్నుమూశారు. గత నెలాఖరున విదేశాలకు వెళ్లివచ్చిన డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి ఈ నెల మొదటి వారం నెలూరులో నూతన హాస్పిటల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన తీవ్ర అస్వస్థతకు గురికాగా నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించమించడంతో నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ డాక్టర్ కోరిక మేరకు మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో కు తరలించారు. అక్కడ కూడా ఆయన పరిస్థితి మెరుగుపడలేదు. పెద్ద వయసు కావడం, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాలు ఉండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఇవాళ మధ్యాహ్నం చెన్నై అపోలో హాస్పిటల్ లో కన్నుమూసినట్లు ఆయన సన్నిహితులు తెలియజేసారు. మృతి చెందిన డాక్టర్ భార్యకు, హాస్పిటల్ ఫార్మాసిస్ట్ కు కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని నెల్లూరుకు తీసుకురాకుండా చెన్నైలోనే అంత్యక్రియలు నిర్వహించేలా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే డాక్టర్ మృతి విషయం    జిల్లా అధికారులు ఇంకా దృవీకరించలేదు.జిల్లా ప్రజలు నష్టం జరిగిందని భాధ పడటం కాకుండా కనీసం పద్దతులను పాటిస్తూ  లాక్ డౌన్ ద్వారా ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని పున్నమి కోరుకుంటుంది.

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు ఎంఎల్ఏలు వర్సెస్ అధికారులు

కరోనా విపత్తు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య చిచ్చురేపింది. జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేదలకు ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది.నిన్న బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పేదలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమంలో లాక్ డౌన్ లోని144 సెక్షన్ను అతిక్రమించడం టూ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పై అధికారులు కేసు నమోదు చేశారు. స్థానికంగా బుచ్చిరెడ్డిపాలెం లో ఈ పంపిణీ కార్యక్రమం జరగడంతో అక్కడి సీఐ సురేష్ బాబు ఉ ఎస్ఐలను జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ సెట్లో తీవ్రంగా మందలించారు. దీనిపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహించారు. ఇవాళ బుచ్చిరెడ్డిపాలెం లోని పోలీస్ స్టేషన్ వద్ద ఆయన బైఠాయించారు కరోనా విపత్తు సమయంలో పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తే దానిపై అధికారులు రాద్ధాంతం చేయడం, కేసులు నమోదు చేయడం ఏమిటంటూ ఆయన మండిపడ్డారు. ఇవాళ ఉదయం 10 గంటలకు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి దాదాపు మూడు గంటల పాటు ఆందోళన చేశారు. దాంతో జిల్లా కలెక్టర్ రంగప్రవేశం చేసి వివాదాన్ని సర్దుబాటు చేశారు. ఇదే సమయంలో జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి మద్దతుగా నిలిచారు.. జిల్లా వైసీపీ అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా అధికారుల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ముత్తుకూరు లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారుల తీరును తప్పుపట్టారు.. ఎమ్మెల్యే పైనే కేసు కడతారా.. అంతటి నేరం ఏమీ చేసారంటూ.. మండిపడ్డారు. విపత్తుల సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న వారిపై ఇలా కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. అధికారుల తీరులో మార్పు లేకుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మొత్తానికి నెల్లూరు జిల్లాలో కరోనా నేపథ్యంలో పేదలకు నిత్యావసరాలు అందజేసే ఈ కార్యక్రమం ఇప్పుడు అధికారులకు అధికార పార్టీ శాసనసభ్యులకు మధ్య చిచ్చు పెట్టింది.. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న చర్చ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Featured ఆంధ్రప్రదేశ్

మేము సైతం

  *మేము సైతం” అంటూ దొరవారిసత్రం ఎసై సుధాకర్ రెడ్డి, సిబ్బంది మరియు సూళ్లూరుపేట ఎలక్ట్రానిక్ మీడియా సాయం* *సూళ్ళూరుపేట నియోజకవర్గం* *దొరవారిసత్రం:-* చేసు కోవడానికి చేతిలో పనులు లేక జేబుల్లో పైసలు లేక రెక్కాడితే గాని డొక్కాడని వలస కూలీలకు స్థానిక ఎసై యల్ సుధాకర్ రెడ్డి మరియు సిబ్బంది, సూళ్లూరుపేట పట్టణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు నేడు అనగా శుక్రవారం ఉదయం “మేము సైతం” అంటూ ముందు కొచ్చి తమ వంతు సాయం గా “మనల్ని మనమే కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదిప్పుడు” అని వారికి బియ్యం , కూరగాయలు , కిరాణా వస్తువులను కూలి పనుల నిమిత్తం వచ్చి కరోనా వైరస్ మహమ్మారి కట్టడి లో భాగం గా బయటకు రాలేక ఇళ్ల లోనే ఉంటూ రోజు కూలీలు ఆకలి తో అలమ టిస్తున్న విషయం తమ ద్రుష్టి కి రాగానే మీడియా సోదరులు స్పందించి వారికి కొంతైన తమవంతు సాయం గా ఈ చిన్ని సహాయం చేయడం పై పలువురు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు . వివరాల్లో కెళితే సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని దొరవారిసత్రం (మండలం) లో రైల్వే కూలి పనుల కోసం బీహార్ , జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుండి వచ్చి కరోనా వైరస్ లాక్ డౌన్ లో చిక్కుకుని దిక్కు తోచని స్థితి లో ఉన్న కారణము గా ఇక్కడే చిక్కుపోయిన కూలీల ఆకలి తీర్చడానికి సూళ్లూరుపేట ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు సాహసో పేతమైన పట్టుదల తో మంచి మనస్సు తో ముందుకు వచ్చి నేడు దొరవారిసత్రం పోలీసుల తో కలిసి సంయుక్తం గా జర్నలిస్ట్ లు ఆపదలో ఉన్న కూలీలకు సహాయం చేశారు . ఈ కార్యక్రమం లో స్థానిక ఎస్ ఐ .యల్ సుధాకర్ రెడ్డి చేతుల మీదు గా 40 మంది కూలీ కుటుంబాలకు నెల రోజుల కు సరిపడే బియ్యం తో పాటు కిరాణా వస్తువులు , కూరగాయలు అందించారు . ఆకలి తో ఉన్న కూలీలను మీడియా వారు ఆదుకోవడం పట్ల ఎస్ ఐ . సుధాకర్ రెడ్డి జర్నలిస్ట్ ల నుద్దేశించి “పది మంది కి అన్నం పెట్ట గలిగిన శక్తీ ని భగవంతుడు మీలాంటి జర్నలిస్ట్ లకు ఇచ్చినందుకు నేను మిమ్మల్నెనెంతగానో అభినందిస్తున్నాను . అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కున్నవి రెండే కులాలు . అవేమి టంటే ఒకటి పాజిటివ్ రెండవది నెగిటివ్ . గతం లో అందరు బతికి చచ్చేవారు . కానీ ఇప్పుడు మనం అంటే మనందరం క్షణం క్షణం చస్తూ బతుకు తున్నాం ఎప్పుడెవరికి కరోనా వస్తుందో తెలియక . ముఖ్యం గా కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే మనిషి మనిషి కి రెండు మీటర్లు దూరం , ప్రతి రోజు ఓ గంట యోగ , జలుబు , దగ్గు , తుమ్ములు వచ్చి నప్పుడు నోటికి ఖచ్చిఫ్ పెట్టు కోవడం , , సెల్ ఫోన్ ను రోజు కు ఒక్క సారైన ఖచ్చిఫ్ తో శుభ్రం చేసుకోవడం , వంటివి చేస్తే చాలు . దేశ భద్రత కోసం పోరాట యోధులు ఐన పోలీసు వీరులు , రేయింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్న మునిసిపల్ కార్మికులు , తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నడాక్టర్లు , వైద్య సిబ్బంది కి శత కోటి వందనాలు” అంటున్నారు . అలాగే “దేశ భవిత కోసం వారు చేస్తున్న సేవలు అనంతమైన వని చరిత్ర మరువదు వారి సేవలను అని ఈ కరోనా వైరస్ ను అరికట్టాలంటే కొన్ని జాగ్రత్త లు , నివారణా చర్యలు పాటించడం ముఖ్యమని , అలాగే మన దేశ ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ ను మనం గౌరవించి పాటిస్తే ఏ కరోనా మన దరి చేరదని అన్నారు . అభాగ్యులను ఆదుకోవడానికి ఎంతోమంది దాతలు ముందుకు రావాలని ఎస్ ఐ సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు . ఈ కార్యక్రమం లో ఏ ఎస్ ఐ . చెంగయ్య , పోలిస్ సిబ్బంది మరియు సూళ్ళూరుపేట ఎలక్ట్రానిక్ మీడియా కి చెందిన వి . రమణయ్య , డి . కిరణ్ , బి . సుధా, సిహెచ్ . గురవయ్య , ఏ . అశోక్ , వి . నాగరాజు కె . జోసఫ్ , యన్ . శ్రీనివాసులు , సర్ధార్ , మూర్తి తదితరులు పాల్గొన్నారు .    

Featured ఆంధ్రప్రదేశ్

నిత్యావసర సరుకులు పంపిణీ.

కరోనా వైరస్ దేశమునుండి వెళ్ళేదాకా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. వైయస్సార్ సిపి నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి. నెల్లూరు జిల్లా నాయుడుపేట వైయస్సార్ సిపి నాయకుడు కామిరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో మర్లపల్లి గ్రామాo తదితర గ్రామాల్లో ముమ్మరంగా ప్రతి కుటుంబానికి నిత్యవసర సరుకులు కూరగాయలు ను పంపిణీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సందర్భంగా పనులకు పొకుండా ఇంటికే పరిమితమై ఉండి ఆకలితో అలమటిస్తున్న వారు గ్రామాల్లో చాలా మంది పేదలు ఉన్నారని తెలుసుకుని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మర్లపల్లి,మర్లపల్లి మిట్టా, హరిజనవాడ,నరసారెడ్డి కండ్రిగ, పెరిగిలపాటి కండ్రిగ గ్రామాలలో సులూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పిలుపుతో సుమారు 250 కుటుంబాలకు ఎటువంటి డోకా లేకుండా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు రాజారెడ్డి తెలిపారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దొప్పల చంద్రశేఖర్,రవి కుమార్, అశోక్ ,వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.