Friday, 27 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఈ నెల 6న వారికి రూ.10 వేలు

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️ లాక్ డౌన్ నేపథ్యంలో చేపల వేతపై నిషేధం ఉన్న క్రమంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. మత్స్యకారుల విరామ భృతి కింద రూ.10 వేలు అందించాలని నిర్ణయించింది.ఈ నెల 6న దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనుండగా…ఆ రోజే వారి అకౌంట్లో రూ.10 వేలు జమ చేయనున్నారు. ఇప్పటికే లబ్దిదారుల పేర్లను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు.

Featured తెలంగాణ

సమాజ అభివృద్ధి జరగాలంటే౼దేశంలో నిరుద్యోగం అంతం కావాలి!!_* *_!!యువత నిర్లక్ష్యం విడి౼ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి!!_*

*_!!సమాజ అభివృద్ధి జరగాలంటే౼దేశంలో నిరుద్యోగం అంతం కావాలి!!_* *_!!యువత నిర్లక్ష్యం విడి౼ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి!!_* *_సిద్దిపేట: సమాజంలో ప్రతి వ్యక్తికి ఈ పాలక ప్రభుత్వలు ప్రభుత్వ ,ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించి,నిరుద్యోగాన్ని అంతం చేసినప్పుడే సమాజ అభివృద్ధి, దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అఖిల భారత యువజన సమాఖ్య(AIYF)జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్ అన్నారు._* *_ఆదివారం రోజు AIYF61వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్థానిక ఎడ్ల గురువారెడ్డి భవన్ వద్ద AIYF జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ…యువత నిర్లక్ష్యం దేశానికి పెను ప్రమాదం అని.నిర్లక్ష్యం విడి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై ప్రశ్నించే తత్వన్నీ అలవర్చుకోని అదేవిధంగా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర ప్రధానమైనది అన్నారు.యువతరంలో ప్రగతి శీల అభ్యుదయ భావాలను , దేశభక్తి లౌకిక ప్రజాస్వామిక ఆలోచనలను నైతిక విలువలను మానవత్వాన్ని నెలకోల్పడానికి అఖిల భారత యువజన సమాఖ్య AIYF నిరంతరం కృషి చేస్తుందని అదేవిధంగా దేశం కోసం ప్రాణార్పన చేసిన సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు లాంటి అమరవీరుల వారసత్వం పునికి పుచ్చుకుని దేశ స్వతంత్రం అనంతరం నల్లదోరలను దోపిడీని అడ్డుకునేందు కై 1959 మే 3వ తేదీ న అఖిల భారత యువజన సమైక్య AIYF ఢిల్లీలో ఆవిర్భావించిందని,18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతకు ఓటు హక్కు కోసం పోరాడి విజయం సాదించిందన్నారు. జాబ్ OR జైలు పనైనా చూపండి తిండైనా పెట్టండి అనే నినాదంతో యువత గొంతుకై గర్జించిన ఎకైక యువజన సంఘం AIYF అని అయన కొనియాడారు,అవినీతి అంతం AIYF పంతం అనే నినాదంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ అనేక ఉద్యమాలు నిర్మిస్తుందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల పై బడిన వివిధ శాఖల ఉద్యోగాలను భర్తీ చేయాలని , నిరుద్యోగభ్రృతి వేంటనే ప్రభుత్వంను డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో AIYF జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డు నరేష్, పట్టణ నాయకులు ప్రభాకర్, సురేష్, రాజు,కుమార్ లు పాల్గొన్నారు._*

Featured ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలి” డా. యం.వి.రమణయ్య ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు , టి. కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి. — ప్రజారోగ్య వేదిక డిమాండ్

“ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలి” డా. యం.వి.రమణయ్య ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు , టి. కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి. — ప్రజారోగ్య వేదిక డిమాండ్ ———————————————- భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 47 ప్రకారం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా రాష్ట్రంలోని 5 కోట్లు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ” సంపూర్ణ మద్య నిషేధం” అమలు చేయాలి. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లు దాటినా ప్రభుత్వాలు మద్య నిషేధం అంశాన్ని అత్యంత నిర్లక్ష్యం చేస్తున్నాయి. 1991- 1992లో రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగసిన సారా వ్యతిరేక ఉద్యమ సెగతో ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం 1993 అక్టోబర్ 1 న “సారా నిషేధం” ప్రకటించింది. కానీ ఆ నిషేధాన్ని అమలు చేయడంలో మాత్రం ఘోరం గా విఫలమైంది. 1995 లో అధికారంలోకి వచ్చిన ఎన్.టి.రామారావు (తెలుగు దేశం పార్టీ) ప్రభుత్వం “సంపూర్ణ మద్య నిషేధం” అమలులోకి తెచ్చింది. కానీ 1996లో అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రం రూ.960కోట్లు లోటు బడ్జెట్ లో ఉందనే సాకు చెప్పి 1997లో మద్య నిషేధం ఎత్తివేశారు. ఇలా గత ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ పరిపాలన సాగించాయి. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వై.యస్. జగన్మోహన్ రెడ్డి (వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ) “నవ రత్నాలు” అనే 9 రంగాలను పరిపాలనాంశాలుగా నిర్ణయించింది. అందులో దశలవారీగా “సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయడం” అనేది కూడా ఒక అంశం. పైగా 2017 జూలైలో అమరావతి లో జరిగిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కూడా అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని తీర్మానించారు. అందులో భాగంగానే మద్య విమోచన ప్రచార కమిటీ అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి రూపొందించిన “నూతన మద్యం పాలసీ”ని అమలులోకి తేవడం ఒక ముందడుగు. * రాష్ట్రంలోని మొత్తం లైసెన్స్ గల 4380 మద్యం షాపులను 3500కు తగ్గించడం. * గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బెల్ట్ షాపులను తొలగించడం. * ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టడం. అందుకోసం 16000 మంది ఉద్యోగులను నియమించుకోవడం. * గతంలో మద్యం అమ్మకాల సమయం ఉదయం 10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకు ఉండగా ప్రస్తుతం ఉదయం 11గం.ల నుండి రాత్రి 8 గం.ల వరకు మాత్రమే అమ్మకాలు నిర్వహించడం లాంటి చర్యలు తీసుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అభినందనలు. కానీ నేడు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా భావిస్తున్నారు తప్ప ప్రజల ఆరోగ్య వినాశకారిగా పరిగణించడం లేదు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం రూ. 2.5 లక్షల కోట్లు. కాగా అందులో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.17,340 కోట్లు. కానీ మద్యపానం ద్వారా సంభవించిన జబ్బులు లివర్ క్యాన్సర్, గుండె జబ్బులు, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు, ఊపిరి తిత్తుల క్యాన్సర్లు, చర్మవ్యాధులు, ఒబేసిటీ, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు లాంటి మరెన్నో ప్రమాదకరమైన జబ్బులకు ప్రైవేటు కార్పొరేట్ వైద్యశాలలకు ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారాను మరియు ప్రజలు నేరుగాను ఏడాదికి చెల్లించిన మొత్తం దాదాపు అక్షరాలా రూ. 40,000/ కోట్లంటే అతిశయోక్తి కాదు. అదే సందర్భంలో రాష్ట్రంలోని మొత్తం మరణాలలో 25% వరకు మద్యపానం సంబంధిత వ్యాధుల వల్ల సంభవించే మరణాలే ఉంటున్నాయి. రాష్ట్రంలోని 40%-60% కుటుంబాలు మద్యపానం వల్ల చితికి పోతున్నాయి. వైవాహిక జీవితంలో పురుషులు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కోల్పోతున్నారు. సంసారాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. భావి భారత పౌరులు 12ఏళ్ళ వయసు నుంచే మద్యపానానికి బానిసలై పోతూ నేరప్రవృత్తికి దాసోహం అయిపోతున్నారు.మొత్తం యాక్సిడెంట్ కేసుల్లో 75% డ్రంకన్ డ్రైవ్ కేసులే. ఇలా యువత పెడధోరణులు తొక్కుతూ తల్లి తండ్రులు, అక్కాచెల్లెళ్ళు, రక్తసంబంధాలు అనే ఉచ్ఛ నీచాలు మరచిపోయి కుటుంబ, సామాజిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు. దేశం ఎంతో మేథో సంపత్తిని కోల్పోతోంది. కనుక వీటన్నింటికీ సరైన పరిష్కారం “సంపూర్ణ మద్య నిషేధం” ఒక్కటే. గాంధీ గారు ఒక సందర్భంలో మద్యపానం గురించి మాట్లాడుతూ ” దొంగతనం, వ్యభిచారం కంటే మద్యపానం అత్యంత నీచమైంది. ఒక గంటసేపు నేను భారత దేశానికి నియంతనైతే ఎలాంటి నష్ట పరిహారాలు చెల్లించకుండా దేశం లోని మొత్తం మద్యం కంపెనీలను మూసేస్తాను” అని అన్నారు. ఇప్పటికే గుజరాత్, బీహార్, నాగాలాండ్, మిజోరాం, లక్షద్వీప్ రాష్ట్రాల్లో మద్య నిషేధం అమలులో ఉంది. అందుకే అక్కడ ప్రజల ఆరోగ్య స్థాయిలు మెరుగ్గానే ఉన్నాయి.నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణంగా ఎవరినైనా మద్య పానం మాన్పించడానికి 21 రోజుల సమయం సరిపోతుంది. కానీ కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు విధించిన 40రోజుల లాక్ డౌన్ లో మద్యం అందుబాటులో లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ ను మే 17 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అయితే గ్రీన్ జోన్స్ లో 6 అడుగుల సామాజిక దూరం పాటించడం, ఒక దఫా 5మందిని మాత్రమే వరుసలో అనుమతించడం లాంటి షరతులతో మద్యం అమ్మకాలకు అనుమతించింది. లాక్ డౌన్ సమయంలో మద్యం మానేసిన దాదాపు 75% మద్యపాన ప్రియులు ఇప్పుడు తిరిగి మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది! కావున ఈ లాక్ డౌన్ సమయంలో ఆహారం కోసమే ప్రయాసపడుతున్నవారు ఇక మద్యానికి డబ్బులేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. మద్యానికి దూరమై సాధారణ జీవితంలోకి మారిపోయినవారు కుటుంబాలతో కలిసి మెలసి సంతోషంగా గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మద్యాన్ని ఎన్ని షరతులతో ప్రవేశపెట్టినా సమర్థనీయం కాదు. ఇది కరోనా వ్యాప్తి చెందేందుకే ఉపయోగకరం తప్ప కరోనాను నిరోధించేందుకు ఏ మాత్రం ఉపయోగపడదు. అలాగే వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లోను, ఎన్నికల మేనిఫెస్టోలోనూ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 5 కోట్ల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లాక్ డౌన్ సమయంలోనే సంపూర్ణ మద్య నిషేధం అమలులోకి తేవాలి. –డా. యం.వి.రమణయ్య ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు , టి. కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి.

Featured

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.6 లక్షల వితరణ

పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ✍ కరోనా సంక్షోభంలో ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.6 లక్షల చెక్కును నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ కు లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్ జోన్ సభ్యులు అందించారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు డివిజన్ సేక్రటరీ కె.వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Featured

కావలి ప్రెస్ క్లబ్ లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

పున్నమి ప్రతినిధి షేక్ .ఉస్మాన్ అలీ కావలిలో ఇటీవల ప్రారంభమైన ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శుక్రవారం మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …ఇటీవల ప్రారంభమైన ప్రెస్ క్లబ్ సామాన్యులకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. మొక్కలు నాటడం వల్ల పొల్యూషన్ నియంత్రణ అవుతుందని గుర్తు చేశారు.ప్రస్తుతం లాక్ డౌన్ వలన పొల్యూషన్ చాలా వరకు నియంత్రణ అయిందన్నారు.

Featured

నెల్లూరు జిల్లా ప్రజలకు హెచ్చరిక

నెల్లూరు నగరంలో రెప్పట్నుంచి ఎటువంటి కారణం లేకుండా రహదారులపై కనిపిస్తే క్వారంటైన్ కు తరలిస్తామని ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ హెచ్చరించారు.నెల్లూరు నగరంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో రేపట్నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. కావున ప్రజలు సహకరించి ఇళ్లకు పరిమితం కావాలని సూచించారు.

జాతీయ అంతర్జాతీయ

BREAKING: లాక్ డౌన్ మరోసారి పొడిగింపు

  పున్నమి  దేశంలో లాక్ డౌన్ మే 3వ తేదీతో ముగియనుండగా,తజాగా లాక్ డౌన్ ను కేంద్రం మరోసారి పొడిగించింది.రెండు వారాలా పాటు (మే 17 వరకు) లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది.దేశంలో లాక్ డౌన్ పొడిగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.దేశంలో కరోనా కేసులు పేరుగుతుండటంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Featured చిత్తూరు

గూడు…పదిలం” గంజాం భ్రమరాంబ తిరుపతి

“గూడు…పదిలం” గంజాం భ్రమరాంబ తిరుపతి ” డాక్టర్ గారూ నమస్తే.మీతో నేరుగా చెప్పలేక మెసేజ్ పంపుతున్నాను ఏమనుకోకండి శ్రీధర్ గారు. మీరు చాలా మంచి డాక్టర్. ఎవరూ కాదనలేరు. వైజాగ్ నుంచి బదిలీమీద ఇక్కడకు వచ్చినప్పటి నుంచీ మా ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. చాలా సంతోషం. మీతో కానీ మీ ఇంటి సభ్యులతో కానీ మాకు ఎటువంటి ఇబ్బందులూ లేవండి. కానీ..కానీ… మీరు రోజూ కరోనా వ్యాధులకు వైద్యం చేసి వస్తున్నారు. ఒక ప్రత్యేక గదిని కేటాయించుకున్నారు లేండి. ఏది ఏమైనా.. మా ఇంట్లో నేనూ, మా ఆవిడా మా అమ్మా ..నాన్నా..చూస్తే ముసలివాళ్ళు.. నా కొడుకు , కోడలూ వాళ్ళ పిల్లలేమో ఇద్దరూ ఐదేండ్ల లోపు వారే. ఎందుకైనా మంచిది. మీరు ఇల్లు ఖాళీ చేస్తే బాగుంటుంది అని మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు… మీరు అన్యధా భావించకుండా ఒక నాలుగు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయగలరా….? ఇట్లు భుజంగరావు.” పేషేంట్స్ అందరినీ పరామర్శించి హాస్పిటల్ అంతా ఒక రౌండ్ వేసి తన సీట్ దగ్గరకి వచ్చిన డా. శ్రీధర్ తనకు భుజంగరావు పంపిన తీపి వార్తవిని “ఛ” ఏమిటో వీళ్ళ మనస్తత్వాలు అని నిట్టూర్పు వదిలాడు. అక్కడే ఉన్న ఇంకొక డాక్టర్ జాన్ తో “ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా… అర్థరాత్రి.. అపరాత్రి అని చూడకుండా డాక్టర్ అని పరిగెత్తుకువస్తారు. కరోనా లాంటి భయంకరమైన వ్యాధితో ప్రాణాలు పణంగా పెట్టి మనమిక్కడ యుద్ధం చేస్తుంటే… మానసిక స్థైర్యాన్ని అందించాల్సిపోయి… ఇల్లు ఖాళీ చేయండి.. అంటూ నివేదనలు పంపుతున్నారు” అన్నాడు ఆవేశంగా. డాక్టర్ జాన్ ” శ్రీధర్ గారూ.. ప్రజలు అంతేనండీ అమాయకులు. ఇదిగో పులి అంటే అదిగో తోక అని అనేస్తారు. మీరేమీ దిగులు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే.. మా మిద్దెపైన ఒక పోర్షన్ ఖాళీగా ఉంది. మా పాపకు పెళ్ళైనాక ఉపయోగపడుతుంది అని అలాగే ఉంచాను. ప్రస్తుతానికి నా రీడింగ్ రూమ్ లా వాడుకుంటున్నాను. మీరు రేపే షిఫ్ట్ అవ్వొచ్చు. మిగతా విషయాలు తరువాత చేసుకుందాం” అని ఓదార్పుగా చెప్పాడు డా.జాన్. ” మొన్నటికి మొన్న కరోనాకి వైద్యం చేస్తున్న పాపానికి డాక్టర్లపై దాడులు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి వెళితే రాళ్ళ దాడులు, చివరికి కరోనా రోగులకు వైద్యం చేస్తూ చనిపోయిన డాక్టర్ ని ఖననం చేయడానికి కూడా అంగీకరించక ధర్నాలకు దిగిన వైనం చూస్తుంటే ఒళ్ళు కోపంతో రగిలిపోతోంది. ఉన్న అరాకొరా వసతులతోనే మనం పోరాడుతుంటే వీళ్ళ ధోరణి అసహనానికి గురి చేస్తోంది. ఎనీ వే… థాంక్యూ జాన్… అవసరానికి మంచి సహాయం చేసావు.రేపే వచ్చేస్తాం. .” అన్నాడు శ్రీధర్. ” నువ్వూ.. మీ ఆవిడ ఇద్దరే కదా! ఫర్నిచర్ కూడా సరిపోతుంది. నువ్వు ఏమీ తీసుకుని రానవసరం లేదు. రెండు మూడు నెలల తరువాత పరిస్థితిని బట్టి మంచి విశాలమైన ఇల్లు చూసి ఒకేసారి ఫర్నిచర్ షిఫ్ట్ చేసుకుందువు గానీ” అని ఆప్యాయంగా చెప్పాడు డా.జాన్. “అవునవును. అదే మంచిది.అంతకు మించి చేసేదేముందిలే..” అని సాలోచనగా అన్నాడు శ్రీధర్. ************ “డాక్టర్… డాక్టర్… ఎలాగైనా మావాడిని కాపాడండి. ముక్కుపచ్చలారని పిల్లలు ఉన్నారు. దయచేసి ఎలాగైనా మీరే కాపాడాలి “అంటూ కాళ్ళమీద పడిన భుజంగరావుని పైకి లేపాడు శ్రీధర్. కరోనా నుండి ప్రొటెక్షన్ సూట్ లో ఉన్న శ్రీధర్ ని గుర్తుపట్టలేదతను. “అసలు ఏమయ్యిందో చెప్పండి” అని అడిగాడు. ” ఇంట్లోనే కూర్చుంటే బోరుగా ఉందని మా వాడు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్ళేవాడు. ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా వినేవాడు కాదు. నిన్న రాండమ్ గా కొన్ని కుటుంబాలకు కొత్తగా ప్రవేశ పెట్టిన కిట్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. మా ఇంట్లో మిగతా అందరికీ నెగటివ్ వచ్చింది. మా అబ్బాయికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. దయచేసి వాడిని కాపాడండి ” అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. సరే సరే… మీరేమీ దిగులు పడకండి. మేమంతా ఉన్నాము కదా.. పాజిటివ్ వచ్చిన ప్రతివారికీ ప్రాణహాని ఉండదు. మీరు బయటకు వెళ్ళి కూర్చోండి. మేము చూసుకుంటాము బయటకు పంపేసాడు శ్రీధర్. ******* ” సార్..డా. శ్రీధర్ గారు.. నమసే. మా బాబుకు మంచి ట్రీట్‌మెంట్‌ ఇచ్చి కాపాడింది మీరేనని తెలుసుకున్నాను. నేను మీ మనసు నొచ్చుకునే విధంగా ప్రవర్తించినా.. అది మనసులో పెట్టుకోకుండా మీరు మా బాబును కాపాడారు. అందుకే మీలాంటి వైద్యులను దైవంతో పోలుస్తారు. మావాడు వాడి నిర్లక్ష్య ధోరణి వల్ల కరోనాకు గురైతే.. మీర వాడిని మామూలు మనిషిని చేసారు. మీలాంటి ఇంట్లో ఉంటే అనర్థం అనుకున్నాను. కాదు..గొప్ప భరోసా అని మీరు నిరూపించారు. మిమ్మల్ని నేరుగా కలిసి మాట్లాడే ధైర్యం లేక ఈ మెసేజ్ పంపుతున్నాను. ఇక మీదట మీరు మనింటికి వచ్చేయండి‌. మీరు ఈ ఊరిలో పనిచేసినన్నిరోజులూ ఆ పోర్షన్ మీదే. మీ వల్లే మా గూడు పదిలంగా ఉంది. దయచేసి నా తొందరపాటును మన్నించి మనింటికి వస్తారు కదూ!!.. ఇట్లు మీ భుజంగరావు .” ****** శుభం****** గంజాం భ్రమరాంబ తిరుపతి 9949932918

Featured

మూలపేటలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

పున్నమి ప్రతినిథి షేక్ . ఉస్మాన్ అలీ…✍️­­­ నెల్లూరు నగరంలోని మూలపేటలోని శంకర మఠం నందు నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు, కూరగాయలను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాతలుగా శంకర మఠం మేనేజర్ కొర్రపాటి నందకిషోర్ & ఉషా,మాళెం సుధీర్ కుమార్ రెడ్డి ,దూబగుంట గౌరీశంకర్,అమంచెర్ల ప్రభాకర్,పొచాగ్నుల పవన్,స్వరాజు రాజేష్ పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.