Friday, 27 March 2026

Blog

Featured పిల్లలకు

?? భారతీయ సంసృతి ??

పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి కేకులు కట్ చేయడం, దీపాలు ఆర్పడం వంటి పద్దతులు మన సంప్రదాయంలో లేదు. దీపాలు ఆర్పడం అశుభం, అందులోనూ అది పుట్టినరోజున చేయడం ఎంతవరకు మంచిదో చెప్పండి .పార్టీ కి స్నేహితులు పిలిస్తే వెళ్ళకుండా ఉండలేము, వెళ్ళాక మన సనాతన ధర్మానికి విరుద్ధంగా జరిగే తంతు చూసి మనసు కష్టపెట్టుకోకుండా ఉండలేము. పాశ్చాత్య సంస్కారం ఎంత త్వరగా మన యువతను చెడగొడుతోందో తెలుస్తోంది. వెలిగే దీపం ఆర్పడం అశుభం. ఏ శాస్త్రాలలోనూ దీపాన్ని ఆర్పమని చెప్పలేదు. అగ్ని పావనుడు, ఆయనపై ఎంగిలి పడితే అది తీరని అపకారమవుతుంది. పుట్టినరోజు దీపాలు వెలిగించే పండుగ కావాలి గాని, దీపాలు ఆర్పి అశుభం కార్యక్రమంగా చేయకూడదు. ఇక కేకు అంటార, అంగడిలో కొని తెస్తారు, అందులో కోడి గుడ్డు కలుపుతారు. తినేవారి సంగతి సరె, గుడ్డు తినని వారు ఈ పని చేసి తప్పు చేస్తున్నారు. ఇక ఎంగిలి తినడం మంచిది కాదు.ఇటీవల కాలంలో కేకులు కట్ చేయడం వివాహ వేడుకలలో ఫాషన్ అయింది. ఇది పద్దతి కాదు. మన శాస్త్రం ప్రకారం పుట్టినరోజు వేడుకలలో ఏమి చేయాలో చూద్దాం ప్రతి జన్మ నక్షత్రమందో, పుట్టిన రోజు తిధి నందో అపమృత్యు పరిహారం కోసం ఆయుష్యు సూక్తంతో హోమం చేయాలి.ఈ హోమం ఆ వ్యక్తి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. వ్యాధులు రాకుండా పరిహారాన్ని ఇస్తుంది. ఇంద్ర, రుద్రాది దేవతలకు చేసే ప్రార్ధనలు వారికి సకల క్షేమాలనిస్తాయి. వేదవేత్తుల ఆశీస్సులు వారిని కాపాడుతాయిఆరోజు చేసే దానాలు వారికి పుణ్యాన్ని ఇవ్వడం కాకుండా మనకన్నా తక్కువస్థితిలో ఉన్న వారికి సహాయం చేశామన్న తృప్తిని కలిగిస్తాయి. లలితా, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలిఅంతేకాకుండా, గ్రహచారాదుల వలన అపమృత్యు దోష ప్రాప్తమైనప్పుడు, మృత్యుంజయహోమం మంచిదికేవలం అనుకరణ చేసి అదే గొప్ప అనుకునే భ్రమ నుండి బయటపడాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి? మన ఆచారాల ప్రస్తావన వచ్చినప్పుడు “ఇందులో అర్ధం ఎమిటి “అని పెద్ద మేధావుల వలె ప్రశ్నించే మనం ..ఈ అనుకరణ వ్యవహారాలను ప్రశ్నిస్తున్నామా??ఎవరి ఆచారం వారికి గొప్ప. మన ధర్మాలు మనకు గొప్ప కావాలి, అంతేగాని కించపరచకూడదు. పసితనంలో సంవత్సరం పూర్తి అయ్యేవరకు ప్రతినెలా “జన్మ తిధి” రోజు జన్మదినోత్సవం చేయాలి. తరువాతి ప్రతిఏడు జన్మతిధినాడు జన్మదినం చేయాలి. కొందరు జన్మ నక్షత్రం ప్రకారం కూడ జరుపుకుంటారు. అదీ మంచిదే. ఆ రోజు కులదేవతలను స్మరించాలి. తదుపరి గణపతి, సూర్యుని, మార్కండేయుని, వ్యాసుని, పరశురాముని, అశ్వత్ధాముని, హనుమంతుని, విభీషణుని, షష్టీదేవిని తలచి నమస్కరించాలి పుట్టినరోజు కేశఖండనం, గోళ్ళు తీయడం, కలహం, మాసభోజనం, ప్రయాణం, హింస విడిచిపెట్టాలి. చిన్నవారందరు పెద్దవారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొందాలి. వయసైన వారు పనికిరాని వారని భావింపక వారి ఆశేస్సులే మనకు శ్రీరామ రక్ష అని భావచడానికే ఈ కార్యక్రమం ఏర్పడింది. మహాభారతం లో అంతటి శ్రీకృష్ణుడే తానే కొందరికి నమస్కరిస్తానన్నాడు. వారు..“నిత్యాన్నదాత, నిత్యాగ్నిహోత్రి, ప్రతిమాసం ఉపవాసం చేసేవారు, పతివ్రత, వేదాంతవేత్త, సహస్ర చందన దర్శనం చేసినవారు – ఈ ఆరుగురు నాకు వందనీయులు” అని శ్రీకృష్ణుని మాట. ఎస్.కార్తీక్ రెడ్డి – రాపూరు

Featured

స్నేహహస్తం హస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో లో 43 వ రోజు అన్నదానం

రాపూరు, మే 13, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : స్నేహహస్తం హస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా సందర్భంగా జరుగుతున్న 43 వ అన్నదానానికి రాపూరు లక్ష్మీపురం వాస్తవ్యులు మోడిబోయిన సోమశేఖర్, జ్యోత్స్న దంపతులు వారి కుమార్తె మోడిబోయిన శ్రీనేహ జన్మదినం సందర్భమున 500 మంది పేద గిరిజనులకు అన్నదానం కి విరాళం స్నేహ హస్తం ఫౌండేషన్ వారికి ఇవ్వడం జరిగింది వారి సహాయ సహకారాలతో పేద గిరిజనులకు అన్నదానం చేయడం జరిగిందివారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తలియజేస్తు ఈ అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నన్ని రోజులు జరపమని మా వెన్నంటి ఉంటూ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న శ్రీ బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Featured

పారిశుధ్య కార్మికులకు నిత్యవసర సరుకులను,పౌష్టికాహారం పంపిణీ

రాపూరు, మే 13, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణంలోని విద్యావనరుల కేంద్రం ప్రాంగణంలో కరోన కష్ట కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యమే తమ సంతోషం గా భావించి పారిశుధ్యపనులు పనులు చేస్తున్న కార్మికుల సేవలను వారి సాధక బాధకాలను గుర్తించిన యం.ఆర్.పి.యస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక యం.ఆర్.పి.యస్ నాయకులు మరియు MEF నాయకులు యం.పి.డి.ఓ ఆమోస్ బాబు చేతులు మీదుగా నిత్యవసర సరుకులను,వివిధ రకాల పౌష్టికాహారంను వారికి అందించారు.ఈ సందర్భంగా MEF రాపూరు మండల అధ్యక్షులు కార్తీక్ మాట్లాడుతూ పారిశుధ్యకార్మికుల సేవలు ఈ సమయంలో వెల కట్టలేనివని వారికి ఏమిచ్చినా తక్కువే అని వారి సాధక బాధకాలను గుర్తించిన యం.ఆర్.పి.యస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆదేశానుసారం ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం.ఇ.ఓ శ్రీనివాసులు,ఎ.పి.యం కృష్ణయ్య,ఇ,ఓ,పి.ఆర్డి,గంగయ్య,సచివాలయ సిబ్బంది,యం.ఆర్ .పి యస్.నాయకులు రంగయ్య,పెంచలనరసయ్య,అంకయ్య, MEF నాయకులు డి.పెంచలయ్య,డాక్టర్ శేషు,గంపాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Featured

కలువాయి పోలీస్ స్టేషన్లో సిబ్బందికి యూనిఫామ్ మరియు మాస్కులు పంపిణీ

రాపూరు, మే 13, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కలువాయి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 30 మంది సిబ్బందికి యూనిఫామ్ మరియు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది దాత బండి వేణుగోపాల్ రెడ్డి స్టేషన్ హౌసింగ్ ఆఫీసర్ ఆంజనేయులు చేతుల మీదగా సిబ్బందికి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దాత బండి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లల్లో ఉంటే వాళ్ళకు సేవ చేసే దానికి డాక్టర్లు పోలీసులు శానిటేషన్ సిబ్బంది నిత్యం విధుల్లో ఉంటూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని అటువంటి వారికి అండగా నిలవాలని నేడు డక్కిలి పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని ఇప్పటికే రాపూరు మండలంలో ప్రతి ఇంటికి కూరగాయలు మరియు పండ్లు, గుడ్లు పంచామని, రాపూరు టౌన్ లో ఉన్నటువంటి అన్ని శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బందికి నిత్యవసర సరుకులు కూరగాయలు మాస్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కరోనా లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూడా నన్ను సంప్రదించినట్లయితే వెంటనే వారి సమస్యలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు.కలువాయి ఎస్ఐ ఆంజనేయులు మాట్లాడుతూ పోలీసులు సేవలను గుర్తించి మాకు యూనిఫామ్ , మాస్కులు పంపిణీ చేసిన బండి వేణుగోపాల్ రెడ్డి గారికి పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రత్యేకంగా కలువాయి పోలీస్ స్టేషన్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని భవిష్యత్తులో బండి వేణుగోపాల్ రెడ్డి గారు సేవలు ఇలాగే కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.పై కార్యక్రమంలో కలువాయి మాజీ జెడ్పటీసీ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి, కలువాయి మాజీ మండల ఉపాధ్యక్షులు మాలేపాటి వెంకట కృష్ణారెడ్డి,SI ఆంజనేయులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి దితరులు పాల్గొన్నారు.

Featured గూడూరు

H2H సంస్థ వారి ఔదార్యం

  పున్నమి ప్రతినిధి – షేక్ రసూల్ అహమద్ : తమ సేవాకార్యక్రమాల్లో భాగంగా గూడూరు డివిజన్ లోని చిల్లకూరు మండలానికి చెందిన శారదానగర్ లోని పేద ప్రజలకు H2H (హార్ట్ టూ హాండ్) ఫౌండేషన్ అధ్యక్షుడు వాకా నిరంజన్ కూరగాయలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తాము నిరవధికంగా పేదప్రజలకు అవసరమైన ఆహార వస్తువులను అందిస్తున్నామని అందులో భాగంగా నేడు చిల్లకూరు మండలంలో కూరగాయలు తదితర వస్తువులను పంపిణి చేశామని చెప్పారు. తనకు ఎల్లప్పుడూ సహాయకారాలు అందించే తమ సంస్థ సభ్యులు అయిన వరప్రసాద్, ప్రభాకర్, కార్తిక్, రమేష్ లకు ఈ సందర్భంగా నిరంజన్ కృతఙ్ఞతలు చెప్పారు.

Featured గూడూరు

80 పేద కుంటుబా లకు కూరగాయలు

గూడూరు పట్టణములో చిల్లకూరు మండలానికి చెందిన శారదా నగరలో 80 పేద కుంటుబలు కు H2H (హార్ట్ టూ హాండ్) ఫౌండేషన్ అధ్యక్షుడు వకా నిరంజన్ ,వారి మిత్రులు వరప్రసాద్ ,ప్రభాకర్,కార్తిక్ రమేష్ కూరగాయలు అందజేయడం జరిగింది.

Featured జాతీయ అంతర్జాతీయ

బ్రిటిష్ ప్రభుత్వాలు భారతదేశంలో కలరా వ్యాప్తిని ఎలానిర్వహించాయి

పున్నమి ప్రతినిధి – షేక్ రసూల్ అహమద్ : ప్రతి 100 సంవత్సరాలకు ఏదో ఒక మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం  చేసేయడం అనాదిగా వస్తున్నదే. ఇందులో ఒకటి కలరా వ్యాధి ఒకటి . ఈ వ్యాధివల్ల లక్షలమంది మృత్యువాత పడ్డారు.  ఇప్పటికి  ఆఫ్రికా ఖండ ప్రాంతాలలోని ప్రజలు అప్పుడప్పుడు దీని బారిన పడుతున్నారు. కలరాను, బ్లూ డెత్ అనికూడాపిలుస్తారు, ఎందుకంటే  వ్యక్తిపూర్తిగా ద్రవాలను కోల్పోయి చర్మం సహజ రంగునుండి నీలం-బూడిద రంగులోకిమారుతుంది, దీంతో ప్రతి సంవత్సరందాదాపు లక్ష మరణాలకు కలరాకారణమైంది. గత 250 సంవత్సరాల్లో, 6 సార్లు కలరా మహమ్మారిలో లక్షలాదిమంది మరణించారు. నేడు కలరా మహమ్మారియుద్ధం లేదా ప్రకృతి వైపరీత్యాలువంటి విపత్తులతో సమానంగా పరిగణించబడుతుంది. విబ్రియోకలరా అనే బ్యాక్టీరియా వల్లకలరా వస్తుంది, ఇది సాధారణంగా మలపదార్థం ద్వారా వ్యాపిస్తుంది. చాలా మంది ప్రజలకుఎటువంటి లక్షణా కనిపించవు. దీంతో ఈ వ్యాధినివీరు సులభంగా కారీ చేస్తుంటారు. కొంతమందితెలియక అతిసారం యొక్క తీవ్రమైన కేసులనుఇంకాస్త ఎక్కువ చేస్తుంటారు. వ్యక్తులలోఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. చికిత్స చేయకపోతే, నీరు లేకపోవడం వల్లఒక వ్యక్తి గంటల్లోనే చనిపోవచ్చు. ఈ వ్యాధి శతాబ్దాలుగాగంగా మైదానంలో ఉంది,  బ్రిటిష్వలసరాజ్యాన్ని అనుసరించి వేగవంతమైన పట్టణీకరణ మరియు వాణిజ్యం ఈమహమ్మారికి అనువైన పరిస్థితులను సృష్టించింది. విపరీతమైన రద్దీ మరియు పారిశ్రామికీకరణ,పేలవమైన పారిశుధ్య పరిస్థితులు సైతం దీనికి కారణమైంది. కలరా వ్యాప్తి చరిత్రలోచాలాసార్లు జరిగి ఉండవచ్చు, వలసరాజ్యాలప్రభుత్వం యొక్క వాణిజ్యం మరియుయుద్ధ పిపాసం వలన కలరా ప్రపంచవ్యాప్తంగావ్యాపించింది. 1810 లో మొదటగా బ్రిటిష్దళాలు ఈ వ్యాధిని వివిధదేశాలకు తీసుకువెళ్ళాయి. తర్వాత ప్రతి ఇరవై సంవత్సరాలకుఒకసారి కలరా విస్ఫోటనం జరుగుతూవచ్చింది.బ్రిటిష్ వారి పుణ్యమాఅని 1810 లోనేఇండోనేషియా నుండి చైనా వరకు,అక్కడనుండి దక్షిణ ఆసియా అంతటా వ్యాపించింది.1830లో యూరప్ కు, అమెరికాకు1850 లో అడుగుపెట్టి  లాటిన్అమెరికా అంతటా వ్యాపించింది. 1860 లో మధ్యప్రాచ్యంగుండా ఆఫ్రికాకు  వెళ్ళింది.ఇలా ప్రపంచమంతా పాకిపోయి బ్రిటిషువారిని అప్రతిష్టపాలు చేసింది. కలరా వల్ల కలిగేనష్టాలను తగ్గించడానికి , బ్రిటిష్ వారు ప్రజారోగ్యం మరియుపారిశుద్ధ్యం యొక్క వ్యవస్థలను అభివృద్ధిచేశారు.నీటిని  పైపులద్వారా భవనాలనుంచి  త్వరగాబయటికి తరలించే విధంగా నగరాలు రూపకల్పన చేయడం ప్రారంభించారు.పారిశుద్ధ్యవ్యవస్థలు మొదట్లో కేవలం ప్రజల కోసమేవ్యర్థాలను తరలించడం జరిగేది. కాని ఇది ప్రజలందరికోసం  కాకుండాకొందరు ధనవంతుల కోసమే ఉపయోగపడేది. దిగువతరగతి ప్రజలు బాధింపబడేవారు. పైపుల గుండా వచ్చేవ్యర్ధాలు, మురుగునీళ్లను చాలా దూరం తరలించడానికి,మాన్యువల్ స్కావెంజర్లను ఉపయోగించేవారు. వీరు సాంద్రీకృత మలినంలోపని చేయాల్సి రావడంతో వారి పని మరింతప్రమాదకరంగా మారి వారు అనారోగ్యాలబారిన పడాల్సివచ్చింది. దీనితోపాటు నిఘా మరియు సామాజికదూర నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయికాని పెద్దగా విజయవంతం కాలేదు. రాజకీయ సమీకరణల కోసం కొందరు నాయకులు  తీర్థయాత్రలనుఅక్కడి జనసమూహాలను వాడుకొనేవారు. ఈ స్థలాలు సభలుగావాడటం బ్రిటిషువారిని సందిగ్ధంలోకి నెట్టివేశాయి. తీర్ధయాత్రలుచేయడం భారతదేశంలో సహజమైన ప్రక్రియ అటువంటి సందర్భంలో ప్రజలు వ్యాధులకు గురయ్యేవారు. ఆప్పట్లో యాత్రికుల ప్రయాణాన్ని నియంత్రించే చట్టాలు అంతగా లేవు. బ్రిటీష్ప్రభుత్వం యాత్రికుల స్థలాలను పరిశీలించి, రాజకీయ సమీకరణలపై అణిచివేసే విధంగా చర్యలు తీసుకొంది. అయితే ఇది కలరావ్యాప్తిని నిరోధించడానికి పెద్దగా ఉపయోగపడలేదు.. బ్రిటీష్ వారు కూడా కుంబ్లామేళా అనే భారీ తీర్థయాత్రలనుజరిపి తమ క్రూరమైన విధానాలుఐన డివైడ్ అండ్ పాలసీలను  సమర్థించుకోగలిగారు. కలరా చరిత్ర భారతదేశప్రజారోగ్య చరిత్రతో ముడిపడి ఉంది. వాణిజ్యం మరియువేగవంతమైన పారిశ్రామికీకరణ కలరా వ్యాప్తికి కారణంఅయితే, ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణ మరియు పారిశుద్ధ్య వ్యవస్థలనుఅభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి. పనిలోపని నిఘా వ్యవస్థలను పెట్టిపరిస్థితులను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాయిప్రభుత్వాలుఅవలంబించిన చర్యలు అందరినీ సమానంగా రక్షించలేదు, ప్రపంచవ్యాప్తంగా పేదలు, కార్మికవర్గం రక్షించబడలేదు. భారతదేశంలో, కుల అసమానతలతో, కొన్నివర్గాలు ఎక్కువ ప్రమాదంలోకి నెట్టబడ్డాయి. పాత వలస రాజ్య పాలనను గుర్తు చేస్తూ ఇటీవల మరొక మహమ్మారినుండి ప్రజలను రక్షించడమే లక్ష్యంగా పబ్లిక్ లాక్డౌన్ విధించబడింది. ఇందులో ఎవరు రక్షించబడ్డారు? ఎవరుప్రమాదంలోకి ఇరుకొన్నారు?

Featured

స్నేహహస్తం హస్తం పౌండేషన్ రాపూరు ఆధ్వర్యంలో లో 42 వ రోజు అన్నదానం

రాపూరు, మే 12, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : స్నేహహస్తం హస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా సందర్భంగా జరుగుతున్న అన్నదానానికి బండి కృష్ణా రెడ్డి రాపూరు మాజీ MPP గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ బండి వేణు గోపాల్ రెడ్డిగారి సహాయ సహకారాలతో 500 మంది పేద గిరిజనులకు అన్నదానం చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నన్ని రోజులు జరపమని మా వెన్నంటి ఉంటూ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న వారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తలియజేశారు

Featured

బొడిచెర్ల వారి దాతృత్వం

పున్నమి ప్రతినిధి షేక్.రసూల్ అహమద్ : గత నలభై ఒక్క రోజులుగా ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా వెంకటగిరి పరిసర గ్రామాల్లోని జీవనోపాధి లేని నిరుపేదల ఆకలిని గుర్తించిన శ్రీ పరమేశ్వర వస్త్రాలయం అధినేత,ఘంటసాల కళాక్షేత్రం అధ్యక్షులు, ప్రణతి సంస్థ గౌరవాధ్యక్షులు అయిన బొడిచర్ల సుబ్బయ్య వారి ధర్మపత్ని సరస్వతమ్మ దంపతుల దాతృత్వంతో ప్రణతి సంస్థ ఆధ్వర్యంలో 13వేల రూపాయలు పేదప్రజల భోజనాదులకు కోసం అందించడం జరిగింది. ఈ సందర్బంగా సత్యవాది, గాంధేయవాదులు అయిన బొడిచెర్ల సుబ్బయ్య గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా పేదవారిని ఆదుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. స్వీయనిర్బంధం, క్రమశిక్షణతో ఉంటూ కరోనాను తరమికొట్టవచ్చునని ఆయన చెప్పారు. ప్రకృతి పరిరక్షణే అన్ని ధర్మాల్లోకెల్లా ఉత్తమమైనదని, దీనికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. కరోనా లాంటి మహా విపత్తులోనుంచి బయటపడేందుకు భౌతికదూరంతో పాటు శుచి శుభ్రతను పాటించాల్సిన అవసరం ఉందని సుబ్బయ్యగారు పేర్కొన్నారు. ఈ ఆహార కార్యక్రమ పర్యవేక్షకులుగా ప్రణతి సభ్యులు సుంకర రవికుమార్, చేబ్రోలు రవీంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది.

Featured

బండి వేణుగోపాల్ రెడ్డి దాతృత్వం పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో మండలంలో 3 లక్షల కోడిగుడ్లు లు పంపిణీ

రాపూరు, మే 12, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలంలో 3 లక్షల కోడిగుడ్లు లు పంపిణీలో భాగంగా మండల ప్రజలకు మంచి పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ఒకొక్క కుటుంబానికి డజన్ గుడ్లు లెక్కన మండలంలోని తెగచర్ల లో 6600,గరిమెన పెంట లో4200,గోనుపల్లి లో6920, రాంకురు లో 1680,తూమాయి లో 2880, రెగడపల్లి లో 2180, ఓబులాయపల్లి లో 4380, గుండవోలు లో 6000, నెల్లేపల్లి లో1440,పెనుబర్తి లో 6600, ఏపూరు లో 4320,బొజ్జనపల్లి లో 1380,వెలుగోను లో 2640 గుడ్లు పంపిణీ చేయగా నేడు కంభాలపల్లి, అదురుపల్లి పంచాయతీ, తాతిపల్లి, ఎం.వీ.పురం,శానాయపాలెం, రాపూరు పంచాయతీ పరిధిలో గల అన్ని గ్రామాల్లోని ప్రజలకు లక్ష కోడి గుడ్డులు పంపిణీ కార్యక్రమాని రాపూరు వైస్సార్సీపీ నేత వైకాపా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బత్తిన పట్టాభిరామిరెడ్డి నివాసం వద్ద ఆయనతో కలసి రాపూరు మాజీ ఎంపీపీ, వైకాపా మండల కన్వీనర్ దివంగత నేత బండి క్రిష్ణారెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి గారు రాపూరు పట్టణంలో ప్రతి కుటుంబానికి డజన్ గుడ్లు లెక్కన పంపిణీ చేసారు.ఇప్పటికే మండలంలో పలు పంచాయతీల్లో ఉద్యమంలా ప్రారంభించి పంపిణీ చేసిన బండి వేణుగోపాల్ రెడ్డి మండలంలోని పెద్ద పంచాయతీ అయిన రాపూరు ప్రజలకు గుడ్లు పంపిణీ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.