Saturday, 28 March 2026

Blog

Featured

స్నేహహస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో లో 50 వ రోజు అన్నదానం

దాత శ్రీ బండి వేణు గోపాల్ రెడ్డి గారు రాపూరు, మే 20, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు తూర్పు అగర్తకట్ట వద్ద కరోనా సందర్భంగా జరుగుతున్న అన్నదానానికి బండి కృష్ణా రెడ్డి మాజీ MPP రాపూరు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ బండి వేణు గోపాల్ రెడ్డిగారి సహాయ సహకారాలతో 500 మంది పేద గిరిజనులకు అన్నదానం చేయడం జరిగింది వారికి మరియుగత 50 రోజులుగా స్నేహ హస్తం ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న అన్నదానం కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నన్ని రోజులు జరపమని మా వెన్నంటి ఉంటూ గత 50 రోజులుగా అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తలియజేశారు

Featured

లాక్ డౌన్ దెబ్బకు ఇండియాలో ఏం జరగబోతుంది..!!

రాపూరు, మే 20, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సన్ ఫ్లవర్ నూనె, పల్లీ నూనె మార్చి 22కి ముందు ఒక లీటర్ 115ఉండేది..ఈరోజు 160 రూపాయలు..మరి ఈ మధ్య కాలంలో ఏం పెరిగిందని అంత రేట్ పెరిగింది..లేబర్ కూలీ రేట్ పెరగలేదు..ట్రాన్స్ పోర్ట్ ఛార్జ్ పెరగలేదు..పంట మధ్దతు ధర పెరగలేదు..షాపు అద్దె పెరగ లేదు. కరెంట్ ఛార్జీలు పెరగలేదు.అయినా అంత ధర పెరగడం వెనక కేవలం జనాల డిమాండ్ తప్ప ఇంకేం ఉంది.మరి ఇదే డిమాండ్ కూరగాయలకు, పండ్లకు కూడా ఉంది.అయితే వాటిని నిత్యావసర సరుకులు అని చెప్పి వాటికో ధరను నిర్ధేశించి అంతకంటే ఎక్కువ ధరకు అమ్మవధ్ధని ఒక వేళ హధ్ధు మీరితే చట్టప్రకారం శిక్షార్హులు అని చెప్పారు.నిజానికి ఇవి రెండు మూడు రోజులకంటే ఎక్కువ నిల్వ ఉంచి డిమాండ్ క్రియేట్ చేయగలిగే వస్తువులు కూడా కాదు.మరి ఇలానే పెద్ద పెద్ద కంపెనీలలో ఉత్పత్యి అయ్యే ఇతర నిత్యావసర సరుకుల ధరలను కూడా అదుపులో ఉంచాలి కదా.ఇవి కృత్రిమ డిమాండ్ సృష్ఠించేందుకు అవకాశం ఉన్నవే…ఎన్ని రోజులైనా నిల్వ ఉంచే అవకాశం ఉన్న ఇలాంటి సరుకుల విషయంలో ఎందుకుండదు.దీన్ని బట్టి పేదోడు అమ్మే వస్తువుల మీద అదుపు ఉంటుంది తప్ప పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు అమ్మే వస్తువుల మీద ప్రభుత్వాలకు అదుపు ఉండదు అని అర్థమౌతుంది.ఇక వచ్చే రోజులలో బతుకు దుర్భరమై ఈ ధరల పెరుగుదలను భరించలేక కార్మికులు జీతాలు పెంచమనో కూలీ రేట్ పెంచమనో ఉద్యోగులు తమ జీతాలను పెంచమనో డిమాండ్ చేస్తే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తూ రోజుకు 12 గంటలు కాదు.రోజంతా పనిచేయాలనే చట్టాలు కూడా చేస్తారనిపిస్తుంది..ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి కూడా.ఈ లాక్ డౌన్ వలన వస్తువుల ఉత్పత్తి లేదన్నది ఎంత నిజమో.వాటికి డిమాండ్ కూడా లేదన్నది అంతే నిజం ప్రపంచంలో అత్యంత ఎక్కువగా వస్తువులను వినియోగించే అభివృధ్ధి చెందిన దేశాలలో ఇప్పటికీ లాక్ డౌన్ కొనసాగుతుంటే భారత్ లాంటి పేద దేశాలలో ఆ వస్తువులకు డిమాండ్ బాగా తగ్గాలి కాని ధరలు పెరగడం ఏంటి ? ఇక పెట్రోల్ బారెల్ ధర ఉత్పత్తి పెరిగి పోయి డిమాండ్ పూర్తిగా తగ్గిపోవడంతో నెగెటివ్ లో పడింది…నెగెటివ్ అంటే పెట్రోల్ ఉచితంగా ఇవ్వడమే కాక ట్రాన్స్ పోర్ట్ ఖర్చు కూడా ఆయిల్ రిఫైనరీసే భరిస్తాయని అర్థం.పేదోన్ని కొట్టి ఉన్నోడికి పెట్టేందుకే ఈ లాక్ డౌన్ ఉధ్దేశ్యం అని కనపడుతుంది తప్ప జనాల మీద ప్రేమతో కాదేమోననే సందేహం మాత్రం బలంగా వినిపిస్తుంది.ప్రజలకున్న ఈ ప్రాణభయాన్ని సాకుగా తీసుకుని లాక్ డౌన్ చేసి భారత్ లో ఉన్న అన్ని కార్మిక చట్టాలను వినియోగదారుల చట్టాలను లేబర్ హక్కులను మానవ హక్కులను కాలరాసే వ్యూహమే కనపడుతుంది.ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు మద్యం ధరలను అమాంతం పెంచేసాయి…ఇక ఢిల్లీ అయితే ఏకంగా ఫెట్రోల్ ధరలను పెంచి ఆ పెంచిన దాన్ని కరోనా టాక్స్ పేరుతో వసూలు చేయడం గమనార్హం.మీరిప్పటికైనా కరోనాకు భయపడి జనాలని భయపెట్టడం మానేయండి.ముందు ముందు అన్ని రకాల వస్తువుల ధరలు 200% పెరగబోతున్నాయి అలానే పైకి కనపడని పరోక్ష పన్నులు కూడా పెరగబోతున్నాయి కాని ఒక్క వ్యక్తి కూలీ కాని జీతం కాని పెరగబోవడం లేదు..!!

Featured

వలసకూలీలు12 మంది కోరంటైన్ కి తరలింపు

రాపూరు, మే 19, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన కోరంటైన్ లో ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 11 మందిని కోరంటైన్ లో ఉంచగా వారికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా వారికి ఎటువంటి కరోన లక్షనాలు లేవని నిర్ధారణ చేసుకొని వారిని 14 రోజులు పర్యవేక్షణలో ఉంచారు. వీరిలో 8 మందిని మంగళవారం కోరంటైన్ కాలపరిమితి ముగిసినందున హోమ్ కోరంటైన్ లో ఉండాలి అంటూ ఆంక్షలు జారీచేసి వారిని వారి యొక్క సొంత ఊర్లకు అధికారులు పంపించటం జరిగినది మిగిలిన ముగ్గురు వ్యక్తులకు ఇంకా కాలపరిమితి ఉన్నందున వారిని కోరంటైన్ పర్యవేక్షణలో ఉంచారు మరియు కొత్తగా గుంటూరు జిల్లా తెనాలి-కొల్లూరు నుండి ప్రత్యేక బస్సులో వలసకూలీలు12 మంది రాపూరు కి రాగా వీరిలో రాపూరు మండలం కోటూరుపాడు చెందినవారు 11 మంది, తెగచర్ల గ్రామానికి చెందిన వారు ఒకరు ఉన్నారు మొత్తం12 మందిని అధికారులు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కమ్యూనిటీ కోరంటైన్ లో ఉంచడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరికి కరోణ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారిని 14 రోజుల పాటు కోరంటైన్ లో ఉంచి పర్యవేక్షణలో పెట్టడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్ కుమార్, ఎమ్మార్వో మధుసూదన్ రావు,ఎంపీడీవో ఆమోస్ బాబు ఆర్ఐ కామాక్షి,వీఆర్వో చెంచు రెడ్డి,ఆరోగ్య శాఖ సిబ్బంది ఏఎన్ఎమ్ లు ఆశ వాలంటీర్లు పాల్గొన్నారు

Featured

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.

రాపూరు, మే 19, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో తాటిపర్తి, మహమ్మదాపురం, విరువూరు, సూరాయపాళెం, నావూరు, ఆల్తుర్తి, మొగళ్లూరు గ్రామాలలో పర్యటించి, ముస్లిం కుటుంబాలకు “రంజాన్ కానుక” పేరిట పండుగ సరుకులను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముస్లిం కుటుంబాలందరికీ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రంజాన్ పండుగ సరుకులను పంపిణీ చేస్తున్నాం.లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రంజాన్ పండుగ రావడం, ముస్లింలు ప్రధానంగా, పవిత్రంగా భావించే రంజాన్ పండుగకు సర్వేపల్లి నియోజకవర్గంలోని ఒక్క ముస్లిం కుటుంబం కూడా దూరం కాకూడదని, రంజాన్ పండుగ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము.ప్రతి ముస్లిం కుటుంబానికి పంపిణీ చేసే ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 7000 కుటుంబాలకు అందజేయడం సంతోషంగా ఉంది.రంజాన్ పండుగ నాడు ప్రతి కుటుంబానికి అవసరమైన సేమియా, నెయ్యి, చక్కెర, గోధుమపిండి, వంటనూనెతో కలిపి 5 రకాల పండుగ సరుకులను పంపిణీ చేస్తున్నాం. కరోనా నేపథ్యంలో నివారణ చర్యలను పాటిస్తూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులను ధరించాలి.కరోనా పరిస్థితులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వైద్యం చేయించుకున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం అభినందించదగ్గ విషయం. ప్రజల ఆశీస్సులతో జిల్లా పరిషత్ చైర్మన్ గా, రెండు సార్లు శాసన సభ్యునిగా అన్ని వర్గాల ప్రజలకు సేవచేసే భాగ్యాన్ని కల్పించడం భగవంతుడు నాకు ప్రసాదించిన వరం. ప్రతి ముస్లిం కుటుంబం జరుపుకునే రంజాన్ పండుగలో భాగస్వామ్యుని కావడం మహాభాగ్యంగా భావిస్తూ, ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.

Featured

బండి వేణుగోపాల్ దాతృత్వం

లాక్ డౌన్ నేపద్యంలో నెల్లూరు నగరంలోని పెన్నా నది ఒడ్డున కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న 50 కుటుంబాలకు భోజనాలు మరియు పిల్లలకు బట్టలు పంపిణీ చేసిన బండి వేణుగోపాల్ రెడ్డి

Featured గూడూరు

పవిత్ర రంజాన్ పండుగను ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. ఈద్గా యూత్ అసోసియేషన్ వారి ఔదార్యం 

  గూడూరు మే 19, 2020 (పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ ) : గూడూరు పట్టణములోని దర్గా ఆవరణలో మంగళవారం నాడు ఈద్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 250 నిరుపేద ముస్లిం కుటుంబాలకు గూడూరు దర్గా వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్.రియాజ్ అహ్మద్, డాక్టర్ సిద్ధిక్, మత గురువు మొహమ్మద్ యూసుఫ్ హుస్సేన్, ఏపి.ఎం.డబల్యూ.ఓ. జిల్లా అధ్యక్షులు మగ్ధుమ్, మైకా కరిముల్లాల చేతుల మీదుగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ మగ్ధూమ్ మాట్లాడుతూ ఈద్గా యూత్ అసోసియేషన్ నిర్వాహకులు సామాన్య మధ్యతరగతికి చెందిన యువకులు చెందినవారని, కానీ సేవ చేసే విషయంలో మాత్రం శ్రీమంతులని, ఈద్గా సభ్యులందరూ చిన్నవ్యాపారాలు చేసుకుంటూ స్వచ్చందంగా వారి సంపాదనలోంచి కొంత నగదును కేటాయిస్తూ లాక్ డౌన్ మొదలయినప్పటి నుండి నేటి వరకు అనేక కార్యక్రమాలు చేస్తూ దేశ పౌరులుగా తమవంతు బాధ్యతను నిర్వహిస్తున్న ఈద్గా యూత్ అసోసియేషన్ సభ్యులు గూడూరు ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. సేవ చేయాలంటే కోటీశ్వరులు కానక్కరలేదని దృఢ సంకల్పం ఉంటే చాలని చెపుతూ ఈద్గా యూత్ అసోసియేషన్ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలియజేసారు. మత గురువు యూసుఫ్ హుస్సేన్, మౌలానా షఫీలు మాట్లాడుతూ లాక్ డౌన్ విపత్కర పరిస్థితుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకు మేమున్నామంటూ భరోసాను కల్పిస్తున్న ఈద్గా సభ్యులకు అభినందనలు చెప్పారు. ఈద్గా యూత్ అసోసియేషన్ సభ్యులు షేక్. షబ్బీర్ మాట్లాడుతూ మా ఈద్గా యూత్ అసోసియేషన్ సభ్యుల సమిష్టి కృషి వల్లే మేము విజయవంతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగానే 200 మందికి రంజాన్ తోఫా కిట్లను అందజేసామని, అలాగే పండుగలోపు మరి కొన్ని కుటుంబాలకు ఇస్తామని పేర్కొన్నారు. పండుగను ప్రతి పేదవాడు సంతోషంగా జరుపుకోవాలన్నదే ఈద్గా యూత్ అసోసియేషన్ యొక్క  లక్ష్యమని అందుకు అనుగుణంగా  సేవలను విస్కృతం చేస్తామని హాషిం చెప్పారు. ప్రేమ, దయ, శాంతి, దాన ధర్మాలకు మరో పేరే రంజాన్ అని దర్గా వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్.రియాజ్ అహ్మద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈద్గా సభ్యులతోపాటు మరికొంతమంది పెద్దలు పాల్గొనడం జరిగింది.

Featured

స్వర్ణకారులని ఆదుకున్న డాక్టర్ బెజవాడ రవి కుమార్ గారు

పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ ✍️ కావలి విష్ణాలయం సెంటర్ కన్యకా పరమేశ్వరి గుడి వీధిలోని స్వర్ణ కారులకు నిత్యవసర సరుకులు అందించిన డాక్టర్ బెజవాడ రవి కుమార్ గారు మరియు డాక్టర్ అమూల్య గారు మరియు మనవరాలు మరియు బి పి ఎస్ ప్రకాశం గారు వారి చేతుల మీదగా నిత్యావసర సరుకులను స్వర్ణ కారులకు అందజేశారు. డాక్టర్ గారు మాట్లాడుతూ రోజు నిత్యం కలకలలాడే స్వర్ణకారుల షాపులు లాక్ డౌన్ కారణంగా గత 60 రోజులుగా పనులు లేక స్వర్ణకారులు ఇంటికే పరిమితం కావడంతో వారి ఇబ్బందులు నిగ్రహించి వారికి నా వంతు సహాయంగా 90 వేల రూపాయలు నిత్యావసర సరుకులను అందించారు.

Featured

విద్యుత్ చార్జీల పెంపు భూములు విక్రయం ల జీవో లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి

మనుబోలు 19-05-2020(పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అధికారం లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ స్లాబ్ మార్పుద్వార చార్జీలు పెంపును ,ప్రభుత్వ భూముల విక్రయంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అని బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు అన్నారు.ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లుల స్లాబులలో మార్పు చేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చార్జీలు భారీగా పెరిగినాయి అన్నారు ఈ చర్యల వలన పేద ప్రజలు మరియు మధ్యతరగతి ప్రజలు బిల్లులు భారీగా పెరిగినాయి అన్నారు .ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులు భారీగా విక్రయించి రాష్ట్ర భవిష్యత్తును బలి చేసే విధంగా నిర్ణయం తీసుకుందని అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తుందని తెలిపారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాగితాలపురు లోని ఆయన ఇంటి దగ్గరనిరసన వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్

జగన్ కీలక ప్రకటనలు

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ ?ఈ నెల 26న అర్చకులు, పాస్టర్లు,ఇమామ్ లకు రూ.5వెలు ? జూన్ 4న వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా సొంత ఆటో,క్యాబ్ ఉన్నవారికి రూ.10వెలు ఆర్థిక సాయం ? జూన్ 10న నాయిబ్రాహ్మణులు, రజకులు,ట్రైలర్లకు రూ.10వెలు ? జూన్ 17న వైఎస్సార్ నేతన్న హస్తం, ? జూన్ 24 న వైఎస్సార్ కాపు నేస్తం డబ్బులు ? ఆగస్టు 12 వైఎస్సార్ చేయూత, ? ఆగస్టు 19న వైఎస్సార్ వసతి దీవెన డబ్బులు జమ

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.