Wednesday, 11 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొత్తపేట ప్రీమియర్ లీగ్ సీజన్-8 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!

దుత్తలూరు 16-జనవరి-2026 దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామంలో నిర్వహించిన కొత్తపేట ప్రీమియర్ లీగ్ – సీజన్ 8 క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు యువతతో కలిసి ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో సరదాగా క్రికెట్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంలో, స్నేహభావాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే గారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అలాగే, ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన యువత వ్యాపార, ఉద్యోగ నిమిత్తం బయట ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ, సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు తిరిగి వచ్చి గ్రామ సమస్యలను తెలుసుకుంటూ, వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్న తీరును ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ప్రశంసించారు. గ్రామ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని, వారి ఐక్యత మరియు సేవాభావం భవిష్యత్తులో గ్రామాలకు మరింత వెలుగును తీసుకువస్తుందని అభినందనలు తెలియజేశారు.

E-పేపర్

ప్లాస్టిక్ వాడకం నియంత్రణ : ప్రతి ఇంటినుండి కనీసం 10 నుండి 20 ప్లాస్టిక్ సంచులు ప్రతిరోజూ వస్తుంటాయి (నూనె సంచి, పాల సంచి, కిరాణా సంచి, షాంపూ, సబ్బు, మ్యాగీ, కుర్కురే మొదలైనవి

పున్నమి ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: 16 జనవరి 2026 ప్రతి ఇంటినుండి కనీసం 10 నుండి 20 ప్లాస్టిక్ సంచులు ప్రతిరోజూ వస్తుంటాయి (నూనె సంచి, పాల సంచి, కిరాణా సంచి, షాంపూ, సబ్బు, మ్యాగీ, కుర్కురే మొదలైనవి). మనం రోజూ డస్ట్‌బిన్‌లకు బదులు వాటర్ బాటిళ్లలో ఆ బ్యాగులను వేయాలి. మీరు వారానికి ఒకసారి సీసాని నింపవచ్చు మరియు సరైన మూతతో డస్ట్‌బిన్‌లో వేయవచ్చు. ఇలా చేయడం వల్ల జంతువులు చెల్లాచెదురుగా ఉన్న ప్లాస్టిక్‌ను తినవు. ప్లాస్టిక్ వ్యర్థాలు, వాటర్ బాటిళ్లను సక్రమంగా పారవేసే అవకాశం ఉంటుంది. చెత్తను సేకరించేందుకు పారిశుద్ధశాఖకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఈ సీసాలను ఎకో బ్రిక్స్‌గా ఉపయోగించవచ్చు మరియు బెంచీలు, కుండలు లేదా అలంకరణ వస్తువులను కూడా తయారు చేయవచ్చు. ప్రతి ఇంటివారు ఈ ఆవశ్యకతను గుర్తించి ఈ పనిని ప్రారంభించవలసిందిగా వినయపూర్వకమైన మనవి. స్వఛ్చ భారత్

ప్రకాశం

నుచ్చుపొద గ్రామంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

ఉమ్మడి ప్రకాశం జిల్లా (పున్నమి ప్రతి నిధి) ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. దేవుడి పూజలతో పాటు పంక్తి భోజనాలు, బంధువుల రాకపోకలతో గ్రామాలు కళకలాడాయి. పండుగను పురస్కరించుకుని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వివిధ ఆటల పోటీలు నిర్వహించి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పామూరు మండలం నుచ్చుపొద గ్రామంలో సంక్రాంతి పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేసిన స్వర్గీయ దేవరపు హనుమంత రావు సమాధి వద్ద ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామస్థులు కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

E-పేపర్

కర్ణ గూడ లో క్రికెట్ సంబరాలు* *రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కర్ణ గూడ గ్రామంలో సంక్రాంతి సంబరాలు*

*కర్ణ గూడ లో క్రికెట్ సంబరాలు* *రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కర్ణ గూడ గ్రామంలో సంక్రాంతి సంబరాలు* కే పి ఎల్ విజయం …సంబురాలు పున్నమి న్యూస్ ప్రతినిధి: 16 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ : గ్రామంలోని యువతకు క్రీడల్లో స్ఫూర్తిదాయకంగా నిలవడానికి కె.పీ.ఎల్ ట్రోఫీ నీ గ్రామ సర్పంచ్ వాంగేటి తిరుమల రెడ్డి నిర్వహించారు. సంక్రాంతి మొదటి రోజు ప్రారంభమై మూడో రోజు కనుమ రోజు ప్రారంభమై కనుమ రోజు సాయంత్రం ముగిసింది.డేరంగుల మహేష్ బృందం విజయం సాధించారు.విజేతకు 25,000,రూపాయల చెక్కును,రెండవ బహుమతి ఉప సర్పంచ్ రవీంద్ర రెడ్డి బృందానికి 15,000 రూపాయల చెక్కును నల్ల బోలు శ్రీనివాస్ రెడ్డి,ఉప సర్పంచ్ రవీంద్ర రెడ్డి లు అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తిరుమల రెడ్డి మాట్లాడుతూ పండుగ వెలవల్లో యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా మద్యానికి,డ్రగ్స్ కు ఎలాంటి వాటికి బానిస కాకుండా క్రీడల వైపు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు గ్రామస్తులు పెద్దలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ మండలంలో జాతీయ యువ జనోత్సవ క్రీడా సందడి

ముస్తాబాద్/పున్నమిప్రతినిధి/జనవరి 17 ఈరోజు జాతీయ యువజన దినోత్సవం భాగంగా ముస్తాబాద్ మండలంలో మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముస్తాబాద్ మండల ఎస్సై గణేష్ గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి పోతుగల్ గ్రామ సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ గారు మరియు ముస్తాబాద్ మండలం పట్టణ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి పోతుగల్ గ్రామ ఉపసర్పంచ్ కోలా కృష్ణ మరియు వార్డు సభ్యులు రంజాన్ నరేష్ రాజు తదితరులు పాల్గొన్నారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చెడుదారులు పట్టకుండా డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తాము చదివిన చదువులకు విలువ తేవాలని దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని దేశ అభివృద్ధి నిర్మాణంలో యువత దె ముఖ్యపాత్ర అని వారు తెలియజేశారు

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ మండలంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం కార్యవర్గం ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లో ఈరోజు బ్రహ్మంగారి గుడి వద్ద ఈరోజు విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం కార్యవర్గం ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఓరగంటి సత్యం చారి ఉపాధ్యక్షులుగా దుంపటి శ్రీనివాస చారిని ప్రధాన కార్యదర్శిగా ఓరగంటి నరసింహ చారిని ప్రచార కార్యదర్శిగా సురోజుల నరేంద్ర చారిని గౌరవ అధ్యక్షులుగా పొనుగంటి రఘువీరా చారి కోశాధికారిగా ఓనం గంటి బాల నర్సయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు చింతోజు బాలయ్య మరియు స్వర్ణకారుల సంఘం మాజీ అధ్యక్షులు చింతోజు కిషన్ మరియు సిహెచ్ శ్రీనివాస చారి సిహెచ్ సంతోష్ చారి పాల్గొని ఎన్నుకోబడ్డ సభ్యులను శాల్వాతో సత్కరించింది శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్నుకోబడిన సభ్యులు తమ సంఘం యొక్క అభివృద్ధికి సమస్యలను ఐకమత్యంతో ఉండి పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకుందామని అభివృద్ధికి అందరు సహకరించాలని పారి కోరారు

కామారెడ్డి

మాఘామావాస్య స్నానాలకు సర్వం సిద్దం

కామారెడ్డి, 16 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : మాఘమం అమావాస్య స్నానాలకు సర్వం సిద్దం చేశారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, మద్దికుంట గ్రామ శివారులో ప్రకృతి సౌందర్యంతో కూడిన స్వయంభు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆల యంలో మాఘ అమావాస్య (మౌని అమావాస్య) సందర్భంగా భక్తులకు పవిత్ర స్నాన ఘట్టా పూర్తి సౌకర్యాలతో సిద్ధం అయింది. దట్ట అడవుల మధ్య గ్రామం నుంచి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో మంచినీటి వద్ద ఘనంగా భాగమామాస్య స్నానాలు జరిగేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపా రు.ఆలయ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ,భక్తుల సౌకర్యం కోసం పూర్తి సౌకర్యాలతో ఘట్టాన్ని సన్న ద్ధం చేశామన్నారు.పవిత్ర స్నానాల ద్వారా పాపా లు తొలగి పూర్వీకుల ఆశీస్సులు కలుగుతాయని అని తెలిపారు.ఆలయ ప్రధాన అర్చకులు ప్రభు స్వామి మాట్లాడుతూ, గొప్ప చరిత్ర స్వయంభు లింగంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం బుగ్గలో (జి లాల్లో) వెలిసింది,రామలింగేశ్వర స్వామి అనుగ్ర హం భక్తులు పొందుతున్నారు.గ్రామ పెద్దలు,దాత ల సహకారంతో నూతన మందిర నిర్మాణం,మంగ ళ గౌరి అమ్మవారి ప్రతిష్ఠాపన జరిగి,ఏటా శివరాత్రి, మాఘ అమావాస్య వంటి పండుగల్లో జాతరలు జరుగుతున్నాయి. ప్రకృతి ఒడిలో కనిపించే ఈ ఆలయం ప్రాంతీయ భక్తులకు ప్రత్యేక ఆకర్షణ. మాఘ అమావాస్య మహత్త్వం పురాణాల ప్రకారం మానవ మూలపురుషుడు మనువు జన్మించిన తిథి మాఘ అమావాస్య,సూర్య దేవుడు ఆవిర్భ వించిన రోజు.ఈ రోజు మౌనవ్రతం పాటించడం, పవిత్ర స్నానాలు, పూర్వీకుల తర్పణాలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక శుద్ధి, మానసిక ప్రశాంతత,కు టుంబ శ్రేయస్సు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో గంగాది నదులు, పుణ్యక్షేత్రాల్లో ఈ రోజు ఘనోత్సవాలు జరుగుతా యి.ప్రధాన వేడుకల వివరాలు పవిత్ర స్నానాలు మంచినీటిలో భాగమామాస్య స్నానం పాపాలను నాశనం చేస్తుంది, భక్తుల రద్దీకి సౌకర్యాలు. పూర్వీ కుల పూజ: తర్పణం, పిండప్రదానం ద్వారా ఆత్మ శాంతి కోరుకుంటారు.మౌనవ్రతం: ‘మౌని’ అమావా స్య కాబట్టి రోజంతా మౌనంగా దైవ చింతన. దాన ధర్మాలు: నువ్వులు, తిలాలు, దుస్తులు, భోజనం దానాలు పుణ్యకరం.సూర్యారాధన: సూర్యోదయం లో అర్ఘ్య ప్రదానం, సూర్య ఆలయ దర్శనాలు. ప్రత్యేక ఉత్సవాలు: ఆలయంలో అభిషేకాలు, తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.తేదీలు.. తెలుగు పంచాంగం ప్రకారం 2026 మాఘ అమావాస్య జనవరి 18న ఆదివారం రోజు 00:03 గంటలకు ప్రారంభమై, 19 జనవరి 01:21కు ముగుస్తుంది. కామారెడ్డి జిల్లాలో మద్దికుంటతో పాటు సింహాచ లం, ఏడుపాయల వంటి క్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగేందుకు పోలీస్ బందోబస్తు, రవాణా, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంతీయ భక్తులు, స్థానికులు తండోపతండాలుగా తరలివచ్చి పాల్గొంటారు.

మహబూబ్ నగర్

సంక్రాంతి సప్తవర్ణ శోభిత క్రాంతి

*సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి… మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ* *16/ 01/ 2026* *ఇంటింటా సంక్రాంతి రంగవల్లులతో పిండి వంటలు పతంగులు హరిదాసుల కీర్తనలు సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి, మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం సంవత్సరం తర్వాత పంట ఇంటికి వచ్చిన వేళ, జిల్లాలో ఎక్కడ చూసిన పండగ వాతావరణం భోగి మకర కనుమ ఇలా నవధాన్యాలు ముగ్గులో పోసి గొబ్బెమని పెట్టి వైభవంగా ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి జిల్లా వాసుల అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు*,*ఇంటింటా నవధాన్యాలతో కళకళలాడాలని రంగవల్లులతో* *సప్తవరణ శోభితంగా ముంగిళ్ళు వాకిళ్లు* *విరియాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు*

మహబూబ్ నగర్

సంక్రాంతి సప్తవర్ణ శోభిత క్రాంతి

*సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి… మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ* *16/ 01/ 2026* *ఇంటింటా సంక్రాంతి రంగవల్లులతో పిండి వంటలు పతంగులు హరిదాసుల కీర్తనలు సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి, మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం సంవత్సరం తర్వాత పంట ఇంటికి వచ్చిన వేళ, జిల్లాలో ఎక్కడ చూసిన పండగ వాతావరణం భోగి మకర కనుమ ఇలా నవధాన్యాలు ముగ్గులో పోసి గొబ్బెమని పెట్టి వైభవంగా ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి జిల్లా వాసుల అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు*,*ఇంటింటా నవధాన్యాలతో కళకళలాడాలని రంగవల్లులతో* *సప్తవరణ శోభితంగా ముంగిళ్ళు వాకిళ్లు* *విరియాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు*

మహబూబ్ నగర్

సంక్రాంతి సప్తవర్ణ శోభిత క్రాంతి

*సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి… మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ* *16/ 01/ 2026* *ఇంటింటా సంక్రాంతి రంగవల్లులతో పిండి వంటలు పతంగులు హరిదాసుల కీర్తనలు సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి, మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం సంవత్సరం తర్వాత పంట ఇంటికి వచ్చిన వేళ, జిల్లాలో ఎక్కడ చూసిన పండగ వాతావరణం భోగి మకర కనుమ ఇలా నవధాన్యాలు ముగ్గులో పోసి గొబ్బెమని పెట్టి వైభవంగా ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి జిల్లా వాసుల అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు*,*ఇంటింటా నవధాన్యాలతో కళకళలాడాలని రంగవల్లులతో* *సప్తవరణ శోభితంగా ముంగిళ్ళు వాకిళ్లు* *విరియాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.