Wednesday, 11 March 2026

Blog

ఖమ్మం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్‌ రిజర్వేషన్లు ఖరారు – కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా వివరాలు

ఖమ్మం జనవరి ( పున్నమి ప్రతినిధి) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించిన డివిజన్‌/వార్డు రిజర్వేషన్లను ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వుడ్‌ (UR) కేటగిరీలకు కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ (60 డివిజన్లు): ఎస్టీ : 1 ఎస్సీ : 7 బీసీ : 20 అన్‌రిజర్వుడ్‌ (UR) : 32 కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్: ఎస్టీ : 11 ఎస్సీ : 12 బీసీ : 7 అన్‌రిజర్వుడ్‌ (UR) : 30 ఏదులాపురం (32 వార్డులు): ఎస్టీ : 3 ఎస్సీ : 7 బీసీ : 6 అన్‌రిజర్వుడ్‌ (UR) : 16 కల్లూరు: ఎస్టీ : 3 ఎస్సీ : 5 బీసీ : 2 అన్‌రిజర్వుడ్‌ (UR) : 10 మధిర: ఎస్టీ : 1 ఎస్సీ : 6 బీసీ : 4 అన్‌రిజర్వుడ్‌ (UR) : 11 సత్తుపల్లి: ఎస్టీ : 1 ఎస్సీ : 3 బీసీ : 7 అన్‌రిజర్వుడ్‌ (UR) : 12 వైరా: ఎస్టీ : 1 ఎస్సీ : 5 బీసీ : 4 అన్‌రిజర్వుడ్‌ (UR) : 10 అశ్వరావుపేట: ఎస్టీ : 3 ఎస్సీ : 4 బీసీ : 4 అన్‌రిజర్వుడ్‌ (UR) : 11 ఇల్లెందు: ఎస్టీ : 2 ఎస్సీ : 4 బీసీ : 6 అన్‌రిజర్వుడ్‌ (UR) : 12 ఈ రిజర్వేషన్లతో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు ఊపందుకున్నాయి. రాబోయే ఎన్నికలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చెట్లను తొలగించడి

దుత్తలూరు మండలంలోని పలు ప్రాంతల్లో వెళ్లే రహదారుల మలుపుల్లో చెట్లు విపరీతంగా పెరిగాయి ఆ మలుపుల వద్ద ఎదురుగ వస్తున్నా వాహనం కూడా కనిపించే పరిస్థితి లేదు రాత్రి వేళ్లలో మరి విపరీతంగా ఉంటుంది ప్రధానంగా దుత్తలూరు అనకట్ట చెరువు ఎక్కువగా ఉంటుంది కావున ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పండగ పూట ఒకే ఇంట్లో ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లాలోని అల్లూరు మండలం ఇసుకపల్లి తీరంలో ఇద్దరు బిడ్డలు కనుమ పండగ పూట విషాదం చోటుచేసుకుంది ఆ ఇద్దరు బిడ్డలు 1 అమ్ములు, బాలకృష్ణ ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ తల్లి దండ్రులు తీరని శోకాన్ని చేసుకుంది

ప్రకాశం

నుచ్చుపొద గ్రామంలో ఘనంగా సంక్రాంతి క్రీడా సంబరాలు:

పామూరు జనవరి ( పున్నమి ప్రతి నిధి) సంక్రాంతి సంబరాల్లో భాగంగా పామూరు మండలం నుచ్చుపొద గ్రామపంచాయతీలో స్వామి వివేకానంద యువ చైతన్య ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరెకొండ సురేష్ బాబు అధ్యక్షత వహించగా, మెడబలిమి శ్రీహరి ఆధ్వర్యంలో క్రికెట్, కబడ్డీ, రన్నింగ్ రేసులు, లెమన్ స్పూన్స్, మ్యూజికల్ చైర్స్ తదితర ఆటలు నిర్వహించబడాయి. ఆటల అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ ఉపసర్పంచ్ గొల్ల వెంకటేశ్వర్లు, పోకా లోకనాథం పాల్గొని మాట్లాడారు. యువతకు క్రీడలు ఎంతో అవసరమని, ఇవి గ్రామంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు శరీర దేహదారుఢ్యానికి ఉపయోగపడతాయని తెలిపారు. గత 13 సంవత్సరాలుగా గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిస్తున్న పోకా లోకనాథం, ఉపసర్పంచ్ గొల్ల వెంకటేశ్వర్లు, ఆరెకొండ హరిప్రసాద్, కోలనీడి రామకృష్ణ, శ్రీహరి, హనుమంతు ల సహకారం అమూల్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోలనీడి రామకృష్ణ, ఆరెకొండ హరిప్రసాద్, కందుల మాల్యాద్రి, కవులూరి చిన్న కాశం, సుత్తినేని రమణయ్య, హనుమంతు, రాము, వెంకీ, రాజశేఖర్, రామచంద్ర, ప్రవీణ్‌తో పాటు గ్రామంలోని పిల్లలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఖమ్మం

మీడియా తొ చిట్‌చాట్‌లో మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూజ్యులు ఎన్టీఆర్ గారు తనకు నీతి–నిజాయితీ రాజకీయాలు నేర్పారని గుర్తు చేశారు. కష్టపడితే సామాన్యులు కూడా రాజకీయాల్లో ఏదైనా సాధించవచ్చని చంద్రబాబు నాయుడు చూపించారని పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ శైలి వేరు, వ్యూహాత్మకంగా రాజకీయాలు చేస్తారని అన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు రేవంత్ రెడ్డి అని ప్రశంసించారు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద ఎవ్వరిని నొప్పించకుండా పనిచేశానని, అది దైవ నిర్ణయమేనని చెప్పారు. గత ప్రభుత్వంలో భద్రాద్రి రామాలయ అభివృద్ధి సాధ్యం కాలేదని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పునరుద్ధరణ పనులు చేపట్టామని వెల్లడించారు. శ్రీరామ నవమి రోజున సీఎం రేవంత్ చేతుల మీదుగా రామాలయ విస్తరణ పనులకు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇండస్ట్రీ, టూరిజం రంగాల్లో కృషి చేశానని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టామని, తెలంగాణలో పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరణ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రాసెసింగ్ ప్లాంట్లతో పంటలకు అదనపు విలువ కల్పించనున్నట్లు చెప్పారు. తుఫాన్లు, చీడపీడలు, కోతుల బెడద లేకుండా పామాయిల్ సాగు రైతులకు వరంగా మారిందన్నారు. పామాయిల్‌లో అంతర పంటలుగా కోకో, జాజి, వక్క, మిరియం సాగుతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. సమాజంలో జీవన ప్రమాణాలు పెరిగే చిత్తశుద్ధితో రాజకీయాలు చేస్తే సమాజమే తిరిగి ఇస్తుందని అన్నారు. అబ్దుల్ కలాం, స్వామినాథన్, కురియన్ వంటి మహానుభావుల వల్ల దేశం ప్రగతి బాటలో నడిచిందని పేర్కొన్నారు. రైతు కేంద్రంగా ప్రభుత్వ లక్ష్యాలు, పరిశోధనలు ఉండాలని సూచించారు. అడవుల్లో ఎలాంటి ఎరువులు లేకుండానే మొక్కలు చక్కగా ఎదుగుతాయని, విచ్చలవిడిగా ఎరువులు–పురుగుమందులు వాడటం వల్ల కాలుష్యం పెరుగుతోందని హెచ్చరించారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మనకు హెచ్చరిక లాంటిదని, కాలుష్యరహితంగా భూమాతను కాపాడేలా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం యజ్ఞంలా చేసే అవకాశం దక్కిందన్నారు. నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజాసేవ చేసే భాగ్యం భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామి ఆశీస్సులతో లభించిందని చెప్పారు. సీఎం రేవంత్ పాలనలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తన నలబై ఏళ్ల రాజకీయ జీవితం ప్రజాసేవగా సాగిందన్నారు.

మహబూబ్ నగర్

సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం

*సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి… మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ* *17/ 01/ 2026* *ఇంటింటా సంక్రాంతి రంగవల్లులతో పిండి వంటలు పతంగులు హరిదాసుల కీర్తనలు సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి, మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం సంవత్సరం తర్వాత పంట ఇంటికి వచ్చిన వేళ, జిల్లాలో ఎక్కడ చూసిన పండగ వాతావరణం భోగి మకర కనుమ ఇలా నవధాన్యాలు ముగ్గులో పోసి గొబ్బెమని పెట్టి వైభవంగా ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి జిల్లా వాసుల అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు*,*ఇంటింటా నవధాన్యాలతో కళకళలాడాలని రంగవల్లులతో* *సప్తవరణ శోభితంగా ముంగిళ్ళు వాకిళ్లు* *విరియాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు*

మహబూబ్ నగర్

సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం

*సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి… మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ* *17/ 01/ 2026* *ఇంటింటా సంక్రాంతి రంగవల్లులతో పిండి వంటలు పతంగులు హరిదాసుల కీర్తనలు సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి, మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం సంవత్సరం తర్వాత పంట ఇంటికి వచ్చిన వేళ, జిల్లాలో ఎక్కడ చూసిన పండగ వాతావరణం భోగి మకర కనుమ ఇలా నవధాన్యాలు ముగ్గులో పోసి గొబ్బెమని పెట్టి వైభవంగా ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి జిల్లా వాసుల అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు*,*ఇంటింటా నవధాన్యాలతో కళకళలాడాలని రంగవల్లులతో* *సప్తవరణ శోభితంగా ముంగిళ్ళు వాకిళ్లు* *విరియాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు*

పల్నాడు

దొంగల హల్‌చల్..

అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. 12 ఇళ్లలో చోరీ …. తెలంగాణ : హైదరాబాద్‌ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచెర్లలో దొంగలు హల్‌చల్ చేశారు. గురువారం అర్ధరాత్రి 12 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. చేతిలో కత్తులు పట్టుకుని పరిసరాల్లో కలియతిరిగారు. గత రాత్రి కార్లలో వచ్చి పక్కా ప్లాన్‌తో 12 ఇళ్లలో చోరీ చేసి పరార్ అయ్యారు. బంగారం, నగదుతో పరారైనట్లు తెలుస్తోంది. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు….

E-పేపర్

ఎన్టీవీ జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలి

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083 రాజమహేంద్రవరం,: జర్నలిస్టులపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాలను జర్నలిస్టు డెమోక్రటిక్ రైట్స్ ఫోరం (జెడిఆర్ఎఫ్) తీవ్రంగా ఖండిస్తున్నట్లు మేడా శ్రీనివాస స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో జర్నలిజం నాలుగో స్తంభమని, అలాంటి జర్నలిస్టులను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా, అర్ధరాత్రి వేళ తీవ్రవాదుల్లా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. మహిళా ఐఏఎస్ అధికారి, మంత్రి సంబంధిత వార్త వ్యవహారంలో, సిట్ విచారణ ఇంకా కొనసాగుతున్న దశలోనే ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్లను అరెస్ట్ చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఐదు రోజుల క్రితం ప్రసారమైన కథనంపై ఇప్పటికే ఎన్టీవీ యాజమాన్యం క్షమాపణలు కూడా తెలిపినప్పటికీ, ఆ తర్వాత కూడా జర్నలిస్టులపై కఠిన చర్యలకు దిగడం ప్రభుత్వ దురుద్దేశాన్ని స్పష్టంగా చూపుతోందని డా. సురేంద్రబాబు అన్నారు. “సిట్‌పై నిజంగా నమ్మకం ఉంటే, విచారణ పూర్తయ్యాకే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. ముందస్తు అరెస్టులు మీడియా స్వేచ్ఛను హరించడమే” అని ఆయన వ్యాఖ్యానించారు. నిరాధారమైన లేదా అసత్య కథనాలపై ఖండన కోరుకోవడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రతి పౌరుడి హక్కేనని, కానీ అర్ధరాత్రి అరెస్టులు, కుటుంబ సభ్యుల ముందే పోలీస్ దాడులు మీడియాను భయపెట్టే ప్రయత్నంగా మాత్రమే భావించాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీవీ జర్నలిస్టులు ముగ్గురూ సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్టులని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో వారి పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. అలాంటి వారిని నేరస్థులుగా చూపడం సమాజానికి తప్పు సంకేతాలు పంపుతుందని హెచ్చరించారు. ఈ తరహా చర్యలు కొనసాగితే రేపు ప్రజలకు నిజం చెప్పే ప్రతి గొంతు ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుందని జెడిఆర్ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. జెడిఆర్ఎఫ్ డిమాండ్లు: 1. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్‌లను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి 2). జర్నలిస్టులపై అర్ధరాత్రి అరెస్టుల సంస్కృతిని వెంటనే నిలిపివేయాలి 3). మీడియా స్వేచ్ఛకు, జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి 4). సిట్ విచారణను పారదర్శకంగా, రాజకీయ ఒత్తిడులు లేకుండా కొనసాగించాలి మీడియా స్వేచ్ఛను అణిచే ఏ ప్రయత్నాన్నైనా దేశవ్యాప్తంగా తోటి జర్నలిస్టుల సంఘాలతో కలిసి తీవ్రంగా ఎదుర్కొంటామని జర్నలిస్టు డెమోక్రటిక్ రైట్స్ ఫోరం(జెడిఆర్ఎఫ్) స్పష్టం చేసింది. End

సాహితీ

కలిసొచ్చిన కాలం (కథ) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

మానవత్వం ఉన్న ప్రతి మనిషి అందరిని సమానంగా చూస్తాడు. నైతిక విలువల పట్ల విధేయత చూపుతాడు. మనసు మనసు తోడై ఆకర్షితులైన స్త్రీ పురుషులు జీవితానికి పూలబాట వేసుకుని జీవన రథచక్రాలై సరైన మార్గంలో సాగి పోతారు. ‘ప్రేమ’ కొలువున్న ప్రదేశం కల్మషం లేని హృదయం. ఈ హృదయాలను ధరించిన జంటలు మేరువులై జీవన స్రవంతిలో పూబంతులై పరిమళిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. కష్ట సుఖాలు, కలిమి లేములు జీవన యాత్రకున్న లక్షణాలు. చీకటి వెన్నెలవోలె కష్ట సుఖాలు. ఇదే కదిలే కాలం. చీకటిని అనుభవించిన తర్వాతే వెన్నెల కున్న ప్రాముఖ్యత చక్కగా బోధపడుతుంది. జీవితం మీద విరక్తి కల్గించిన కాలం కల్పవృక్షమై నిలిస్తే అదే ‘కలిసొచ్చిన కాలం’ బ్రహ్మరాతలకు రూపు దిద్దుకున్న అలంకారం. ఇక కథలోకి వెళ్దాం… బస్సు వేగంగా సాగిపోతుంది. చల్లని గాలి వీస్తుంది. తన తలపులలో కొలువుండే వనజకు పెళ్ళవుతుందన్న వార్త తెలుసుకున్న సుమంత్ హృదయం బరువెక్కి నీటిలో రాయిలా ఉంది. వెనక్కి పోతున్న చెట్లను విచారంగా చూస్తూ ఉన్నాడు. గడిచిన తన 20 సం॥రాల జీవితం కళ్ళముందు కనబడుతుంది. తీపి గుర్తులు చేదుగుర్తులయ్యేటట్లున్నాయి. క్షణమునకో ఆలోచన ఉదయిస్తుంది. ఓ చోట ఉన్నట్లుండి బస్సు ఆగింది. రోడ్డు ప్రక్కనున్న మైలురాయి కనిపించింది. దాని పై హైదరాబాద్ 45 km అని వ్రాసుంది. మరో గంటలో హైదరాబాద్ లొ ఉంటాననుకొని, ‘వనజను కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు అతనెవరో చూడాలి. అయినా మావయ్య నాకు ఆహ్వానం పంపలేదు’ అక్కడి కెళ్ళడం మర్యాద కాదేమోనని తలచి తన మిత్రుడు మాధన్ ఇంటికెళ్ళాలనుకున్నాడు. కాస్సేపటిలో బస్టేషన్ వచ్చేసింది. వనజను తన కళ్ళల్లోనే దర్శించు కుంటూ బస్సు దిగాడు సుమంత్. మాధన్ ఇల్లు విద్యుత్ నగర్ లో ఉంది టౌన్ సర్వీస్ కూడా సిద్దంగానే ఉంది. ఆ బస్సెక్కాలో లేదా వనజ కళ్యాణ మండపం వైపెళ్ళాలో దిక్కుతోచడం లేదు సుమంత్కి. వనజ పెళ్ళయినా కళ్ళారా చూడాలని తన మనసు ఉబలాట పడుతున్నది. ‘వనజకు నేనంటే ఇష్టమే, కాని నాపై ఉన్న ఇష్టం కన్నా తన తండ్రిమీదే ప్రేమెక్కువ. అతని మాటకు ఎదురివ్వక అతని ఇష్ట ప్రకారమే పెళ్ళికంగీకరిచిందేమో.. మనిషికి మనసుంటే చాలదు. మనీ కూడా కావాలి.. అది నా దగ్గిర లేదు గనుకే వనజకు మేనల్లుణ్ణి నేనొకడున్నానని కూడా చూడకుండా మ్యారేజ్ ఫిక్స్ చేశాడు మామయ్య.. సర్లే వనజ నన్ను పెళ్ళాడినట్లయితే వనవాసమే.. కాదామరి! పేదవాణ్ణి పెళ్ళాడితే.. రాతలు ప్స్’ అని తన మనసు తో మాట్లాడి నిరాశ ముఖం తో టౌన్ సర్వీసెక్కబోయాడు. అనుకోకుండా మాధవ్ అదే బస్సులోంచి దిగుతూ ‘ఏరా సుమంత్ పి.జి. పూర్తయిందా.. అన్నట్లు ఎప్పుడొచ్చావ్.. అమ్మ బాగుందా..’ అంటూ 5 నిముషాలు డబడబా మాట్లాడేశాడు మాధవ్. ‘ఇప్పుడే దిగారా.. ఈమధ్య మనసేం బాగోలేదు నిన్ను కలవాలనిపించింది.. వెంటనే వచ్చేసా.. అంతే’ ఏదో దాస్తున్నట్లు చెప్పాడు సుమంత్. ‘సరే.. అన్నీ తర్వాత మాట్లాడుతాం గానీ.. మరో 30 ని॥లలో ఆ… కన్పించే కళ్యాణ మండపంలో మా చిన్నాయన కొడుక్కి పెళ్లి’ అంటూ దూరంగా ఉన్న దాన్ని వేలెత్తి చూపిస్తూ ‘పెళ్ళి కుమార్తె పేరు వనజ.. వాళ్ళు కూడా బాగా ఉన్నవారే సుమా!’ అంటూ టాక్సీని పిలిచాడు మాధవ్. ‘ఉన్నవాళ్ళు కాబట్టే నన్ను దూరం చేసుకున్నారు’ నోటిలో గొణుక్కుంటూ ఎలాగయినా సరే వనజ తనకి దక్కకున్నా ఆ దక్కించుకునే వాణ్ణి చూడాలన్న తాపత్రయం తనలో ఎక్కువైంది. మరేం చెప్పలేక సరే పదమంటూ మిత్రుడితో కలిసి కళ్యాణ మండపానికి బయల్దేరాడు సుమంత్. కళ్యాణ వేదిక విద్యుద్దీపాలంకరణలతో శోభాయ మానంగా ఉంది. ఆ కాంతులలో వనజ సౌభాగ్య లక్ష్మిగా దర్శన మిచ్చింది. ‘వేసవి సెలవులలో మా ఇంటి కొచ్చి నాతో ఆడి పాడిన వనజేనా ఈమె’ అనుకుని ఆ అందాన్ని మరెప్పుడూ చూడలేనట్లు చూస్తూ నిలబడిపోయాడు సుమంత్. ‘కూల్ డ్రింక్ ప్లీజ్’ అన్న శబ్దం వినబడింది. తీసుకున్న కూల్ డ్రింక్ చేతిలోనే ఉంచుకొని వనజను తనివి తీరా చూస్తూ నిలబడి పోయాడు. తన మావయ్య ఆ పెళ్ళి సందడిలో సుమంత్ను కనీసం పలకరిచనూ లేదు. మాధవ్ సుమంత్ని పెళ్ళికొడుక్కి పరిచయం చేస్తూ ‘హి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్’ అని చెబుతాడు. ప్రక్కనే ఉన్న వనజ సుమంత్ రాక చూసి ఆనందిస్తుంది కాని అతని ప్రేమను గ్రహించలేదు. చనువుగా ప్రవర్తించేది ఆ చనువే ప్రేమగా భావించాడు సుమంత్. చనువుతో పాటే వారిరువురి వయసు కూడా పెరగడంతో వీరెక్కడ ప్రేమించి పెళ్ళి చేసుకుంటారోనని, అలా జరిగితే తన కూతురు పేదింటి కోడలవుతుందని రాకపోకలను కట్చేసి చివరకు ఆహ్వానం కూడా పంపలేదు తన మావయ్య. పురోహితులు మంత్రాలు చదువుతుండగా, మంగళ వాయిద్యాలతో వనజ మెడలో మూడుముళ్ళు పడ్డాయి. వనజకు వెళ్ళాస్తానంటూ తన చూపులతోనే తెలిపాడు సుమంత్. సుమంత్ను ఆపి మనస్ఫూర్తిగా మాట్లాడాలంటే తన తండ్రి అడ్డు పడడంతో ఏమీచేయలేక తటస్థంగా ఉండిపోయింది వనజ. తను ఆశించింది పొందలేనపుడు ఎవరికైనా బాధే. మాధవ్ ఎంత బ్రతిమలాడినా ఉండకుండా తన గ్రామానికి బయల్దేరాడు సుమంత్. *** ‘ఎప్పటి నుంచో చెబుతూనే వచ్చాను.. మీ మావయ్య ధనమే జీవితం అనుకునే మానవత్వం లేని మనిషని, అతనికి రక్త సంబంధం, మమతాను రాగాల విలువ తెలియదు. తెలిసిందల్లా ఒకటే.. ధనం, హోదా.. ఇప్పటికైనా అన్నీ మరచిపో బాబు’ అంటూ సుమంత్ ని ఓదార్చుతూ గిన్నెలో అన్నం పెడుతుంది తన తల్లి అన్నపూర్ణమ్మ. కాని ప్రేమించిన నేరానికి శిక్ష ఉపవాసం ఇది కాలం చెప్పే మాటగా ఆ రోజంతా పస్తుండి పోయాడు సుమంత్. ** నిరాశ నిస్పృహల మధ్యన తను చదివిన చదువు కూడా మరచాడు సుమంత్. అన్నపూర్ణమ్మకు ఐదుగురు బిడ్డలు. నలుగురి ఆడపిల్లలకు అతి కష్టం మీద పెళ్లి చేయ గలిగింది. ఆఖరివాడు సుమంత్. నాలుగిండ్లలో పని చేసి తను పోషిస్తున్న అమ్మను చూసి ఏదో ఒక ఉద్యోగం చేయాలనిపించి విశాఖపట్నం లో టైపిస్టు పోస్టు ఖాళీగుందని తెలిసి మరేం ఆలోచించక కష్టపడుతున్న తన తల్లిని పోషించుటకు ఒక బిస్కెట్ ప్యాక్టరీలో టైపిస్టుగా చేరాడు సుమంత్. *** ‘అమ్మా రూపా.. చదివిన చదువు చాలు.. ఇక నుంచి నీవు చదవాల్సిన అవసరం లేదు మనకేం తక్కువ?.. ఆరు ఫ్యాక్టరీలున్నాయి. B.A. వరకు చదివి అంతో ఇంతో తెలివితేటలు సంపాదించావు.. నీ కంతగా బోరనిపిస్తే.. ఏదో నీకిష్టమొచ్చిన ప్యాక్టరీని మేనేజ్చేయి’ అంటాడు దీప తండ్రి గుణశేఖర్. ఇతను చాలా సహృదయుడు పెంచిన మమకారం తప్ప తన కన్నకూతురు కాదనే భావన ఎప్పుడు రానివ్వలేదు. చదువు మానేసి ఇంట్లో కూర్చోవటం ఇష్టంలేక వారి బిస్కెట్ ఫ్యాక్టరీలో మేనేజర్గా ఉండడానికి ఒప్పుకుంది దీప. ఓ రోజు గుణశేఖర్ బిస్కెట్ ఫ్యాక్టరీ వర్కర్స్ అందరిని దీపకు పరిచయం చేస్తూ ‘ఇతను సుమంత్ అని టైపిస్టు ఈ మధ్యనే చేరాడు ఇతనికి ఇక్కడ ఓ ప్రత్యేక స్థానముందమ్మా.. ఏంటంటే చేరిన మొదటి రోజు మెయిన్ ఆపి నన్ను ఈ ఫ్యాక్టరీని రక్షించాడు. లేకుంటే ఆ… విద్యుత్ తీగ తెగి పెద్ద ప్రమాదమే సంభవించేది’. ‘నా దేముందండి విధి ధర్మం మీదయ’ వినయంగా పలికాడు సుమంత్. పేరుకు తగ్గట్టు అతని వినయశీలతకు దీర్ఘదృష్టికి దీప ఆకర్షితురాలయింది. ‘అంతా వివరించాను ఇక ఈ ఫ్యాక్టరీ బాధ్యత నీదే.. వెళ్ళోస్తానమ్మా’ అంటూ వేరే పని మీద వెళ్ళిపోయాడు గుణ శేఖర్. ఏదో పోగొట్టుకొని నిరాశతో ఉన్నట్లు సుమంత్ ముఖకవళికను బట్టి దీప గ్రహించింది. ‘చూడండి సుమంత్ గారు.. ఈ ఫ్యాక్టరీ లోని వర్కర్స్ అందరి నేమ్స్, వారి ఏజ్ టైప్ చేసి నాబల్ల మీదుంచండి’ అని చల్లని గాలి వీచినట్లుగా చెప్పింది దీప. ‘అలాగే మేడమ్’ అంటూ చకచక టైప్ చేసి దీప బల్లమీదుంచాడు సుమంత్. నిజానికి అతన్ని పలకరిచాలనే ఉద్దేశ్యంతోనే దీప అలా అంది. సుమంత్ ను గమనిస్తూ ‘మీ ఊరేంటి’ అడిగింది దీప. ‘చిరుకాలం’ ‘ప్రస్తుతం ఎక్కడున్నారు’. ఈ విశాఖపట్నం లోనే ఓ అద్దె గదిలో నేనూ మా అమ్మా ఉంటున్నాం’ ‘మీ నాన్నగారు లేరా!’ ‘నాకు తెలియని వయసులోనే కాలం చేశాడు మేడమ్’ నిదానంగా విధేయతగా సమాధాన మిచ్చాడు సుమంత్. సుమంత్ యొక్క ప్రవర్తన మాటల్లో దాగుండే అంతరార్థం, బాహ్యతేజస్సు దీపకు బాగా నచ్చాయి. అదే విధంగా దీప యొక్క పలుకు పలకరించే తీరు చూస్తుంటే సుమంత్ హృదయంలో ఏదో ఆశా జ్యోతి వెలుగుతోంది. ‘సుమంత్ అందరిలా కన్పించడేంటి.. తనపనేమో తానేమో.. ఆ నిరాశ పూరిత వైఖరికి కారణం తెలుసుకోవాలి’ అనుకుంది దీప. అతనితో పదే పదే మాట్లాడాలనిపిస్తుంది. ఏమిటో ఆ తెలియని ప్రేమ. కాలేజీ రోజుల్లో ఎంత మంది అందమైన అబ్బాయిలు తనచుట్టూ తిరిగినా పట్టించుకునేది కాదు. ఆడవారి మాటలకు అర్థాలే కాదు మనస్తత్వాలు కూడా వేరు. అవసరానికి మించి ఎక్కువగా మాట్లాడడు సుమంత్. ధనవంతులకు దూరంగా ఉండాలనే భావన అతనిలో బాగా పేరుకు పోవడమే కారణం. రోజూ డైరీ వ్రాసుకోవడం అలవాటే సుమంత్కు. వనజ పట్లున్న మౌనప్రేమ, P.G. విశేషాలు అందులో చక్కగా వ్రాసుకున్నాడు. ప్రతి రోజు డైరీ చూసుకోందే ఉండలేడు. ఓ రోజు టేబుల్ మీదుంచి మరచి పోవడంతో అది దీప గమనించి అతని గూర్చి పూర్తిగా తెలుసుకునే చక్కని మార్గంగా భావించి చదువుతుంది. ‘ప్రేమ రెండు హృదయాల మధ్య వారధి. ఈ వారధి కిరువైపుల ఆస్తులు, అంతస్తులు సమపాళ్ళలో ఉన్నపుడే ఇది అమరత్వ ప్రేమ సుధా సన్నిధి’ అని ఇటువంటి వాక్యాలెన్నో.. ఆ డైరీలో వ్రాసున్న అంతరార్ధం దీపకు చక్కగా బోధపడుతుంది. తను M.A. వరకు చదివి ఈ టైపిస్టు ఉద్యోగం చేస్తున్నాడంటే విచారించవలసిన విషయమే అనుకొని ఆ రోజు గుణ శేఖర్కు అంతా వివరించి చెప్తుంది. గుణశేఖర్ అభిమానం ఉన్న వ్యక్తి కనుక ఆసక్తిగా ఆలకించి తను కాలేజ్ కమిటీ చైర్మన్ కావడం చేత దీప కోరిక కాదనలేదు. ఓ రోజు సుమంత్ ను పిలిచి ‘మిమ్మల్ని

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.