Wednesday, 11 March 2026

Blog

ఖమ్మం

ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు తాండ్రా వినోద్ రావు

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) ఖమ్మంలో సీపీఐ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు వినోద్ రావు తండ్రా తీవ్రంగా ఖండించారు. బీజేపీని పూర్తిగా తుడిచిపెట్టాలంటూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం రాజకీయ ఆత్మవిశ్వాసం కాదని, అది రాజకీయ అసహనం, నిరాశకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మంలో బీజేపీ ఒక్క సర్పంచ్ స్థానం కూడా గెలుచుకోలేదన్న వ్యాఖ్యలు వాస్తవాలకు దూరమని పేర్కొన్న వినోద్ రావు, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో బీజేపీకి 1.20 లక్షలకుపైగా ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో దాదాపు 99 శాతం బూత్‌లలో బీజేపీ ఓట్లు సాధించడం చారిత్రక విజయమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను అవమానించేలా మాట్లాడడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటూ పిలుపునివ్వడం ద్వారా కాంగ్రెస్–సీపీఐల దేశవిరోధి రాజకీయ ధోరణి మరోసారి బయటపడిందని ఆరోపించారు. భద్రాచలం రామమందిరానికి కేంద్రం నిధులు ఇవ్వలేదన్న వ్యాఖ్యలను వినోద్ రావు పూర్తిగా అవాస్తవమని ఖండించారు. ప్రసాద్ పథకం కింద భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ అభివృద్ధికి సుమారు రూ.90 కోట్లు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. అలాగే 2022లో భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని, దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పారు. రామాయణ సర్క్యూట్ అభివృద్ధిలో భాగంగా భద్రాచలం కీలకంగా మారిందని, అయోధ్య తరహా ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఇప్పటికే అమలులో ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రసాద్ పథకం కింద పూర్తి స్థాయి ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిందా అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదని విమర్శించారు. భద్రాచలం శ్రీరాముడు రాజకీయాలకు అతీతుడని, ఆయన పేరుతో అబద్ధాలు ప్రచారం చేయడం తగదని వినోద్ రావు తండ్రా హితవు పలికారు. ప్రజలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మవద్దని, ఖమ్మం జిల్లా సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బీజేపీ బలంగా ఎదుగుతోందని తెలిపారు. బీజేపీ ప్రయాణం ఖమ్మంలో ఇప్పుడే ప్రారంభమైందని, దాన్ని ఎలాంటి ప్రసంగాలు ఆపలేవని స్పష్టం చేశారు.

E-పేపర్

గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారు పోలేరమ్మ వారు జాతర

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. ఇరగవరం మండలం ఇరగవరం గ్రామంలో గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారు పోలేరమ్మ వారు జాతర ఆ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి గ్రామ ప్రజలందరూ మహా నివేదన చేసిన తర్వాత పోలేరమ్మని అత్తవారింటికి పంపేటప్పుడు ఆ విధంగా చేయడం ప్రతి గ్రామంలో నూ సాంప్రదాయం గ్రామ పురోహితులు పొన్న రాంబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు END.

E-పేపర్

సంక్రాంతి సంబరాలు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెంలొ సంక్రాంతి సంబరాలు వేళ్ళచింతలగుడెం ఆర్ & ఎమ్ కల్చరల్ కమిటీ, మధు,మరియు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు గారి ఆధ్వర్యంలో కామెడీ యాక్టర్స్ మరియు సింగర్స్ మ్యుజికల్ కల్చరల్ ప్రొగ్రంస్ నిర్వహించారు END.

ఆంధ్రప్రదేశ్

యుగపురుషుడు స్వర్గీయ పద్మశ్రీ డా. ఎన్‌టీఆర్ గారి వర్ధంతి

నెల్లూరు: (పున్నమి ప్రతినిధి) యుగపురుషుడు, స్వర్గీయ పద్మశ్రీ డా. ఎన్‌టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హజరతయ్య టీచర్ (వీఆర్‌ఎస్), బ్రాహ్మిన్ స్ట్రీట్, మూలపేట, నెల్లూరు వారు పాల్గొన్నారు. డా. ఎన్‌టీఆర్ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్

చెట్టు = తల్లి’ షార్ట్ ఫిల్మ్ విజయోత్సవ వేడుకలు

(పున్నమి ప్రతినిధి) పర్యావరణ పరిరక్షణతో పాటు మానవ సంబంధాల విలువలను ప్రతిబింబించిన ‘చెట్టు = తల్లి’ అనే షార్ట్ ఫిల్మ్ ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా ఈ నెల 18న ఉదయం 10.30 గంటలకు నెల్లూరులోని విజయమహల్ సమీపంలో ఉన్న నేతాజీ పైలట్ స్కూల్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. లౌహిత్య ప్రెజెంట్స్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. కార్యక్రమంలో చిత్ర బృందం, అతిథులు, కళాకారులు పాల్గొని చిత్ర విజయాన్ని పంచుకోనున్నారు. పర్యావరణంపై అవగాహన పెంచేలా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

యువత కోసం ఇచ్చిన మాటను క్రీడలతో నిలబెట్టిన సర్పంచ్ రడం లక్ష్మీ ప్రవీణ్

ఇల్లంతకుంట/పున్నమి ప్రతినిధి/ జనవరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం క్రికెట్ టోర్నమెంట్ లొ గొల్లపల్లి జట్టు ఘన విజయం సాధించింది ఎన్నికల సందర్భంగా క్రీడాకారులు, యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సర్పంచ్ రడం లక్ష్మి (ప్రవీణ్) గారు మరోసారి తన మాటకు కట్టుబాటును చాటుకున్నారు. ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌లో తిప్పాపూర్ – గొల్లపల్లి జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో గొల్లపల్లి జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా విజేత జట్టు సభ్యులను సర్పంచ్ రడం లక్ష్మి (ప్రవీణ్) గారు, ఉపసర్పంచ్ ఓరుపుల లక్ష్మన్ గారు అభినందించారు. అలాగే మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మీసరగండ్ల అనిల్ కుమార్ గారు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండ్ర చందన్ గారు, కేటీఆర్ సేన అధ్యక్షులు ఓరుపుల రాములు గారు, యువ నాయకులు పొట్ల అనిల్ గారు పాల్గొని క్రీడాకారులను ప్రశంసించారు. గ్రామీణ యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ యువతలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు గ్రామాల్లో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని నాయకులు తెలిపారు.

కామారెడ్డి

సర్పంచ్ భార్తను ఫోటో యూనియన్ ఘనంగా సన్మానించారు

కామారెడ్డి, 18 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గిద్ద మైసమ్మ పరిసరాలలో ఫోటోగ్రాఫర్ల యూనియన్ ఆధ్వ ర్యంలో ఘన సన్మాన సమావేశం నిర్వహించారు. ఉప్పల్వాయి గ్రామ సర్పంచ్‌గా గెలిచిన శివరాణి విజయాన్ని ఆమె భర్త, ఫోటోగ్రాఫర్ రాజేందర్‌కు యూనియన్ సభ్యులు అభినందాలు తెలిపారు. ఈ సందర్భంగా ఫోటో యూనియన్ అధ్యక్షుడు మధు మాట్లాడుతూ,ఉప్పల్వాయి గ్రామానికి చెందిన రాజేందర్ భార్య శివరాణి సర్పంచ్‌గా గెలిచిన సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించామని తెలిపారు.యూని యన్ సభ్యుడైన రాజేందర్‌ను అభినందిస్తూ, ఫోటోగ్రాఫర్ల సంఘాన్ని మరింత బలోపేతం చేసేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ రజనీకాంత్, శేఖర్, కిరణ్, శివరాజ్, నరేష్, క్రాంతి, వడ్ల కార్తీక్, నవీన్ తదితరులు పాల్గొని, గ్రామంలోని ఫోటోగ్రాఫర్లు, స్థానికులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైభవంగా గొబ్బెమ్మ విగ్రహ ప్రతిష్ట.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం కోదండరాంపురం చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో యాడాది పండగ సందర్భంగా గొబ్బెమ్మను వైభవంగా కొలువు తీర్చారు. మేళా తాళాలు, డప్పు వాయిద్యాల నడుమ సాయంత్రం పుట్ట మట్టిని తెచ్చి గొబ్బెమ్మను తయారు చేశారు. మూడు రోజుల పాటు గొబ్బెమ్మను కొలువు తీర్చి గొబ్బి పాటలు పాడుతూ గొబ్బిలు తట్టారు. ఈ సందర్భంగా పొంగళ్లు పొంగించి పండగను ఘనంగా జరుపుకున్నారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తూర్పు గోదావరి

రాజమండ్రి సినిమా హాల్లో సినిమా వాళ్ళ సందడి

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. రాజమండ్రి గీతా అప్సి నిమా హాల్లో సినిమా వాళ్ళ సందడి END.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలంలో ఆదివారం ఎన్టీ రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండలాధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. పేదవాడి ఆకలిని గుర్తించి రెండు రూపాయల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనకేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.