Thursday, 5 March 2026

Blog

విశాఖపట్నం

మహిళా భద్రతపై అవగాహన కోసం బీచ్ రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీ

విశాఖపట్నం మార్చి పున్నమి ప్రతినిధి) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం నగరంలో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం సాయంత్రం బీచ్ రోడ్డులో కొవ్వొత్తులు చేతబట్టి ర్యాలీ చేపట్టి మహిళల భద్రతపై స్పష్టమైన సందేశాన్ని ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీ లతా మాధురి, పలువురు ఎస్ఐలు, సచివాలయ మహిళా పోలీసులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మహిళలపై వేధింపులు, దాడులు వంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. మహిళలను వేధించినా, దాడులు చేసినా జీవితాంతం శిక్ష తప్పదనే సందేశాన్ని ప్లకార్డుల ద్వారా ప్రదర్శించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తిగత సమాచారం పంచుకోవడంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలియజేశారు. మహిళల భద్రతే పోలీసుల ప్రాధాన్యమని, ప్రతి మహిళ భయభ్రాంతులకు గురికాకుండా జీవించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

విశాఖపట్నం

ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నం మార్చి (పున్నమి ప్రతినిధి) సముద్రంలో మత్స్య వేటకు వెళ్లి మృతిచెందిన బోయివీధికి చెందిన సురివిన వీర్రాజు కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం తగరపువలసలో అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ప్రమాదంలో మృతిచెందిన ఆనందపురం మండలం బోని గ్రామానికి చెందిన కనకల ప్రసాద్ కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ఎంవీపీ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

విశాఖపట్నం

కూటమి అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పల్లా

గాజువాక మార్చి (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం సోమవారం ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించారు. పాత గాజువాకలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తోందన్నారు. వారి డిమాండ్లను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తోందని, సమస్యల పరిష్కారానికి సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోందని తెలిపారు. విపక్షాల మాయమాటలను నమ్మవద్దని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్న ఈ తరుణంలో ఉద్యమాలకు దిగడం సమంజసం కాదన్నారు. గత వైకాపా పాలనలో గాడితప్పిన పలు వ్యవస్థలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా చక్కదిద్దుతోందని, అయితే విపక్షాలు రాజకీయ లాభం కోసం విషప్రచారం చేస్తూ ఉద్యోగులను ఉద్యమాల వైపు ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు. అంగన్వాడీ కేంద్రాలను సదుపాయాలతో అభివృద్ధి పరచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో శనివారం కాకినాడలో జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని చెప్పారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి సంఘటన స్థలానికి వెళ్లడం ప్రజా సంక్షేమ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, విల్లా రామ్మోహన్ కుమార్, బలగా బాలు నాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

జనవాసాల మధ్య అక్రమ క్వారీ బ్లాస్టింగ్‌లు–సంధ్యానగర్ వాసుల ఆగ్రహం

విశాఖ గాజువాక మార్చి (పున్నమి ప్రతినిధి) నగర పరిధిలోని దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని సంధ్యానగర్ కాలనీ పక్కన కొనసాగుతున్న క్వారీ కార్యకలాపాలు స్థానికుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమవుతున్నాయి. జనవాసాల మధ్యనే అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ రాత్రి, పగలు తేడా లేకుండా బాంబు బ్లాస్టింగ్‌లు చేస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. భారీ శబ్దాలతో ఇళ్ల గోడలు కంపిస్తున్నాయని, పలుచోట్ల గోడలకు చీలికలు వస్తున్నాయని వారు వాపోయారు. ప్రతి సారి బ్లాస్టింగ్ జరిగినప్పుడు చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర భయానికి గురవుతున్నారని, గర్భిణీ స్త్రీలు ఇళ్లలో ఉండటానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాత్రి వేళల్లో ఆకస్మికంగా బ్లాస్టింగ్‌లు చేయడం వల్ల నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్వారీ పూర్తిగా అక్రమమని, అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. “ఇది అక్రమ క్వారీ… వెంటనే మూసివేయాలి” అంటూ నినాదాలు చేశారు. ఏదైనా ప్రాణనష్టం జరిగితేనే అధికారులు స్పందిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గాజువాక రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖలు తమ బాధ్యతను విస్మరించాయని ఆరోపిస్తూ క్వారీ యాజమాన్యానికి కొందరు అధికారులు సహకరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పరిస్థితి విషమించకముందే తక్షణ చర్యలు తీసుకోవాలని, లేదంటే మరింత తీవ్ర ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అక్రమ క్వారీపై విచారణ జరిపించి బ్లాస్టింగ్‌లను నిలిపివేసి జనవాసాల భద్రతకు హామీ ఇవ్వాలని సంధ్యానగర్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. Uploaded Video:

ఖమ్మం

బంజారా న్యాయవాదులతో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ భేటీ – సమస్యలపై చర్చ

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ జిల్లా బార్ కౌన్సిల్‌కు చెందిన బంజారా న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బంజారా న్యాయవాదులు ఎదుర్కొంటున్న వృత్తి సంబంధిత సమస్యలు, అలాగే స్థానికంగా బంజారా సమాజానికి జరుగుతున్న అన్యాయాలపై విస్తృతంగా చర్చ జరిగింది. సమాజానికి న్యాయం జరిగే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన హుస్సేన్ నాయక్ సమస్యలను పరిశీలించి తగిన స్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో న్యాయ వాదులతొ పాటు బీజేపీ నాయకులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు కోటేశ్వరరావు, జాటోతూ మధు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

బంజారా న్యాయవాదులతో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ భేటీ – సమస్యలపై చర్చ

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ జిల్లా బార్ కౌన్సిల్‌కు చెందిన బంజారా న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బంజారా న్యాయవాదులు ఎదుర్కొంటున్న వృత్తి సంబంధిత సమస్యలు, అలాగే స్థానికంగా బంజారా సమాజానికి జరుగుతున్న అన్యాయాలపై విస్తృతంగా చర్చ జరిగింది. సమాజానికి న్యాయం జరిగే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన హుస్సేన్ నాయక్ సమస్యలను పరిశీలించి తగిన స్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో న్యాయ వాదులతొ పాటు బీజేపీ నాయకులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు కోటేశ్వరరావు, జాటోతూ మధు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

బంజారా న్యాయవాదులతో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ భేటీ – సమస్యలపై చర్చ

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ జిల్లా బార్ కౌన్సిల్‌కు చెందిన బంజారా న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బంజారా న్యాయవాదులు ఎదుర్కొంటున్న వృత్తి సంబంధిత సమస్యలు, అలాగే స్థానికంగా బంజారా సమాజానికి జరుగుతున్న అన్యాయాలపై విస్తృతంగా చర్చ జరిగింది. సమాజానికి న్యాయం జరిగే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన హుస్సేన్ నాయక్ సమస్యలను పరిశీలించి తగిన స్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో న్యాయ వాదులతొ పాటు బీజేపీ నాయకులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు కోటేశ్వరరావు, జాటోతూ మధు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

వెలుగుమట్లకు ఢిల్లీ దృష్టి: జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ – అధికారులపై కఠిన చర్యల హెచ్చరిక. కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ రాక తొ మొదలైన అధికారులలో వణుకు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ బాధితుల సమస్య ఇప్పుడు జాతీయ స్థాయికి చేరుకుంది. దశాబ్దాలుగా సొంత స్థలం కోసం పోరాడుతున్న పేదల వేదనపై స్పందించిన జాతీయ స్థాయి వ్యవస్థ రంగంలోకి దిగడంతో స్థానిక అధికార యంత్రాంగంలో కలకలం రేగింది. బాధితుల పరిస్థితిని తెలుసుకునేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఖమ్మం పర్యటించడం పరిస్థితిని మలుపుతిప్పిన ఘటనగా మారింది. ఆయన పర్యటన సందర్భంగా రెవెన్యూ వ్యవస్థ స్పందనపై కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బాధితుల వేదన – కమిషన్ స్పందన వెలుగుమట్లలో భూదాన్ భూముల వ్యవహారంలో పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్రమాల ఆరోపణలు, ఇళ్ల కూల్చివేతలతో ఏర్పడిన మానవీయ సంక్షోభం కమిషన్ దృష్టికి వెళ్లింది. బాధితులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చిన్నారులకు కనీస సదుపాయాలు కూడా అందని పరిస్థితి ఉందని వివరించడంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో కమిషన్ సంబంధిత అధికారుల నుంచి పూర్తి వివరాలు కోరింది. వారం గడువు – నివేదిక ఆదేశం వెలుగుమట్ల ఘటనలపై సమగ్ర నివేదికను ఒక వారం రోజుల్లో సమర్పించాలని కమిషన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. బాధితులకు జరిగిన అన్యాయం, భూముల కేటాయింపులో జరిగిన ప్రక్రియ, కూల్చివేతల పరిస్థితులు వంటి అంశాలపై పూర్తి వివరాలు అందించాలని సూచించింది. నివేదికలో నిర్లక్ష్యం, అస్పష్టత లేదా వాస్తవాలకు విరుద్ధమైన సమాచారం ఉంటే కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కమిషన్ అధికారాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 338A ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్‌కు విస్తృతమైన విచారణాధికారాలు ఉన్నాయి. అవసరమైతే సంబంధిత అధికారులను పిలిపించి వివరణ కోరే అధికారం కమిషన్‌కు ఉంది. బాధితుల పట్ల నిర్లక్ష్యం లేదా వివక్ష తేలితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు సూచించే అవకాశముంది. ప్రత్యేకించి షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గాల హక్కులకు భంగం కలిగితే, సంబంధిత చట్టాల కింద విచారణ జరిపే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అధికార యంత్రాంగంలో ఆందోళన కమిషన్ జోక్యం నేపథ్యంలో ఖమ్మం జిల్లా అధికారుల్లో అప్రమత్తత పెరిగింది. భూదాన్ భూముల వ్యవహారంపై పూర్తి సమాచారం సేకరణ, పత్రాల పరిశీలన, విధానపరమైన అంశాలపై సమీక్ష మొదలైన ప్రక్రియలు వేగవంతమయ్యాయి. పరిపాలనా వ్యవస్థలో బాధ్యత, పారదర్శకతను నిర్ధారించే దిశగా కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాధితులకు ఆశ వెలుగుమట్ల బాధితుల సమస్యపై జాతీయ స్థాయిలో స్పందన రావడం వారికి కొంత న్యాయం దిశగా ముందడుగుగా భావిస్తున్నారు. గతంలో స్థానిక స్థాయిలో పరిష్కారం దొరకని సమస్య ఇప్పుడు కేంద్ర దృష్టికి వెళ్లడంతో పరిణామాలు మారే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలతో వెలుగుమట్ల భూదాన్ వివాదం ఇక సాధారణ పరిపాలనా అంశం కాకుండా, రాజ్యాంగబద్ధ సంస్థల పర్యవేక్షణలోకి వెళ్లిన కీలక వ్యవహారంగా మారింది.

ఖమ్మం

15లోపు పట్టాలు – ఇందిరమ్మ ఇళ్లు: వెలుగుమట్ల నిర్వాసితులకు మంత్రి పొంగులేటి భరోసా

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం: వెలుగుమట్ల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు రూ.5 లక్షల విలువైన ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఆదివారం ఖమ్మం ఐడీఓసి వేదికగా జరిగిన బాధితుల ముఖాముఖి సమావేశంలో మంత్రి పాల్గొని వారి సమస్యలను స్వయంగా విన్నారు. అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లు కూల్చివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వివరించగా, “మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది” అని మంత్రి భరోసా ఇచ్చారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో దళారుల మోసానికి గురై రూ.30 వేల నుంచి రూ.8 లక్షల వరకు అప్పులు చేసి స్థలాలు కొనుగోలు చేసినట్లు బాధితులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దళారులపై కఠిన చర్యలు తీసుకుని, వారి నుంచి డబ్బులు రికవరీ చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గత తొమ్మిది నెలలుగా కరెంటు, నీరు వంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు పేర్కొనగా, కొత్త కాలనీల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. నియోజకవర్గాల వారీగా గౌరవప్రదమైన పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో ప్రతిపక్షాలపై మంత్రి ఘాటుగా స్పందించారు. పది సంవత్సరాలపాటు అధికారంలో ఉన్నప్పుడు పేదల సమస్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శక సర్వే ద్వారా అర్హులైన వారినే ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 15న తానే స్వయంగా వచ్చి ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల ఆర్డర్లు అందజేస్తానని మంత్రి వెల్లడించారు. అధికారులే నేరుగా బాధితుల వద్దకు వస్తారని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

Featured

ఏఎన్ఎంలకు పదోన్నతులపై ఏపీ హంస ఆవేదన

01.03.2026 నెల్లూరులో ఓల్డ్ వెన్నెల ఐస్‌క్రీమ్‌లో ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్ రావు ఏఎన్ఎంలకు 28 ఏళ్లుగా పదోన్నతుల జాప్యం జరుగుతోందని పేర్కొంటూ కొత్త పోస్టులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా జంగా శ్రీనివాసులును జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.