Thursday, 5 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు అధికార పార్టీలో రాజకీయ పోరు

నెల్లూరు అధికార పార్టీలో రాజకీయ పోరు ఆనం – మంత్రి అనిల్‌ మధ్య ఆధిపత్యపోరు వి.ఆర్‌.విద్యాసంస్థలే వేదిక రాజకీయాలకు రాజధాని నెల్లూరులో ఇప్పుడు సరికొత్త రాజకీయ అంతర్యుద్ధం మొదలైంది. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన మంత్రి అనిల్‌, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలు మరో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మధ్య తాజా వార్‌ మొదలైంది.ఇందుకు వి.ఆర్‌.విద్యా సంస్థలు వేదికయ్యాయి. గత రెండేళ్లుగా వి.ఆర్‌.విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు ఆనం పెత్తనం పై అత్యున్నత ధర్మాసనం వరకు వెళ్ళి విజయం సాధించారు. వి.ఆర్‌.విద్యాసంస్థలకు పాత పాలక వర్గాన్ని రద్దు చేసింది కోర్టు. జాయింట్‌ కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. వి.ఆర్‌. విద్యా సంస్థల నూతన యాజమాన్యం కోసం ఎన్నికలు జరపాలని గత ఏడాది క్రితం సుప్రీం కోర్ట ఆదేశాలిచ్చిన నేపథ్యంలో కసరత్తు మొదలైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వి.ఆర్‌.కళాశాల నూతన పాలక వర్గం కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పూర్వ విద్యార్థులు ఓటర్లుగా సభ్యత్వాలకు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇదే సమయంలో జిల్లా అధికారులు పదే పదే మారడం, ఎన్నికల క్రతువు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో వి.ఆర్‌. విద్యాసంస్థల ఆర్థిక వ్యవహారాలు, కళాశాల పురోభివృద్ధికి అవాంతరాలు మొదలయ్యాయి. దాదాపు అయిదు దశాబ్దాలుగా ఆనం కుటుంబం వి.ఆర్‌.విద్యాసంస్థల పై పెత్తనం చేస్తోంది. సుదీర్ఘ 144 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటగిరి రాజాల విద్యాసౌధానికి ఆనం కుటుంబమే యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తోంది. ఒకప్పటి ఆనం భక్తవత్సల రెడ్డి నుంచి ప్రస్తుత వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ కళాశాల కార్యనిర్వాహకులుగా కొనసాగుతూ వున్నారు. సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్న రామనారాయణరెడ్డి, అంతకుముందున్న ఆనం కుటుంబీకుల మొత్తం పెత్తనం ఆపివేయాలంటూ ఆనం వ్యతిరేక వర్గం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళింది. తాజాగా వి.ఆర్‌.విద్యాసంస్థల నిర్వహణ పై రూరల్‌ ఎమ్మెల్యేతో పాటు మంత్రి అనిల్‌ ప్రత్యేక దృష్టి సారించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి, ప్రత్యేక అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌తో కలిసి కళాశాలను పరిశీలించారు. పాలనా తీరును అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌తో పాటు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యానాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. వి.ఆర్‌. విద్యాసంస్థలకు పూర్వవైభవం తెస్తాం. ఇందులో ఎవరి ప్రమేయాలు ఉండబోవు. ఎవరికి భయపడాల్సిన పనిలేదు అంటూ పరోక్షంగా మాజీ పాలక వర్గాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానాలను చేశారు. మరోవైపు వి.ఆర్‌.విద్యాసంస్థల పై ఇప్పటి వరకు ఉన్న పెత్తనాలను సహించం. కొత్త యాజమాన్యంతో కళాశాలను అభివృద్ధి చేస్తాం.. ఇప్పుడివి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వి.ఆర్‌.విద్యాసంస్థలు వేదికగా ఆనం వర్సెస్‌ మంత్రి అనిల్‌ అన్నట్లుగా ఉన్నాయి తాజా పరిణామాలు. వి.ఆర్‌.కళాశాల పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి అనిల్‌ తనదైన స్టైల్‌లో పరోక్షంగా ఆనంకు వ్యతిరేకంగా మాట్లాడారు. పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వి.ఆర్‌.కళాశాల మైదానాన్ని ఇకపై రాజకీయ పార్టీలకు వేదిక కానివ్వబోమని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో కళాశాల నిర్వాహకులకు నిర్ధిష్టమైన ఆదేశాలిచ్చారు. ఎవరి పెత్తనాన్ని సహించం. విద్యాశాఖ మంత్రి ద్వారా సంస్కరణలకు శ్రీకారం చుడతామన్నారు. ఈ మొత్తం వ్యవహారం ఆనంకు వ్యతిరేక ధోరణిలోనే సాగిందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి నెల్లూరు వి.ఆర్‌.విద్యాసంస్థలు మరోసారి అధికార వైసీపీలో ఆధిపత్య రాజకీయాలకు తెరలేపాయి.

Featured ఆంధ్రప్రదేశ్

పుణ్యక్షేత్రాలు

పుణ్యక్షేత్రాలు రంగనాథస్వామి(పల్లికొండ నాథుడు) దేవాలయం : దేశంలోని ప్రముఖ దేవాలయాలు నదీమ తల్లుల ఒడ్డున వెలసివున్నాయి. అలాగే నెల్లూరు లోని రంగనాథ స్వామి (రంగపెరుమాళ్‌) దేవాలయం పెన్నానది ఒడ్డున వుంది. ఇది అతి ప్రాచీనమైన వైష్ణవాలయం. నెల్లూరు కాపులు (ఇక్కడ రెడ్లను కాపులంటారు) ఏడవ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తుంది. ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచినది. దాదాపు వెయ్యి సంవత్సరాలక్రితం నిర్మి తమైనట్లు తెలుస్తుంది. సోమశిల నిర్మాణం కాకముందు పెన్నకు వరదలు వచ్చిన పుడు దేవాలయంలోకి నీరు వచ్చేది. ఏడు అంతస్తులతో 29 మీటర్ల ఎత్తు గలిగిన గాలిగోపురం భక్తకోటిని ఆకర్షిస్తుంది. ఈ గాలి గోపురాన్ని 1859 ప్రాంతంలో మహాభక్తులు యరగుడిపాటి వెంకటాచలం పంతులు నిర్మించారు. ఈ గాలి గోపురం మధుర, చిదంబరం, కంచి వంటి తమిళనాడు దేవాలయాలను తలపిస్తుంది. ఇక్కడ రంగనాథస్వామి వారు తలక్రింద కుంచం పెట్టుకొని శయనించి వుంటారు. కనుక తల్పగిరి రంగనాధస్వామిగా ప్రసిద్ధి చెందారు. భూదేవి, శ్రీదేవి స్వామివారి పాదాలొత్తుతూ వుంటారు. నెల్లూరు సీమ వరి పంటకు ప్రసిద్ధి చెందింది. పండిన ధాన్యాన్ని కొలిచి, కొలిచి కలిగిన శ్రమవల్ల సేదతీరుతున్నారని చెపుతారు. దేవాలయ ప్రాంగణములో 1928లో భక్తుడు ముప్పిరాల చినవెంకట నరసింహాచార్యులు నిర్మించిన అద్దాల మంటపం చూపరుల నాకర్షిస్తుంది. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ నెలలలో తిరునాళ్లు వైభవంగా జరుగుతుంది. గరుడసేవ, రథోత్సవం రోజున భక్తులు క్రిక్కిరిసి వుంటారు. రంగనాధ స్వామి ఆలయం వుండే ప్రాంతాన్ని రంగనాయకులపేట అని, గోపురానికి ఎదురుగా వున్న వీధిని గోపురంవీధి అని పిలుస్తారు. మూలస్థానేశ్వరస్వామి దేవాలయం : నెల్లూరు మూలాపేటలో ఈశ్వరాలయం వుంది. ఇది ప్రాచీన దేవాలయం. దీన్ని మూలస్థానేశ్వర దేవాలయం అంటారు. ఉసిరిక చెట్టు క్రింద స్వయంభువుగా శివలింగం కనిపిస్తే అక్కడ శివాలయం నిర్మించా రని చెపుతారు. ఇందులో వేణు గోపాలస్వామి విగ్రహం కూడ వుండడం విశేషం. మూల స్థానేశ్వరుడు పేరు మీదుగానే ఈ ప్రాంతానికి మూలాపేట అని పేరు వచ్చింది. నిత్యం భక్తులు వస్తుంటారు. శివరాత్రి ఘనంగా జరుగుతుంది. దీని సమీపంలో వేణుగోపాలస్వామి దేవాలయం వుంది. ఆ ప్రాంతంలోనే శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవాలయం కూడా వుంది. ఈ రెండు దేవాలయాలలో పెళ్ళిళ్లు జరుగుతుంటాయి. నెల్లూరు సీమవారు పెళ్ళి లగ్నం కుదరగానే దేవాలయ ప్రాంగణాన్ని రిజర్వు చేసుకుంటారు. కళ్యాణ వేదికంటూ వుండాల్సిన అవసరం లేదు. దేవాలయ ప్రాంగణంలో ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ వధూవరులను కూర్చోబెట్టి పెళ్ళిళ్ళు జరుపుతుంటారు. ఇక్కడ పెళ్ళి జరిగితే అంతా శుభమే జరుగుతుందని ఈ సీమ ప్రజల పరిపూర్ణ విశ్వాసం. కన్యకా పరమేశ్వరి దేవాలయం : నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలో కన్యకా పరమేశ్వరి ఆలయం వుంది. ఆర్య వైశ్యులు పరమేశ్వరి అమ్మవారిని తమ కుల దేవతగా ఆరాధిస్తారు. భక్తుల విరాళాలతో దేవాలయం నిర్మించారు. దేవీ శరన్నవరాత్రి వుత్సవాలను చాల వేడుకగా నిర్వహిస్తారు. పెళ్ళి కాని యువతీ యువకులు ఇక్కడ దేవాలయంలో ‘వరమాల’ కట్టి పూజలు చేస్తారు. ఈ విధంగా చేస్తే త్వరగా వివాహం నిశ్చయవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆంజనేయస్వామి గుడి : నెల్లూరు నగరానికి నడిబొడ్డున రాయాజీవీధిలో ఆంజనేయస్వామి దేవాలయం వుంది. నిత్యం స్వామి వారిని భక్తులు దర్శించుకొంటారు. పూజాదికాలు నిర్వహిస్తుంటారు. ఇస్కాన్‌ మందిరం (అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం) : శ్రీకృష్ణ తత్వాన్ని ప్రపంచ సమాజానికి తెలియపరచి ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెంపొందించడానికి దేశ విదేశాలలో కృష్ణ మందిరాలు నెలకొల్పారు. స్థానికంగా నెల్లూరులో కొండాయపాళెం రోడ్డు ప్రాంతంలో రాథాకృష్ణ మందిరం 1996లో నిర్మించారు. వీరి ఆధ్వర్యంలో 2012 నుండి ఏటా జనవరిలో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. సాయిబాబా గుడి : నెల్లూరులో సాయిబాబా మందిరాలు చాలానే వున్నాయి. మొదటిదిగా డాక్టరు రాజగోపాలాచార్లు రాయాజీ వీధిలో చిన్నగుడి నెలకొల్పి రేబాల లక్ష్మీనరసారెడ్డి ఆర్ధిక సహకారంతో నిర్వహించారు. నెల్లూరు ప్రజలకు ‘సాయిబాబా’ ఎవరో తెలియని రోజుల్లో సాయిభజనలు ప్రారంభించి, సాయి ఎఱుక కలిగించారు. రోగులకు వైద్యంతో పాటు విభూతి ఇచ్చేవారు. అటు తర్వాత కోఆపరేటివ్‌ బ్యాంకు సమీపంలోని బాబా గుడి నిర్మింపబడింది. 1956లో నిర్మాణం మొదలుపెట్టి 1958 అక్టోబరు నెలలో విజయదశమి రోజున మందిరం ప్రారంభమైంది. భక్తులతో నిత్యం రద్దీగా వుంటుంది. నెల్లూరు నడిబొడ్డున మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహనీయులు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వ డానికి, భక్తులు కూర్చోడానికి అనువుగా పైఅంతస్తు నిర్మాణం జరిగింది. పిల్లలపార్కు సమీ పంలోని సాయిసదన్‌, పద్మావతి నగర్‌లోని సాయిదర్బార్‌ అద్దాల మందిరం, మినీబైపాస్‌ రోడ్డులో జేమ్స్‌గార్డెన్‌ ప్రాంతంలోగల సాయిబాబా మందిరం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని సాయిబాబా దేవాలయం ప్రసిద్ధమైనవి. పొదలకూరు, గూడూరు పట్టణాలలోను ఆధ్యాత్మికత పరిఢవిల్లే సాయిబాబా మందిరాలు నిర్మితమై వున్నాయి. సత్యసాయిబాబా మందిరం : నెల్లూరులో రామమూర్తినగర్‌ ప్రాంతంలో సత్యసాయి భజన మందిరం నిర్మితమైంది. బాబా జన్మదినం తదితర వేడుకలు ఘనంగా జరుపుతారు. ప్రతి గురువారం భజన కార్యక్రమాలు వుంటాయి. పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం : నెల్లూరులోని దర్గామిట్ట ప్రాంతంలో ప్రధాన రహదారి ప్రక్కనే వున్న అమ్మవారి ఆలయం ప్రసిద్ధి చెందింది. శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకతో జరుగుతాయి. విద్యుద్దీపాలతో మెరిసిపోతుంది. రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి 1968లో కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతి స్వాముల వారిచే శంకుస్థాపన జరిగింది. 1975లో జయేంద్ర సరస్వతి స్వాములవారు, శృంగేరీ పుష్పగిరి పీఠాధిపతి స్వాముల వారి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. నేడు అత్యంత వైభవోపేతమైన దేవాలయంగా వెలుగుతుంది. దేవాలయానికి అనుబంధంగా వున్న కల్యాణ మండపంలో వివాహాది శుభకార్యాలు జరుపు కొంటారు. ఆలయాన్ని స్వర్గీయ రత్నసాయి మొదలియార్‌ నిర్మించారు. వీరు తమిళనాడు నుండి వచ్చి నెల్లూరులో స్థిరపడినవారు. అయ్యప్ప స్వామి గుడి : నెల్లూరులో వేదాయపాళెం సమీపంలో వున్న దేవాలయం. 1987లో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ప్రజలు అపార విశ్వా సంతో వుంటారు. భక్తులు ప్రతి సంవత్సరం అయ్యప్పమాల ధరిస్తారు. నల్ల బట్టలు ధరించి చాల నియమ నిష్ఠలతో వుంటారు. 41 రోజుల దీక్ష చేస్తారు. కేరళలోని శబరిమలకు వెళ్ళే భక్తులకు గుడి యాజమాన్యం వారు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. డిసెంబరు, జనవరి మాసాలలో స్వామివారి గుడిని విద్యుద్దీపాలతో వైభవంగా అలంకరిస్తారు. శబరిమల వెళ్లే భక్తులు నవంబరు నెల మధ్య నుండి ప్రయాణ సన్నాహాలలో వుంటారు. భగవాన్‌ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి మందిరం : నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో నాగులవెల్లటూరు గ్రామంలో జన్మించిన వెంకయ్య స్వామి 1982 ఆగష్టు 24న గొలగమూడిలో మహాసమాధి చెందారు. అక్కడ మందిర నిర్మాణం జరిగింది. ఇది నెల్లూరుకు 15 కి.మీ. దూరంలో వెంకటాచలం మండలంలో వుంది. వీరు భగవాన్‌ వెంకయ్యస్వామిగా, అవధూతగా ప్రసిద్ధి చెందారు. భరద్వాజ మాష్టారు, మాకాని వెంకట్రావు వంటి మహనీయులు వెంకయ్యస్వామిని భగవత్‌ స్వరూపులుగా భావించి ఆరాధించారు. వెంకయ్యస్వామి ఈతాకు చాపమీద కూర్చొని, శరీరంపై కౌపీనం (గోచిగుడ్డ) తప్ప మరే ఆచ్ఛాదన లేకుండా తంబూర వాయించుకొంటూ కాలం గడిపే వారు. ‘ఆకలైన వారికి అన్నం పెట్టండి. ఆపదలో వున్న వారిని ఆదుకోండి. ‘పావలా దొంగలిస్తే పది రూపా యలు పోతాయి’ అని చెప్పేవారు. ఈ మాటల ద్వారా ఆర్తులకు సహా యపడమని, అన్యాయార్జితం కూడదని, ఇతరుల సొత్తు నాశించరాదని యుగాలకు సరిపోయే సందేశమిచ్చారు. నేడు ఆశ్రమంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ఆశ్రమపాఠశాల స్థాపించారు. వృద్ధాశ్రమాలు నిర్మిస్తున్నారు. ప్రఖ్యాతి చెందిన యాత్రా స్థలంగా పేరుపొందింది. ఏటా ఆగష్టు నెలలో ఆరాధనోత్సవాలు జరుగుతాయి. గాలిపాలెం చిన వెంకయ్యస్వామి : చేజర్ల మండలంలోని గాలిపాలెం ప్రాంతం 1987కు ముందు దాదాపు జనసంచారం లేని ప్రదేశం. అక్కడ శ్రీహరి అనే పశువుల కాపరి ఒక పాకలో శ్రీశ్రీశ్రీ భగవాన్‌ వెంకయ్యస్వామి పటాన్ని పెట్టుకొని పూజ చేసేవారు. కొద్ది కాలానికి ఒక చిన్న ఆశ్రమం ఏర్పడింది. గ్రామస్తులు రావడం, ప్రార్థించినవారి కోర్కెలు తీరుతుండడంతో ఆశ్రమ ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్న భక్తుల విరాళాలతో క్రమంగా తొమ్మిది ఆలయాల సముదాయం ఏర్పడింది. నేడు ప్రముఖ పుణ్య క్షేత్రంగా పేరు పొందింది. భగవాన్‌ వెంకయ్యస్వామివారి పీఠం ఏర్పరచి ‘ఆకలైన వారికి అన్నం పెట్టండి’ అనే సూక్తిని ఇక్కడ ఆచరణలో పెడుతున్నారు. ఆలయ ప్రాంతమంతా ‘ఓం నారాయణ, ఆదినారాయణ’ మంత్రంతో మారుమ్రోగు తుంటుంది. ఏటా మూడు రోజులు ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీహరి చిన వెంకయ్యస్వామివారికి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయం : దక్షిణ భారత దేశంలో కంచి కామాక్షి దేవాలయం ప్రసిద్ధి చెందినది. జొన్నవాడను రెండవ కాంచీపురంగా పిలు స్తారు. ఇది నెల్లూరుకు 12 కి.మీ. దూరంలో వుంది. కామాక్షి అమ్మవారుగా ప్రసిద్ధి చెందింది. బుచ్చిరెడ్డిపాళెంకు దగ్గరగా పెన్న ఉత్తరతీరాన ఈ పుణ్యక్షేత్రంలో మల్లికార్జునుడు (ఈశ్వరుడు), కామాక్షి అమ్మవారు (పార్వతీ దేవి) కొలువై వున్నారు. శ్రీశైలక్షేత్రంతో సమానంగా వెలుగుతోంది. నిత్యం భక్తులతో ప్రత్యేకించి మహిళా భక్తులతో నిండి వుంటుంది. గ్రహపీడి తులకు స్వాంతన చేకూర్చే సన్నిధిగా పేరుంది. భక్తుల కోరికలు తీరుతుంటాయని, సంతానం కలగాలని అమ్మవారికి మొక్కుకుంటారు. ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పెంచలకోన : రాపూరు మండలంలో అడవి ప్రాంతంలో గోనుపల్లి గ్రామం దగ్గరగా దేవాలయం వుంది. పెనుశిల నరసింహ స్వామి దేవాలయం క్రమంగా పెంచలకోనగా మారింది. ఎ.సి.సుబ్బారెడ్డి మంత్రిగా వున్న సమయంలో ఆలయ అభివృద్ధి, రోడ్డు నిర్మాణం, సింహద్వార స్థాపన, నిత్యపూజ ఏర్పాట్లు జరిగాయి. హిరణ్యకశిపుడనేరాక్షస రాజును మహావిష్ణువు ఉగ్ర నరసింహావతార మెత్తి సంహరిస్తాడు. తర్వాత కూడ ఉగ్రరూపం చల్లారదు. చెంచులక్ష్మి రూపంలో వున్న ఆదిలక్ష్మితో చెలిమి తర్వాత ఉగ్రరూపం చాలిస్తాడు. భక్తుల కోరిక మేరకు పెంచలకోనలో స్వయంభువుగా స్వామివారు వెలిశారని స్థలపురాణం చెపుతోంది. నృసింహ జయంతి పండుగ ఘనంగా జరుపుతారు. నెల్లూరుకు పెంచలకోన 80 కి.మీ. దూరంలో వుంది. ఈ ప్రాంత వాసులు స్వామివారి పేరుతో పెంచలయ్య, పెంచలమ్మ, పెంచల నరసింహ, పెంచలలక్ష్మి అనే పేర్లు పెట్టుకొంటారు. పెంచలకోన వెళ్లినవారు అక్కడ వేంచేసి వున్న కరుణామయి విజయేశ్వరి దేవి

Featured ఆంధ్రప్రదేశ్

ఆ…నాటి నెల్లూరు మహనీయులు

ఆ…నాటి నెల్లూరు మహనీయులు పొట్టి శ్రీరాములు – రాష్ట్ర సాధన గాంధేయవాదాన్ని ఆయుధంగా చేసుకొని ప్రత్యేకరాష్ట్రం కొరకు నిరసన దీక్ష చేపట్టి ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టిశ్రీరాములు. వీరు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. వీరు జన్మించింది మద్రాసులో అయినా, స్వగ్రామము బోగోలు మండలంలోని జువ్వల దిన్నె. పూర్వీకులు నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లి గ్రామానికి చెందినవారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. శానిటరి ఇంజనీరింగ్‌ చదివి రైల్వేలో ఉద్యోగం పొంది స్థిర పడుతున్న రోజులలో భార్యావియోగం కలిగింది. పురిటిబిడ్డ కూడ మరణించింది. విధి వంచితుడైన శ్రీరాములు విరక్తి, వైరాగ్యాలకు లోనయ్యారు. ఉద్యోగానికి రాజీనామా చేశారు. వేదాంత ధోరణి వచ్చింది. స్వభావరీత్యా ఆయనలో ఉన్న పట్టుదల, కార్యదీక్ష సడలలేదు. గాంధీజీ ప్రబోధాలకు ఉత్తేజితులయి వార్ధాలోని ఆశ్రమాన్ని దర్శించి అందులో చేరిపోయారు. గాంధీజీ నుండి నేర్చుకొన్నవే ఖద్దరుధారణ, హరిజనోద్ధరణ, హరిజన దేవాలయ ప్రవేశం కొరకు కృషి, అస్పృశ్యతా నివారణ, స్వాతంత్య్ర సాధనకు అహింసా పోరాటం, ఉప్పు సత్యాగ్రహం మొదలయినవి. 18 నెలల జైలు జీవితం అను భవించారు. గాంధీజీ భావాలు శ్రీరాములుకు బాగా వంట బట్టాయి. నమ్మిన సిద్ధాంతాన్ని మనసా, వాచా, కర్మణా ఆచరించేవారు. ఏపని చేపట్టినా దానిని సాధించే వరకు నిద్రపోయేవారు కాదు. హరిజన దేవాలయ ప్రవేశం కొరకు నెల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో దీక్ష చేపట్టారు. 23 రోజుల తర్వాత దేవాలయ మేనేజ్‌ మెంట్‌ దిగివచ్చి హరిజనులకు ప్రవేశం కల్పించింది. మొదట పట్టించుకోక పోయినా అప్పటి మద్రాసు ప్రభుత్వం స్పందించింది. పొట్టి శ్రీరాములు పేరు వింటేనే దీక్షలు గుర్తుకొచ్చే విధంగా ఆయన పేరు మార్మోగిపోయింది. అప్పట్లో ఆంధ్రప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. తమిళులు తెలుగువారిపై చిన్నచూపు చూసేవారు. ఆంధ్రప్రాంతం విడివడాలని కొంతకాలం నుండి ఉద్యమాలు సాగుతుండేవి. అది తీవ్రమై రాష్ట్రసాధన కొరకు దీక్షచేపట్టడానికి శ్రీరాములు సిద్ధపడ్డారు. మద్రాసు నగరం నడిబొడ్డున తెలుగువాడైన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బులుసు సాంబమూర్తి ఇంట్లో శ్రీరాములు ఆమరణదీక్ష ప్రారంభించారు. 58రోజులు నిరాహారదీక్షచేసి 1952 డిసెంబరు 15న శ్రీరాములు మరణించడంతో రాష్ట్రం అగ్నిగుండమైంది. అల్లర్లు వ్యాపించాయి. కాల్పులు జరిగాయి. నెల్లూరులో నలుగురు అమాయకులు మరణించారు. పలువురు గాయపడ్డారు. కేంద్రప్రభుత్వం స్పందించింది. ప్రధాని నెహ్రూ పార్లమెంటులో ప్రకటన చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత తెలిపారు. పొణకా కనకమ్మ (1892-1963) జిల్లాలో స్త్రీ విద్యకు నాంది పొణకా కనకమ్మ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న తొలి తరం మహిళ. ఆమె రెండు సార్లు ఏడాదిన్నర పాటు కఠిన కారాగార శిక్ష అను భవించారు. పోట్లపూడిలో సుజన రంజని సమాజం స్థాపించారు. వివేకానంద గ్రంధాలయం నెలకొల్పారు. కనకమ్మ బహుముఖ ప్రజ్ఞాశాలి, నాయకురాలు, వక్త, విప్లవకారిణి, కారుణ్యమూర్తి, రచయిత్రి, రమణాశ్రమంలో వున్న రోజుల్లో ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మతో కలిసి రమణ మహర్షిని కీర్తిస్తూ ‘ఆరాధన’, ‘నైవేద్యం’ రచనలు చేశారు. భగవద్గీతలోని శ్లోకాలను ‘జ్ఞాన నేత్రం’ పేరుతో అనువదించారు. మదరాసులోని ఆంధ్ర మహిళా సభ రజతోత్సవాలలో శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ గారి నుండి కనకమ్మ సన్మానం అందుకున్నారు. ”ఆడపిల్లలకు చదువెందుకు?” అనే అభిప్రాయం నెలకొని ఉన్న రోజులవి. పొణకా కనకమ్మ 1923లో కస్తూరిదేవి బాలికల విద్యాలయం స్థాపించారు. అప్పట్లో అదొక సాహసోపేత నిర్ణయం. భూస్వామ్య కుటుంబం నుండి మహిళ గడపదాటి రావడమే సంచలనం. ఆమె సత్యాగ్రహం చేసి జైలు కెళ్ళింది. వెంకటగిరి జమీందారీ వ్యవస్థపై తిరుగుబాటు చేసింది. తన యావదాస్తిని జాతీయోద్యమానికి, హరిజనోద్ధరణకు, మహిళాభ్యుదయానికి త్యాగం చేసింది. గాంధీజీ వచ్చినప్పుడు ఒంటిమీద నగలన్నీ విరాళంగా ఇచ్చివారి చేత కస్తూరిదేవి విద్యాలయ భవనాలకు 1929లో శంకుస్థాపన చేయించింది. ఆమె కోరిక మేరకు పల్లెపాడులో పినాకినీ సత్యాగ్రహాశ్రమాన్ని గాంధీజీ 1921లో ప్రారంభించారు. దానికవసరమైన 13 ఎకరాల స్థలాన్ని కనకమ్మ కొని ఇచ్చారు. దీనికి ‘దక్షిణాది సబర్మతి’ ఆశ్రమంగా పేరుంది (పల్లెపాడు ఇందుకూరుపేట మండలంలోని గ్రామం). కనకమ్మ వర్ణాంతర వివాహాలు, వితంతు వివాహాలు జరిపించారు. విధి వంచితలైన స్త్రీల అభ్యున్నతికొరకు 1952లో పారిశ్రామిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. మరుపూరివారి ఇంట పుట్టింది – పొణకా వారి ఇంటి కోడలుగా వచ్చింది. రెండు కుటుంబాలకు పేరు ప్రతిష్ఠలు తెచ్చింది. ‘ఆధునిక మహిళలు చరిత్రను తిరగరాస్తారు’ అని చెప్పిన గురజాడవారి మాటలను కనకమ్మ నిరూపించింది. ఆమె తమ్ముడు మరుపూరు కోదండరామిరెడ్డి ‘మందాకిని’ పత్రిక నడిపిన ప్రముఖ సాహితీవేత్త. కనకమ్మ మరణించి (1963) అర్ధశతాబ్దం దాటుతున్నా నెల్లూరు నగరంలోగాని, కస్తూరిదేవి విద్యాలయంలో గాని ఆమె విగ్రహప్రతిష్ఠ నేటికీ జరగకపోవడం విచారకరం.ఆమె స్థాపించిన విద్యాలయం, పల్లెపాడు ఆశ్రమం, నెల్లూరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయి. నేడు ఈ ప్రాంతపు ఆడపిల్లలు చదువుల్లో ముందడుగులో ఉండడానికి కారణం ఆనాడు కనకమ్మ వేసిన పునాది. స్త్రీల ప్రగతికి విద్య మౌలికావసరంగా ఆమె ఆ రోజుల్లోనే గుర్తించి ఎంతో ముందుచూపుతో వ్యవహరించారు. నెల్లూరు పురమందిర నిర్మాత రేబాల లక్ష్మీనర్సారెడ్డి నెల్లూరు నడిబొడ్డున ట్రంకురోడ్డు ప్రక్కన సువిశాలమైన స్థలంలో నెల్లూరు పురమందిర నిర్మాణం జరిగింది. టౌన్‌హాలుగా పేరొందిన దీనిని నిర్మించిన ఉదారుడు రావుబహద్దూరు రేబాల లక్ష్మీనరసారెడ్డి. 1915లో భవనం నిర్మిం చినప్పటి నుండి ఇక్కడ సభలు, సమావేశాలు, నాటక ప్రదర్శనలు, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పట్టణానికిది తలమానికంగా ఉంది. దీన్ని తెలియని వారుండరు. అంతగా ప్రఖ్యాతి వహించింది. వర్ధమాన సమాజం ఆఫీసు, పఠన మందిరం ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఇప్పుడా పురమందిరం స్థలం కోట్లకుకోట్లు విలువ చేస్తుంది. రేబాల కుటుంబీకులు దాతృత్వం కలిగిన వారు. దానగుణం వారికి వంశ పారంపర్యంగా వచ్చింది. రేబాల పట్టాభిరామరెడ్డి వర్థమాన సమాజ అధ్యక్షులుగా వున్నారు. వారి స్మృతి చిహ్నంగా వారి ధర్మపత్ని సుజాతమ్మ పురమందిర ప్రాంగణంలో విశాలమైన పఠన మందిరాన్ని నిర్మించారు. వారి సోదరుడు రేబాల లక్ష్మీనరసారెడ్డి 1943-47లో మున్సిపల్‌ ఛైర్మన్‌గా, 1957-62లో నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా వున్నారు. దాదాపు 35 సంవత్సరాలపాటు వర్థమాన సమాజ అధ్యక్షులుగా వున్నారు. స్టోన్‌హస్‌పేటలోని రేబాల వారివీధిలోని తమ నివాస భవనాన్ని చిన్నపిల్లల ఆస్పత్రి కిచ్చారు. దాని ప్రక్కనే వున్న మరొక భవనాన్ని పట్టాభిరామిరెడ్డి ధర్మ పత్ని సుజాతమ్మ జిల్లా గ్రంథాలయానికిచ్చారు. నెల్లూరు చరిత్రలో వారి కీర్తి చిరస్థాయిగా నిలి చిపోయింది.

Featured ఆంధ్రప్రదేశ్

రోడ్డుకు చికిత్స చేసిన అధికారులు

రోడ్డుకు చికిత్స చేసిన అధికారులు ఆత్మకూరు బస్టాండు వద్ద దెబ్బతిన్న రొడ్డును పరిశీలించిన కలెక్టర్‌ శేషగిరి బాబూ. నెల్లూరు, అక్టోబర్‌ 26 (పున్నమి విలేకరి) : నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండు వద్ద దెబ్బతిన్న రొడ్డును తక్షణమే మరమ్మతులు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వీ శేషాగిరి బాబు ఆదేశించారు. కలెక్టర్‌ శుక్రవారం నగరంలో పర్యటించి దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు తనిఖీ చేశారు. అధికారుల పని తీరుపై అసహనం వ్యక్తం చేసారు. ముందుగా ఆత్మకూరు బస్టాండ్‌ ప్లైఓవర్‌ను పరిశీలించి చాలా చోట్ల దెబ్బతిన్న వంతెనను వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఇంజినీరింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనం రద్దీ, వాహన రాకపోకలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పలు చోట్ల మరమ్మతులు చేయించాలన్నారు. ఏస్‌.మోహన్‌, కార్పొరేషన్‌ ఎస్‌.ఈ. హిమయుద్దీన్‌, ఏఈలు మహేష్‌, సంజయ్‌, జానీ తదితరులు కలెక్టర్‌తో పాటు ఉన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

అభిమానం అక్షర సాక్షిగా తరుమారైంది…

అభిమానం అక్షర సాక్షిగా తరుమారైంది… నేతల హోదాలు మారిపోయాయి… రెట్టించిన అభిమానంతో… నెల్లూరు, అక్టోబర్‌ 26 (పున్నమి విలేకరి) : అభిమాన నాయకులు.. అధినేతలు వస్తున్నారంటే క్యాడర్‌ లో ఉత్సవాహం ఉరకలేస్తుంది.ముఖ్యంగా సినీ రాజకీయ నేతల అనుచరుల్లో ఇది మరీ ఎక్కువ….ఒక్కోసారి మితిమీరిన అభిమానం. అతిధులు… అధినాయకులకు…అభిమాన నేతలను చాలా ఇబ్బందులు తెస్తుంది….. అలాంటిదే నెల్లూరులో ఓ పోస్టర్‌ లో బయటపడింది… నెల్లూరు జిల్లాలో మహాత్మాగాంధీ సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్‌,ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వై సుజనా చౌదరి నెల్లూరు రానున్నారని ఆ పార్టీ నాయకులు బ్యానర్లు, పోస్టర్లు,ఫ్లెక్సీలు వేశారు.. అందులోను నెల్లూరులో సత్యకుమార్‌ కి నెల్లూరు నేతలు చిరకాల అనుబంధం ఉంది.. సత్యకుమార్‌ గతంలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు… దీంతో సత్యకుమార్‌ కి స్వతహాగా నెల్లూరు బీజేపీ, సంఘ్‌ నేతలతో పేర్లతో పిలవగలిగే పరిచయాలు ఉన్నాయి.. ఇటీవల వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యాక అప్పటి నాయుడు గారి టీమ్‌ అంతా ఇప్పుడు సత్యకుమార్‌ తో ఉంటోంది.. ఒకరకంగా చెప్పాలంటే నాయుడు ఫాలోయర్లందరూ ఇప్పుడు సత్య వెంట ఉన్నారు.. అలాంటి అనుబంధముంటే నెల్లూరోళ్ళ హంగామా గురించి చెప్పాలనా… పావలాకి రూపాయి బిల్డప్‌ …సత్యాపై ఉన్న అభిమానంతో… నగరంలోని విఆర్సీ సెంటర్లో నెల్లూరు క్లబ్‌ వద్ద జిల్లా బీజేపీ అధ్యక్షులు సురేందర్‌ రెడ్డి పేరుతో అభిమానులు ఒక ఫ్లెక్సీ కట్టారు..అందులో ఫ్లెక్సీ నిర్వాహకుల పొరపాటో.. మరి ఉత్సాహమో..తెలియదుగానీ….బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ని ఎంపీ గానూ… ఎంపీ సుజనా చౌదరిని బీజేపీ జాతీయ కార్యదర్శి గానూ గౌరవించారు… ఫ్లెక్సీలో..ఆ ఫ్లెక్సీ నిత్యం రద్దీగా ఉండే విఆర్సీ సెంటర్‌ కావడంతో అది కాస్తా సోషల్‌ మీడియాకెక్కి హడావుడి చేస్తోంది… అందుకే ప్లెక్సీ లైన.. పోస్టర్‌ లైన ఒకసారి చెక్‌ చేసుకోవాలి.. మరీ..

Featured ఆంధ్రప్రదేశ్

కేపీపోర్ట్‌ పరిశ్రమలపై నీలిమేఘాలు

కేపీపోర్ట్‌ పరిశ్రమలపై నీలిమేఘాలు భూములు కేటాయింపు రద్దుచేసిన ఏపీఐఐసీ కోర్టుకెక్కిన పోర్ట్‌ యాజమాన్యం పరిశ్రమలకిచ్చిన భూమితో పోర్టు వ్యాపారం చేసిందంటోన్న ఏపీఐఐసీ. నెల్లూరు, అక్టోబర్‌ 26 (పున్నమి ప్రతినిధి) : పారిశ్రామిక ప్రగతికోసం నెల్లూరు జిల్లాలో పలు పరిశ్రమలకిచ్చిన భూముల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.. ప్రత్యేకించి క ష్ణపట్నం పోర్ట్‌ ఆధారిత పరిశ్రమలకిచ్చిన ల్యాండ్స్‌ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వివాదానికి తెరలేపాయి.. దాదాపు 9 ఏళ్ల క్రితం పరిశ్రమలకిచ్చిన భూముల్లో భూవ్యాపారం తప్ప పారిశ్రామిక ప్రగతిలేదంటూ ఏపీ ఐసీసీ పార్టీకి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంది.. ఏపీఐఐసీ నిర్వాహకం వల్లనే ప్రగతిలేదంటూ కేపి పోర్ట్‌ కోర్టుకెక్కింది..దీంతో ఈవ్యవహారం వివాదాస్పదంగా మారింది… వివరాల్లోకెళితే… కేపి పోర్ట్‌ ఇన్‌ ఫ్రాటెక్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు 2009లో కేటాయించిన 4731 ఎకరాల భూమిని వెనుకకు తీసుకుంటున్నట్లు భూకేటాయింపును రద్దు చేసినట్లు ఏపీఐఐసీ ప్రకటించింది. క ష్ణ పట్నం పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల అభివ ద్ది కొసము నెల్లూరు జిల్లాలోబి చిల్లకూరు,కోట మండలాల పరిదిలో 4731.15 ఎకరాల భూమిని ఎకరా 1.15లక్షలతో కేపిఐఎల్‌ కు కేటాయించారు. అయితే భూమి ఇచ్చి 9సంవత్సరాలు అయినప్ప టికి ఇప్పటి వరకు ఎలాంటి పరిశ్రమ స్థాపించ లేదని ఏపిఐసిసి అంటుంది.దీనికి తోడు ఈ భూముల ను తనఖా ఉంచి మూడు బ్యాంకులలో 1935 కోట్లు రుణం పొందింది.అయితే రుణం తీసుకునే టప్పుడు ఎపీఐఐసి నుంచి ఎన్‌ ఓసీ తీసుకోలేదని ఎపీఐఐసీ అదికారుల వాదన.పలు మార్లు నోటీసులు జారీ చేసిన కేపీఐఎల్‌ పట్టించుకోక పోవడంతో భూముల కేటాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే ఈ స్థలం లో ఓ ఇంటర్‌ నేషనల్‌ స్కూల్‌ ను కేపీఐఎల్‌ ఏర్పాటు చేసింది.పరిశ్రమ కోసం భూములిస్తే పోర్ట్‌ సొంతవ్యాపారం.. భూ వ్యాపారాలు చేస్తుందని ఏపీఐఐసీ ఆరోపిస్తోంది.. ప్రభుత్వం పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి భారీగా రుణాలు పొందడం నిబంధనలకు విరుద్ధమని రాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనాసంస్థ ఆరోపిస్తూ ఇచ్చిన భూములను రద్దుచేసింది.. పోర్ట్‌ భూముల వ్యవహారంలో యాజమాన్యం స్పందించింది.. న్యాయపరమైన అంశాలతో పారిశ్రామిక ప్రగతివైపు వెళ్తున్నామంటూ.. ఏపీఐఐసీ నిర్ణయాన్ని కోర్టులో సవాల్‌ చేసింది. భూముల రద్దు ఏకపక్షంగా ఉందని,ఏపీఐఐసీ రద్దు ఉత్తర్వులు రద్దు చేయాలని కోర్టును కోరింది.. భూ బదలాయింపు లో అన్ని నిబంధనలు పూర్తిచేసుకున్న 9 ఏళ్ల అనంతరం రద్దు చేయడమే మిటంటూ ప్రశ్నిస్తోంది..పోర్టు.. ఏపీఐఐసీ నుంచి విక్రయ దస్తావేజులప్రకారం 4,731 ఎకరాల భూమిని రూ.65.07 కోట్లకు కొనుగోలు చేసి.. రిజర్వేషన్లు పూర్తయ్యాయని పోర్ట్‌ కోర్టుకు తెలిపింది.. ఏపీఐఐసీ తో జరిగిన ఒప్పందం ప్రకారం మరో 1,298 ఎకరాలు ఇవ్వాలని కోరి ఉన్నా 2012 నుంచి సమాధానం లేదని పోర్ట్‌ వాదిస్తోంది.. మొత్తం భూములను కేటాయించకుండా పరిశ్రమ స్థాపన ఎలా జరుగుతుందనేది పోర్టు ప్రశ్న… ఒకవైపు ఏపీఐఐసీ, ఇంకోవైపు పోర్ట్‌ కోర్టు వ్యవహారాల తో ఇప్పుడు క ష్ణపట్నం పోర్టు భూ వ్యవహారం పారిశ్రామిక వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.. భూముల రద్దుపై పోర్ట్‌ కోర్టుకెక్కిన నేపథ్యంలో ఏపీఐఐసీ నివేదన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే..

Featured

టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ని అభినందిస్తూ గుంటూరు మాజీ మేయర్ రాయపాటి మోహన్ సాయి క్రిష్ణ లేఖ

*టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ గుంటూరు మాజీ మేయర్ రాయపాటి మోహన్ సాయి కృష్ణ లేఖ ???* ————————————- ? బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలపై సబ్సిడీని నిలిపివేయాలి ? సిఫార్సులపై బ్రేక్ దర్శనానికి రూ. 10 వేలు ధర ? సిఫార్సులపై ఆర్జిత సేవలకు రూ. 10 వేలు నుంచి రూ. 50 వేలు ధర ? సుపధం ప్రవేశం ద్వారా నూతన దర్శనం రూ. 1000 నుంచి రూ. 1500 ధరతో ప్రారంభించాలి ? రద్దీ నియంత్రణకు వారాంతపు, ఇతర సెలవు దినాల్లో టిక్కెట్ ధరపై 25 నుంచి 50 శాతం అదనంగా వసూలు చేయాలి ? వసూలు చేసిన అదనపు ఆదాయాన్ని సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, హిందూ ధర్మ ప్రచారానికి వినియోగించాలి ======================== To తేదీ :- 25-10-19 *శ్రీ వై. వి. సుబ్బారెడ్డి గారికి, చైర్మన్, టి.టి.డి. ధర్మకర్తల మండలి* *విషయం :- టి.టి.డి. – సాధారణ భక్తులకూ రూ.10 వేలకు వి.ఐ.పి. బ్రేక్ దర్శనం కల్పించడం విప్లవాత్మక నిర్ణయం – అభినందనలు – సిఫార్సుల ద్వారా లభించే బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలకు సరైన ధర నిర్ణయించాలని సూచన.* ఎంతో కాలంగా అందని ద్రాక్ష లాగా ఉన్న శ్రీవారి వి.ఐ.పి. బ్రేక్ దర్శనాన్ని రూ.10,000 లకు సాధారణ భక్తులకూ అందుబాటులోకి తేవడం శుభపరిణామం. ఈ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్న మీకు, సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి గారికి, టి.టి.డి. ధర్మకర్తల మండలి సభ్యులకు, అధికారులకు అభినందనలు. మారుమూల ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ఏర్పాటైన శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చే దాతలకు వి.ఐ.పి. బ్రేక్ దర్శన అవకాశం ఇవ్వడం వలన ధనికులు, ఎగువ మద్యతరగతి భక్తులకు వి.ఐ.పి.లు, ప్రజాప్రతినిధులు, అధికారులు లేదా న్యాయమూర్తుల సిఫార్సు లేఖల కోసం పడిగాపులు కాయడం లేదా దళారులు, పైరవీకారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. రూ.10.000 విరాళం ఇస్తే ఒక రూ.500 వి.ఐ.పి. బ్రేక్ దర్శనం టికెట్ కొనుగోలుకు అవకాశం లభిస్తుండడం మంచి నిర్ణయం. సామాన్య భక్తులకు గర్భగుడి దాక వెళ్ళి దర్శనం చేసుకోవడం గగనంగా మారిన పరిస్థితులలో కొంచెం ధనాన్ని వెచ్చించగల ఎగువ మధ్యతరగతి భక్తులకు, సిఫార్సు లేఖలు తెచ్చుకోలేని ధనిక భక్తులకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ విధమైన పారదర్శక విధానం వలన ఎంతో పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో పైరవీకారులు చేస్తున్న అక్రమ చర్యలకు ముక్కుతాడు పడినట్లవుతుంది. *వి.ఐ.పి. బ్రేక్ దర్శనానికి – ఇతర దర్శనాలకు ఉన్న తేడాను ఒకసారి పరిశీలిస్తే…* (1) బ్రేక్ దర్శనంలో శ్రీవారి గర్భగుడి దాకా వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన స్వామి వారిని దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. (2) తోపులాటలు, హడావుడి ఉండదు. (3) తక్కువ సమయంలోనే శ్రీవారి దర్శనం లభిస్తుంది. (4) గర్భగుడి దాకా వెళ్ళి దర్శనం చేసుకోవడంతో పాటు వెనక్కి వచ్చే క్రమంలో కూడా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. (5) గర్భగుడి దాకా వెళ్ళే అవకాశం ఉండడం వలన ఎక్కువసేపు దర్శనం చేసుకోవచ్చు. (6) ఇతర దర్శనాలలో కేవలం లఘు లేదా మహా లఘు దర్శనం మాత్రమే లభిస్తుంది. *టి.టి.డి. లోని వివిధ ట్రస్ట్ లకు ఇచ్చే విరాళాల ద్వారా బ్రేక్ దర్శనం లభించేది. అవి …* (1) రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి విరాళం ఇచ్చే వారికి ఇతర సదుపాయాలతో పాటు 15 మందికి ఎల్-2 బ్రేక్ దర్శనం లభించేది. (2) రూ.1 కోటి పైన విరాళం ఇచ్చే వారికి ఇతర సదుపాయాలతో పాటు 15 మందికి ఎల్-1 బ్రేక్ దర్శనం మరియు 15 మందికి సుప్రభాత సేవ లభించేది. గర్భగుడి వరకు అనుమతించి దర్శనం చేసుకొనే వెసులుబాటు వి.ఐ.పి. బ్రేక్ దర్శనానికి ఉండడంతో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దూరం నుంచే శ్రీవారిని తోపులాటల మధ్య అతి తక్కువసేపు దర్శించుకోవడానికి సర్వ దర్శనంతో పాటు రూ.50 లేదా రూ.300 ల టికెట్ లు అందుబాటులో ఉన్నాయి. దీనికి *కేవలం రూ.200 లు అదనంగా చెల్లిస్తే లభించే రూ.500 ల వి.ఐ.పి. బ్రేక్ దర్శనం టికెట్ ద్వారా ఎంతో మెరుగైన దర్శనం లభించడం ఎంతవరకు సబబు..?* *పై పేర్కొన్న విరాళాల మీద బ్యాంకు వడ్డీని లెక్కగట్టిన ఒక్కో మనిషి దర్శనం విలువ రూ.10 వేల నుండి రూ.20 వేల వరకు ఉంటుంది. అంటే ఇంత విలువ చేసే దర్శనాన్ని ఇన్నాళ్ళు కేవలం రూ.500 లకే సిఫార్సు లేఖల మీద కల్పించారు.* దీంతో పైరవీకారులకు, ప్రజాప్రతినిధులు / అధికార గణానికి దగ్గరగా ఉండే వారికి మాత్రమే లాభం జరిగి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో అన్యాయం జరుగుతోంది. *ఇన్ని సంవత్సరాలపాటు పైరవీకారులకు, సిఫార్సులపై దర్శనం కల్పించిన వారికి సబ్సిడీ ఇచ్చినట్లు భావించాలి.* టికెట్ రేట్లు పెంచితే శ్రీవారి దర్శనం వ్యాపారీకరణంగా మారుతుందనే విమర్శకి భయపడి ఇన్నాళ్ళు ఈ సబ్సిడీని కొనసాగించారు. ఇప్పటికైనా మీరు ధైర్యంగా ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తూ నేను చేస్తున్న మరికొ

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు మహిళా చైతన్యం

నెల్లూరు మహిళా చైతన్యం నెల్లూరుజిల్లా మహిళలు పలురంగాలలో చైతన్య వంతులుగా నిలిచారు. 1930 ప్రాంతాల నుండి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు, సమాజసేవలో తరించారు. స్త్రీ విద్యకు, స్త్రీ జనోద్ధరణకు, ఖద్దరు వస్త్రధారణకు, విదేశీ వస్తు బహిష్కరణకు ఉద్యమించారు. ఆనాటి నుండి నేటి వరకు మహిళా చైతన్యం వెల్లివిరుస్తుంది. బుచ్చిరెడ్డిపాళెం సమీపంలోని వవ్వేరు గ్రామ పంచాయితీకి మొత్తం తొమ్మండుగురు మహిళలు, సర్పంచిగా వవ్వేరు విమలమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన 1956లో ఇది జరగడం విశేషం. ఇక్కడ మహిళల్లో అంత చైతన్యం వచ్చింది. ఇది జిల్లాలో సంచలనం కలిగించింది. రాష్ట్ర నాయకుల దృష్టికి వెళ్ళింది. ఆనాడు ఆంగ్ల పత్రికలలో సైతం ఈ సమాచారం ప్రముఖంగా ప్రచురించారు. సారా వ్యతిరేకోద్యమం – శంఖం పూరించిన రోశమ్మ నెల్లూరు మహిళా చైతన్యానికిది నిలువెత్తు సాక్ష్యం. మహిళల కడుపు మంటతో ప్రారంభ మైనదీ వుద్యమం. ధన, మాన, ప్రాణాలను హరించే మద్యపానం అనర్థమని గుర్తించిన నెల్లూరుసీమ మహిళలు ఉవ్వెత్తున లేచారు. కుటుంబ బాధ్యతలు చేపట్టాల్సిన పురుషులు సారామత్తులో జోగుతూ భార్యాబిడ్డలను, వృద్ధులైన తల్లిదండ్రులను కష్టాలు పాలు చేయడం సహించలేక ఉద్యమబాట పట్టారు. జిల్లాలో కలిగిరి మండలంలోని తూర్పుదూబగుంట గ్రామానికి చెందిన ఒక సాధారణ మహిళ వర్ధినేని రోశమ్మ ఉద్యమాన్ని 1991లో ప్రారంభించారు. ఆమె వేసిన బీజం మండల స్థాయిలో చిన్న ఉద్యమంగా ప్రారంభమై 1992లో జిల్లా మొత్తానికి పాకింది. రాష్ట్ర వ్యాప్త ఉద్యమమైంది. ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపింది. ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు మద్దతిచ్చాయి. సారా వ్యతిరేకోద్యమ నాయకులంతా ఒక పోరాటసమితిగా ఏర్పడ్డారు. సారా వేలం పాటలు అడ్డుకోవడం, అంగళ్లపై దాడులు, సారా పొట్లాలు దహనం చేయడం జరిగింది. ఉద్యమం తీవ్రమైంది. 1992 చివరనాటికి జిల్లాలోని శాసనసభ్యులందరు మద్దతు ఇచ్చారు. ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఆనాటి ముఖ్యమంత్రి జనార్థన్‌రెడ్డి ఆలోచనలో పడ్డారు. ఒక వైపు వేలం పాటలు దక్కించుకొన్న సారాయి కాంట్రాక్టర్ల వత్తిడి, మరోవైపు ప్రజా ఉద్యమం, ఇంకోవైపు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందన్న ఆందోళనతో ఏ నిర్ణయానికి రాలేక పోయారు. ఇంతలో ముఖ్యమంత్రి మారారు. విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం వచ్చింది. 1993లో సారా నిషేధ ఉత్తరువులు జారీ చేసింది. మహిళా ఉద్యమం విజయం సాధించింది. నెల్లూరు జిల్లాలో ఏప్రెల్‌ నెలలో, రాష్ట్రం మొత్తానికి అక్టోబరు నెలలో నిషేధం విధించారు. నెల్లూరు జిల్లాలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళల సంఖ్య తక్కువేమీ కాదు. 1964 – 70లో రాజ్యసభకు ఎం.ఎల్‌. మేరినాయుడు ఎన్నికైనారు. పార్ల మెంటు సభ్యులుగా 91-96 వరకు కుడుముల పద్మశ్రీ (కాంగ్రెసు), 1996,1998,2004 ఎన్నికలలో పనబాక లక్ష్మి (కాంగ్రెసు), 1999-2004 వరకు ఉక్కాల రాజేశ్వరమ్మ (తెలుగుదేశం) ఎన్నికైనారు. వీరిలో పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా పనిచేశారు. వెంకటగిరి అసెంబ్లీ నుంచి రెండు సార్లు 1999, 2004లో ఎన్నికైన నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఐదేళ్లపాటు విద్యాశాఖ మంత్రిగా, మాతా, శిశు సంరక్షణశాఖ మంత్రిగా పదవుల నలంకరించారు. రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి పదవి పొందిన జిల్లా తొలి మహిళగా గుర్తింపు పొందారు. మాగుంట పార్వతమ్మ ఒకసారి ఒంగోలు పార్లమెంటుస్థానానికి, ఒకసారి కావలి అసెంబ్లీ స్ధానానికి ఎన్నికైనారు. నెల్లూరు జిల్లా పరిషత్తు అధ్యక్ష పదవికి ఎం. నాగభూషణమ్మ ఎన్నికైనారు. నెల్లూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఒకసారి తాళ్లపాక అనూరాధ (తెలుగుదేశం), కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత పులిమి శైలజ(కాంగ్రెసు), ఆ తర్వాత నంది మండలం భానుశ్రీ(కాంగ్రెస్‌) మేయరు పదవుల నలంకరించారు. గూడూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా కోడూరు కల్పలత పనిచేశారు. ఆ తర్వాత యారం మంజుల వచ్చారు. 2014లో పొణకా దేవసేన ఎన్నిక య్యారు. కావలి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా పోతుగంటి అలేఖ్య ఎన్నికయ్యారు. నెల్లూరు నెరజాణ కథ చారిత్రకాధారంలేని ఒక కథ ప్రచారంలో వుంది. ఇందులో వాస్తవమెంతో తెలియదు గాని ఒకసారి కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి నెల్లూరు సీమలో మేనాలో ప్రయాణిస్తున్నాడు. ఎదురుగా వచ్చిన అందమైన గ్రామీణ యువతిని చూసి ఆమె సౌందర్యాన్ని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పాడు. చివరగా తనపేరు ‘శ్రీనాథు’డని, ‘స్త్రీ నాథు’డని భావగర్భితంగా, గూఢార్ధం ధ్వనించేటట్లుగా అన్నాడట. ఆమె తడుముకోకుండా ‘మీ అమ్మకు కూడానా’ అని వెనువెంటనే అన్నదట. రాజసభలలో కవి పండితులను తన వాక్పటిమతో ఓడించిన శ్రీనాథుడు క్షణకాలం పాటు అవాక్కయి నివ్వెరపోయి, తేరుకొని ‘నెల్లూరు నెరజాణ’ అంటూ వెళ్ళిపోయాడట. గ్రామీణ ప్రజలు ఇప్పటికి ఈ కథను చెప్పుకొంటారు. నెల్లూరు మహిళల సమయస్ఫూర్తికి, స్వాభిమానానికి, జాణతనానికి నిదర్శనంగా చెప్పుకోవాల్సిన విషయం. వీరపత్ని చానమ్మ 13వ శతాబ్ధిలో నెల్లూరునేలిన మనుమసిద్దికి, కనిగిరి సీమ రాజైన కాటమరాజుతో ‘పుల్లరి’ చెల్లించే కారణంగా యుద్దం వచ్చింది. యాదవులది పైచేయి కాగా తిరిగి వచ్చిన మనుమసిద్ది సైన్యాధిపతి ఖడ్గతిక్కనతో పౌరుషాగ్నిని రగిల్చి భార్య చానమ్మ కదనరంగానికి పంపింది. యుద్దంలో వీరమరణం పొందిన భర్తతోపాటు సహగమనం చేసింది. వీరనారిగా, వీరపత్నిగా చానమ్మ చరిత్రలో నిలిచిపోయింది. ఇదికూడా ప్రచారంలో వున్న ఒక గాధ.

Featured

నేటి నెల్లూరు సంగతులు

ఈ రోజు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర అధికార ప్రతినిధి,స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు మాట్లాడుతూ…. రాష్ట్ర బాద్యతో పాటు అదనంగా జిల్లా పార్లమెంటరీ బాధ్యతలు అప్పగించిన పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపారు….జిల్లాలో సిటీ,రూరల్ ,కోవూరు,నియోజక వర్గాల్లో ఇంచార్జి లను ఏర్పాటు చెసెవరకూ తానే ఆ నియోజకవర్గాలను సమీక్షించనున్నట్లు తెలిపారు… ?ప్రభుత్వం అవలంబిస్తున్న ఇసుక విధానాల వలన ఉపాధి కోల్పోతున్న కార్ముకులకు అండగా..మన పార్టీ చలో వైజాగ్ అని నవంబర్ 3rdన పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇపుడు ఉన్న ysr ప్రభుత్వం అవగాహనలేని నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాల మంది ఇబ్బంది పడుతున్నారు సామాన్యప్రజలు ? భవన నిర్మాణ కార్మికులు కనీసం 30 లక్షల మంది రోడ్ల మీద పడుతున్నారు …. వాళ్లంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో వారికీ రోజు కూలీలు రాక , ఉపాధి లేకుండా రోడ్ల మీద పడుతున్నారు.వాళ్లే కాకుండా ఇసుకని తరలించే వాళ్లు ట్రాన్స్ పోర్టర్లు కానీయండి ట్రక్ ,ట్రాక్టర్లు లీజ్ కి తీసుకొని లీజ్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడ ఉన్నారు.అదేవిధంగా మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోడానికి ఎంతో కష్టంగా ఉంది కాస్ట్ ఎస్కేలేషన్ ఎక్కువ అయిపోయింది వీలందరికి భరోసా ఇవ్వడం కోసం విధానాలలో ఏదొక మార్పు తీసుకు రావాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఛలో వైజాగ్ అని చెప్పి నవంబర్ 3వ తారీకు అందరు కూడా పాల్కొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం … ? ఈ రోజు పొద్దున్న వైస్సార్సీపీ కార్యాలయం లో *కోటంరెడ్డి శ్రీధర్* రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒప్పుకున్నారు సాండ్ పాలసీ వలన ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, కొందరు అధికారుల వల్ల అని అధికారుల లేదా వైస్సార్సీపీ నాయకుల అని తప్పకుండా వివరణ ఇవ్వాల్సింది… ఎందుకంటే అధికారం లో ఉండేది మీ పార్టీనే అధికార mla కూడా మీరే ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరే భాధ్యత వహించాలి, మీరు ఒప్పుకోవాలి మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి, మీరు ప్రతక్షంగా యుద్ధం చేస్తానని చెప్తున్నారు ఎవరిమీద చేస్తారు *జగన్ మోహన్ రెడ్డి గారి మీద చేస్తారా..?* అనే క్లారిటీ ఇవ్వాలి . మీరు కనుక నిస్వార్ధంగా లేకుంతే మీ mla పదవికి రాజీనామా చేసి ప్రజలందరికీ క్షమాపణ చెప్పినట్టు ఐతే మేము కూడా మీకు మధ్దతు ఇస్తాం అంతేకాని ఎదో కంటితుడుపు చర్యలాగా ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి అని అంటే సరికాదు ఇసుకలో కచ్చితంగా అక్రమాలు జరుగుతున్నాయి సామాన్య ప్రజలికి ఇసుక దొరకడం లేదు కానీ రాత్రులు పూట ట్రక్కులకి ట్రక్కులు ఇసక చెన్నై కి కానీ బెంగుళూరు కి అక్రమంగా లక్ష రూపాయలకి ట్రక్ చొప్పున తరలిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి జరుగుతున్న వాస్తవాలకి ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. దీని మీద కూడా నెల్లూరు రురల్ mla కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తప్పకుంఢా సమాధానం చెప్పాలి. అదేవిధంగా చూస్తే ఈ వారం అంత కూడా వర్షాలు తీవ్రంగా ఉన్నాయి , భారీ వర్షాల వల్ల ఈ మురికి కాల్వల అన్ని పొంగిపొర్లుతున్నాయి దానివల్ల ఆ నీళ్లు కొన్ని చోట్ల ఇళ్లల్లోకి వస్తున్నాయి ప్రజలు కూడా తీవ్రఇబ్బంది పడుతున్నారు తప్పకుండా దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి.పోయిన సారి మీరు ప్రతిపక్షం లో ఉన్నాం ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పారు కానీ ఇపుడు ప్రభుత్వం మీదే ఉంది అధికార mla మిరే ఉన్నారు కాబట్టి తప్పకుండా చర్యలు తీస్కొని ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా చూడాలి. అదేవిధంగా నెల్లూరు లో చాలావరకు విషజ్వరాలు ఎక్కువగా ఉంది వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ? మనం చూస్తే లిక్కర్ పాలసీ అని ప్రభుత్వం తీసుకొచ్చారు కానీ అసలు మద్యపానం నిషేధం అంటే మద్యపానం అంచెలంచెలుగా తీసేస్తాం అంటున్నారు కానీ మద్యం రేట్లు విపరీతంగా పెంచేసి డబ్బులు ఎక్కువ పెట్టి కొనాల్సివస్తున్నది అని చెప్తున్నారు అది బ్లాక్ మార్కెట్ లో అప్పులైపోతున్నారు అని వాళ్ళింట్లో పిల్లలు , భార్యలు, తల్లులు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీని వెనకాల కూడా వైస్సార్సీపీ నాయకుల హస్తం ఉందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ని బలోపేతం చేసుకొని గ్రామా స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేసుకుంటాము.మిగతా ముగ్గురు అభ్యర్థులను కూడా మన నెల్లూరు పార్లమెంట్ నియోజగవర్గం పరిధిలో ఉన్న నెల్లూరు రురల్ , నెల్లూరు సిటీ , కోవూరు సంభందించిన వాళ్ళని కూడా త్వరలో కరెక్ట్ నాయకులని నియమించి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటిస్తాం అని తెలియజేసారు.. పై కార్యక్రమం లో మనుక్రాంత్ గారి తో పాటు ఆత్మకూరు ఇన్ ఛార్జ్ నలిసెట్టి శ్రీదర్ గారు,కిశోర్ గునుకుల,కృష్ణారెడ్డి,శ్యామ్,ప్రవీణ్,సంజయ్ తదితరులు పాల్గొన్నారు…

Featured ఆంధ్రప్రదేశ్

అట్టహాసంగా ఎంపీ ఆదాల జన్మదినోత్సవం

అట్టహాసంగా ఎంపీ ఆదాల జన్మదినోత్సవం దివ్యాంగ బాలలు మంచి జీవితాన్ని పొందాలి అంధుల పాఠశాలకు ఎంపీ ఆదాల లక్ష విరాళం నెల్లూరు, అక్టోబర్‌ 25 (పున్నమి ప్రతినిధి) : నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి జన్మదినోత్సవం శుక్రవారం ఉదయం ఆయన ఇంట్లో అట్టహాసంగా జరిగింది. ఉదయాన్నే ఆదాల ప్రభాకర్‌ రెడ్డి వింధ్యావళి దంపతులు వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. పలువురు నేతలు కార్యకర్తలు అభిమానులు ఉదయం నుంచే ఆయన ఇంటికి అభినందించేందుకు బారులు తీరారు. ఏపీ ఆర్‌ జిందాబాద్‌ ఏపీ ఆర్‌ వర్ధిల్లాలి అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. భారీ గజమాలలతో సత్కరించారు డప్పులు మోత మోగాయి. బాణాసంచా శబ్దాలతో ప్రాంతమంతా హోరెత్తింది. పలువురు కార్యకర్తలు, నేతలు శాలువాలతో సత్కరించారు పూలమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత అభిమానుల మధ్య ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి భారీ కేకును కట్‌ చేసి కార్యకర్తలకు తినిపించారు. ప్రాంతాలకతీతంగా పార్టీలకతీతంగా ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఇంటికి ఇరువైపులా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఆదాల అభిమాని నిజాముద్దీన్‌ హైదరాబాదు నుంచి భారీ బెలూన్ను తెప్పించి గురువారం రాత్రి ఆయన ఇంటి పైన ఎగరవేశారు తన అభిమానాన్ని ఆకాశమంత ఎత్తులో చూపించుకున్నారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులకు కు అల్పాహారం మిఠాయిలు పంపిణీ జరిగింది ఆదాల ప్రభాకర్‌ రెడ్డి జన్మదినోత్సవ ఏర్పాట్లు విజయ డైరీ చైర్మన్‌ రంగా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి అంధుల పాఠశాలకు ఎంపీ ఆదాల లక్ష విరాళం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి తన జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం విశ్వభారతి అంధుల పాఠశాలకు లక్ష రూపాయల విరాళం అందించారు సతీమణి వింధ్యావళి సమేతంగా పాల్గొన్నారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విశ్వభారతి అంధుల పాఠశాలలో తన జన్మ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషమని తన అభిమానాన్ని ప్రకటించారు అంధుల పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మేలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు నగదుతో పాటు అక్కడ అవసరమైన మరుగుదొడ్లను కూడా కట్టిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఇక్కడి అంధ విద్యార్థు లకు మేలు జరగాలని ఆశిస్తున్న ట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆంధ విద్యార్థులకు పండ్లు పలహారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆదాల సతీమణి వింధ్యావళితో పాటు పాల్గొన్నారు. విజయ డైరీ చైర్మన్‌ రంగారెడ్డి, నెల్లూరు రూరల్‌ ఇన్చార్జి గిరిధర్రెడ్డి ,కోటేశ్వర్‌ రెడ్డి , స్వర్ణ వెంకయ్య, సుధాకర్‌ రెడ్డి, అబూబకర్‌, ఇక్బాల్‌, సుధాకర్‌ యాదవ్‌, మధు, నరసింహారావు ,నెల్లూరు ఝాన్సీ లక్ష్మి, పాముల హరి తదితరులు పాల్గొన్నారు దివ్యాంగ బాలలు మంచి జీవితాన్ని పొందాలి దివ్యాంగ బాలల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరు రెడ్‌ క్రాస్‌ ప్రాంగణంలో జరిగిన మహా రక్తదాన శిబిరం, దివ్యాంగ బాలలకు అన్నదానం, వ్యాయామ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్క్రాస్‌ ఆధ్వర్యంలో చాలా సంస్థలు సేవాగుణం తో పనిచేస్తున్నాయని ప్రశంసించారు. దివ్యాంగ బాలలు ఇక్కడ లభిస్తున్న శిక్షణతో కోలుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టి , స్వతంత్య్రంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలు జిమ్‌ వంశి ఆధ్వర్యంలో జరగడం సంతోష దాయకమని పేర్కొన్నారు. రక్తదానం ఉత్తమమైనదని, దీనివల్ల ఎందరో ప్రాణాలను రక్షించ వచ్చునని తెలిపారు . ముఖ్యంగా విష జ్వరాలు ప్రబలి ఉన్న ఈ తరుణంలో రక్తదానానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు తన జన్మదినం సందర్భంగా చాలా మంది యువకులు ముందుకు రావడం సంతోషదాయకం దాయకమని, వారందరికీ అభినందనలు తెలిపారు. రెడ్‌ క్రాస్‌ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి మనోహర్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. జిమ్‌ వంశీ ఆధ్వర్యంలో దాదాపు 50 మందికి పైగా రక్తదానం చేశారు .ఈ సందర్భంగా వికలాంగ బాలలకు ఆయన తరఫున ఒక వ్యాయామ పరికరాన్ని ఎంపీ చే అందజేశారు. అలాగే స్పాస్టిక్‌ సెంటర్లో దాదాపు 150 మందికి పైగా ఉన్న బాలలకు అన్నదానం జరిగింది.ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్‌ రంగారెడ్డి, కోటేశ్వర్‌ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి , అబూబకర్‌, ఇక్బాల్‌, పాముల హరి , హరి శివారెడ్డి, డాక్టర్‌ సుబ్రమణ్యం, నరసింహారావు, ఎస్‌ గోపి, బాల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.