కోవిడ్-19 నియంత్రణకు లాక్ డౌన్ ఒక్కటే మార్గం: డా.మానికిరెడ్డి, కాకినాడ.
కోవిడ్ -19 నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తూ సేవలందిస్తున్న జిల్లా అధికారులు పనితీరు అభినందనీయం అని డా. మానికిరెడ్డీ హెల్త్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. మానికీరెడ్డి అన్నారు. దేశం లో కరోనా వైరస్ ప్రబలకుండా లాక్ డౌన్ స్వీయ నియంత్రణ సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తే కరోనా మహమ్మారిని దేశం నుండి తరిమి కొట్టవచ్చు అని డా . మానికి రెడ్డి సత్యన్నారాయణ గారు అన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా మానవాళిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంది అన్నారు.ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల జరుగుతున్న లాక్ డౌన్ ను విజయవంతం చెయ్యడానికి అహర్నిశలు శ్రమిస్తున్న అధికారులకు పోలీస్ లకూ భాద్యతగా సహకరిస్తూ ఇళ్ళకే పరిమితమై ప్రాణాలను కాపాడుకుందాం అని డా .మానికి రెడ్డీ అన్నారు .ప్రపంచములో భయంకరమైన కరోనా వైరస్ లక్షల్లో ప్రాణాలను కోల్పోయిన విషయం దృష్టిలో ఉంచుకొని దేశాన్ని కాపాడుకోవడానికి భాద్యతగా ప్రతీ ఒక్కరూ ఇంటిలోనే గడపాలి అన్నారు.దేశం లో ఇది దృష్టి లో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్య భద్రత కోసం లాక్ డౌన్ నిర్వహించారు.వైద్యులు,పోలీసులు, మునిసిపల్ కార్మికులు ,పాత్రికేయులతో పాటు ప్రజా సేవలో అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు తమ ప్రాణాలను పణం గా పెట్టీ మన ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నవారికి సహకరించాలి అన్నారు.కరోనా పై ప్రభుత్వం వైద్యులు సూచనలు తప్పనిసరిగా పాటించాలి అని సూచించారు.మన దేశం లో రోజు రోజుకీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో జాగ్రత్తలు పాటించకుండా ఉంటే ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని మానికి రెడ్డీ హెచ్చరించారు .











