Friday, 6 March 2026

Blog

Featured

విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త

విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త AP:విద్యార్థుల కోసం ప్రభుత్వం నేడు మరో పథకం ప్రారంభించింది.తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న విద్యా దీవెన పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.ఈ పథకం కింద రూ.4000 కోట్లను పూర్తి ఫీస్ రీయంబేర్స్మెంట్ కోసం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ1880 కోట్ల బకాయిలను కూడా చెల్లిస్తామని,12 లక్షల మంది తల్లులు ,వారి పిల్లలు ఈ పథకం ద్వారా లబ్ది పొందునున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

మేము సైతం అండగా ఉంటాం- … వావిలేరు యువత

చేజర్ల, ఏప్రిల్ 26, 20 20. (పున్నమిప్రతినిధి -ఎస్ హజరత్) చేజెర్ల మండలం వావి లేరు గ్రామం లోని యువత కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు వారి కుటుంబం నుండి బయటకు రావడానికి ఇబ్బంది ఉంది అలాగే సామాజిక దూరం తోనే కరోనావైరస్ అరికట్ట వచ్చునని అందుకే యువత మేము సైతం తోడు గా ఉంటాం అంటూ ముందుకొచ్చి వారికి ఏడు రకాల కూరగాయలు మరియు కోడిగుడ్లు వావి లేరు కండ్రిగ, మరియు వావి లేరు గ్రామంలో ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు సామాజిక దూరం తోనే ఈ వైరస్ ని అరికట్టవచ్చునని ఈ సందర్భంగా యువత తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంత నేని బాబు నాయుడు, అనంత నేని ప్రసాద్ ,లక్కు కోటేశ్వరరావు ,తాళ్లపల్లి వరదా రెడ్డి , నెట్టం శ్రీకాంత్ ,మాలపాటి పెంచల్ రెడ్డి, గోనుగుంట వివేక్, పొత్తూరు రఘు, రవి, చెంచురామయ్యమరియు వావి లేరు యువత పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయనిధికి ముస్లింల విరాళం..

  అనంతపురం;  కరోనా నివారణలో మేము సైతం అంటూ ఓ మసీదుకు సంబంధించిన ముస్లింలు స్థానిక ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి కి విరాళం చెక్కును అందజేశారు. ఆదివారం హెచ్చెల్సీ కాలనీ సమీపంలోని మసీదు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి సహాయనిధికి 50 వేల రుపాయల చెక్కును ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ సందర్భంగా వెంక్రామిరెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకవైపు కరోనా విపత్తులో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదని పేదప్రజలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నారని ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

మీడియా పాత్రికేయులకు 16 రకాల వంటసరుకులు పంపిని చేసిన టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు రెడ్డి.

కడప (పున్నమి ప్రతినిధి)  : ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి మరింతగా విజృంభించ కుండా తమ వంతు సేవలు అమలు చేస్తున్నా పాత్రికేయులు అభినందన అభినందనీయమని మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, మరియు కడప జిల్లా టిడిపి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస రెడ్డి గారు, రాయచోటి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఆర్. రమేష్ కుమార్ రెడ్డి గారు, మాజీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల ఖాదర్ భాషా గారు పేర్కొన్నారు. ఆదివారం నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు టిడిపి ఇన్చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి గారి, ఆర్థిక సహకారంతో 16 రకాల వంట సరుకులను ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా గాజుల ఖాదర్ భాషా మాట్లాడుతూ kovid-19 లాక్ డౌన్ సందర్భం గా జిల్లా టిడిపి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు రాయచోటి టిడిపి ఇన్చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి గారు, ఇరువురు హైదరాబాద్ లో ఉన్నందువల్లన తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి రాకపోకలు నిషేధించడం వల్లన వారు పాత్రికేయులకు కానుకలు ఇవ్వడం జరిగింది. భయంకరమైన అంటు వ్యాధి అని తెలిసినా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పాత్రికేయులు తమ విధి నిర్వహణను చిత్తశుద్ధితో కొనసాగిస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారన్నారు. తమ వార్తల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని కలిగిస్తున్న విలేకరులు ప్రస్తుత తరుణంలో నిజమైన దేశభక్తులను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి అంజద్ అలీఖాన్, పట్టణ అధ్యక్షులు ఖాదర్ వలి, ప్రభుత్వ న్యాయవాది జక్రియ భాష, సంబేపల్లె మండల అధ్యక్షుడు రెడ్డయ్య యాదవ్, లక్కిరెడ్డిపల్లె మండల అధ్యక్షుడు జయరాం, 9వ వార్డు అధ్యక్షుడు మైన్ ఉద్దీన్, 10 వ వార్డు అధ్యక్షులు అబూ సర్, ఏడవ వార్డు అధ్యక్షుడు అత్తా ఉల్లా, 27 వ వార్డు అధ్యక్షులు మహబూబ్ అలీఖాన్, 11వ వార్డు అధ్యక్షుడు సోనీ రాజ్ కలీం, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గంగాధర్, మాజీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ హుస్సేన్, జిల్లా టిడిపి కార్యదర్శి ముస్తాక్, మాసాపేట టిడిపి నాయకులు సుమన్, మరియు అమీర్ భాషా, ఇటుకుల యజమాని పీరు సాబ్ జావిద్, తదితరులు పాల్గొన్నారు,

Featured ఆంధ్రప్రదేశ్

“సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామన్న జిల్లా అధికారులు”

నెల్లూరు,  (పున్నమి ప్రతినిధి, సి ఎస్ రావు)  నెల్లూరు ,జిల్లా పరిషత్ ఆఫీస్ నందు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు గారి ఆదేశాల మేరకు ఉద్యోగులకు మరియు పోలీసులకు మధ్య ఏర్పడిన వివాదాలపై చర్చించేందుకు డి ఆర్ ఓ గారు మరియు ఎ. ఎస్. పి గారి సమక్షంలో ఉద్యోగ సంఘ నాయకులు ప్రధానంగా APGEA, APRSA, HAMSA ,APVRA రాష్ట్ర నాయకులు చొప్పా రవీంద్ర బాబు గారు, వరిగొండ. కృష్ణారావు, చేజర్ల సుధాకర్ రావు, పంటా. అశోక్ కుమార్ రెడ్డి ,ఇతర సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జరిగిన చర్చను ఉద్దేశించి APGEA రాష్ట్ర నాయకులు చొప్పా. రవీంద్ర బాబు గారు మాట్లాడుతూ కరోనా కోవిద్ 19 విధుల్లో భాగంగా అత్యవసర సేవలను అందించే డిపార్ట్మెంట్ అధికారులు ,ఉద్యోగులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వీరోచితంగా సేవలు అందిస్తున్నారని, రెట్టింపు స్థాయిలో పోలీసు యంత్రాంగం కూడా సేవలు అందిస్తున్నారని , జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు అన్ని శాఖల అధికారులతో కలుపుకొని పోలీసు యంత్రాంగాన్ని పటిష్టం వంతంగా సేవలు అందించే విధంగా చేస్తున్నారని, కొంతమంది కిందిస్థాయి అధికారులు చేసే తప్పిదాల వల్ల, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని , ఉద్యోగులపై దాడులు చేస్తూ, మానసిక వేదనకు గురి చేయడం సరికాదని ,ఇతర శాఖల ఉద్యోగులను విధి నిర్వహణలో వస్తున్నప్పుడు మాట్లాడే విధానం సరిగా ఉండాలని అని, ఒకరిద్దరు పోలీసు అధికారులు ,ఉద్యోగులు చేసే చర్యల వల్ల , వ్యవస్థ మొత్తానికి ఆపేరు వస్తుందని , డివిజన్ స్థాయి అధికారులు ఆర్డిఓ ,డిఎస్పి గార్లు ఇచ్చిన పాస్ లను పట్టించుకోకుండా జరిమానాలు విధించడం ఎంతవరకు సమంజసమని, ప్రతి పోలీస్ పోస్ట్ దగ్గర ఉద్యోగులును ఎక్కువసేపు ఆపడం వల్ల ,సకాలంలో అత్యవసర సేవలు అందించలేక పోతున్నాం అని విధి నిర్వహణలో వెళ్తున్న వారిని దండించే హక్కు, తిట్టే హక్కు ఎవరిచ్చారని, ఒక ఉద్యోగి తోటి ఉద్యోగిని అకారణంగా కొట్టి చిత్రహింసలు పెట్టడం ఎంతవరకు సమంజసమని, ఇలాంటి పరిస్థితులకు కారకులైన వారిపై చర్యలు తీసుకొని, సమస్యలు పునరావృతం కాకుండా , ఉద్యోగులు అందరూ సృహత్బావ వాతావరణంలో మంచిగా ఉండేటట్లు చూడాలన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

దువా చేస్తున్న ట్రాఫిక్ పోలీసు

నెల్లూరు  (పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ) గుంటూరు రెడ్ జోన్ లో విధినిర్వహణలో ఉపవాసం వుంటూ ఉపవాస విరమణకు ముందు ప్రత్యేక దువా చేస్తున్న ట్రాఫిక్ పోలీసు లాలాపేట పొలిసు స్టేషన్ ఏ ఎస్ ఐ కరీముల్లా.

Featured ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి సహాయ నిధికి 36 లక్షల 50 వేలు

నెల్లూరు, ( పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ ) ముఖ్యమంత్రి సహాయ నిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు వివిధ సంస్థలు కోవిడే 19 నివారణలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు వివిధ సంస్థలు అందచేసిన 36 లక్షల 50 వేల రుాపాయల చెక్కులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ .జగన్మోహన్ రెడ్డి గారికి అందచేసిన రాష్ట్ర హోమ్ శాఖా మంత్రివర్యులు శ్రీమతి మేకతోటి సుచిరిత గారు అందజేశారు.

Featured ఆంధ్రప్రదేశ్

“కష్టకాలంలో అండగా ఉంటాం అంటున్న ఉద్యోగ సంఘాలు “

నెల్లూరు, 26.04.2020, (పున్నమి ప్రతినిధి, సి.ఎస్.రావు) “కష్టకాలంలో అండగా ఉంటాం అంటున్న ఉద్యోగ సంఘాలు ” ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాయకులు, అధికారులు ,ఉద్యోగులు సచివాలయ ఉద్యోగుల సహకారంతో నిర్వహిస్తున్న ఈసేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు డైరెక్టర్ తమ్మినేని .పాండు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గీతా మయి వృద్ధుల ఆశ్రమం ,బాలాజీ నగర్ నెల్లూరు నందు 100 మంది చిన్నారులకు ,వృద్ధులకు అన్నదానం నిర్వహించడంతోపాటు, మాస్కులు, బిస్కెట్స్ చేయడం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి చేజర్ల సుధాకర్ రావు ఏపీ జి ఈ ఏ జిల్లా నాయకులు మాట్లాడుతూ కరోనా కోవిద్ 19 లాక్ డౌన్ సందర్భంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయి సాధారణ జనం ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు ,ఉద్యోగుల సమన్వయంతో ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ,ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజు గీతామయి వృద్ధులు- చిన్నారుల ఆశ్రమంలో అన్నదానం, మాస్క్ లు పంపిణీ ,బిస్కెట్స్ అందజేసేందుకు శ్రీ పోలుపోగు. నరసింహారావు ,సూపరిండెంట్, పే మరియు అకౌంట్స్ ఆఫీస్, వర్క్స్ అకౌంట్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఒంగోలు వారు ముందుకు వచ్చి తమవంతు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నెల్లూరు జిల్లా శాఖ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు, ఆకలితో అలమటిస్తూ చెప్పుకోలేని దుస్థితి, దీన స్థితిలో అనేక మంది ఉన్నారని వారందరినీ కొంతమేరకు ఆదుకునేందుకు ఆకలి తీర్చేందుకు, అధికారులు ఉద్యోగులు తరలి ముందుకు రావాలని ఆయన అన్నారు ‌ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు ఏనుగు రమణారెడ్డి ,పులి సతీష్, లక్ష్మీనారాయణ, , ఏవి. సురేష్ , చేజర్ల.తేజ విఆర్ఓ,రంజిత్, నాగరాజు, ఎస్ వి సుబ్బారెడ్డి, కిరణ్, సుధాకర్ రెడ్డి ,ఎపిజి ఈ ఏ మహిళా విభాగం జిల్లా చైర్మన్ టి. సౌందర్య జిల్లా కన్వీనర్ జిఎస్ఎల్. సౌజన్య కో చైర్మన్ ఆర్. ఇందిర, వైస్ చైర్మన్ సునీత తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

ప్రసిద్ధ చారిత్రక క్షేత్రం అలఘమల్లారి దేవాలయం

వెలుగోటి వారి పాలనలో ప్రసిద్ధికెక్కిన మన్నారు పోలూరు శ్రీకృష్ణుని ఆలయం ( పున్నమి ప్రతినిధి. షేక్. రసూల్ అహమద్ ) :  బ్రహాండ పురాణకాలములో మణిమంటపక్షేత్రముగా, నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన  పుణ్యక్షేత్రం అలఘమల్లారి కృష్ణస్వామి దేవాలయం. ఈ దేవాలయం నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటకు దగ్గరలో ఉన్న మన్నారుపోలూరు అనే గ్రామములో వెలసి వుంది. సంపదలకు నిలయంగా ఉండే ప్రతి గుడికి ఓ పురాణగాథ ఉన్నట్టే ఈ గుడికి కూడా ఓ పురాణం ఉంది. ద్వాపరయుగంలో సత్రాజిత్తుడనే రాజు తన తపోబలముచే సూర్యుని వలన శ్యమంతకమణిని సంపాదించెను. శ్రీకృష్ణుడు ఆ మణి  మహాత్యమును తెలిసుకొని దానిని తనకివ్వవలసినదిగా  సత్రాజిత్తు రాజును కోరగా , అందుకు ఆరాజు నిరాకరించెను. తరువాత ఒకనాడు సత్రాజిత్తుని తమ్ముడగు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లగా అడవిలో ఒక సింహము ప్రసేనుని చంపి ఆ మణిని తీసుకొని వెళ్లుచుండగా, ఆ ప్రాంతంలో తపస్సు చేసుకొంటున్న జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి మణిని తీసికొనివచ్చి తన కుమార్తె ఐన జాంబవతికిచ్చెను. కానీ మోసముచే శ్రీకృష్ణుడే ప్రసేనుని వధించి శమంతక మణిని దొంగతనంగా తీసుకున్నాడని లోకములో అపవాదు కలిగేను.కొంత కాలము తరువాత ఒకనాడు దండకారుణ్యమునకు వేటకు వచ్చిన కృష్ణుడు జాంబవతి వద్దనున్న శమంతకమణి చూసి, తనపైఉన్న అపవాదును పోగొట్టుటకు , త్రేతాయుగములో శ్రీరామావతారములో జాంబవంతుడికిచ్చిన వరమును చెల్లించుటకు గాను శ్రీకృష్ణుడు జాంబవంతునితో 18 రోజులు మల్లయుద్దము చేసి జాంబవంతుడిని ఓడించి శ్యమంతకమణితో పాటు జాంబవతిని కూడా వివాహమాడెను. అందువలన ఇక్కడ వెలసివున్న కృష్ణస్వామికి అలఘమన్నారి  కృష్ణస్వామి అను పేరు కలిగినట్టుగా ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రపాలకుడు జాంబవంతుడు. కృష్ణుడు మణిని సత్రాజిత్తునికిచ్చి తనపై ఉన్న అపవాదును పోగొట్టుకొనెను. అప్పుడు సత్రాజిత్తు శ్రీకృష్ణుని మెచ్చుకొని తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహము చేసి ఆ మణిని తిరిగి శ్రీకృష్ణుడికి కానుకగా ఇచ్చెను. ఇక చారిత్రకంగా ఈ గ్రామము ఒకప్పుడు వడ్డెరాజులకు ముఖ్యపట్టణంగా ఉండింది. 12వ శతాబ్దములో మనుమసిద్ధి రాజుగారి బంధువు తిక్కరాజు ఉత్సవకాలములో ప్రత్యేక వసతులు కల్పించినట్లు ఈ ఆలయంలో శిలాశాసనము వుండింది. ప్రస్తుతం అది కనపడుటలేదు.కల్నల్ మేకంజి కైఫీయత్తులో ఈ దేవాలయ స్థల పురాణం రాయబడింది. దేవాలయం వెనక వైపు రాజుల కాలంనాటి  శిధిల కోట ఆనవాళ్లు ఉన్నాయి.  వెంకటగిరి రాజుల కాలంలో ఈ దేవాలయం  మహోన్నత స్థాయికి చేరింది. వెంకటగిరి రాజులు  ఈ దేవాలయ నిర్వహణకు 5 గ్రామాలతోపాటు వేల ఎకరాలు దానంగా ఇచ్చారు. వెలుగోటివారు మన్నారు పోలూరును తూర్పు దక్షిణ రాజ్యానికి  తమ ముఖ్య కేంద్రంగా వాడుకొన్నారు. ఇక్కడ అధిక సంఖ్యలో దేవదాసీలు ఆలయానికి అనుబంధంగా పనిచేసేవారు. వెంకటగిరి రాజాల దర్బారులో, అలాగే సంస్థానానికి చెందిన  ప్రతి ఉత్సవాల్లో మన్నారు పోలూరు దేవాసీలు ఉండేవారు. అత్యంత ఆకర్షణీయంగా ఉండే  మన్నారుపోలూరు దేవదాసీల కోసం వెంకటగిరి రాజుల యొక్క అతిధులు అధికారులు ఆఖరికి పామర జనాలు కూడా ఎగబడేవారు. పెద్ద ఎత్తున రంగమంటపాలు వీరికోసం ఉండేవి. దేవదాసీలు దేవాలయంపై వచ్చే ఆదాయం పైన ఆధారపడి వీరు బతికేవారు. జమీందారి రద్దు తర్వాత దేవదాసీల జీవితం దుర్భర స్థితిలోకి నెట్టివేయబడింది. ఇక దేవాలయంలోని శిల్ప కళ ద్రావిడ శైలిలో కట్టబడింది . ప్రతి శిల్పం ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. నవరసాలకు ప్రతిబింబంగా ఇక్కడి శిల్పకళావైభవం వర్ధిల్లుతోంది. ఇందుకు ఉదాహరణగా గర్వభంగము అయిన గరుత్మంతుడు రోధిస్తున్నట్టు విగ్రహ కనులనుండి నీరుకారుతున్నట్టుగా గోచరిస్తుంది. ఇలా ప్రతి శిల్పం ప్రత్యేకలక్షణము కలిగి ఈ దేవాలయం భారతదేశములో ప్రసిద్ధ పుణ్యక్షేత్రములో ఒకటిగా విరాజిల్లుతోంది.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

కరోనా వైరస్ కంటే ముందే ఆకలి అనే వైరస్ ప్రజలను చంపేస్తుందా ?

( పున్నమి ప్రతినిధి ) : కరోనా దెబ్బకు ప్రపంచమంతా ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది, తీవ్ర దుర్భిక్షంలోకి దేశాలు నెట్టివేయబడుతున్నాయి. కెన్యా రాజధానిలోని అతిపెద్ద మురికివాడలో ప్రజలు ఆహారంకోసం జరిగిన ఘర్షణలో కొందరు  గాయపడ్డారు మరియు ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. భారతదేశంలో, వేలాది మంది కార్మికులు రోజుకు రెండుసార్లు రొట్టె మరియు వేయించిన కూరగాయల కోసం వరుసలో ఉన్నారు. కొలంబియా అంతటా ఆకలితో ఉంటున్నామని తెలియడానికి, పేద కుటుంబాలు వారి కిటికీలు మరియు బాల్కనీల నుండి ఎర్రటి దుస్తులు మరియు జెండాలను వేలాడదీసి తాము ఆకలితో ఉన్నామనడానికి సంకేతంగా వేలాడదీస్తున్నారు.  “మాకు డబ్బు లేదు, ఇప్పుడు మనం బ్రతకాలి” అని పౌలిన్ కరుషి అన్నారు ఆమెకు నైరోబిలోని ఒక ఆభరణాల వ్యాపారంలో ఉద్యోగం పోయింది, ఆమె బిడ్డ మరియు మరో నలుగురు బంధువులతో కలిసి ఇరుకైన  రెండు గదులలో నివసిస్తుంది. తినడానికి ఏమి లేదు అంటే కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ఆకలిని తెచ్చిపెట్టింది. జాతీయ లాక్‌డౌన్లు మరియు సామాజిక-దూర చర్యలు, పని మరియు ఆదాయాలను ఎండబెట్టాయి,  వ్యవసాయ ఉత్పత్తి మరియు సరఫరా మార్గాలకు అంతరాయం కలిగించాయి. దీంతో లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ను ధనవంతులు మరియు పేదలు ఇద్దరిని అనారోగ్యానికి గురిచేసి కొన్నిసార్లు సమానత్వం చూపించింది. కానీ ఆహారం విషయానికి వస్తే సమరూపం చూపించలేదు.పేద, ధనిక దేశాల మధ్య అంతరం అలాగే ఉంది, ఆకలితో ఉన్న అవకాశాన్ని ఎదుర్కొంటున్నప్పుడు క్లాసిఫికేషన్ మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆశా జాఫర్ అనే  స్వచ్ఛంద సేవకుడు నైరోబి మురికివాడలోని కుటుంబాలకు ప్రాణాంతక తొక్కిసలాట తరువాత ఆహారాన్ని తీసుకువచ్చాడు. తరగతి విభజనపై ఉన్న అడ్డు తెరను వెనక్కి లాగడం ద్వారా  ఈ దేశంలో ఎంత లోతైన  అసమానంగా ఉందో బహిర్గతం చేస్తోంది. ఇలాంటి సంఘటనలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే, 135 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు, కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి దీన్ని రెట్టింపు చేయవచ్చని  ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం చీఫ్ ఎకనామిస్ట్ ఆరిఫ్ హుస్సేన్ అన్నారు. మొత్తంగా, సంవత్సరాంతానికి 265 మిలియన్ల మంది ప్రజలు ఆకలి అంచుకు నెట్టబడతారని చెప్పారు. మేము ఇంతకు ముందెన్నడూ చూడని మహా ఆహార సంక్షోభం అని హుస్సేన్ అన్నారు. ప్రపంచం ఇంతకు ముందు తీవ్రమైన ఆకలి సంక్షోభాలను ఎదుర్కొంది, కానీ అవన్నీ ప్రాంతీయమైనవి మరియు ఒక కారకం లేదా మరొక కారణంతో సంభవించాయి.  తీవ్రమైన వాతావరణం, ఆర్థిక మాంద్యాలు, యుద్ధాలు లేదా రాజకీయ అస్థిరతతో  ఈ ఆకలి సంక్షోభం ప్రపంచవ్యాప్తమని, మరియు కరోనావైరస్ మహమ్మారితో  ముడిపడివున్న అనేక కారణాల వల్ల మరియు ఆర్ధిక క్రమం యొక్క అంతరాయం కారణంగా ఈ ఆహార సంక్షోభం సంభవిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే  లెక్కలేనన్ని మిలియన్ల మందికి ఆదాయంలో అకస్మాత్తుగా నష్టం, చమురు ధరల పతనం,  పర్యాటక రంగం నుండి కఠినమైన కరెన్సీ కొరత, విదేశీ కార్మికులు ఇంటికి పంపించడానికి ఆదాయాలు లేకపోవడం, వాతావరణ మార్పు, హింస, జనాభా తొలగింపులు మరియు మానవతా విపత్తులు వంటి కొనసాగుతున్న సమస్యలు  లేదా సామాజిక భద్రత లేకపోవడం, ఆహార ధరల పెరుగుదల, వంటి కారణాలతో ప్రపంచం ఆహార కొరతగా దిశగా అడుగులు వేస్తుంది.  ఇప్పటికే, హోండురాస్ నుండి ఆఫ్రికాకు  ఆఫ్రికానుండి భారతదేశానికి ఆహార సంక్షోభం పెద్దముప్పుగా పరిణమించే అవకాశముంది. వైరస్ వల్ల దోపిడీ విచ్ఛిన్నమైంది వేతనాలు ఎండిపోయినందున, ప్రపంచవ్యాప్తంగా సుడాన్ మరియు జింబాబ్వే వంటి నగరాలను ప్రజలు విడిచిపెట్టినందుకు మిగతా దేశాల ఆర్ధికవ్యవస్థలు మరింతగా క్షీణించాయి. మిలియన్ల ప్రజలు ఇంటికి నడవడం,ఇతర ప్రదేశాలకు బయలుదేరడం లేదా ఆగిపోవడం లాంటి బీభత్సమైన వాతావరణం కనిపిస్తుంది. ఇరాన్ వంటి ఇస్లామిక్ దేశాలు పోషకమైన భోజనం కోసం ఎక్కువగా చమురును ఉపయోగించారు. ఇది కూడా సంక్షోభానికి కారణమైంది. దీనికి భిన్నంగా ఇండియా తమ విశిష్టతను ఆహారం మరియు మెడిసిన్ పదాల్లో చూపిస్తుంది. అయితే వాస్తవం ఇంకోలాఉంది దేశం మొత్తం వలస, సంచార జాతులు తీవ్ర ఆకలితో చిక్కుకు వున్నారని మాధ్యమాలు ఘోషిస్తున్నాయి, దేశరాజధాని ఐన ఢిల్లీలోవలసకార్మికులు ఆహార సంక్షోభంలో చిక్కుకున్నారనే ప్రకటనలు కనిపిస్తున్నాయి. అయితే అలాంటిది ఏదినిజం కాదని ఢిల్లీ వర్గాలు చెపుతున్నాయి. గణాంకాలు ఎలా ఉన్న “కరోనా వైరస్ కంటే ముందే ఆకలి అనే వైరస్ ప్రజలను చంపేస్తుందా,” అన్న సందేహాలు నేటి నాగరిక సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.