Friday, 6 March 2026

Blog

Featured

గూడూరు శ్రీమంతులు

పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ : కోట్ల రూపాయల ఆస్తి పరులు వెయ్యి రూపాయలు సహాయం చేయడం గొప్పకాదు. వెయ్యిరూపాయలు జేబులో ఉన్నప్పుడు అది పూర్తిగా పేదలకు ఖర్చు పెట్టడం చాలా గొప్ప విషయం. ఇలాంటి దాతృత్వం కేవలం మహానుభావులకు మాత్రమే సాధ్యమవుతుంది. మన గూడూరులో ఇలాంటి మహానుభావులకు కొదవేలేదు. ఉదాహరణకు మిత్ర ఫౌండేషన్, మై ఫ్రెండ్స్ అసోసియేషన్, స్వాంతన, ఈద్గా యూత్ కమిటీ, ఆల్ ఇస్లాం, మఖ్దూమ్ చారిటీ లాంటివి పేదప్రజల అభ్యున్నతికి ఎదో ఒక రూపేణా తమ వంతు సహాయం చేస్తున్నాయి. ఈ కోవకు చెందినదే గూడూరికి చెందిన హార్ట్ టూ హాండ్ (H2H) ఫౌండేషన్ సంస్థ. ఈ సంస్థ గత రెండు నెలల నుంచి నిరంతరంగా పేదప్రజల అవసరాలకు తమ తోడ్పాటు అందిస్తున్నది. ఈ సంస్థ అధ్యక్షుడు వాకా నిరంజన్ వారి మిత్రులు తమ శక్తికి మించి చేస్తున్న సహాయకార్యక్రమాలు శ్రీమంతులను సైతం సిగ్గుపడేలా చేస్తున్నాయి. నేడు దేశంవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ సామాన్యులను తీవ్ర కష్టాల్లోకి నెట్టివేయబడిందని అందరికి తెలిసిన విషయమే. ఇలాంటి సందర్భంలో పేదప్రజలను ఆదుకోవడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని, అందులో భాగంగా గూడూరులోని గాంధీనగర్ కు చెందిన కార్మికులు మరియు పేదవారికి నిత్యావసర సరుకులను పంచడం జరిగిందని వాకా నిరంజన్ తెలియచేసారు. అలాగే నెల్లటూరు దగ్గర ఉన్న నిమ్మకాయల మార్కెట్టుకు సమీపంలోని నిరుపేదలకు మొత్తం దాదాపు 80 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేశామని నిరంజన్ చెప్పారు. చిన్నపిల్లలకు తినుబండారాలతో పాటు మాస్కులు సైతం పంచినట్టు నిరంజన్ పేర్కొన్నారు. కరోనా వ్యాధి దరి చేరకుండా భౌతిక దూరం, పరిశుభ్రత లాంటి విధానాలు యొక్క అవసరాన్ని ప్రజలకు వివరిస్తున్నట్టు హార్ట్ టూ హాండ్ (H2H) సంస్థ తెలిపారు. ఈ కార్యక్రమంలో H2H ఫౌండేషన్ సభ్యులు వరప్రసాద్ ,ప్రభాకర్, రమేష్, కార్తిక్, వంశీ, ముని దయాకర్ తో పాటు స్థానికులు పాల్గొన్నట్టు వాకా నిరంజన్ వివరించారు.

Featured

రాపూరు మండల సమితి ఆధ్వర్యంలో 42వ రోజు అన్నదానం

రాపూరు, మే 11, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా లాక్ డౌన్ సందర్భంగా రాపూరు మండలం సేవాసమితి ఆధ్వర్యంలో ఈరోజు రాపూరు వాటర్ ట్యాంక్ సెంటర్, లిప్రసి కాలనీ, సిద్దల్య సెంటర్ st లకు నవాబు పేట ST లకు 500 మంది నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగిందని, ఈ కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు అండగా ఉంటామని మండల సేవ సమితి సబ్యులు తెలిపారు. ఈ రోజు కారయక్రమానికి డాక్టర్ మతార్ సహీబ్ గారు పేదలకు 500 మందికి స్వీట్లు మరియు హాట్ పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాపూరు మండల సేవ సమితి సభ్యులు మదమాల పిచ్చిరెడ్డి, దామిశెట్టి సురేష్ (గోల్డ్) కొత్త హజరత్తయ్య, కంభాల వెంకటరత్నం, సయ్యద్ జలీల్ అహ్మద్,పిట్టబోయిన వెంకటసుబ్బయ్య , పాలవల్లి హరినాధ్, దందోలు తిలక్ రెడ్డి,శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి,కేతా అమర్ నాద్ధ్ రెడ్డి, బులాగాకుల మునీంద్రా రెడ్డి,బులాగాకుల మనోహర్ రెడ్డి,దామిశెట్టి సురేష్ (మినుములు),ఏటూరి మురళీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాపూరు మండల సేవ సమితి వారు డాక్టర్ మతర్ సాహెబ్ గారిని అభినందించడం జరిగింది.

Featured గూడూరు

నిరాశ్రయులకు నిత్యఅవసర సరుకులు.H2H

గూడూరు లోని ఇందిరానగర్ కాలనీ నిరాశ్రయులకు నిత్యఅవసర సరుకులు హార్ట్ టు హ్యాండ్ (H2H) ఫౌండేషన్ సభ్యులు ఇవ్వడం జరిగింది దీనిలో వకానిరంజన్, వరప్రసాద,ప్రభాకర్, రమేష్, కార్తిక్, వంశీ, మరియు ముని దయాకర్ మరియు స్థానికులు పాల్గొన్నారు భవిష్యత్తు లో చాలా కార్యాక్రమాలు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు

Featured

చిల్డ్రన్స్ పార్కు రోడ్డు -లో రత్నమ్మ ఛారిటబుల్ సొసైటీ నెల్లూరు వారిద్వారా సహాయం

ప్రచురణార్దం. ——————— నెల్లూరు – చిల్డ్రన్స్ పార్కు రోడ్డు – రాంజీ నగర్ 9వ వీధిలో ఇల్లు వాకిలి లేక చెట్ల క్రింద నివాసముంటున్న 25 కుటుంబాల నిరుపేదలకు శ్రీ D. రామచంద్రయ్య అటవీశాఖాధికారి మరియు రత్నమ్మ ఛారిటబుల్ సొసైటీ నెల్లూరు వారిసౌజన్యంతో ఒక్కో కుటుంబానికి 5 కేజీలు బియ్యం +5 కేజీలు కూరగాయలు + 10 కోడి గుడ్లు + శానిటైజర్స్ 16 వ వార్డు YSRCP నాయకులు శ్రీ వేనాటి శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడమైనది. భౌతిక దూరం పాటిస్తూ లబ్ధిదారులకు సూచనలు చేయడమైనది. పద్మనాభ రెడ్డి, నాగేశ్వరరావు మొదలగు వారు సహకారమందించారు. ఇట్లు డా : రాచపాళెం రఘు రత్నమ్మ ఛారిటబుల్ సొసైటీ నెల్లూరు తేది : 07-5-2020 స్థలం : రాంజీ నగర్ నెల్లూరు

ఆంధ్రప్రదేశ్

26 నుండి కోర్టులకు సెలవులు

ఏపీ కోర్టులకు వేసవి సెలవులు ఖరారు అయ్యాయి. హైకోర్టుతో పాటు రాష్ట్రంలోని దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లు,లేబర్ కోర్టులకు సేలవులు ప్రకటించారు. ఈ నెల 26 నుండి జూన్ 12వ తేదీ వరకు హైకోర్టు, అన్ని జిల్లా కోర్టులు,సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు జూన్ 1 నుండి 12వ తేదీ వరకు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు,రెంట్ కంట్రోలర్స్ కోర్టులకు వేసవి సెలవులు మంజూరయ్యాయి.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో 43 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు సంఖ్య 1,930 కు చేరింది.999 మంది చికిత్స పొదుతుండగా,ఇప్పటివరకు 887 మంది డిశ్చార్జ్ అయ్యారు.గత 24 గంటల్లో ముగ్గురు మరణించడంతో కరోనా మరణాలు 44కి చేరాయి.తాజా కేసుల్లో అనంతపురం జిల్లాలో 3,విశాఖ జిల్లాలో 5,గుంటూరు జిల్లాలో 2,చిత్తూరులో 11,కర్నూలులో 6,కృష్ణాజిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి.

Featured

తప్పిన పెను ప్రమాదం

నెల్లూరు 09.05.2020 పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ✍️ ఆత్మకూరు బస్టాండ్ వద్ద గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల బస్సు రైల్వే పోల్ ను ఢీ కొంది.శనివారం తెల్లవారుజామున 5:30గం.ల సమయంలో కళాశాల బస్సుకు బ్రేకులు పడనందున ప్రమాదం జరిగినట్లు తెలిపారు. బస్సు పోల్ ను ఢీ కొనడంతో బస్సు ముందు వెళ్తున్న ఆటోకి ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. పోల్ లేనట్లయితే ఘోర ప్రమాదం జరిగేదన్నారు.కాగా బస్సు డ్రైవర్ పరారీ ఉన్నాడు.

Featured

స్టోన్ హౌస్ పేటలో దుకాణాలు బంద్

నెల్లూరు 09.05.2020 పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ✍️ నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో వ్యాపారాలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. స్టోన్ హౌస్ పేట మినహా మిగిలిన ప్రాంతంలోని దుకాణాలలో కోనుగోలులకు ఉదయం 6గం.ల నుండి 9గం.ల వరకు అనుమతి ఉందని స్పష్టం చేశారు.ప్రజలు అర్థం చేసుకుని,సహకరించాలని ఆయన కోరారు.కరోనా వైరస్ నియంత్రణ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Featured

74 మంది ముస్లింలు చిక్కుకుపోయారు:మంత్రి

నెల్లూరు 09.05.2020  పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ✍️ నెల్లూరు జిల్లాకు చెందిన ముస్లిం సోదరులు 74 మంది ఢిల్లీకి జమాత్ సభలకు వెళ్లి లాక్ డౌన్లో చిక్కుకు పోయారని వారిని త్వరిగతిన జిల్లాకు తీసుకురావాలని మంత్రి అనిల్…కలెక్టర్ కి తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… నిబంధనల ప్రకారం వీరిని 15 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతామన్నారు.జిల్లా కలెక్టర్ తో పాటు అధికార యంత్రాంగం కృషి వల్ల కరోనా వైరస్ ఉద్ధృతి జిల్లాలో తగ్గిందని ప్రశంసించారు.

Featured

జిల్లా అధికారులతో టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించిన మంత్రి

నెల్లూరు 09.05.2020 పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ✍️ నెల్లూరు నగరంలోని దర్గామిట్ట నందు గల జెడ్పి హాల్లో మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా క్వారంటైన్ వార్డులు,ఐసోలేషన్ వార్డులలో అందిస్తున్న వైద్య సదుపాయాలు,సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాలు,మన రాష్ట్రం నుంచి రాకపోకలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.