Friday, 6 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం డీఎస్పీ ఆత్మహత్య

నెల్లూరు ,15.05.2020 పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ ✍ ఏపీ విశాఖ బీచ్‌ రోడ్డు ప్రాంతంలో ఓ పొలిసు ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకున్నారు . శ్రీకాకుళం స్పెషన్ డీఎస్పీ గా విధులు నిర్వహిస్తున్నకృష్ణ వర్మ తన ఇంట్లోనే ఉరి వేసుకొని బలవన్మరణానికి పాప్పడ్డారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యానంతో బాధపడుతూ సెలవుల్లో ఉన్నారు . శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పదేళ్ల పాటు సిఐ గా పనిచేసిన కృష్ణ వర్మ డీఎస్పీగా ప్రమోట్ అయ్యారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి నాలుగో విడత రేషన్ పంపిణీ

నెల్లూరు,15.05.2020 పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ ✍ ఏపీలో రేపటి నుంచి 4వ విడత ఉంచిత రేషన్ పంపిణీ కార్యక్రమం మొదలుకానుంది. రాష్ట్రంలో మొత్తం కోటి 48 లక్షల 5,879 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం,కేజీ శనగలను ప్రభుత్వం ఇవ్వనుంది.రేషన్ కార్డుదారులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేయగా, పోర్టబులిటి ద్వారా ఎక్కడ ఉంటే అక్కడ రేషన్ తీసుకునే వెసులుబాటు కలనించింది. రేషన్ తీసుకునేందుకు షాపుల వారీగా టైం స్లాట్ కేటాయించింది.

Featured

కేంద్ర ఆర్థిక ప్యాకేజీ పై బిజెపి నాయకుడు బోలా హర్షం

మనుబోలు 15-05-2020(పున్నమి ప్రతినిధి కె- వెంకటేష్) కరోనా విపత్కర పరిస్థితులను అధ్యయనం చేసి వాటి లోటు పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్లు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.అందులో భాగంగా ఈ రోజు ప్రకటించినటువంటి ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ప్యాకేజీ భాగంగా లిక్విడిటీ పెంపు, వలస కార్మికులకు అండగా వన్ నేషన్ వన్ రేషన్ ,వలస కార్మికులకు ఆవాసం ఉచిత రేషన్, వీది వ్యాపారులకు ఊరట వలస కూలీలు ఉపాధి బాట వంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మనుబోలు లో హర్షం వ్యక్తం చేశారు .ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి ఆధ్వర్యంలో కరోనా పై చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రజలందరూ స్వాగతించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు .

Featured భక్తి

అష్టాదశ శక్తిపీఠం-18

కాశ్మీరేతు సరస్వతి శ్రీ సరస్వతీ దేవి ధ్యానంజ్ఞాన ప్రదా సతీమాత కాశ్మీరేతు సరస్వతీమహావిద్యా మహామాయా భుక్తిముక్తి ప్రదాయినీ భారతమాత శిరోభాగాన వెలిగే పచ్చల కిరీటమే కాశ్మీరు భూప్రాంతము. ప్రకృతి అందాలన్నీ మూటగట్టి రాసిపోసిన సుందర దివ్య ఆరామం కాశ్మీర్‌. సుందర దృశ్యముగా కనిపించు మంచు పొగలతో నిండిన హిమాలయ పర్వతాలు, గలగల సాగే సెలయేళ్లు. నయనానందకరమైన సరస్సులు, మధురఫల వృక్షసంపద, పరిమళాలు విరజిల్లు పుష్పజాతులతో ప్రకృతిపరచిన సౌందర్యాల రాశిగా కాశ్మీరులోయ ఖ్యాతి గాంచినది. ప్రఖ్యాత వేసవి పర్వత విశ్రాంతి కేంద్రంగా గణతికెక్కింది. అనాదికాలంలో కాశ్మీర్‌ పెద్ద జలార్ణవంగా ఉండేది. ఇది జలోద్భవానికి దానవుడు యొక్క నివాసం. జలాశయంలో ఉన్నంతవరకు చావులేకుండా వరం పొందినాడు. అందిన జీవరాశులను భక్షిస్తూండేవాడు. కశ్యప మహాముని దేవతల సాయంతో నాగలి సహాయంతో సరోవర ప్రాంతాన్ని దున్ని, నీటిని ఇంకింపచేశాడు. దానవుని మరణంతో జనవాసం ఏర్పడింది. ఈవిధముగా కాశ్మీర్‌ భూభాగము అవతరించినట్లు పురాణగాథ. పురాణేతిహాసాల్లో కాశ్మీర్‌ ప్రశస్తి ఉంది. హిందు రాజులనేకమంది కాశ్మీర్‌ భూప్రాంతమును పరిపాలించారు. 3వ శతాబ్దంలో అశోకుని సామ్రాజ్యంలో ఒక భూభాగము ఉండేది. అక్బరు మహాచక్రవర్తి కాశ్మీర్‌ భూభాగాన్ని జయించి మొగలు సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. ఆఫ్గనిస్తాన్‌ రాజు అహమ్మద్‌షా అబ్దాలి దండయాత్ర చేసి రాజ్యపాలనకు వచ్చాడు. 1819 సంవత్సరములో పంజాబు మహారాజు రాజారంజిత్‌సింగ్‌ ఆధిపత్యంలోనికి వచ్చింది. రంజిత్‌సింగ్‌ మరణం తరువాత సిక్కులతో యుద్ధంచేసి బ్రిటీష్‌వారు వశపరచుకొన్నారు. కాశ్మీర్‌ భూభాగము కొరకు పాకిస్తాన్‌ సైన్యము భారత సైనికులతో యుద్ధంచేసి, కొంత భూభాగమును వారి ఆధిపత్యంలోనికి తెచ్చుకొన్నారు. ఇప్పటికి సరిహద్దు సమస్య ఇరుదేశాలకు వుంది కాశ్మీర్‌ రాజ్యపాలన చేసిన మహమ్మదీయులు నిరంకుశులై మత చాంధసత్వంతో హిందూ దేవాలయమును నేలమట్టము చేశారు. సికిందర్‌ (1389-1413) పానలో హిందూ దేవాలయములను కూలగొట్టడం ప్రభుత్వ నిత్యకృత్యాలలో ఒకటైంది. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వ విభాగం ఒకటి ఏర్పరచినారు. పరాస్పోర్‌, అవంతిపూర్‌, తాపార్‌ తదితర ప్రాంతాలలోని ప్రసిద్ధ దేవాలయములను కూల్చినట్లుగా పర్షియన్‌ చారిత్రక పత్రాల్లో స్పష్టంగా పేర్కొనబడింది. ఇస్లాంను స్వీకరించని హిందువులపై జిజియా పన్ను వేశాడు. ఇస్లాం మతం పుచ్చుకోని కాశ్మీర్‌ బ్రాహ్మణుల మెడలోని యజ్ఞోపవీతాన్ని సికిందర్‌ బలవంతముగా త్రెంచి, వాటిని తూకం వేస్తే అవి ఏడు మణుగులు బరువు తూగాయంట! అలీషా పాలనలో (1413) కాశ్మీర్‌లో మిగిలిన పండిత కుటుంబాలు కేవలం పదకొండు మాత్రమే. 1489లో ఫతేషా 24 వేలమంది కాశ్మీర్‌ హిందువుల మెడమీద కత్తిపెట్టి ఇస్లాంలోనికి బలవంతముగా మార్పించారు. తాను కూల్చిన కాళికాలయంలోనికి ప్రవేశించిన నేరానికి, కాశ్మీర్‌ పండితులందరికి ముక్కు, చెవులు కోసేయమని ఆజ్ఞ జారీచేశాడు. మొగలాయి షాదుషాల ఏలుబడిలో మతసహనం పాటించగా కొంత ప్రశాంతత ఏర్పడినది. తిరిగి ఔరంగజేబు కాలములో దేశవ్యాప్తముగా దేవాలయములను కూల్చివేయడానికి సంకల్పము చేశారు. ఇస్లాం మతచాంధసులు కాశ్మీర్‌లో అనేక హిందూ దేవాలయములను నేలమట్టం చేశారు. నేలమట్టమైన ఆలయాలలో శ్రీ సరస్వతీ ఆలయం కూడా ఉండవచ్చును. నేడు కాశ్మీర్‌ శోధిస్తే ఎక్కడా శ్రీ సరస్వతీ పీఠం కనిపించుటలేదు. శ్రీనగర్‌నందలి శ్రీ శంకరాచార్యుల పర్వతము మీద శ్రీ సరస్వతీ ఆలయం ఉండేది అని పరిశోధకులు భావించుచున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో పద్దెనిమిదవదిగా పరిగణించబడుతోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో చివరిది. సతీదేవి కుడి చెంపభాగం కాశ్మీర్‌ ప్రాంతములో పడినట్లుగా పురాణాలు చాటుతున్నాయి. సరస్వతీపీఠం అనుపేరుతో ఎక్కడా దర్శించలేక పోవుచున్నాము. కాశ్మీర్‌ ప్రాంతములో అనేక శక్తిపీఠాలు కలవు. వాటిని ప్రతివారు సరస్వతీపీఠంగా చాటుతారు. వీటిలో ముఖ్యమైన స్థానం శారికాదేవి మందిరము. ఇది హరిపర్వతంపై వుంది. అమ్మ అద్భుతమైన మౌనశిల రూపములో దర్శనమిస్తుంది. ఇదే సరస్వతి పీఠంగా స్థానికులు కొలుస్తారు. మహాయోగులు, మహాత్ములు, పుణ్యపురుషులు హరిపర్వతం చేరి, అమ్మ సన్నిధిలో మౌనవ్రతం పాటించి, సిద్ధులు పొందుచున్నారు. ప్రతి శనివారం అద్భుత మౌనశిల నుంచి మౌనచక్రం బయటకు వచ్చి, సిద్ధులకు దర్శనమిస్తుంది. ఇది సృష్టిలో అద్భుతమైన చర్యగా భావించవచ్చును. మరో విషయము మౌనశిలలో ఒక మూలన గల గుంటలో నీరు ఉద్భవించుతుంది. దాని నుంచి ఎంతనీరు మనము తీసుకుంటే, అంత నీరు మళ్ళీ ఉద్భవించ గలదు. భక్తులు ఈ నీరును పవిత్రమైన గంగా జలంగా భావించి సేవించుతారు. యాత్రికులు మౌనంగా, దీక్షగా అమ్మను ప్రార్ధన చేస్తే వారి కోరికలు తప్పక తీరగలవు అని గట్టి నమ్మకం. ఆషాడమాసంలోని శుక్లనవమితో కూడిన శనివారం నాటి మౌనచక్రం యొక్క దర్శనం చాలా పుణ్యదాయకం. భక్తుల కోరికలు తీర్చగల మహిమతో నిండి ఉంటుంది. శ్రీనగర్‌ జనరల్‌ బస్‌స్టాండుకు ఈశాన్యంగా హరి పర్వత్‌ పోర్టు ఉంది. బస్‌స్టాండ్‌కు సుమారు 10 కి.మీ. దూరంలో గల హరిపర్వతం (హరిపర్బత్‌ కోట) చేరుటకు బస్‌ సర్వీసులున్నాయి. కొండ క్రింద నుంచి మెట్లు మార్గం. సర్వేజనా సుఖినోభవంతు

Featured

రాపూరు మండల సమితి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల, కూరగాయలు, పండ్లు పంపిణీ

రాపూరు, మే 14, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా లాక్ డౌన్ సందర్భంగా రాపూరు మండలం సేవాసమితి ఆధ్వర్యంలో గత 45 రోజులుగా సుమారు 400 నుండి 1000 మంది నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగింది. అందులో భాగంగా కుసుమహర యువ భక్త బృందం వారి సహకారం తో 45 రోజు (గురువారం ) 150 మంది పేద ప్రజలకు 15 రోజులకు సరిపడ 18 రకాల నిత్యావసర సరుకులు ,కూరగాయలు , పండ్లను, పంచడం జరిగింది. ఈ సందర్భంగా రాపూరు మండల సేవా సమీతి సబ్యులు మాదామల పిచ్చి రెడ్డి గారు కుసమహర యువ భక్త బృందాo వారికి ప్రత్యేక కృజ్ఞతభినందనలు తెలిపారు ఈ కారిక్రమం లో రాపూరు మండల సేవ సమితి సభ్యులు మదమాల పిచ్చిరెడ్డి, దామిశెట్టి సురేష్ (గోల్డ్) కొత్త హజరత్తయ్య, కంభాల వెంకటరత్నం, సయ్యద్ జలీల్ అహ్మద్ పిట్టబోయిన.వెంకటసుబ్బయ్య , పాలవల్లి హరినాధ్, దందోలు తిలక్ రెడ్డి,శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి,కేతా అమర్ నాద్ధ్ రెడ్డి, బులాగాకుల మునీంద్రా రెడ్డి,బులాగాకుల మనోహర్ రెడ్డి,దామిశెట్టి సురేష్ (మినుములు),ఏటూరి మురళీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Featured

రాపూరు మండల ప్రజలకు అండగా నిలుస్తున్న బండి వేణుగోపాల్ రెడ్డి

రాపూరు, మే 14, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : ఎంత సంపాదించామన్నది కాదు ఆ సంపాదించినదానిలో రాపూరు మండల ప్రజలకు ఎంతో కొంత సమయం చేయడమే తనకెంతో సంతృప్తినిస్తుందని రాపూరు మాజీ ఎంపీపీ, మండల వైకాపా కన్వీనర్ బండి క్రిష్ణా రెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు.కరోనా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి మండల ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి రాపూరు మండలంలోని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదన్న ఉదేశ్యంతో మండలంలో పలు సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పేదలకు అండగా నిలుస్తూ వస్తున్నారు.ఇప్పటికే లాక్ డౌన్ విధించినప్పటి నుంచి మండలంలోని ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకుల, కూరగాయలు, గుడ్లు పంపిణీ చేస్తూ తన ఉదరతను చాటుకుంటునారు,అలాగే ఆకలితో అలాంటిస్తున్న వారిని గుర్తించి వారికి భోజనానికి అయ్యే ఖర్చు భరిస్తూ వారికి ఆకలి తిరుస్తున్నారు.ఇందులో భాగంగా గురువారం ఐదోవ రోజు మండలంలోని సిద్దవరం పంచాయతీలో 675 కుటుంబాలకు 8100 గుడ్లు పంపిణీ చేశారు.గత ఐదు రోజులు నుంచి మండలంలో అలుపెరుగ కుండా ఉద్యమంలా ఇంటింటికి గుడ్లు పంపిణీ చేస్తున్న బండి వేణుగోపాల్ రెడ్డి పై మండల ప్రజలు అభినందల వర్షం కురిపిస్తున్నారు.ఈ సందర్భంగా బండి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాపూరు మండల ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడు ముందుటానన్ని తెలిపారు.లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి సహకారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిద్దవరం మాజీ సర్పంచి కయ్యురు మురళి మోహన్ రెడ్డి,బండి వెంకటరెడ్డి,రామ్మోహన్ రెడ్డి,యూటీఎఫ్ నాయకులు పింగాణీ హరిప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Featured

*FLASH: నెల్లూరు జిల్లాలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు*

పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ ✍️ జిల్లాలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 126 కేసులు నమోదవ్వగా..ఆ సంఖ్య 140కి చేరింది. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తుల ద్వారా వారి కుంటుంబ సభ్యులకు,ఇతర వ్యక్తులకు వైరస్ ప్రబలుతోంది.జిల్లాలో ఇప్పటివరకు కరోనాతో ముగ్గురు మృతి చెందారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..లాక్ డౌన్ కు సహకరీంచాలని అధికారులు కోరుతున్నారు.

Featured

మనుబోలు టీడీపీ ఆధ్వర్యంలో 38 వరోజు కొనసాగుతున్న ఆహారం పంపిణీ

మనుబోలు 14-05-2020( పున్నమి ప్రతినిధి కె. వెంకటే ష్) లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు కుసేవచేస్తున్న పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు వైద్యులు మరియు బిక్షగాళ్లు వాహనదారులకు వలస కార్మికులు కు మనుబోలు టీడీపీఆద్వర్యంలో 38వరోజు టమోటా అన్నము400మందికి పంపినిచేసినారు.ముఖ్యంగా వలసకార్మికులు ఆహారం దొరకక రోడ్డు వెంట నడుచుకుంటూ వెల్లడం చాలా బాధాకరం అని తెలిపారు. వీరిపట్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆదుకోవాలని కొరినారు. ఈకార్యక్రమములో మనుబోలు టీడీపీనాయకులు పచ్చిపాల రామిరెడ్డి, కలికి రమేష్ రెడ్డి,చేరెడ్డి పద్మనాభిరెడ్డి, శివుడు రాజగౌడ్, చల్లగిరిప్రసాద్ ,సాని వెంకట రమణయ్య, రమణారెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured పిల్లలకు

?? భారతీయ సంసృతి ??

పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి కేకులు కట్ చేయడం, దీపాలు ఆర్పడం వంటి పద్దతులు మన సంప్రదాయంలో లేదు. దీపాలు ఆర్పడం అశుభం, అందులోనూ అది పుట్టినరోజున చేయడం ఎంతవరకు మంచిదో చెప్పండి .పార్టీ కి స్నేహితులు పిలిస్తే వెళ్ళకుండా ఉండలేము, వెళ్ళాక మన సనాతన ధర్మానికి విరుద్ధంగా జరిగే తంతు చూసి మనసు కష్టపెట్టుకోకుండా ఉండలేము. పాశ్చాత్య సంస్కారం ఎంత త్వరగా మన యువతను చెడగొడుతోందో తెలుస్తోంది. వెలిగే దీపం ఆర్పడం అశుభం. ఏ శాస్త్రాలలోనూ దీపాన్ని ఆర్పమని చెప్పలేదు. అగ్ని పావనుడు, ఆయనపై ఎంగిలి పడితే అది తీరని అపకారమవుతుంది. పుట్టినరోజు దీపాలు వెలిగించే పండుగ కావాలి గాని, దీపాలు ఆర్పి అశుభం కార్యక్రమంగా చేయకూడదు. ఇక కేకు అంటార, అంగడిలో కొని తెస్తారు, అందులో కోడి గుడ్డు కలుపుతారు. తినేవారి సంగతి సరె, గుడ్డు తినని వారు ఈ పని చేసి తప్పు చేస్తున్నారు. ఇక ఎంగిలి తినడం మంచిది కాదు.ఇటీవల కాలంలో కేకులు కట్ చేయడం వివాహ వేడుకలలో ఫాషన్ అయింది. ఇది పద్దతి కాదు. మన శాస్త్రం ప్రకారం పుట్టినరోజు వేడుకలలో ఏమి చేయాలో చూద్దాం ప్రతి జన్మ నక్షత్రమందో, పుట్టిన రోజు తిధి నందో అపమృత్యు పరిహారం కోసం ఆయుష్యు సూక్తంతో హోమం చేయాలి.ఈ హోమం ఆ వ్యక్తి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. వ్యాధులు రాకుండా పరిహారాన్ని ఇస్తుంది. ఇంద్ర, రుద్రాది దేవతలకు చేసే ప్రార్ధనలు వారికి సకల క్షేమాలనిస్తాయి. వేదవేత్తుల ఆశీస్సులు వారిని కాపాడుతాయిఆరోజు చేసే దానాలు వారికి పుణ్యాన్ని ఇవ్వడం కాకుండా మనకన్నా తక్కువస్థితిలో ఉన్న వారికి సహాయం చేశామన్న తృప్తిని కలిగిస్తాయి. లలితా, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలిఅంతేకాకుండా, గ్రహచారాదుల వలన అపమృత్యు దోష ప్రాప్తమైనప్పుడు, మృత్యుంజయహోమం మంచిదికేవలం అనుకరణ చేసి అదే గొప్ప అనుకునే భ్రమ నుండి బయటపడాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి? మన ఆచారాల ప్రస్తావన వచ్చినప్పుడు “ఇందులో అర్ధం ఎమిటి “అని పెద్ద మేధావుల వలె ప్రశ్నించే మనం ..ఈ అనుకరణ వ్యవహారాలను ప్రశ్నిస్తున్నామా??ఎవరి ఆచారం వారికి గొప్ప. మన ధర్మాలు మనకు గొప్ప కావాలి, అంతేగాని కించపరచకూడదు. పసితనంలో సంవత్సరం పూర్తి అయ్యేవరకు ప్రతినెలా “జన్మ తిధి” రోజు జన్మదినోత్సవం చేయాలి. తరువాతి ప్రతిఏడు జన్మతిధినాడు జన్మదినం చేయాలి. కొందరు జన్మ నక్షత్రం ప్రకారం కూడ జరుపుకుంటారు. అదీ మంచిదే. ఆ రోజు కులదేవతలను స్మరించాలి. తదుపరి గణపతి, సూర్యుని, మార్కండేయుని, వ్యాసుని, పరశురాముని, అశ్వత్ధాముని, హనుమంతుని, విభీషణుని, షష్టీదేవిని తలచి నమస్కరించాలి పుట్టినరోజు కేశఖండనం, గోళ్ళు తీయడం, కలహం, మాసభోజనం, ప్రయాణం, హింస విడిచిపెట్టాలి. చిన్నవారందరు పెద్దవారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొందాలి. వయసైన వారు పనికిరాని వారని భావింపక వారి ఆశేస్సులే మనకు శ్రీరామ రక్ష అని భావచడానికే ఈ కార్యక్రమం ఏర్పడింది. మహాభారతం లో అంతటి శ్రీకృష్ణుడే తానే కొందరికి నమస్కరిస్తానన్నాడు. వారు..“నిత్యాన్నదాత, నిత్యాగ్నిహోత్రి, ప్రతిమాసం ఉపవాసం చేసేవారు, పతివ్రత, వేదాంతవేత్త, సహస్ర చందన దర్శనం చేసినవారు – ఈ ఆరుగురు నాకు వందనీయులు” అని శ్రీకృష్ణుని మాట. ఎస్.కార్తీక్ రెడ్డి – రాపూరు

Featured

స్నేహహస్తం హస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో లో 43 వ రోజు అన్నదానం

రాపూరు, మే 13, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : స్నేహహస్తం హస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా సందర్భంగా జరుగుతున్న 43 వ అన్నదానానికి రాపూరు లక్ష్మీపురం వాస్తవ్యులు మోడిబోయిన సోమశేఖర్, జ్యోత్స్న దంపతులు వారి కుమార్తె మోడిబోయిన శ్రీనేహ జన్మదినం సందర్భమున 500 మంది పేద గిరిజనులకు అన్నదానం కి విరాళం స్నేహ హస్తం ఫౌండేషన్ వారికి ఇవ్వడం జరిగింది వారి సహాయ సహకారాలతో పేద గిరిజనులకు అన్నదానం చేయడం జరిగిందివారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తలియజేస్తు ఈ అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నన్ని రోజులు జరపమని మా వెన్నంటి ఉంటూ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న శ్రీ బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.