Friday, 6 March 2026

Blog

Featured

స్నేహ హస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో లో 47 వ రోజు అన్నదానం

రాపూరు, మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : స్నేహహస్తం హస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా సందర్భంగా జరుగుతున్న 47 వ అన్నదానానికి Sd.ఆసిఫ్, జిల్లా వోక్ఫ్ బోర్డు డైరెక్టర్ (వైయస్ అర్ సిపి) నాయకులు 500 మంది పేద గిరిజనులకు అన్నదానం కి విరాళం స్నేహ హస్తం ఫౌండేషన్ వారికి ఇవ్వడం జరిగింది వారి సహాయ సహకారాలతో పేద గిరిజనులకు అన్నదానం చేయడం జరిగింది. Sd.ఆసిఫ్ గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తు ఈ అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నన్ని రోజులు జరపమని మా వెన్నంటి ఉంటూ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న శ్రీ బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Featured

రాపూరు మండలాన్ని అభివృద్ధి చేయడమే నాధేయం

రాపూరు, మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలంలోని ప్రజలు ఎవరూ అధైర్యపడకండి..నేనున్నా అంటూ భరోసా కల్పిస్తూ నిత్యం ప్రజా సేవకుడిగా ఏమి ఆశించకుండా తన తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం మండల ప్రజల బాగోగులు చూసుకునే మనసున్న మా రాజు రాపూరు మాజీ ఎంపీపీ మండల వైకాపా కన్వీనర్ దివంగత మహానేత బండి క్రిష్ణారెడ్డిగారి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ ప్రజల హృదయాల్లో స్థానాన్ని పొందుతున్నారు.కరోనా లాక్ డౌన్ లో మండలంలోని 25 వేల కుటుంబాలకు కూరగాయలు, పండ్లు,గుడ్లు పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన ఆయన ఆదివారం రాపూరు మండలంలోని నాగావారిపల్లి గ్రామంలోని ప్రజలు మంచినీటిి కోసం ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి తన సొంత నిధులు 4 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్ కు పెంచలకోన దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ బొడ్డు కృష్ణరెడ్డితో కలిసి భూమిపూజ కార్యక్రమం చేశారు.దీన్ని 30 రోజుల్లో పూర్తి చేసి నాగావారిపల్లి ప్రజలకు శుద్ధిజలం అందిస్తామన్నారు.అలాగే మండలంలోని అకిలి వలసలో ప్రయాణికుల కోసం బండి వేణుగోపాల్ రెడ్డి సొంత నిధులు 2 లక్షల రూపాయలతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించనున్న ప్రయాణికులు సముదాయాన్నికి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిఈఈ కంబాల రవీంద్ర బాబుతో కలిసి భూమిపూజ చేశారు.త్వరలో వీటి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామన్నారు.నా మండల ప్రజల శ్రేయస్సు కోసం ఎప్పుడు ఏమి కావాలన్న చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.మండలంలో పార్టీలకు అతీతంగా సేవ చేస్తున్నామని,ఎవరికి ఏ ఆపదవచ్చినా నన్ను సంప్రదిస్తే నా చేతనైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు నెల్లూరు మధుసూదన రెడ్డి,కసుమూరు రామసుబ్బారెడ్డి, బండి శ్రీనివాసులు రెడ్డి,లక్కకుల శ్రీరాములు, యూటీఎఫ్ నాయకులు పింగాణీ హరిప్రసాద్ రెడ్డి,రాపూరు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Featured చిత్తూరు

పిడుగుపాటుకు రైతు మృతి…

రాపూరు, మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం మహాదేవమంగళం గ్రామానికి చెందిన రామిరెడ్డి కుమారుడు కే వెంకటేశ్వర రెడ్డి (60) ఆదివారం సాయంత్రం పడిన అకాల వర్షం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న తన చెఱకు గానుగ షెడ్డు వద్ద ఉన్న కొబ్బరి చెట్టు మీద పిడుగు పడి పూర్తిగా కాలిపోయి ప్రక్కనే వున్న కే. వెంకటేశ్వర రెడ్డి అనే రైతు అక్కడికక్కడే మృతి* చెందాడు.ఇతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.విషయం తెలుసుకున్న రెవెన్యూ మరియు పోలీసు అధికారులు దుర్ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Featured

*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వలసకూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి*

  దూర ప్రాంతాలకు జిల్లా మీదుగా సైకిల్ మీద అలాగే కాలినడకన వెళుతున్న  వలసకూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి శిబిరాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. తదనంతరం రిజిస్ట్రార్ గారు వలస  కూలీలలకు పండ్లు , మజ్జిగ, బిస్కట్ మరియు చల్లని నీళ్ల బాటిల్స్ ను పంపిణి చేశారు. రిజిస్ట్రార్ డా. విజయ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారి ఆదేశానుసారంగా మరియు జిల్లా అధికారుల అనుమతితో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ శిబిరం ద్వారా కోవిద్ -19 వ్యాధి వలన సంభవించిన విపత్కర పరిస్థితులలో  లక్షల మంది వలస కూలీలు  వందలు వేల కిలోమీటర్ల దూరం  లో వున్నా ఒడిస్సా , కలకత్తా  రాష్ట్రాలకు  వెళుతున్న వలస కూలీలకు విశ్వవిద్యాలయము తరపున కొంత చేయూత నివ్వటానికి ముందుకు వండని అన్నారు. వలస కూలీల కోసం  ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న కార్యక్రమాలకు, తమంతు సాయంగా ఉడతా భక్తి తో తాము చేస్తున్నామన్నారు. ఈ శిభిరం ఏర్పాటు చేయటానికి నిరంతరం శ్రమిస్తున్న హెల్ప్ ది నీడి  టీం ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యమంలో  కొప్పవరపు హరినాథ్ గారు సురేష్ హెరర్స్ యాజమాన్యం,  NSS  సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, డా, మధుమతి, డా చెంచు రెడ్డి, పీఆర్వో డా కోట మణికంఠ , హెల్ప్ ది నిడి టీం సభ్యులు పార్ధసారధి, రాజేష్, అఖిల్ , చైతన్య , జూనియర్ అఖిల్ మరియు డ్రైవర్ సాగర్ పాల్గొన్నారు.

Featured

*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వలసకూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి*

దూర ప్రాంతాలకు జిల్లా మీదుగా సైకిల్ మీద అలాగే కాలినడకన వెళుతున్న  వలసకూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి శిబిరాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. తదనంతరం రిజిస్ట్రార్ గారు వలస  కూలీలలకు పండ్లు , మజ్జిగ, బిస్కట్ మరియు చల్లని నీళ్ల బాటిల్స్ ను పంపిణి చేశారు. రిజిస్ట్రార్ డా. విజయ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారి ఆదేశానుసారంగా మరియు జిల్లా అధికారుల అనుమతితో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ శిబిరం ద్వారా కోవిద్ -19 వ్యాధి వలన సంభవించిన విపత్కర పరిస్థితులలో  లక్షల మంది వలస కూలీలు  వందలు వేల కిలోమీటర్ల దూరం  లో వున్నా ఒడిస్సా , కలకత్తా  రాష్ట్రాలకు  వెళుతున్న వలస కూలీలకు విశ్వవిద్యాలయము తరపున కొంత చేయూత నివ్వటానికి ముందుకు వండని అన్నారు. వలస కూలీల కోసం  ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న కార్యక్రమాలకు, తమంతు సాయంగా ఉడతా భక్తి తో తాము చేస్తున్నామన్నారు. ఈ శిభిరం ఏర్పాటు చేయటానికి నిరంతరం శ్రమిస్తున్న హెల్ప్ ది నీడి  టీం ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యమంలో  కొప్పవరపు హరినాథ్ గారు సురేష్ హెరర్స్ యాజమాన్యం,  NSS  సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, డా, మధుమతి, డా చెంచు రెడ్డి, పీఆర్వో డా కోట మణికంఠ , హెల్ప్ ది నిడి టీం సభ్యులు పార్ధసారధి, రాజేష్, అఖిల్ , చైతన్య , జూనియర్ అఖిల్ మరియు డ్రైవర్ సాగర్ పాల్గొన్నారు.

Featured

మనుబోలు జాతీయ రహదారి వెంబడి పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో విజిటబుల్ బిరియాని పంపిణీ

మనుబోలు 17-05-2020(పున్నమి ప్రతినిధి కె- వెంకటేష్) కరోనా లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితులలో బిచ్చగాళ్లు ,లారీ డ్రైవర్లు,వలస కార్మికులు పస్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో మనుబోలు జడ్.పి.హెచ్.ఎస్ పదవ తరగతి పూర్వపు విద్యార్థులు (1998-1999 )అందరూ కలిసి దాదాపు 400 మందికి వెజిటబుల్ బిర్యాని ,గుడ్డు, బిస్కెట్ ప్యాకెట్ ,అరటిపండు మనుబోలు జాతీయ రహదారి వెంబడిమరియు కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు మరియు వెంకటాచలం టోల్ ప్లాజా వరకూ ఆటోలో తిరుగుతూ రోడ్డు వెంబడి అందజేసినారు. పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ తమ వంతు సాయంగా అందజేయడం సంతృప్తినిచ్చింది అని తెలియజేసినారు భవిష్యత్తులో అందరం కలిసి మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయం అందజేసిన ప్రతి ఒక్క పూర్వపు విద్యార్థులకుఅభినందనలు తెలియజేశారు .

Featured ఆంధ్రప్రదేశ్

దివ్యంగులను ఆదుకోవాలి

ఈ రోజు జలవనరులశాఖ మాత్యులు గౌ DR .P . అనిల్ కుమార్ యాదవ్ గారిని అయన క్యాంపు కార్యాలయంలో కలిసి “కోవిద్-19 “లాక్ డౌన్ కష్టకాల సమయంలో ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యంగుల కుటుంబాలను ఆదుకోవాలని వివరించారు.

Featured

మనుబోలు తెలుగుదేశంపార్టీ అద్వర్యంలో40 వ రోజు విజిటబుల్ బిర్యానీ పంపిణీ

మనుబోలు 16-05-2020( పున్నమి ప్రతినిధి కె. వెంకటేష్) లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న బిక్షగాళ్లు వాహనదారులకు వలస కార్మికులు కు మనుబోలు టీడీపీఆద్వర్యంలో 40వరోజ విజిటబుల్ బిరియాని400మందికి పంపినిచేసినారు.ముఖ్యంగా వలసకార్మికులు ఆహారం లేక రోడ్డు వెంట నడుచుకుంటూ వెల్లడం చాలా బాధాకరం అని తెలిపారు. వీరిపట్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆదుకోవాలని కొరినారు. ఈకార్యక్రమములో మనుబోలు టీడీపీనాయకులు పచ్చిపాల రామిరెడ్డి, కలికి రమేష్ రెడ్డి,చేరెడ్డి పద్మనాభిరెడ్డి, శివుడు రాజగౌడ్, చల్లగిరిప్రసాద్ ,సాని వెంకట రమణయ్య, రమణారెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్ మరో కీలక ప్రకటన.. ఇక ప్రతీ గ్రామంలో జనతా బజార్..

  నెల్లూరు ,15.05.2020 పున్నమి✍ ప్రతి గ్రామ లో వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేస్తాం: సీఎం జగన్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రైతులు ప్రతిపంటను జనతా బజార్ల ద్వారా అమ్ముకోవచ్చని వెల్లడి జనతా బజార్లు రైతులకు ఉపయుక్తంగా ఉంటాయని వివరణ ఏపీ సీఎం జగన్ రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, 2021 చివరికల్లా ప్రతి గ్రామ సచివాలయం పక్కన వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.రైతులు పండించే ప్రతి పంటను అమ్ముకునేందుకు వైఎస్సార్ జనతా బజార్లు ఉపయుక్తంగా ఉంటాయని వివరించారు.వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు రైతులు కష్టపడకుండా వైఎస్సార్ జనతా బజార్లు సరైన వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. అంతేకాకుండా, గ్రామ స్థాయిలోనే కోల్డ్ స్టోరేజి సదుపాయం కల్పించే స్థాయికి అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మున్ముందు రాష్ట్ర, జిల్లా స్థాయిలో వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేయనున్నామని, ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

Featured

వాట్ ఎన్ ఐడియా సర్ జీ..!!

నెల్లూరు ,15.05.2020 పున్నమి ✍ పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త సాంప్రదాయాలను పుట్టించాలంటే మన తెలుగు వారి తర్వాతే ఎవరైనా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో “పెళ్లి” శుభ లేఖ ను ఇలా అందరికీ ఉపయోగ పడేలా మాస్కులపై ముద్రించడం అంటే ఎంత గొప్ప ఆలోచనో కదా..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.