Friday, 6 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఆ ఘటన నా హృదయాన్ని కలచివేసింది: డీజీపి

పున్నమి తెలుగు దిన పత్రిక ✍ జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓ చిన్నారితో స్పాట్‌ వాల్యుయేషన్‌ గదిని శుభ్రం చేయించిన ఘటనపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఘాటుగా స్పందించారు. గది శుభ్రం చేసే సమయంలో పోలీసు హెడ్‌ కానిస్టేబుళ్లు ప్రేక్షక పాత్ర పోషించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నెల్లూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు. గదిని శుభ్రం చేయాల్సిన తండ్రి తన ఆరేళ్ల కుమార్తెతో ఆ పని చేయించడం బాధాకరమని డీజీపీ అన్నారు. తండ్రి అయినప్పటికీ చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు. చట్టం ప్రకారం 14 సంవత్సరాలు నిండని పిల్లల చేత ఇలాంటి పనులు చేయించడం నిషేధమన్నారు. ఈ ఘటన తన హృదయాన్ని కలచి వేసిందని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు.

Featured

మనుబోలు ను తాకిన కరోనా

మనుబోలు 18-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్ )మనుబోలు మండలం మనుబోలుగ్రామం లోని బీసీ కాలనీ మరియు గమళ్లపాలెం ను నెల్లూరు డివిజన్ ఆర్డీవో హుస్సేన్ బాషా గారు పర్యటించారు గత రెండునెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరి తాజా గా మనుబోలును తాకింది. దీంతో గ్రామంలో ఆర్డీవో హుస్సేన్ బాష పర్యటించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మనుబోలు బిసికాలనిలో వ్యక్తి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో ఇంటిపరిసరాలను కంటైన్మేంట్ జోన్ గా పరిగణించి గ్రామాన్ని రెడ్జోన్ గా ప్రకటించి పోలీసు లకు ఆదేశాలు జారీచేశామన్నా రు. అదేవిధంగా నలుగురు కుటుంబ సభ్యులు ను నెల్లూరు క్వారెంటైన్ కు తరలించామన్నారు .కారోన పాజిటివ్ వచ్చిన రాపూరు చిన్న రాగయ్య నివాసం ఉంటున్న రెండు ప్రాంతాలను కంటైన్మెంట్ కోర్ జోన్ లోకి తీసుకోవడం జరిగిందని అతను నివాసం ఉన్న ప్రాంతం లోని ప్రతి ఒక్కరికి కరోన పరీక్షలు చేయడం జరుగుతోందని ముఖ్యంగా అరవై సంవత్సరాల పైబడిన వాళ్లకు పది సంవత్సరాలు లోపు పిల్లలకు ప్రత్యేకముగా పరీక్షలు నిర్వహించి వైద్య సహాయం అందించడం జరుగుతుందని తెలిపినారు.సిఐ రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ కోయంబేడు కలకలంలో అనుమానితుడు రాపూరు చిన్న రాగయ్య ను ఐదురోజుల క్రితం అదుపులో తీసుకుని క్వారంటైన్ తరిలించామని ఆదివారం పరీక్ష లో అతనికి పాజిటివ్ అనితేలడంతో గ్రామం రెడ్జోన్ లో 28రోజులుంటుందని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో వెంకటేశ్వర్లు,తహశీల్దార్ ఆనందరావు,వైద్య ధికారిణి శ్వేత ఎస్ఐ సూర్య ప్రకాష్ రెడ్డి ,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Featured

నెల్లూరు నారాయణలో మరో 9 మంది కరోనా బాధితుల డిశ్చార్జి

పున్నమి తెలుగు దినపత్రిక ✍️ నారాయణ హోస్పెటల్ కరోనా వైరస్ పూర్తిగా నయమై రెండుసార్లు నెగటివ్ రావడంతో సోమవారం తొమ్మిది మందిని డిశ్చార్జి చేశారు. వాకాడుకు చెందిన ఇద్దరు,స్టోన్ హౌస్ పేటకు చెందిన ఇద్దరు కోట మిట్టకు చెందిన నలుగురు,జెండా వీధికి చెందిన ఒకరు వీరిలో ఉన్నారు.వీరిలో నెల్లూరు కోటమిట్టకు చెందిన తొమ్మిది నెలల బిడ్డ కూడా వీరిలో ఉండటం గమనార్హం.నారాయణ ఏజీఎం భాస్కర్ రెడ్డి,సీఈఓ డాక్టర్ మహేష్ పాల్గొన్నారు.

Featured

నెల్లూరులో వలస కూలీలకు చేయూత

పున్నమి తెలుగు దినపత్రిక ✍️  నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వలస కూలీలకు పోలీసులు అల్పాహారంతో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. జాతీయ రహదారి వెంబడి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తున్న వలస కూలీలకు జిల్లాలోని చెక్ పోస్ట్ లవద్ద అల్పాహారం, భోజనం, నీరు,మజ్జిగ అందించారు.వారికి రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్

ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త

పున్నమి తెలుగు దినపత్రిక ✍️ ఏపీలో ఆటో,మ్యాక్సీ క్యాబ్,టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాహన మిత్ర పథకం కింద డ్రైవర్లకు రెండో విడత ఆర్ధిక సాయం అందజేయనుంది. జూన్ 4న ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఓనర్ కమ్ ఆటో, మ్యాక్సీ క్యాబ్,ట్యాక్సీ వాహనాలు సొంతంగా కొనుక్కొని నడుపుకుంటూ,వృత్తిగా జీవిస్తున్నవారికి పథకం వర్తిస్తుంది. దరఖాస్తులకు మే 26 చివరి తేదీ కాగా,ఆన్ లైన్ లోనూ దరఖాస్తులు చేసుకోవచ్చు.

Featured

కరోనాతో చితికిపోయిన కార్మికుల బతుకులు::::: ఫయాజ్, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్

కరోనాతో చితికిపోయిన కార్మికుల బతుకులు ఫయాజ్, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్దాదాపు రెండు నెలలుగా విధించిన లాక్ టౌన్ తో ఉదయగిరి ప్రాంతంలోని కార్మికులు పూర్తిగా చితికిపోయారు నిండా అప్పుల్లో మునిగిపోయారు చేయడానికి పని లేక, చేసే వీలు లేక కుమిలిపోయారు ఇప్పటికే మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది మళ్లీ నాలుగోసారి కూడా రెండు వారాల పాటు పొడిగించింది ఈ పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు ఇతర పనులు చేసుకునే కార్మికులు రెండు నెలలుగా పనులు లేక అల్లాడిపోయారు రాష్ట్ర ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా అందించిన బియ్యం చాలా వరకు ఆదుకుంది. ఇచ్చిన వెయ్యి రూపాయలు ఏ మూలకు సరిపోలేదు పెద్ద కుటుంబాల వారికి ఆ బియ్యం కూడా సరిపోలేదు ఈ పరిస్థితుల్లో అప్పులు చేసే పరిస్థితి ఏర్పడింది ఎక్కడ చూసినా పేద కుటుంబాల వారు నిండా అప్పుల్లో మునిగిపోయారు అసలే కరువు ప్రాంతమైన ఉదయగిరిలో కరోనా పుణ్యమని మరింత కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి కొంతమంది భవన నిర్మాణాలు రెండు వారాలు గా పనులు చేయాలని తలచినా, సిమెంటు అందుబాటులోకి రాలేదు అరకొరగా వచ్చినా ధరల పెంపుతో నిర్మాణదారులు వెనుకంజ వేశారు దీంతో పని దొరక్క బేల్దారి మేస్త్రి లు కార్మికులు కటకట లాడిపోతున్నారు ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని వేయి కళ్ళతో నిరీక్షిస్తున్నారు పని ఉందంటే చాలు ఉదయాన్నే అక్కడికి చేరుతున్నారు తీవ్ర అక్కడ ఒకరిద్దరికే పని ఉందని తెలిసి నిరాశతో వేను తిరుగుతున్నారు ఇప్పటికీ చాలా హార్డ్ వేర్ షాపులు మూసి ఉండడంతో అవసరమైన సామాగ్రి లభించడం లేదు షాపులు తెరిచేందుకు అభ్యంతరం లేదని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మరో పక్క కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్న వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. షాపులు తీసేందుకు స్థానిక అధికారులు అంగీకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం వచ్చినా దానికి తగ్గ ఆనందోత్సాహాలు లేవు. కారణం ప్రతి వారి చేతుల్లో డబ్బులు లేక పోవడమే. ఈ మాసంలో విస్తృతంగా దానధర్మాలు, ఉపవాస దీక్ష ఆచరించిన వారికి విందువినోదాలు ఇచ్చే ఆనవాయితీ ఉంది. అయితే ఈసారి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది పనులు లేక ఎవరి చేతుల్లోనూ డబ్బులు లేవు వ్యాపారుల పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు వ్యాపారాలు పూర్తిస్థాయిలో జరగకపోయినా అద్దెలు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి రావడం మరింత భారంగా మారింది పండుగకు కొత్త బట్టలు కొనేవారు కూడా కరువయ్యారు ఈసారికి ఇలా మానేసి మరో పండక్కి కొనుక్కుందాం అని తాత్విక చింతనలో మునిగిపోయారు మొత్తం మీద కరోనా ప్రభావం చాలా జీవితాల్లో నిరుత్సాహాన్ని నింపింది.

Featured

పిడూరు రోడ్ విజ్ఞేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ

మనుబోలు 17-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) లాక్డౌన్ వల్ల వివిధ రాష్ట్రాల నుంచి మనుబోలు జాతీయ రహదారి మీద వారి సొంత రాష్ట్రాలకు వెళ్తున్న వలస కార్మికుల కు ఆహారం లేక ఇబ్బందుల పడుతున్న పరిస్థితిలను గుర్తించి తమ వంతు సాయంగా పిడూరు రోడ్ విజ్ఞేశ్వర యూత్ ఆద్వర్యం లో 200 మంది వలస కూలీలకు సాయంత్రం వేళలో టమోటా అన్నం పంపిణీ చేసారు. జాతీయ రహదారి వెంట వేలుతున్న వలస కార్మికులను మనుబోలు గ్రామాల్లోని ప్రజలు వివిధ రూపాలలో ఆదుకోవడం పట్ల వలస కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Featured

లాక్ డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాలు విడుదల

పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ ✍ లాక్ డోన్ సమయంలో నెల్లూరు నగరంలో రోడ్లపైకి వచ్చిన పలు బైకులు ఆటోలు ఇతర వాహనాలు సీజ్ చేయడం జరిగింది. అయితే నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విన్నపం మేరకు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ సీజ్ చేసిన వాహనాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. కఠిన కేసులు కాకుండా నామమాత్రం చలానాలతో విడుదల చేయాలని సూచించారు.

Featured

ముస్లింలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

మనుబోలు17-05-2020( పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలంలో ని కాగితాలపూరు, కొలనకుదురు, మనుబోలు, మడమనూరు, వీరంపల్లి గ్రామాలలో పర్యటించి, రంజాన్ కానుక పేరిట ముస్లిం కుటుంబాలకు పండుగ సరుకులను పంపిణీ చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం కుటుంబం సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకునేందుకు పండగ సరుకులను పంపిణీ చేస్తున్నాం.సర్వేపల్లి నియోజకవర్గం లోని ప్రతి ముస్లిం కుటుంబానికి అందజేయాలనే లక్ష్యంతో సుమారు 7 వేల కుటుంబాలకు పండుగ సరుకులు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టి కొనసాగిస్తున్నాం.రేషన్ కార్డులతో సంబంధం లేకుండా గ్రామాలలో నివసించే ప్రతి ముస్లిం కుటుంబానికీ పండగ సరుకులను అందజేస్తాం. ముస్లిం కుటుంబాలు సంవత్సరకాలం పాటు ఎదురు చూసే, పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కరోనా నేపథ్యంలో పనులు లేక పండుగ జరుపుకునే లేక పోతున్నామనే భావన కలగకూడదని పండుగ సరుకులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా లక్ష కుటుంబాలకు పైగా *”సర్వేపల్లి రైతన్న కానుక”* పేరిట బియ్యం, వంటనూనె పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేశాం.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం కుటుంబాలకు విడదీయరాని సంబంధం ఉంది. ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారిది అయితే, ముస్లిం కుటుంబాలకు అండగా నిలుస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఇంటి బిడ్డగా రంజాన్ పండుగలో పాలుపంచుకునే భాగ్యం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి ముస్లిం సోదరునికి, సోదరిమణికి ముందస్తు *”రంజాన్ శుభాకాంక్షలు”* తెలియజేస్తున్నా.సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ పండుగ సందర్భంగా సేమియా, చక్కెర, నెయ్యి, గోధుమపిండి, వంటనూనెను పంపిణీ చేస్తున్నాము సర్వేపల్లి నియోజకవర్గం లోని 7000 కుటుంబాలకు రంజాన్ పండుగ సరుకులను అందజేస్తున్నము ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోనే *”సర్వేపల్లి రైతన్న కానుక”* పేరిట లక్ష కుటుంబాలకు పైగా 3కోట్ల 50 లక్షల రూపాయల విలువైన బియ్యం, వంటనూనె పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, విజయవంతంగా పూర్తి చేశాం. సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు “ఇంటి బిడ్డగా” వ్యవహరిస్తానని మరోసారి తెలియజేసుకుంటున్నాను. సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాలకు సేవా కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు, పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఈకార్యక్రమంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి,చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,ముంగర విజయ భాస్కర్ రెడ్డి,దాసరి భాస్కర్ గౌడ్, చేరెడ్డి రామిరెడ్డి,సాయి మోహన్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,వెంకటసుబ్బయ్య,దనుంజయరెడ్డి,ప్రదీప్ రెడ్డి, సుల్తాన్ సాహెబ్ మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Featured

వ్వవసాయ మార్కెట్ యాడ్ నందు బత్తాయి పండ్లను విక్రయించారు

రాపూరు, మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు లోని స్థానిక మద్దెల మడుగు వ్వవసాయమార్కెట్ యాడ్ లో కరోనా లాక్ డౌన్ దృశ్య రాష్ట్రప్రభుత్వం రైతులు నష్టపోకూడదు అన్న భావము తో రైతులకు గిట్టుబాటు ధర కళిపిస్తూ కొనుగోలు చేసిన బత్తాయి పండ్లను వ్వవసాయ మార్కెట్ యాడ్ నందు అనిత కుమారి ఆదేశాల మేరకు 6 కిలోలు 100 రూ చొప్పున విక్రయించారు.ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగ పరచుకున్నరు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.