Friday, 6 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

జగన్ కీలక ప్రకటనలు

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ ?ఈ నెల 26న అర్చకులు, పాస్టర్లు,ఇమామ్ లకు రూ.5వెలు ? జూన్ 4న వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా సొంత ఆటో,క్యాబ్ ఉన్నవారికి రూ.10వెలు ఆర్థిక సాయం ? జూన్ 10న నాయిబ్రాహ్మణులు, రజకులు,ట్రైలర్లకు రూ.10వెలు ? జూన్ 17న వైఎస్సార్ నేతన్న హస్తం, ? జూన్ 24 న వైఎస్సార్ కాపు నేస్తం డబ్బులు ? ఆగస్టు 12 వైఎస్సార్ చేయూత, ? ఆగస్టు 19న వైఎస్సార్ వసతి దీవెన డబ్బులు జమ

Featured Others

ఎవరు గొప్ప

ఎవరు గొప్పవెచ్చనైనా విభాప్రభాతముల తాకిడితో మేలుకొలిపి,జీవన గమనంలో ముందుకు సాగిపోయేలా,మండుటెండలో రహదారి వెంట నడుస్తూ,తోడుగా వెంటనడుస్తుంది……పగలు వెన్నెల వెలుగులు విరజిమ్ముచు ,చల్లని మంచు తెరల తెమ్మరలను, నింగి నుంచి నేలపైకి విసురుతూ,తారలోకంలో విహరింప జేస్తుంది……….చీకటి బోసినవ్వుల పాపాయితల్లిహృదయాన్ని హత్తుకున్నట్లు,అలసి సొలసిన దేహాన్నితన ఒడిలోకి చేర్చుకుంటుంది…..నేలతల్లి ప్రేమాభిమానాలు పంచుతూ,మంచి,చెడుల తారతమ్యాలను తెలుపుతు,ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించి,ఓటమిలో ఓదార్పునిస్తు,గెలుపులో ఆనందిస్తూ,పగలు,రాత్రి తేడా లేక,తనతో చిరకాలం నిలచి ఉంటుంది …….కన్నతల్లి ప్రేమ.నావూరు. హరి,ఉపాధ్యాయులు వెంకటగిరి.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు

తేదీ: 19.05.2020 పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా కర్నూలు, చిత్తూరు జిల్లాలో వైరస్ వల్ల ఒక్కొక్కరు మరణించడంతో మృతుల సంఖ్య 52 కి చేరింది. ఇటు రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 2,339 కి చేరుకుంది. ప్రస్తుతం 691 యాక్టీవ్ కేసులు ఉండగా 1,596 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Featured

నెల్లూరు జిల్లాలో విషాదం.. ప్రాణాలు తీసిన విద్యుత్ లైన్

  పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ జిల్లాలో విషాదకర జరిగింది. కలిగిరి మండలం నరసారెడ్డిపాలెంలో లక్ష్మీకాంతమ్మ ( 40 ) అనే మహిళ సోమవారం సాయంత్రం విద్యుత్ తీగలు తగిలి అక్కడిక్కడే మృతి చెందింది. పొలంలో వరి నారుకి నీళ్లు పెట్టడానికి వెళ్తుండగా జిల్లాలో వీస్తున్న గాలులకు తెగిపడి ఉన్న ఎల్ టి లైన్ వైరు తగిలి మృత్యు వాత పడింది.ఈ సంఘాటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

జాతీయ అంతర్జాతీయ

కరోనాపై పోరాటానికి యాచకుడి సాయం

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రతినిధి షేక్.ఉస్మాన్ ✍️ కరోనపై పోరులో భాగంగా సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు,క్రికెటర్లు ఇలా చాలా మంది ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందించారు. అయితే తమిళనాడులో ఓ యాచకుడు కరోనా సహాయ నిధికి తన వంతు సాయం చేశాడు. మధురైకి చెందిన పూల్ పాండియన్ అనే వృద్ధుడు తాను భిక్షాటన చేయగా వచ్చిన రూ.10వేలు నగదును మధురై జిల్లా కలెక్టర్ ను కలిసి అందజేశాడు. దీంతో యాచకుడి గొప్ప మనసును అందరూ ప్రసంసిస్తున్నారు.

Featured బిజినెస్

జీడీపీ అంటే ఏమిటి ?

రాపూరు, మే 18, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : మనం టీవీ లలో న్యూస్ పేపర్ లలో GDP జీడీపీ పెరిగింది, తగ్గింది అని తరుచుగా వింటూ ఉంటాం. కాకపోతే ఈ GDP అంటే ఏమిటి అనేది మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి అసలు GDP అంటే ఏమిటి? అది ఎలా లెక్కిస్తారు? ఎందుకు అది అంత ముఖ్యమైనది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. GDP అంటే Gross Domestic Product. తెలుగులో స్థూల దేశీయోత్పత్తి అని అంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం finished products(అంతిమ వస్తువులు) మరియు సేవల మొత్తం విలువ ఎంత ఉంటుందో అది జీడీపీ అవుతుంది. ఉదాహరణకి ఒక సూపర్ మార్కెట్ ఉంది అనుకోండి. అది ఒక రోజు 20 రూపాయల విలువ చేసే ఒక సబ్బు, 10 విలువ చేసే చాకొలేట్, 50 విలువ చేసే పుస్తకం వీటిని అమ్మింది అనుకుందాం. అప్పుడు దాని ఒక రోజు జీడీపీ 80రూపాయలు అవుతుంది. అదే విధంగా దేశం మొత్తంలో ఉత్పత్తి అయ్యి అమ్ముడైన వస్తువుల మొత్తం విలువ కలిపితే అది ఆ దేశ జీడీపీ అవుతుంది. అయితే అన్ని ప్రోడక్ట్ ఈ GDP లోకి చేరవు. ఉదాహారానికి జపాన్ కి చెందిన ఒక కంపెనీ ఏదైనా మెషిన్ ని మన ఇండియాలో అమ్మితే అది మన GDP లో చేరదు. జపాన్ దేశపు GDPలో కలుస్తుంది. అలాగే ఈ జీడీపీ లో మాధ్యమిక వస్తువులను లెక్కించకూడదు. కేవలం అంతిమ వస్తువులను మాత్రమే లెక్కించాలి. అంటే ఉదాహారానికి కారులో వాడే టైర్, సీట్ వంటివి ఉన్నాయి అనుకుందాం. మనం వాటిని నేరుగా ఉపయోగించలేము. కానీ వాటితో కారును తయారుచేస్తే దానిని ఉపయోగించగలం. ఇక్కడ టైర్ , సీట్ వంటివి మాధ్యమిక వస్తువులు, కార్ అనేది అంతిమ వస్తువు. జీడీపీ లో ఈ అంతిమ వస్తువుల విలువను మాత్రమే లెక్కిస్తారు. మరొక ఉదాహరణ తీసుకుందాం. కాఫీ పొడి ఉంది అనుకుందాం దానిని మనం నేరుగా తినలేము. కానీ దానితో కాఫీ చేసుకుని తాగవచ్చు. కాబట్టి ఇక్కడ కాఫీ పొడి మాధ్యమిక వస్తువు అవుతుంది. కాఫీ అంతిమ వస్తువులోకి వస్తుంది. మరి మన GDP పడిపోయింది అని వింటూ ఉంటాం దాని అర్ధం ఏమిటంటే మన దేశంలో తయారైన వస్తువులను మన దేశంలో ఎక్కువుగా అమ్ముడవడం లేదు. అంటే పక్క దేశాలకు చెందిన వస్తువులనే ఎక్కువగా కొంటున్నాం అని. ఇలా జరిగితే మన దేశంలో తయారైన వస్తువులను కొనడంలేదు కాబట్టి మన దేశంలోని కంపెనీలు కూడా ఎక్కువగా వస్తువులను ఉత్పత్తి చెయ్యవు. ఉత్పత్తి లేకపోతె కంపెనీ కి లాభాలు ఉండవు. దానితో కొత్త ఉద్యోగాలు ఉండవు, లేదా ఉన్న ఉద్యోగులను తీసివేయడం జరుగుతుంది. మళ్ళీ మన దేశ GDP పెరగాలంటే మన దేశంలో తయారైన వస్తువులను మనం ఎక్కువగా కొనాలి. అప్పుడే మన దేశంలో కంపెనీలు ఎక్కువగా వస్తువులను తయారుచేస్తాయి. దాని వాళ్ళ ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. ఈ జీడీపీ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవ్యస్థ ఏ విధంగా ఉంది అనేది తెలుపుతుంది. ఒక క్రమ పద్దతిలో ఒక దేశం యొక్క జీడీపీ అనేది పెరుగుతూ ఉంటె ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అని అర్ధం.

Featured భక్తి

బిల్వ పత్రం

రాపూరు, మే 18, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : మూడు దళాలు కలిగిన, మూడు గుణాలకు ప్రతీకగా, మూడు కన్నులవలె, మూడు ఆయుధాలుగా, మూడు జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. మూడు శాఖలు కలిగి, రంధ్రములు లేని, కోమలంగా, శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను. ఛిద్రం కాని ఒక్క పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగి వేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. సాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే, సోమ యాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. కోటి ఏనుగుల దానం ఫలం, నూరు యజ్ఞాల ఫలం, కోటి కన్యాదానాల ఫలం తో సమానమైన ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. లక్ష్మీ దేవీ స్తన్యము నుండి జన్మించిన, శివునికి ఎంతో ప్రియమైన, బిల్వ వృక్షం ఇచ్చిన దానితో సమానమైన బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. దర్శనం, స్పర్శనం వలన మహా పాపాలను నాశనం చేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. కాశీ నివాసం, కాల భైరవుని దర్శనం, ప్రయాగలో మాధవుని చూసిన తర్వాత బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, కొసలో శివుని కలిగిన బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.

Featured

స్నేహ హస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో లో 48 వ రోజు అన్నదానం

రాపూరు, మే 18, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా సందర్భంగా జరుగుతున్న అన్నదానానికి సోమవారం గుండ్లురు రామయ్య స్వామి గారు ( ప్రధాన అర్చకులు ,పెంచలకోన దేవస్థానం ) అన్నదానానికి విరాళం స్నేహ హస్తం ఫౌండేషన్ వారికి ఇవ్వడం జరిగింది వారి సహాయ సహకారాలతో పేద గిరిజనులు సుమారు 500 మంది అన్నదానం చేయడం జరిగింది.ఈ ఆర్థిక సహయం చేసినందుకు వారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అన్నదాన కార్యక్రమం జరపడానికి మా వెన్నంటి ఉంటూ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న శ్రీ బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు

Featured

సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి “రంజాన్ కానుక” ను పంపిణీ

రాపూరు, మే 18, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లిగూడూరు మండలంలో నరుకూరు, సౌత్ ఆములూరు, కొత్తపాళెం, వరకావిపూడి, వరిగొండ గ్రామాలలో పర్యటించి, ముస్లిం కుటుంబాలకు “రంజాన్ కానుక” ను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రతి ముస్లిం కుటుంబం రంజాన్ పండుగను జరుపుకోవడానికి పండుగ సరుకులను పంపిణీ చేస్తున్నాం. రెక్కాడితే గాని డొక్కాడని పేద ముస్లిం కుటుంబాలు కరోనా నేపథ్యంలో రంజాన్ పండుగకు దూరం కాకూడదని, ప్రతి ముస్లిం కుటుంబం పండుగ చేసుకునేందుకు పండుగ సరుకుల పంపిణీ కార్యక్రమానికి రూపకల్పన చేశాము.సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం కుటుంబానికి సేమియా, చక్కెర, నెయ్యి, గోధుమపిండి, వంటనూనెను పంపిణీ చేస్తున్నాము. లక్ష కుటుంబాలకు పైగా సర్వేపల్లి రైతన్న కానుక పేరిట 3 కోట్ల 50 లక్షల విలువైన బియ్యం, వంట నూనెను ప్రతి కుటుంబానికి అందజేశాము. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఇంటి బిడ్డగా వ్యవహరించే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం సోదరుడికి, సోదరీమణికి ఈ సందర్భంగా ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.