Friday, 6 March 2026

Blog

Featured

మనుబోలు గ్రామ ప్రజలకు ఆందోళన వద్దు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు రెడ్ జోన్ ప్రాంతాలు పరిశీలన

మనుబోలు20-05-2020( పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్)నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలోని రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు . మండల స్థాయి అధికారులు, వైద్యులతో పరిస్థితిని సమీక్షించి, ప్రజలెవ్వరూ ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలంటూ, బహిరంగ ప్రకటన ద్వారా సూచనలు, సలహాలు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి. కాలనీలలో చేపడుతున్న పారిశుద్ధ్య పనుల పరిశీలన. ప్రజలకు మాస్కులు, శానిటైజర్ల పంపిణి మనుబోలు బి.సి. కాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ప్రాథమిక సమాచారం ప్రకారం చుట్టుపక్కల నివాసాలు ఉన్న వారికెవ్వరికీ కరోనా వ్యాప్తి చెందలేదు.కాలనీ వాసులందరూ ఆందోళన చెందకుండా, నివారణకు అవసరమైన చర్యలు తీసుకోండి. ఈ ప్రాంతంలో నివసించే కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల అవసరాలకు ప్రత్యేకాధికారులను నియమించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ప్రజల అవసరాల కోసం మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ, వాలంటీర్లను అందుబాటులో ఉంచాం. అవసరమైనన్ని మాస్కులను, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతాం. వాలంటీర్ల ద్వారా మాస్కులను, శానిటైజర్లను, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తాం. వ్యాధి లక్షణాలు కానీ, అనుమానంగానీ ఉంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని నివృత్తి చేసుకోండి. ఎవరికీ ఏ అవసరమైనా అధికారులను సంప్రదించండి సమస్య పరిష్కారం కాకపోతే, నా దృష్టికి తీసుకొని రండి.ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ, ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై. యెస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,చే రెడ్డి రామి రెడ్డి ముంగర విజయ్ భాస్కర్ రెడ్డి దాసరి మహేంద్రవర్మ అన్నమాల ప్రభాకర్ రెడ్డి ఎంపీడీవో వెంకటేశ్వర్లు తహసిల్దార్ ఆనందరావు గూడూరు రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి మనుబోలు ఎస్ ఐ సూర్య ప్రకారెడ్డి పాల్గొన్నారు.

Featured

రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

రాపూరు, మే 20, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలోని రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.మండల స్థాయి అధికారులు, వైద్యులతో పరిస్థితిని సమీక్షించి, ప్రజలెవ్వరూ ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలంటూ, బహిరంగ ప్రకటన ద్వారా సూచనలు, సలహాలు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి మనుబోలు బి.సి. కాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ప్రాథమిక సమాచారం ప్రకారం చుట్టుపక్కల నివాసాలు ఉన్న వారికెవ్వరికీ కరోనా వ్యాప్తి చెందలేదు.కాలనీ వాసులందరూ ఆందోళన చెందకుండా, నివారణకు అవసరమైన చర్యలు తీసుకోండి.ఈ ప్రాంతంలో నివసించే కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.ప్రజల అవసరాలకు ప్రత్యేకాధికారులను నియమించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ప్రజల అవసరాల కోసం మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ, వాలంటీర్లను అందుబాటులో ఉంచాం. అవసరమైనన్ని మాస్కులను, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతాం. వాలంటీర్ల ద్వారా మాస్కులను, శానిటైజర్లను, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తాం. వ్యాధి లక్షణాలు కానీ, అనుమానంగానీ ఉంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని నివృత్తి చేసుకోండి. ఎవరికీ ఏ అవసరమైనా అధికారులను సంప్రదించండి సమస్య పరిష్కారం కాకపోతే, నా దృష్టికి తీసుకొని రండి. ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ, ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తాం అని తెలిపారు

Featured జాతీయ అంతర్జాతీయ

మరో చప్పట్ల హీరో

పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ : అత్యంత పేద దేశమైన బురుండి తూర్పు ఆఫ్రికా ఖండంలో ఉంది. దీర్ఘకాలంగా అంతర్యుద్దాలలో మునిగిపోయిన బురిండి 1962 వ సంవత్సరంలో స్వాతంత్య్రం పొందింది. అది మొదలు ఇప్పటిదాకా ఏకగ్రీవ లేదా పోటీ ఎన్నికలు జరగలేదు. మొదటిసారిగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బురుండి ప్రజల భవిషత్తును నిర్ణయించబోతున్నాయి. 3సార్లు అధ్యక్షుడిగా నాకురింజిజా ఎన్నికై బురుండి దేశానికి దీర్ఘకాల అధ్యక్షుడిగా పని చేసి తన పాలనాకాలంలో రాజకీయ ప్రత్యర్థుల హత్యలు, అరెస్టులు చేసిన నాకురింజిజా అప్రతిష్ట కూడగొట్టున్నాడు. నేటి గ్లోబల్ మహమ్మారి సమయంలో కూడా స్టేడియాలలో భారీ ర్యాలీలు చేసి తమ పార్టీని గెలిపించమని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మాజీ తిరుగుబాటు నాయకుడు, మానవ హక్కుల ఉల్లంఘనలకు కారణమయ్యాడనే ఆరోపణలను ఎదుర్కొంటూ అంతర్జాతీయ ప్రయత్నాలను తప్పించుకొంటూ గత 15 సంవత్సరాలుగా శిక్షార్హత లేకుండా దేశాన్ని పాలించిన నాకురుంజిజాకు వారసుడిని, బురుండి దేశ పౌరులు బుధవారం నాడు ఎన్నుకుంటున్నారు. సుమారు 1,500 పోలింగ్ కేంద్రాలలో ఐదు మిలియన్లకు పైగా ప్రజలు ఓటు వేస్తున్నారని, 1993 లో ప్రారంభమై 2005 లో ముగిసిన అంతర్యుద్ధం తరువాత ఇది మొదటి పోటీ ఎన్నిక అని నిపుణులు చెపుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి, దేశ సరిహద్దులు తెరచి ఉంచుతూ పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించడానికి అధికారులు అనుమతినిస్తూ కరోనా నుంచి దేవుడు కాపాడుతాడని ఉదహరిస్తున్న నేపథ్యంలో, కరోనా సంక్రమణకు దారితీస్తుందని who అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దేశంలో సానుకూల కేసులు పెద్దగా లేవని కేవలం ఒక మరణం మాత్రమే నమోదయిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు బురుండీలో లేవని, కరోనా వైరస్ వ్యాప్తి ఆసలే లేదని ఇది దేశాన్నిపెద్దగా ప్రభావితం చేయదని ప్రభుత్వ అధికారులు చెపుతున్నారు. గోజిలోని ఒక సమావేశంలో బురుండి అధ్యక్షుడు ఒక అడుగు ముందు వేసి మనం రద్దీగా ఉన్నాము కదా మనకు ఏమైనా సమస్య ఉందా, ‘ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి చప్పట్లు కొడదాం’ అని ప్రజలను ఆదేశించాడు.

Featured

కండలేరు జలాశయం లో 26.224 టీఎంసీలు నీరు

రాపూరు, మే 20, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలం లోని కండలేరు జలాశయం లో మంగళవారం నాటికి 26.224 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి సత్యసాయి గంగకాలువకు 15 క్యూసెక్కులు పినేరు వాగుకు 15 క్యూసెక్కులు లోలెవెల్ స్లుయిస్ 10 క్యూసెక్కులు వంతున నీరు విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు కండలేరు వరద కాలువ ద్వారా 325 క్యూసెక్కులు జలాశయంలోకి చేరినట్లు తెలియజేశారు

Featured

స్నేహహస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో లో 50 వ రోజు అన్నదానం

దాత శ్రీ బండి వేణు గోపాల్ రెడ్డి గారు రాపూరు, మే 20, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు తూర్పు అగర్తకట్ట వద్ద కరోనా సందర్భంగా జరుగుతున్న అన్నదానానికి బండి కృష్ణా రెడ్డి మాజీ MPP రాపూరు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ బండి వేణు గోపాల్ రెడ్డిగారి సహాయ సహకారాలతో 500 మంది పేద గిరిజనులకు అన్నదానం చేయడం జరిగింది వారికి మరియుగత 50 రోజులుగా స్నేహ హస్తం ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న అన్నదానం కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నన్ని రోజులు జరపమని మా వెన్నంటి ఉంటూ గత 50 రోజులుగా అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తలియజేశారు

Featured

లాక్ డౌన్ దెబ్బకు ఇండియాలో ఏం జరగబోతుంది..!!

రాపూరు, మే 20, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సన్ ఫ్లవర్ నూనె, పల్లీ నూనె మార్చి 22కి ముందు ఒక లీటర్ 115ఉండేది..ఈరోజు 160 రూపాయలు..మరి ఈ మధ్య కాలంలో ఏం పెరిగిందని అంత రేట్ పెరిగింది..లేబర్ కూలీ రేట్ పెరగలేదు..ట్రాన్స్ పోర్ట్ ఛార్జ్ పెరగలేదు..పంట మధ్దతు ధర పెరగలేదు..షాపు అద్దె పెరగ లేదు. కరెంట్ ఛార్జీలు పెరగలేదు.అయినా అంత ధర పెరగడం వెనక కేవలం జనాల డిమాండ్ తప్ప ఇంకేం ఉంది.మరి ఇదే డిమాండ్ కూరగాయలకు, పండ్లకు కూడా ఉంది.అయితే వాటిని నిత్యావసర సరుకులు అని చెప్పి వాటికో ధరను నిర్ధేశించి అంతకంటే ఎక్కువ ధరకు అమ్మవధ్ధని ఒక వేళ హధ్ధు మీరితే చట్టప్రకారం శిక్షార్హులు అని చెప్పారు.నిజానికి ఇవి రెండు మూడు రోజులకంటే ఎక్కువ నిల్వ ఉంచి డిమాండ్ క్రియేట్ చేయగలిగే వస్తువులు కూడా కాదు.మరి ఇలానే పెద్ద పెద్ద కంపెనీలలో ఉత్పత్యి అయ్యే ఇతర నిత్యావసర సరుకుల ధరలను కూడా అదుపులో ఉంచాలి కదా.ఇవి కృత్రిమ డిమాండ్ సృష్ఠించేందుకు అవకాశం ఉన్నవే…ఎన్ని రోజులైనా నిల్వ ఉంచే అవకాశం ఉన్న ఇలాంటి సరుకుల విషయంలో ఎందుకుండదు.దీన్ని బట్టి పేదోడు అమ్మే వస్తువుల మీద అదుపు ఉంటుంది తప్ప పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు అమ్మే వస్తువుల మీద ప్రభుత్వాలకు అదుపు ఉండదు అని అర్థమౌతుంది.ఇక వచ్చే రోజులలో బతుకు దుర్భరమై ఈ ధరల పెరుగుదలను భరించలేక కార్మికులు జీతాలు పెంచమనో కూలీ రేట్ పెంచమనో ఉద్యోగులు తమ జీతాలను పెంచమనో డిమాండ్ చేస్తే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తూ రోజుకు 12 గంటలు కాదు.రోజంతా పనిచేయాలనే చట్టాలు కూడా చేస్తారనిపిస్తుంది..ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి కూడా.ఈ లాక్ డౌన్ వలన వస్తువుల ఉత్పత్తి లేదన్నది ఎంత నిజమో.వాటికి డిమాండ్ కూడా లేదన్నది అంతే నిజం ప్రపంచంలో అత్యంత ఎక్కువగా వస్తువులను వినియోగించే అభివృధ్ధి చెందిన దేశాలలో ఇప్పటికీ లాక్ డౌన్ కొనసాగుతుంటే భారత్ లాంటి పేద దేశాలలో ఆ వస్తువులకు డిమాండ్ బాగా తగ్గాలి కాని ధరలు పెరగడం ఏంటి ? ఇక పెట్రోల్ బారెల్ ధర ఉత్పత్తి పెరిగి పోయి డిమాండ్ పూర్తిగా తగ్గిపోవడంతో నెగెటివ్ లో పడింది…నెగెటివ్ అంటే పెట్రోల్ ఉచితంగా ఇవ్వడమే కాక ట్రాన్స్ పోర్ట్ ఖర్చు కూడా ఆయిల్ రిఫైనరీసే భరిస్తాయని అర్థం.పేదోన్ని కొట్టి ఉన్నోడికి పెట్టేందుకే ఈ లాక్ డౌన్ ఉధ్దేశ్యం అని కనపడుతుంది తప్ప జనాల మీద ప్రేమతో కాదేమోననే సందేహం మాత్రం బలంగా వినిపిస్తుంది.ప్రజలకున్న ఈ ప్రాణభయాన్ని సాకుగా తీసుకుని లాక్ డౌన్ చేసి భారత్ లో ఉన్న అన్ని కార్మిక చట్టాలను వినియోగదారుల చట్టాలను లేబర్ హక్కులను మానవ హక్కులను కాలరాసే వ్యూహమే కనపడుతుంది.ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు మద్యం ధరలను అమాంతం పెంచేసాయి…ఇక ఢిల్లీ అయితే ఏకంగా ఫెట్రోల్ ధరలను పెంచి ఆ పెంచిన దాన్ని కరోనా టాక్స్ పేరుతో వసూలు చేయడం గమనార్హం.మీరిప్పటికైనా కరోనాకు భయపడి జనాలని భయపెట్టడం మానేయండి.ముందు ముందు అన్ని రకాల వస్తువుల ధరలు 200% పెరగబోతున్నాయి అలానే పైకి కనపడని పరోక్ష పన్నులు కూడా పెరగబోతున్నాయి కాని ఒక్క వ్యక్తి కూలీ కాని జీతం కాని పెరగబోవడం లేదు..!!

Featured

వలసకూలీలు12 మంది కోరంటైన్ కి తరలింపు

రాపూరు, మే 19, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన కోరంటైన్ లో ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 11 మందిని కోరంటైన్ లో ఉంచగా వారికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా వారికి ఎటువంటి కరోన లక్షనాలు లేవని నిర్ధారణ చేసుకొని వారిని 14 రోజులు పర్యవేక్షణలో ఉంచారు. వీరిలో 8 మందిని మంగళవారం కోరంటైన్ కాలపరిమితి ముగిసినందున హోమ్ కోరంటైన్ లో ఉండాలి అంటూ ఆంక్షలు జారీచేసి వారిని వారి యొక్క సొంత ఊర్లకు అధికారులు పంపించటం జరిగినది మిగిలిన ముగ్గురు వ్యక్తులకు ఇంకా కాలపరిమితి ఉన్నందున వారిని కోరంటైన్ పర్యవేక్షణలో ఉంచారు మరియు కొత్తగా గుంటూరు జిల్లా తెనాలి-కొల్లూరు నుండి ప్రత్యేక బస్సులో వలసకూలీలు12 మంది రాపూరు కి రాగా వీరిలో రాపూరు మండలం కోటూరుపాడు చెందినవారు 11 మంది, తెగచర్ల గ్రామానికి చెందిన వారు ఒకరు ఉన్నారు మొత్తం12 మందిని అధికారులు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కమ్యూనిటీ కోరంటైన్ లో ఉంచడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరికి కరోణ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారిని 14 రోజుల పాటు కోరంటైన్ లో ఉంచి పర్యవేక్షణలో పెట్టడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్ కుమార్, ఎమ్మార్వో మధుసూదన్ రావు,ఎంపీడీవో ఆమోస్ బాబు ఆర్ఐ కామాక్షి,వీఆర్వో చెంచు రెడ్డి,ఆరోగ్య శాఖ సిబ్బంది ఏఎన్ఎమ్ లు ఆశ వాలంటీర్లు పాల్గొన్నారు

Featured

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.

రాపూరు, మే 19, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో తాటిపర్తి, మహమ్మదాపురం, విరువూరు, సూరాయపాళెం, నావూరు, ఆల్తుర్తి, మొగళ్లూరు గ్రామాలలో పర్యటించి, ముస్లిం కుటుంబాలకు “రంజాన్ కానుక” పేరిట పండుగ సరుకులను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముస్లిం కుటుంబాలందరికీ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రంజాన్ పండుగ సరుకులను పంపిణీ చేస్తున్నాం.లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రంజాన్ పండుగ రావడం, ముస్లింలు ప్రధానంగా, పవిత్రంగా భావించే రంజాన్ పండుగకు సర్వేపల్లి నియోజకవర్గంలోని ఒక్క ముస్లిం కుటుంబం కూడా దూరం కాకూడదని, రంజాన్ పండుగ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము.ప్రతి ముస్లిం కుటుంబానికి పంపిణీ చేసే ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 7000 కుటుంబాలకు అందజేయడం సంతోషంగా ఉంది.రంజాన్ పండుగ నాడు ప్రతి కుటుంబానికి అవసరమైన సేమియా, నెయ్యి, చక్కెర, గోధుమపిండి, వంటనూనెతో కలిపి 5 రకాల పండుగ సరుకులను పంపిణీ చేస్తున్నాం. కరోనా నేపథ్యంలో నివారణ చర్యలను పాటిస్తూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులను ధరించాలి.కరోనా పరిస్థితులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వైద్యం చేయించుకున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం అభినందించదగ్గ విషయం. ప్రజల ఆశీస్సులతో జిల్లా పరిషత్ చైర్మన్ గా, రెండు సార్లు శాసన సభ్యునిగా అన్ని వర్గాల ప్రజలకు సేవచేసే భాగ్యాన్ని కల్పించడం భగవంతుడు నాకు ప్రసాదించిన వరం. ప్రతి ముస్లిం కుటుంబం జరుపుకునే రంజాన్ పండుగలో భాగస్వామ్యుని కావడం మహాభాగ్యంగా భావిస్తూ, ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.

Featured

బండి వేణుగోపాల్ దాతృత్వం

లాక్ డౌన్ నేపద్యంలో నెల్లూరు నగరంలోని పెన్నా నది ఒడ్డున కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న 50 కుటుంబాలకు భోజనాలు మరియు పిల్లలకు బట్టలు పంపిణీ చేసిన బండి వేణుగోపాల్ రెడ్డి

Featured గూడూరు

పవిత్ర రంజాన్ పండుగను ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. ఈద్గా యూత్ అసోసియేషన్ వారి ఔదార్యం 

  గూడూరు మే 19, 2020 (పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ ) : గూడూరు పట్టణములోని దర్గా ఆవరణలో మంగళవారం నాడు ఈద్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 250 నిరుపేద ముస్లిం కుటుంబాలకు గూడూరు దర్గా వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్.రియాజ్ అహ్మద్, డాక్టర్ సిద్ధిక్, మత గురువు మొహమ్మద్ యూసుఫ్ హుస్సేన్, ఏపి.ఎం.డబల్యూ.ఓ. జిల్లా అధ్యక్షులు మగ్ధుమ్, మైకా కరిముల్లాల చేతుల మీదుగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ మగ్ధూమ్ మాట్లాడుతూ ఈద్గా యూత్ అసోసియేషన్ నిర్వాహకులు సామాన్య మధ్యతరగతికి చెందిన యువకులు చెందినవారని, కానీ సేవ చేసే విషయంలో మాత్రం శ్రీమంతులని, ఈద్గా సభ్యులందరూ చిన్నవ్యాపారాలు చేసుకుంటూ స్వచ్చందంగా వారి సంపాదనలోంచి కొంత నగదును కేటాయిస్తూ లాక్ డౌన్ మొదలయినప్పటి నుండి నేటి వరకు అనేక కార్యక్రమాలు చేస్తూ దేశ పౌరులుగా తమవంతు బాధ్యతను నిర్వహిస్తున్న ఈద్గా యూత్ అసోసియేషన్ సభ్యులు గూడూరు ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. సేవ చేయాలంటే కోటీశ్వరులు కానక్కరలేదని దృఢ సంకల్పం ఉంటే చాలని చెపుతూ ఈద్గా యూత్ అసోసియేషన్ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలియజేసారు. మత గురువు యూసుఫ్ హుస్సేన్, మౌలానా షఫీలు మాట్లాడుతూ లాక్ డౌన్ విపత్కర పరిస్థితుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకు మేమున్నామంటూ భరోసాను కల్పిస్తున్న ఈద్గా సభ్యులకు అభినందనలు చెప్పారు. ఈద్గా యూత్ అసోసియేషన్ సభ్యులు షేక్. షబ్బీర్ మాట్లాడుతూ మా ఈద్గా యూత్ అసోసియేషన్ సభ్యుల సమిష్టి కృషి వల్లే మేము విజయవంతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగానే 200 మందికి రంజాన్ తోఫా కిట్లను అందజేసామని, అలాగే పండుగలోపు మరి కొన్ని కుటుంబాలకు ఇస్తామని పేర్కొన్నారు. పండుగను ప్రతి పేదవాడు సంతోషంగా జరుపుకోవాలన్నదే ఈద్గా యూత్ అసోసియేషన్ యొక్క  లక్ష్యమని అందుకు అనుగుణంగా  సేవలను విస్కృతం చేస్తామని హాషిం చెప్పారు. ప్రేమ, దయ, శాంతి, దాన ధర్మాలకు మరో పేరే రంజాన్ అని దర్గా వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్.రియాజ్ అహ్మద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈద్గా సభ్యులతోపాటు మరికొంతమంది పెద్దలు పాల్గొనడం జరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.