Friday, 6 March 2026

Blog

Featured

ఘనంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

రెడ్ క్రాస్ ప్రాంగణంలో రక్త దాన శిబిరాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణారెడ్డి గారు ప్రాంభించి స్వచ్చందంగా రక్తదానము చేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజానాయర్ కూడ పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ గత 2 నెలలుగా కొనసాగుతున్న కోవిడ్-19 లాక్ డౌన్ వలన ఏర్పడిన రక్త నిల్వల కొరత వలన తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లలు, కాన్సర్ పేషెంట్స్ మరియు గర్భిణీ స్త్రీలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు ఎదుర్కొఅంటున్నారు అని అన్నారు. విశ్వవిద్యాలయం తనవంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేప్పట్టటం ద్వారా సుమారు 60 యూనిట్ల రక్తం సేకరించటం గొప్ప ఘనకార్యంగా భావిస్తున్నానని అందుకు సహకరించి ముందుకు వచ్చిన ప్రతి రక్తదాతను అయన అభినందించారు. రెడ్ క్రాస్ వారు చేస్తున్న కృషిలో విశ్వవిద్యాలయము కూడా భాగస్వామి అవ్వటం చాలా సంతోషం గా ఉందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో వున్నా దాతలు అందరు ఎటువంటి భయాలు సంశయాలు లేకుండా రక్తదానం చేయటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు లాక్ డౌన్ సమయం లో ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు విశ్వవిద్యాలయ NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం ఆధ్వర్యంలో చేపట్టటం జరిగిందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో కృష్ణ చైతన్య కళాశాల NCC మరియు NSS విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారని అన్నారని అందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత సంక్లిష్టమైన పరిస్థుతులలో కూడా రక్తం అవసరమైన వారికందరికి అందజేయటం జరిగిందని,ఇటువంటి రక్తదాన శిబిరాల వలన ఇంకా ఎంతోమందికి రెడ్ క్రాస్ సహాయం చేయటానికి తోడ్పడుతుందని అన్నారు. చివరిగా విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కాన్సుల్ మెంబెర్ కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ యూనివర్సిటీ జిల్లా అభివృద్ధిలో ముఖ్యభూమిక పోషిస్తుందని ఈ మధ్యకాలంలో ఎన్నో మంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, NSS సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, NSS ప్రోగ్రాం ఆఫీసర్ డా. వై విజయ, రెడ్ క్రాస్ సిబ్బంది రవి, మధు భాస్కర్ హెల్ప్ ది నీడి టీం మెంబెర్స్ పాల్గొన్నారు.

Featured

స్నేహహస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో లో 55 వ రోజు అన్నదానం

రాపూరు, మే 25, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా సందర్భంగా జరుగుతున్న అన్నదానానికి పి.వెంకట ప్రసాద్ జ్ఞాపకార్థం వారి మిత్రులు KVB ప్రసాద్ మరియు రేవూరు సుధాకర్ (PET) గార్ల సహాయ సహకారాలతో 500 మంది పేద గిరిజనులకు అన్నదానం చేయడం జరిగింది మరియు గత 55 రోజులుగా స్నేహ హస్తం ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న అన్నదానం కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నన్ని రోజులు జరపమని మా వెన్నంటి ఉంటూ గత 55 రోజులుగా అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న శ్రీ బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

Featured

1, 12, 500 మాస్క్ లు M PDO కి అందించడం జరిగినది

రాపూరు, మే 25, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రకారం రాపూరు మండలం లో పొదుపు మహిళలు కుట్టిన 1, 12, 500 మాస్క్ లు రాపూరు యం పి డి ఓ అమోస్ బాబు అందించడం జరిగినది. ఏ పి యం.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజవంతం చేయుటలో సంహరించిన టైలర్ల కు, సిసిలు, విఓఏ లకు అలాగే తగు ఆదేశాలు ఇచ్చుచు మమ్మల్ని ముందుకు నడిపించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, ఏ సి వెంకటగిరి వారికీ ప్రత్యేక ధన్యవాదములు తలియజేశారు.యం పి డి ఓ అమోస్ బాబు వారి నుండి ధ్రువీకరణ పత్రంను అందుకున్నారు ఈ కార్యక్రమం లో ఏ సి మురళి, ఏ పి యం కృష్ణయ్య, అకౌంట్ టెంట్ నారాయణమ్మ పాల్గొన్నారు

Featured

కండలేరు జలాశయం నుండి చెన్నైకి నీరు విడుదల

రాపూరు, మే 25, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలం కండలేరు జలాశయం నుండి సత్యసాయి గంగకాలువద్వారా చెన్నైకి సోమవారం ఉదయం 10 గంటలకు నీటిని ఎస్.ఇ హరినారాయణ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసినారు ఈ సందర్భంగా ఎస్.ఇ హరినారాయణ రెడ్డి మాట్లాడుతు చెన్నై త్రాగునీటి అవసరాల నిమిత్తం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాము మరల రేపు 500 క్యూసెక్కులు చొప్పున దపదపాలుగా 1200 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తామని తెలుపుతూ ఇది వరకే 7.58 టీఎంసీలు ఇచ్చి ఉన్నాము. ఈ సంవత్సరానికి 1.5 టీఎంసీలు ఇవ్వవలసి ఉన్నది.మొత్తం జలాశయం లో 26 టీఎంసీలు నిల్వ ఉండగా ఇందులో 8.4 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కు పోగా,7.5 టీఎంసీలు ఉపయోగించు కోవచ్చు.7.5 టీఎంసీల లో తిరుపతి, వెంకటగిరి, రాపూరు, గూడూరు వివిధ ప్రాంతాల త్రాగునీటికోసం 3.5 టీఎంసీలు నిల్వ ఉంచగా,చెన్నైకి వచ్చే సంవత్సరానికి 3 టీఎంసీలు కేటాయించడం జరిగింది, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాకు 3.5 టీఎంసీలు కేటాయించగా స్వర్ణముఖి పరిసర ప్రాంతాల ప్రజలకు త్రాగు నీటి కోసం 1 టీఎంసీ,పరిశ్రమలకు 1.5 టీఎంసీలు కేటాయించడం జరిగింది మరియు ఇతర అవసరాల కోసం 3 టీఎంసీలు పోగా 3 టీఎంసీలు నీరు నిల్వ ఉంటాయి అని తలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఇ హరినారాయణ రెడ్డి , ఈ ఈ .విజయ్ కుమార్,డి ఈ. రమణయ్య, ఏ ఈ .కె.తిరుమలరావు , సుబ్బారావు సైట్ ఇంజినీర్ పాల్గొన్నారు

Featured గూడూరు

రెడ్ జోన్ కష్టాలు

గూడూరు మే 25, 2020 ( పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ ) : లాక్ డౌన్ సందర్భంగా కరోనా పాజిటివ్ కేసులున్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా పరిగణించి పూర్తిగా ఆంక్షలు విధించిడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. అందులో భాగంగానే గూడూరులోని కోతరూం సందులో ఇటీవల కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూడటంతో కంటైన్మెంట్ క్లస్టర్ గా నిర్ధారించి పూర్తి ఆంక్షలను విధించారు. ఆంక్షలతో పాటు అక్కడి నివాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవడం కూడా ప్రభుత్వ అధికారులదే భాద్యత, ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు. అయితే అక్కడ నివసిస్తున్న వారిపై స్థానిక పోలీసులు బెదిరిస్తున్నారని, అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆహార సమస్యలతో పాటు, రోగ గ్రస్తులకు అవసరమైన మందులు అందుబాటులో లేవని, వాటికోసం వెళ్ళడానికి అనుమతించడం లేదని పైపెచ్చు పోలీసు కానిస్టేబుళ్లు అవహేళనగా మాట్లాడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి 5 రోజులైనా నాయకులు, అధికారులు పట్టించుకోకపోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. చుట్టపు చూపుగా మున్సిపాలిటీ అధికారులు వచ్చి మీ పాట్లు మీరు పడండని, మీకివ్వడానికి మాదగ్గర ఏమి లేదని ఇక మీ ఖర్మ అంటూ చెప్పడం, అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా అక్కడి ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ఈ ప్రాంతం ఉపాది లేక రెండు నెలలుగా ఇళ్ళకే పరిమితమై ఉన్న ఈ సమయంలో, రెడ్ జోన్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కనీసం చిన్న పిల్లలకు పాలు, రోగులకు మందులు తెచ్చుకోవడానికైనా అనుమతివ్వాలని వారు వేడుకోవడం శోచనీయం.

Featured

ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు… ఎస్. ఐ సూర్య ప్రకాష్ రెడ్డి

25-05-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా మనుబోలు మండల ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులకు మనుబోలు ఎస్.ఐ సూర్యప్రకాష్ రెడ్డి శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. దైవత్వాన్ని నింపుకునేందుకు అల్లాహ్‌కు ఇష్టమైన జీవన విధానాన్ని ముస్లింలు ఈ విపత్కర కరోనా సమయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ.. నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించారని తెలిపారు. నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్‌ ఒక ముగింపు వేడుక కాగా, ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన తెలిపారు. మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించింది కూడా రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని పేర్కొన్నారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడాలన్న ఆశయం రంజాన్‌ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశం అని అన్నారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని తెలిపారు.భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ లు మరియు శానిటైజర్ ఉపయోగించుకుంటూ పవిత్రమైన రంజాన్ పండుగను ఆరోగ్యవంతంగా జరుపుకొని పోలీసులకు సహకరించాలని ఎస్. ఐ సూర్యప్రకాష్ రెడ్డి కోరినారు .

Featured

టి.టి.డి దేవాలయ ఆస్తులు అమ్మకం సరికాదు…బిజెపి నాయకుడు బోలా శ్రీనివాసులు

మనుబోలు 24-05-2020( పున్నమి ప్రతినిధి) తిరుమల దేవాలయ ఆస్తుల అమ్మకం సరికాదు బిజెపి నాయకుడు బోలా శ్రీనివాసులు తిరుమల దేవాలయానికి ఇతర రాష్ట్రాలలో స్థలాలు, భక్తులు కొంత మంది, తమ ఆస్తులు పరుల పాలు చేయడం ఇష్టం లేక, వాళ్ళ ఇళ్ళనో, భవన సముదాయాలనో, ఖాళీ స్థలాలనో ఆ కలియుగ దైవం (టీటీడీ) పేర వ్రాసేసి ఆ దస్తావేజులను తెచ్చి స్వామికి సమర్పిస్తుంటారు. అలాగే కొంత మంది భక్తులు తమ తమ వ్యాపారాలలో బాగా కలిసివచ్చిందన్న సంతోషంతో, కొంత ఆస్తిని స్వామి వారికి సమర్పిస్తుంటారు. భక్తులచేత సమర్పించబడిన ఆస్తులు కొన్నిటిని టీటీడీ వేలం ద్వారా అమ్మేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది అన్న వార్తలు వస్తున్నాయి. దానికి ప్రభుత్వం చెప్తున్న సాకు ఏంటంటే, “అవి టీటీడీ కి భారంగా మారాయి కాబట్టి, వాటిని వదిలించుకోవడానికి వేలం వేస్తున్నాము”. ఇది చాలా దారుణమైన విషయం. అసలు ఈ భూప్రపంచంలో స్థలాలు, భవనాలు భారంగా మారే అవకాశం ఉందా – అది కూడా టీటీడీ లాంటి విస్తృత నెట్ వర్క్ ఉన్న ఒక అతి పెద్ద ధార్మిక వ్యవస్థకి. రియల్ ఎస్టేట్ గా మనం పిలుచుకుంటోంది వాటినే కదా. స్వామి వారి మీద అత్యంత విశ్వాసంతో భక్తులు ఇచ్చిన ఆస్తులను భారమయ్యాయి అన్న సాకుతో డబ్బు చేసుకోవడం శోచనీయం. సక్రమంగా నిర్వహిస్తే అవి ఏ విధంగానూ టీటీడీ కి భారమయ్యే ప్రసక్తే లేదు. ఒక వేళ నిజంగానే వాటిని నిర్వహించడం టీటీడీకి కుదరని పక్షంలో, ఆ ప్రాంతం లో ఉన్న ఏదన్నా దేవాలయానికి వాటిని అప్పచెప్పాలి కానీ, అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని అన్నారు. ఇప్పటికే పవిత్ర పుణ్య క్షేత్రంగా వెలుగొందాల్సిన తిరుమల రాజకీయ జోక్యం ఎక్కువ అవడంతో, అనేక అకృత్యాలకు వేదికగా మారింది. ఏది ఏమైనా, భక్తుల విశ్వాసాన్ని, మనోభావాలను దెబ్బతీసే హక్కు ప్రభుత్వాలకి ఉండకూడదు. అది చాలా ప్రమాదకరం అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్

విశాఖ పర్యటన ఖరారు చేసుకున్న చంద్రబాబు

విశాఖ పర్యటన ఖరారు చేసుకున్న చంద్రబాబు హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. ఆయన విశాఖ వెళ్లేందుకు ఏపీ డీజీపీ నుంచి అనుమతి లభించింది. చంద్రబాబు రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి విశాఖకు బయలుదేరనున్నారు. అక్కడ విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి, ఆర్.ఆర్.వెంకటాపురంలోని మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం విశాఖలోని స్థానిక తెదేపా నేతలతో భేటీ కానున్నారు. సమావేశం ముగిసిన అనంతరం రోడ్డు మార్గాన అమరావతిలోని తన నివాసానికి బయలుదేరుతారు.

Featured

సహాయం

నెల్లూరు,పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్ సేవలందిస్తున్న అత్యవసర సర్వీస్లు వారికి 54 రోజుల పాటు అత్యవసర శాఖ అధికారులకు ఉద్యోగులకు సొంటి కషాయం అందజేసిన సుగర్ కేన్ డిపార్ట్మెంట్ చిరుద్యోగి వి, శ్రీనివాసులు గారిని, నెల్లూరు వారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బి గౌతమ్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు చేజర్ల సుధాకర్ రావు వారి తోటి కార్యవర్గ సభ్యులు అధికారులు ఉద్యోగులు ఘనంగా అభినందించారు. సాయి ఉద్యోగం చిన్నదని హృదయం సేవాగుసహాయకులుగా వ్యవహరించిన కార్పొరేషన్ణం పెద్దదని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సిటీ అధ్యక్షుడు పులి సతీష్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, DPHNO లు జి మంజుల, జి. బూలోకమ్మ, HEO  శర్మ , కాంతయ్య గారు, నాయకులు శ్రీధర్ పెద్దయ్య రమేష్ చంద్ర ఘతదితరులు పాల్గొన్నారు.

Featured

కోడికూర ఎంత పని చేసిందో!

కోడికూర ఎంత పని చేసిందో!!!! ఓ వ్యక్తి ఆశా కార్యకర్తపై దాడి. యశవంతపుర : పెద్దలకు కోడికూర, చేపలు, పిల్లలకు చిప్స్‌ ఇవ్వలేదనే కోపంతో ఆశా కార్యకర్తపై క్వారంటైన్‌ లో ఉన్న వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురిగిలో జరిగింది. మహారాష్ట్ర నుంచి కలబురిగి జిల్లాకు వచ్చిన వారికి అళంద కిణ్ణి అబ్బాస్‌ గ్రామంలో క్వారంటైన్‌ను ఏర్పాటు చేశారు. క్వారంటైన్‌లో ఉన్న సోమనాథ సోనకాంబళె అనే వ్యక్తి తనకు చికెన్, చేప కూరతో భోజనం ఇవ్వాలని ఆశా కార్యకర్త రేణుకా నాగప్పను కోరాడు. ఇందుకు సమాధానంగా ఉన్నతాధికారుల సూచించిన భోజనాన్ని అందజేస్తామని ఆమె తెలిపారు. దీంతో కోపానికి గురైన ఆ వ్యక్తి రేణుకపై దాడి చేశాడు. దీంతో ఆమె ఎడమ చేయి విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు సోమనాథ, అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.