Wednesday, 11 March 2026

Blog

విశాఖపట్నం

ఉక్కు లో ముగిసిన అధికారుల సంఘం ఎన్నికలు

ఉక్కు లో ముగిసిన అధికారుల సంఘం ఎన్నికలు స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం, జనవరి 21, (పున్నమి ప్రతినిధి). విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మంగళవారం జరిగిన అధికారుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మధ్యాహ్నం 12.30 నుంచి 03.30 వరకు మొదటి విడత, తిరిగి సాయంత్రం 05.30 నుండి 08.30 వరకు రెండవ విడత పోలింగ్ నిర్వహించారు. మొత్తం 2350 ఓట్లకు గాను పోస్టల్ బ్యాలెట్ తో కలపి 1588 ఓట్లు పొలయ్యాయి. అనంతరం జరిగిన లెక్కింపు జరిగింది. అధ్యక్షుడు గా యమ్.యమ్.ఎస్.ఎమ్. డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్ ఎస్. విద్యుత్ కుమార్ వర్మ, జనరల్ సెక్రటరీ గా క్యూఏటిడి డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్ కె.వి.డి. ప్రసాద్ , వైస్ ప్రెసిడెంట్ గా వాటర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ మేనేజర్ బి.పి. శ్రీకాంత్ కళ్యాణ్ , జాయిన్ సెక్రటరీ గా ఎల్.ఎమ్. ఎమ్. ఎమ్. డిపార్ట్మెంట్ మేనేజర్ ఎమ్.సత్యనారాయణ ఎన్నికయ్యారు.

E-పేపర్

పెండింగ్ చలాన్లు కట్టమని వాహనదారులను బలవంతపెట్టొద్దు చలాన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పెండింగ్ చలాన్లు కట్టమని వాహనదారులను బలవంతపెట్టొద్దు చలాన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు పెండింగ్ చలాన్లు కట్టాలని బైక్ కీస్ లాక్కొని బలవంత పెట్టొద్దని, స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని, చెల్లించకపోతే నోటీసులు ఇవ్వాలని వ్యాఖ్యానించిన హైకోర్టు

హైదరాబాద్

తెలంగాణలో రాబోయే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ల నియామకం

తెలంగాణ జనవరి ( పున్నమి ప్రతినిధి) బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారి ఆదేశాల మేరకు, ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు ఈ కింది వారిని నియమిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. – ఎన్నికల ఇన్‌ఛార్జ్: శ్రీ ఆశిష్ షెలార్ గారు (మహారాష్ట్ర మంత్రి) – ఎన్నికల కో-ఇన్‌ఛార్జ్‌లు: శ్రీ అశోక్ పర్నామి గారు (రాజస్థాన్ రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు). శ్రీమతి రేఖ శర్మ గారు (రాజ్యసభ ఎంపీ)

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయం 8 అయినా కనిపించని రోడ్డు

దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామo రోడ్డులో ఉదయం 8 అయిన మంచు కురవటం తగ్గేలేదు ఉదయం పనులకు వెళ్లే కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మంచు కురవటం వలన ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రజలు వాహనాలు మీద వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వేల్లాలని మలుపుల వద్ద లైట్స్, మరియు సిగ్నెల్స్ వేసుకోవాలి ప్రయాణలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి

ఆంధ్రప్రదేశ్

పోలీస్ అభ్యర్థులకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రత్యేక శిక్షణ

పున్నమి ప్రతినిధి – ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని రిమ్స్ ఆడిటోరియంలో పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల కోసం ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 700 మంది పోలీసు అభ్యర్థులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్, సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ ట్రైనర్ శ్రీ గంపా నాగేశ్వర రావు గారు హాజరై అభ్యర్థులకు మార్గదర్శనం చేశారు. పోలీసు విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడం, మానసిక స్థైర్యం పెంపొందించుకోవడం, క్రమశిక్షణతో విధులు నిర్వహించడం వంటి అంశాలపై ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పి.టి.సి ప్రిన్సిపల్ శ్రీమతి జి.ఆర్. రాధిక ఐపిఎస్, వైస్ ప్రిన్సిపల్ శ్రీ డి. లక్ష్మణ కుమార్, డి.టి.సి వైస్ ప్రిన్సిపల్ శ్రీ గురునాథ్ బాబు పాల్గొన్నారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ ట్రైనర్లు డా. కె.టి.సి పాపారాయుడు, వెంకట్ గార్లు అభ్యర్థులకు శిక్షణ అందించారు. ఈ శిక్షణ పోలీసు అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం, నైతిక విలువలు పెంపొందించిందని నిర్వాహకులు తెలిపారు.

కామారెడ్డి

ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో హెల్మెట్ నమూనా ఆవిష్కరణ..

– రోడ్డు భద్రతకు మంత్రి సీతక్క పిలుపు! కామారెడ్డి,20 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడా లనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “ఆరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క (దానసరి అనసూ య) నూతన హెల్మెట్ నమూనాను కామారెడ్డి పట్టణంలో ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి సీతక్క ప్రజలకు స్పష్టం చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారు లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హైదరాబా ద్. ఈ కొత్త హెల్మెట్ భద్రతా ప్రమాణాలకు అనుగు ణంగా ఉండటంతో పాటు తేలికగా, సౌకర్యవంతం గా రూపొందించబడిందని తెలిపారు. యువత నుంచి అన్ని వయస్సు వారు దీనిని నిత్యం వాడే లా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్య మని చెప్పారు.ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాలను తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుం టోందని, “ఆరైవ్ అలైవ్” ద్వారా ప్రజల్లో భద్రతా స్పృహ పెంచుతున్నామని మంత్రి వెల్లడించారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు సహక రించాలని పిలుపునిచ్చారు. అనంతరం సర్పంచ్ ల సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు పని చేయాలి. మంత్రి సీతక్క, కలెక్టర్ సూచనలు! గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రతి సర్పంచ్ పని చేయాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆదేశిం చారు.గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యా నికి పునాది అని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రభు త్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయా లని సూచించారు.త్రాగునీరు, పారిశుధ్యం, రహదా రులు, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయా లకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సీతక్క చెప్పా రు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అర్హులకు చేరవేయడంలో సర్పం చులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రజల తో నిరంతర సమన్వయంతో పారదర్శక పాలన సాగించాలని పిలుపునిచ్చారు.గ్రామాలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచిం చారు. గ్రామ పంచాయతీలు మౌలిక సదుపాయా ల కల్పనలో కీలకమని, పరిశుభ్రత, త్రాగునీరు, పచ్చదనం, విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, నాణ్యత, పారదర్శకతతో పని చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులకు బ్రాహ్మణపల్లి లోని స్మశాన వాటికలో చెత్త వేస్తూ గత 20 రోజులు నుంచి కుప్పలు తిప్పలుగా పేరుకుపోయిన చెత్తను నిప్పు పెట్టి పొగ తో రహదారి వెంట వచ్చి పోయే వాళ్లకు అధికారులు కు స్వాగతం పలుకుతున్నారు రాష్ట్రంలో చెత్త బహిరంగంగా కాల్చడం నిషేధం అయినా అధికారులు అమలు చేయట్లేదని ప్రజలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ పార్టీలో చేరిన సింగారం గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియుయువత

ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి జనవరి 20 ఈరోజు ముస్తాబాద్ మండలంలోని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కే.కే. మహేందర్ రెడ్డి గారి స్వగృహంలో ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఆ గ్రామానికి చెందిన పలువురు నాయకులు మరియు యువత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరినీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కే.కే. మహేందర్ రెడ్డి గారు సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతోనే తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కొత్తగా చేరిన నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, ప్రజల పక్షాన తీసుకుంటున్న నిర్ణయాలే తమను ఆకర్షించాయని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్న డా. అన్నపూర్ణ వరద రాజులు గారు

భారతదేశానికి గర్వకారణం. ప్రకాశం జిల్లా మూలాలు కలిగి, ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన ఎంఎస్సీ, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టరల్ ఫెలో పూర్తి చేసి 33 సంవత్సరాలకు పైగా అకాడమిక్, పరిశోధనా సేవలందించారు. 250కి పైగా పరిశోధనా పత్రాలు, 8 పుస్తకాలు, 24 అంతర్జాతీయ, 77 జాతీయ సదస్సుల్లో పాల్గొన్న ఆయన పరిశోధన రంగంలో విశేష గుర్తింపు పొందారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన టాప్-2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో 2021–2025 వరకు వరుసగా చోటు దక్కించుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. మూలంగా ప్రకాశం, ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు చెందిన అన్నపూర్ణ వరద రాజులు గారు ఎంఎస్సీ, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టరల్ ఫెలో చేసి శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో 33 సంవత్సరాలకు పైగా అకాడమిక్ సేవలందించారు. అనేక పరిశోధనా సంస్థల్లో, పరిశోధనా యూనివర్సిటీలలో ఆయన కీలక పాత్రలు నిర్వహించారు. పరిశోధన రంగంలో ఆయన చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అనేక అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధన వ్యాసాలు ప్రచురితమై ఆయన ఖ్యాతిని మరింత పెంచాయి. అన్నపూర్ణ వరద రాజులు గారు ఇప్పటి వరకు 250కి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించి, దేశవిదేశాల్లో అనేకమంది విద్యార్థులకు పరిశోధనా మార్గనిర్దేశం చేశారు. అంతేకాకుండా శాస్త్ర సాంకేతిక రంగంలో అనేక కీలక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలో 8 పుస్తకాలు ప్రచురించగా, వివిధ శాస్త్రీయ సదస్సుల్లో 24 అంతర్జాతీయ, 77 జాతీయ స్థాయి పరిశోధన పత్రాలు సమర్పించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఆయన చేసిన సేవలకు దేశ విదేశాల్లో అనేక పురస్కారాలు లభించాయి. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన టాప్-2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా 5 సంవత్సరాలు (2021–2025) చోటు దక్కించుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సేఫ్టీ అండ్ క్లైమేట్ (FRSC), ఫుడ్ అండ్ ఎన్విరాన్మెంట్ (FCEnv) వంటి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అకాడమిక్ సంస్థల్లో సభ్యత్వం పొందిన ఆయన, శాస్త్ర రంగంలో భారతదేశానికి గౌరవాన్ని మరింత పెంచుతున్నారు.

ఖమ్మం

వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన వాసవి క్లబ్ ఖమ్మం అధ్యక్షులు ఆచంటి కోటేశ్వరరావు.

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం నగరంలోని ట్రంక్ రోడ్డుపై ఉన్న కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వ ఖమ్మం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకములు, అర్చనలు నిర్వహించగా, అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ చైర్మన్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ గారికి క్లబ్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రేటర్ ఖమ్మం వాసవి క్లబ్ అధ్యక్షులు శ్రీ ఆచంటి కోటేశ్వరరావు, కోశాధికారి శ్రీ తాటికొండ అరవింద్ కుమార్, గౌరవ సభ్యులు శ్రీ కొంకిమళ్ళ మృత్యుంజయ రావు, సభ్యులు నాగేశ్వరరావు, రాజేందర్ పాల్గొన్నారు. అలాగే వాసవి వనిత క్లబ్ సభ్యులు కూడా సహకరించి కార్యక్రమాన్ని మరింత ఘనంగా విజయవంతం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.