Friday, 6 March 2026

Blog

ప్రకాశం

దర్శి లో సబ్ జైలు సిబ్బందికి కరోనా పరీక్షలు

దర్శి లోని సబ్ జైలు సిబ్బందికి కరోనా పరీక్షలను నిర్వహించారు. అంతేకాక సబ్ జైలు నందలి ఖైదీలకు కూడా ఈ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చందలూరు వైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్ తదితర సిబ్బంది ఈ పరీక్షలను నిర్వహించారు.

Featured

ప్రభుత్వ మధ్యo షాపులు ఉద్యోగులు ధర్నా

ఆంధ్రప్రదేశ్   ప్రభుత్వo వారు ప్రతిష్ఠాత్మక ముగా ప్రవేశపెట్టిన మద్య పాన నిషేధం లో భాగంగా ప్రకాశం జిల్లా  నoదు  91 ప్రభుత్వ  మధ్యo షాపులు తొలగించారు. ఆ మద్యo  షాపులు యoదు పని చేయుచున్న  ఉద్యోగుల ను తొలగించారు. ప్రస్తుతo  వారి కుటుంబాలు రోడ్డు న పడ్డాయి. తొలగించ బడిన ఉద్యోగులు వారికి వేరే ప్రత్యామ్నాయo చూపించి వారి కుటుంబాల ను ఆదుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా   నoదు  తొలగించబడిన  ఉద్యోగులు  పాల్గొన్నారు.  

Featured

పి పి ఈ కిట్స్ అందజేసిన మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు

రాపూరు, జూన్ 01, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : వెంకటగిరిలో నూతనంగా ప్రారంభించిన ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక స్పందన కార్యాలయంలో వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం, బంగారు పేట మరియు జి కే పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో మరియు స్థానిక మున్సిపల్ , రెవెన్యూ ,పోలీస్ అధికారులతో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కొవిడ్ నివారణకు చేపట్టాల్సిన చర్యల పై కూలంకుషంగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఆనం ఏర్పాటు చేసిన కరోనా వారియర్ కిట్స్ ను వైద్య ఆరోగ్య ,మున్సిపల్ , పోలీస్, రెవెన్యూ సిబ్బందికి అందించిన ఆనం.ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ బల్లి దుర్గా ప్రసాద్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర గారు తదితరులు పాల్గొన్నారు.

Featured

నెల్లూరు జిల్లా పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్. పి.యల్ నరసింహ రావు ఆధ్వర్యంలో సమావేశము

రాపూరు, జూన్ 01, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు ప్రాంతీయ పశు వైద్యుశాల నందు నెల్లూరు జిల్లా పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్. పి.యల్ నరసింహ రావు ఆధ్వర్యంలో సమావేశము జరిగినది ఇందీలో ముఖ్యముగా గాలికుంటు వ్యాధి కి సంబంధించి టీకాలు వేయడం అలాగే ఐ ఎన్ ఏ పి హెచ్ కమ్మలు పశువులకు వేయడం మొదలైన వాటి మీద సమీక్ష నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమము NADCP లో భాగంగా దేశం మొత్తం గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం ఫిబ్రవరి 2017 న ప్రారంభించడం జరిగినది ఇందులో భాగంగా ప్రతి పశువులకు చెవి కమ్మ వేసి గాలికుంటు టీకాలు వేసి ఆన్లైన్ చేయవలసి ఉన్నది 22 మార్చి 2020 నుండి కోవిడ్-19 కారణంగా ఈ టీకాల కార్యక్రమము అర్ధాంతరంగా నిలిచిపోయింది మరలా లాక్ డౌన్ సరలింపు ఇచ్చినందున ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభించడం జరిగినది. కానీ ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలో టీకాల కార్యక్రమం నెమ్మదిగా జరుగుతున్నదని సిబ్బందిని ఉత్తేజపరచి తిరిగి పూర్తి వేగాన్ని అందుకునే విధంగా ప్రోత్సహించాలని 100% టీకాలు కార్యక్రమమును పూర్తి చేయవలసిందిగా సిబ్బందికి నిర్దేశిక ప్రణాళికలను తెలియజేశారు తదుపరి రైతు భరోసా కేంద్రాల నందు పశు ఆరోగ్య గుర్తింపు కార్డులను అందించడం జరిగిందని ఈ సమావేశంలో తెలియజేశారు ఈ సమావేశానికి రాపూరు ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ సి హెచ్ రామచంద్ర రావు, సైదాపురం మరియు గిద్దలూరు, సంక్రాంతి పల్లి పశు వైద్యాధికారులు డాక్టర్ బొడ్డు ప్రసాద్, డాక్టర్ నాగార్జున దీపక్,డాక్టర్ మహిత తేజ్,VLO లు ఎం ప్రసాద్, మురళీకృష్ణ, L Aవిజయ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

రిమ్స్ ను సందర్శించిన న్యాయమూర్తి

శ్రీకాకుళం : నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)ను సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జయలక్ష్మి సోమవారం సందర్శించారు. ఇటీవల వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, రిమ్స్ క్వారంటైన్ లో ఉంటున్న వారిని పరామర్శించి, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీరిని త్వరగా హోం క్వారంటైన్ కు  పంపించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.

ప్రకాశం

వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే

మార్కాపురం పట్టణంలో సోమవారం and జరిగిన తెలుగుదేశం పార్టీ మార్కాపురం పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీ షైక్ ఆదాము సాహెబ్ ద్వితీయ కుమారుని వివాహానికి విచ్చేసి నూతన వదువరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మార్కాపురం మాజీ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి.

Featured

కళ్ళులేని కబోది ఎవరు మీరా మేమా

పొదలకూరు మండలం మొగళ్లూరు వద్ద నీళ్లు లేక ఎండిన కండలేరు ఎడమ కాలువలో మీడియాతో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు.. కండలేరు ఎడమ కాలువ లిఫ్ట్ ఆన్ చేసి రెండు నెలలవుతోంది. లిఫ్ట్ ఆన్ చేసి నిమ్మతోటలను కాపాడాలని మా నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరితే నోటికొచ్చినట్టు మాట్లాడుతారా పొదలకూరు మండలంలోని ఎడమ కాలువకు నీళ్లివ్వమంటే వెంకటగిరి నియోజకవర్గంలోని పిన్నేరు కాలువకు నీళ్లిచ్చామంటారా నోటికొచ్చినట్టు మాట్లాడే నాయకులు కండలేరు ఎడమకాలువలోకి వచ్చి చూడండి కళ్లు ఎవరికి కనబడటం లేదో తెలుస్తుంది కండలేరు డ్యాంలో 3 టీఎంసీల నీళ్లున్నప్పుడే రైతుల కోరికమేరకు మా నాయకుడు సోమిరెడ్డి 15 రోజులకు ఒకసారి నీళ్లిచ్చి నిమ్మతోటలను కాపాడిన విషయం మీరు మరిచిపోయినా.. రైతులు మరిచిపోరు ఇప్పుడు 26 టీఎంసీలున్నా నీళ్లు విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడమే కాకుండా, నీళ్లివ్వమని కోరిన వారిపై కల్లు తాగిన కోతుల్లా మాట్లాడటాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం వావింటపర్తి పంచాయతీ కూడా పొదలకూరు సర్కిల్ పోలీసుస్టేషన్ పరిధిలోనిదే అనే విషయాన్ని దాచిపెట్టాలనుకుంటున్నారా ఊచపల్లిలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి ఇరువర్గాలను సీఐ పిలిచి మందలించి పంపేస్తే, ఎస్సై టీడీపీ కార్యకర్తలను రెండోసారి పిలిచి రాత్రంతా పొదలకూరు స్టేషన్ ఉంచి ఇబ్బంది పెట్టడం వాస్తవం కాదా అవినీతి గురించి మీరా మాట్లాడేది దోచుకుని దాచుకుంటున్నదెవరో మీ పార్టీ ముఖ్య నాయకులే చెబుతున్నారు ఏడాదిలోనే జరిగిన అవినీతిని లెక్కలతో సహా చెప్పిన మీ నాయకుల మాటలను సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ వింటున్నారులే ఎవరి ప్రభుత్వంలో అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా అవాస్తవాలు మాట్లాడటం మానుకుని కండలేరు నుంచి నీళ్లు వదిలి నిమ్మ తోటలను కాపాడండి. ఈ కార్యక్రమంలో లో పొదలకూరు మండలం టిడిపి నాయకులు రఘురామి రెడ్డి, మల్లికార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Featured

త్రాగునీటికోసం వచ్చిన మచ్చల జింక – త్రుటిలో తప్పిన ప్రమాదం.

 01-06-2020 *బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్)* బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఇసుక పాలెం గ్రామపంచాయతీ పల్లప్రోలు గ్రామ సమీపంలోని మలిదేవి వాగుకు సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ వేసవి నీటి ఎద్దడి కి త్రాగు నీటి కోసం వచ్చిన మచ్చల జింక ప్రమాదవశాత్తు కాలువలో పడింది. ఘటనా స్థలానికి సమీపంలో అటుగా వెళ్తున్న ఇస్కపాలెం గ్రామ వాలేంటర్ కిరణ్ అనే వ్యక్తి జింక ను కాపాడడం జరిగింది. గతంలో కూడా జింకల గుంపు ఇదే మలిదేవి వాగు దగ్గరకు మంచి నీటి కొరకు రావడం అనేది చాలా సార్లు జరిగింది. గ్రామ వాలేంటర్ కిరణ్ విఆర్ఓ కీ సమాచారం అందించడంతో వారు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మచ్చల జింక ను తీసుకెళ్లడం జరిగింది.

Featured

బుచ్చిరెడ్డిపాలెం నివాసి గండికోట సుధీర్ కుమార్ కు జాతీయస్థాయి ప్రశంశా పత్రం.

01-05-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని దొడ్ల పద్మిని ఉమామహేశ్వరి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జిల్లా రిసోర్స్ సభ్యులుగా పనిచేయుచున్న గండికోట సుధీర్ కుమార్ కు జాతీయ స్థాయి ప్రశంసాపత్రం లభించింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వే ఫౌండేషన్ ఎన్జీవోస్ కాన్సార్టియం మరియు వైద్యులు నిర్వహించిన జాతీయ స్థాయి వెబినార్ లో పాల్గొని *” పొగాకు కారకాలు – అనారోగ్య హేతువులు “* అనే అంశంపై ప్రసంగించినందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తూ ఆన్లైన్ ద్వారా ప్రశంసా పత్రం అందజేసినట్టు గండి కోట సుధీర్ కుమార్ వివరించారు. పోగాకులో 64 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయని ముఖ్యంగా యువత పోగాకుకు బానిసలవడం తనని తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశంసా పత్రం అందుకున్న గండికోట సుధీర్ ని మండల విద్యాశాఖాధికారి దిలీప్ కుమార్ మరియు సహోపాధ్యాయులు పలువురు అభినందించారు.

Featured

పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత- సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్దన్ రెడ్డి

01-06-2020 (పున్నమి ప్రతినిధి)రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలను వ్యర్థరహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మనం-మన పరిశుభ్రత’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నారు. ఆరు నెలల్లో వ్యర్ధరహిత గ్రామంగా మార్చేందుకు పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలం నుంచి రెండు గ్రామ పంచాయతీలను ఎన్నుకుంటారు. ప్రజలకు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడం తద్వారా గ్రామాన్ని వ్యర్ధరహిత గ్రామంగా తీర్చిదిద్దడం ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. వ్యర్థాలను సేకరించినందుకు గాను గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి రోజూ లేదా వారానికి .ప్రతి ఇంటి నుంచి రోజుకు రూ.2 చొప్పున నెలకు రూ.60 చెల్లించాలి. దీని ద్వారా 500 కుటుంబాలకు రూ.30 వేలు వస్తుంది. ఈ నగదును ఎంపిక చేసిన గ్రామ వాలంటీర్‌, గ్రామ పెద్ద పేరుతో సంయుక్తంగా బ్యాంకు ఖాతాను తెరచి జమ చేస్తారు. పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షించి, పంచాయతీలో పని చేసే గ్రీన్‌ అంబాసిడర్లు ఇద్దరు, ఒక గ్రీన్‌ గార్డుకు మొత్తం ముగ్గురికి రూ.6వేల చొప్పున రూ.18 వేలు నెలకు చెల్లించాలి. మిగిలిన రూ.12 వేలను చెత్త రవాణా చేసే వాహనాల మరమ్మతులు, ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌ ప్రాంగణంలో పచ్చదనం పెంపు, చీపుర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు ఉపయోగిస్తారు. మనం- మన పరిశుభ్రత కార్యక్రమాన్ని మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రారంభించారు.మొదట అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు ఆయన మాట్లాడుతూ కరోనా వలన ఊహించని పరిస్థితి లను మూడునెలలు ఎదుర్కొన్నామన్నారు. గ్రామాలన్నీ సామరస్యంగా వుండేందుకుకృషి చేస్తామన్నారు..ఎవరు ప్రభుత్వానికి సలహాలుఇవ్వాల్సినఅవసరంలేదని మాజీమంత్రి సోమిరెడ్డి ని పరోక్షంగా విమర్శించారు.సంక్షేమ పథకాలకు సంబంధించిక్యాలెండర్ ప్రకటించిన ఘనత ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో తనను భాగస్వామ్యం చేసినందుకు అందరికి ధన్యవాదములు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి ,బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,కడివేటిచంద్రశేఖర్ రెడ్డి,చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అన్న మాల ప్రభాకర్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్,ముంగర విజయభాస్కర్ రెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,బుజ్జిరెడ్డి,రమణకుమార్ రెడ్డి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.