Friday, 6 March 2026

Blog

ప్రకాశం

ఎంపీ తలారి రంగయ్య ను సన్మానించిన దర్శి నియోజకవర్గ బీసీ నాయకులు

అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య విజయవాడ వెళ్తూ దర్శి లో దర్శి నియోజకవర్గ బీసీ నాయకులు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు .వాల్మీకి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్శి నియోజకవర్గ బీసీ కోర్ కమిటీ సభ్యులు, టీచర్ మీనీగ శ్రీను ఏర్పాటుచేసిన అల్పాహార విందులో పాల్గొని బీసీల హక్కుల పోరాటం గురించి బీసీల ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అని చెప్పి వారు ఉద్ఘాటించారు. అనంతరం వారిని బిసి సంఘ నాయకులు దుశాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల బిసి ప్రధాన కార్యదర్శి విజ్జగిరి శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షులు వరకాల వెంకటేశ్వర్లు దర్శి పట్టణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు అంకాల శ్రీను కోర్ కమిటీ సభ్యులు ప్రముఖ న్యాయవాది గడ్డి శ్రీనివాసులు, అన్నవరపు వెంకటేశ్వర్లు, బల్లగిరి శ్రీనివాసులు, ముండ్లమూరు మండల బీసీ నాయకులు మీనిగ వెంకటేశ్వర్లు, పూరిమెట్ల ఎంపీటీసీ చింతలపల్లి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ చొప్పవరపు సుబ్బారావు మరియు బీసీ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తృటిలో తప్పిన పెను ప్రమాదం

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం లో పెను ప్రమాదం తప్పింది.ఆలమూరు మండలం మడికి నుంచి కడియం మండలం దుళ్ల వెళ్లే కాలువగట్టు రోడ్డు ఇది.ఈరోజు ఒక ఇంటిముందు ఇద్దరు యువకులు మాట్లాడు కుంటున్నారు. ఇంతలో ఓ కొబ్బరి చెట్టు విద్యుత్ స్తంభంపై పడిపోతుండటంతో ఆ స్థంభం కూడా నేల కూలింది.పడిపోవడం గమనించిన యువకుడు మరో యువకుడిని అప్రమత్తం చేసాడు. ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.అదృష్టం ఉండటం అంటే ఇదేమరి అని పలువురు అనుకుంటున్నారు.  

Featured

కామ్రేడ్ దామా అజయ్ ఇకలేరు .

కావలిలో ఎంతోకాలం న్యాయవాదిగా తన సేవలు ప్రజలకు అందించిన కామ్రేడ్ దామా అజయ్ కుమార్ కాసేపటి క్రితం హైద్రాబాద్ స్టార్ హాస్పిటల్ లో కన్ను మూశారు . కొద్ది సంవత్సరాలుగా హైద్రాబాద్ లోని నిజాంపేట లో కాపురముంటున్న దామా అజయ్ కుమార్ ఉదయం గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయన్ను స్టార్ హాస్పిటల్ కు తరలించారు . చికిత్స పొందుతూ అక్కడ మరణించారు . తండ్రి కామ్రేడ్ దామా చెంచెయ్య కుమారుడైన దామా అజయ్ కుమార్ తండ్రి బాటనే ఎన్నుకున్నాడు .విప్లవ సాహిత్యానికి ఆకర్షితుడైన అజయ్ – అన్యాయాల్ని ఎదుర్కొనడంలో ముందుండేవారు . తండ్రి దామా చెంచెయ్య గారు ఇటీవల మరణిస్తే – ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామమైన సాయిపేట కు తీసుకొని వచ్చి స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు అజయ్ కుమార్ . తండ్రి దామా చెంచెయ్య చనిపోయిన కొద్ధి మాసాలకే కుమారుడు అజయ్ కుమార్ తుది శ్వాస వదిలడం ఆ కుటుంబానికి, సన్నిహితులకు తీరని శోకం మిగిల్చింది

Featured ఆంధ్రప్రదేశ్

హౌసింగ్‌పై సీఎం వైయస్‌ జగన్‌ కీలక నిర్ణయం

    గత ప్రభుత్వం పెట్టిన రూ.1,323 కోట్ల బకాయిలు చెల్లించాలని  ఆదేశం   తాడేపల్లి: పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హౌసింగ్‌పై గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను పేదలకు చెల్లించాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ హౌసింగ్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో పేదలకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 3,38,144 ఇళ్లకు గాను రూ.1323 కోట్లు చెల్లించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. గత ప్రభుత్వం బకాయిలు పెట్టినా.. పేదలకు అండగా నిలవాల్సిన అవసరముందన్న సీఎం అన్నారు. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా చెల్లింపులు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.  

E-పేపర్ Featured ఆంధ్రప్రదేశ్ చిత్తూరు

తాగునీటి సమస్యలకు రూ .1.40 కోట్లు మంజూరు ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా

నగరి నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్న 96 గ్రామాలను గుర్తించి పరిష్కారం కోసం రూ .1.40 కోట్లు మంజూరు చేయించినట్లు నగరి ఎమ్మెల్యే , ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్.కే. రోజా తెలిపారు . మంగళవారం ఆమె నగరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు . ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా నిధులు విడుదల చేసి తాగునీటి సమస్య పరిష్కారం కోసం 96 గ్రామాల్లో బోర్లు వేయించేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు . ఇందుకుగాను 80 పనులను గుర్తించి ఆ దిశగా జిల్లా కలెక్టర్ కు ఆర్ డబ్ల్యు ఎస్ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు . దీంతో ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు చర్యలు చేపట్టడంతో పాటు తాగునీటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని రోజా వివరించారు . ఆ దిశగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులను వేగవంతం చేయాలని మండలాల అధికారులకు సూచించారు . గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమైతే గ్రామీణ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే రోజా కు రుణపడి ఉంటారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు .

Featured

వలస కూలీలకు ఆహారం అందజేత

నెల్లూరు జిల్లా తడ మండలంలో ఉన్న మండల అధికారి కార్యాలయం దగ్గర వేచి ఉన్న వలసకూలీలకు  చేనిగుంట గ్రామానికి  చెందిన కారిమేటి శ్రీరాములు గారు ఆహార పొట్లాలు ఈ రోజు అందజేశారు.

Featured

జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ డైరెక్టర్ (హెల్త్) స్టేట్ అధికారి రాజేంద్రప్రసాద్.

02-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే సమావేశము జరుపుకుంటున్న నేపథ్యంలో లో హెల్త్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ (హెల్త్) రాష్ట్ర అధికారి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు వివిధ కార్యక్రమాలను గురించి చర్చించడం జరిగినది. దానిలో భాగంగానే 5th ఫేస్ హౌస్ సర్వే, household వారి ఇంటి వద్దనే ఆన్లైన్ చేయవలెను అని చెప్పడం జరిగినది. ఒకే దగ్గర ఉండి సర్వే గ్రామాలను గుర్తించి వారికి తగు సూచనలు చేయడం జరిగినది. ఇమ్యునైజేషన్ 100% అచీవ్ అవ్వాలని ఏదైనా మిగిలి ఉంటే త్వరగా పూర్తిచేయాలని మెడికల్ ఆఫీసర్ గారికి సూచించడం జరిగింది. అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా వర్కర్లకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ ఆరోగ్య సేతు యాప్ ని డౌన్లోడ్ చేసి ఉన్నారో లేదో అని తనిఖీ చేయడం జరిగింది. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నటువంటి హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను ప్రతిరోజు గమనించి పై అధికారులకు రిపోర్ట్ చేయవలెనని సూచించడం జరిగింది. అదేవిధంగా బిపి మరియు గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారికి ముందుగానే SWAB పరీక్షలు చేయించాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ టెలిమెడిసిన్ కాల్ సెంటర్ నంబర్ 1 4 4 10 గురించి క్షేత్రస్థాయిలో అందరికీ తెలియజేసి అందరూ ఉపయోగించుకునేలా చూడవలెను అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ MD.నస్రీన్ భాను, మరియు కే.సుబ్బమ్మ, CHO, ఎస్.వి.సుబ్బారెడ్డి, MPHEO, బి.ఆరోగ్య మేరీ, HE, మరియు సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు.

Featured

సోమిరెడ్డి నీ సోది రాజకీయాలు ఆపు

  రాజకీయంగా పతనం అయినా బుద్ది మారలేదు నీ రాజకీయ అవసరాలకు కాలువలకు నీరు వదలరు నువ్వు మంత్రిగా ఉన్నపుడు రైతులు ట్యాంకర్లతో నిమ్మతోటలకు తోలుకున్న నీళ్ల బిల్లులు బేబులో వేసుకున్నావు రాజకీయంగా ఎప్పుడో చచ్చిపోయావు, ప్రజలు నిన్ను మర్చిపోయారు మంత్రిగా ఉండి భారీ మెజారిటీతో ఓడావు లో లెవల్ స్లూయీజ్ కు నీరు వదలమని నువ్వు చెప్పలేదా సోమిరెడ్డిపై ఎస్ఆర్ సీపీ నాయకుల ధ్వజం …………………………….. రాజకీయ మనుగడ కోల్పోయిన సోమిరెడ్డి సోది రాజకీయాలు చేస్తూ తానేదో రైతుల కోసం పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడని మండల వైఎస్ఆర్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. పొదలకూరు లో వారు మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. *వారేమన్నారంటే* ………………………. సోమిరెడ్డి రాజకీయ అవసరాలకు కాలువలకు నీటిని విడుదల చేయరు రైతుల అవసరాల మేరకే కాలువలకు నీటిని విడుదల చేస్తారు రైతుల సాగు, తాగునీటి అవసరాలు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన రెడ్డిగారికి తెలుసు లోలెవల్ స్లూయీజ్ కు నీటిని విడుదల చేయమని నువ్వు చెప్పలేదా ఇపుడు హైలెవల్ స్లూయీజ్ కు నీరువిడుదల చేయాలని నీ రాజకీయ మనుగడకోసం నీ మనుషుల ద్వారా అడిగిస్తున్నావు రైతులకు అవసరమైతే హైలెవల్ స్లూయీజ్ కు నీటిని విడుదల చేయిస్తాము, నువ్వు నీ రాజకీయ అవసరాలకు చెపితే విడుద చేయరు ఎడమకాలువ కింద నిమ్మతోటలు ఎక్కడ ఎండుతున్నాయో చెప్పగలవా? నువ్వు మంత్రి గా ఉన్నసమయంలో నిమ్మతోటలను బతికించుకునేందుకు రైతులు ట్యాంకర్లు పెట్టుకున్న బిల్లులను స్వాహా చేసిన చరిత్ర నీది రైతులు ఇప్పటికీ బిల్లులు వస్తాయని ఆశపడుతున్నారు నీ బ్రతుకంతా అవినీతి మయం, సర్వేపల్లి ప్రజలు ఎన్నిపర్యాలు ఛీకొట్టినా ఇంకా నియోజకవర్గాన్ని పట్టుకుని వ్రేలాడాలని చూస్తున్నావు మంత్రి హోదాలో ఐదోపర్యాయం అత్యంత దారుణంగా ఓడిపోయావు, నీకంటే అప్పటి జిల్లాకు చెందిన మరో మంత్రి నయం స్వల్ప మెజారిటీతో ఓడారు నీకు ప్రజలు రాజకీయ సమాది కట్టారు, నువ్వు ఔట్ డేటెడ్ పొలిటీషియన్ గా మిగిలిపోయావు పదవిలో ఉన్నంత కాలం అధికారులను బెదిరించి పబ్బం గడుపుకున్నావు, నీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు ప్రతిపక్ష ఎమ్మెల్యే గా కాకాణి గారు ఉన్నసమయంలోనే ఏమిచేయలేకపోయావు, ఇపుడేమి చేయగలవు అభివృద్ధి, సంక్షేమం గురించి నీలాంటి అవినీతి పరులు చెపితే చేసిపరిస్థితిలో లేము, ఏడాదిపాలనలో అన్ని వర్గాలవారు ఆనందంగా జీవిస్తున్నారు సమావేశంలో మండలపార్టీ అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చిన బ్రహ్మయ్య, మాజీ సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, నాయకులు వాకాటి శ్రీనివాసులురెడ్డి, దాదిబత్తిన విజయభాస్కరరెడ్డి, మొలబంటి శేఖర్ బాబు, ఎస్కే అంజాద్, సోమా భాస్కరరావు, ఎడమగట్టు కాలువ కింద ఉన్న గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ప్రకాశం

దర్శి లో సబ్ జైలు సిబ్బందికి కరోనా పరీక్షలు

దర్శి లోని సబ్ జైలు సిబ్బందికి కరోనా పరీక్షలను నిర్వహించారు. అంతేకాక సబ్ జైలు నందలి ఖైదీలకు కూడా ఈ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చందలూరు వైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్ తదితర సిబ్బంది ఈ పరీక్షలను నిర్వహించారు.

Featured

ప్రభుత్వ మధ్యo షాపులు ఉద్యోగులు ధర్నా

ఆంధ్రప్రదేశ్   ప్రభుత్వo వారు ప్రతిష్ఠాత్మక ముగా ప్రవేశపెట్టిన మద్య పాన నిషేధం లో భాగంగా ప్రకాశం జిల్లా  నoదు  91 ప్రభుత్వ  మధ్యo షాపులు తొలగించారు. ఆ మద్యo  షాపులు యoదు పని చేయుచున్న  ఉద్యోగుల ను తొలగించారు. ప్రస్తుతo  వారి కుటుంబాలు రోడ్డు న పడ్డాయి. తొలగించ బడిన ఉద్యోగులు వారికి వేరే ప్రత్యామ్నాయo చూపించి వారి కుటుంబాల ను ఆదుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా   నoదు  తొలగించబడిన  ఉద్యోగులు  పాల్గొన్నారు.  

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.