Friday, 6 March 2026

Blog

Featured

మీ – సేవలు ఇకపై సచివాలయంలోనే అందుబాటులో ఉంటాయి.

04-06-2020 బుచ్చిరెడ్డిపాలెం(పున్నమి విలేఖరి- జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెంలోని సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో నరసింహారావు, త‌హ‌సీల్దార్‌ షఫీ మాలిక్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వివిధ శాఖల అధికారులు ప్రజలకు అందిస్తున్న సేవలపై వారికి అవగాహన కల్పించారు. గతములో మీ -సేవ ద్వారా అందించే అన్ని రకాల సేవలను ఇకపై సచివాలయంలోనే ప్రజలకు అందించనున్నామని ఎంపీడీవో తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, డిజిటల్ అసిస్టెంట్ లు, వెల్ఫేర్ అసిస్టెంట్ లకు ఆన్ లైన్‌ సేవలను అందించడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కళ్యాణి, ఈవోపీఆర్డీ పెంచల శ్యామ్ పాల్గొన్నారు.

Featured

బుచ్చిరెడ్డిపాలెం లోని ఇస్కపాలెం గ్రామ పంచాయతీలో వై ఎస్ ఆర్ హౌసింగ్ స్కీమ్ ధరకాస్తుదారురుల వెరిఫికేషన్.

04-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఇస్కపాలెం గ్రామపంచాయతీ బిట్ 1 లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ 2020 ద్వారా రెండో విడత దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు వివరాల వెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది. ఎన్నికల ప్రచారం సమయంలో చేసిన వాగ్దానం ప్రకారం తమ సొంత ఇల్లు నిర్మించలేని రాష్ట్రంలోని పేద ప్రజలకు గృహాన్ని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జూలై 12, 2019 న వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ 2020 ను ప్రారంభించారు. ఈ పథకం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రధాన 9 వాగ్దానాల్లో ఒకటి. ఈ పథకానికి ఆయన తండ్రి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న పేరు పెట్టారు. ఈ పథకాన్ని అంతకు ముందు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం గా వ్యవహరించేవారు.YSR హౌసింగ్ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక బలహీన విభాగం వర్గం పౌరుడికి రాష్ట్ర ప్రభుత్వ చొరవ. రాష్ట్ర ప్రభుత్వం అన్ని లబ్ధిదారులకు పక్కా గృహాన్ని అందించబోతోంది, దీని కోసం రాష్ట్ర బడ్జెట్ కింద రూ.1280 కోట్లు కేటాయించారు.ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి బి. రాజేంద్రనాథ్ రెడ్డి మొదటి రాష్ట్ర బడ్జెట్ సమయంలో ప్రకటించారు. ఈ గృహ పథకం ముఖ్యంగా రాష్ట్రంలోని EWS/MIG/LIG వర్గం ప్రజలకు. ఈ కార్యక్రమంలో ఇస్కపాలెం బిట్ 1 వి ఆర్ ఓ శ్రీనివాసులురెడ్డి, వి ఆర్ ఏ లు రమణయ్య, యాదగిరి, ఆ ఏరియా వాలేంటర్ బబ్లూ పాల్గొన్నారు.

Featured

నాడు-నేడు పనులు సకాలం లో పూర్తి చేయాలి

04-06-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం మనుబోలు జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు నేడు పథకంలో భాగంగా మొదటి ఫేస్ లో జరుగుతున్న పనులను డిప్యూటీ డి.ఈ రాధాకృష్ణ పరిశీలించారు .ఆయన మాట్లాడుతూ మనుబోలు మండలం లో నాడు-నేడు ఫస్ట్ ఫేస్ కి సంబంధించి 20 స్కూల్స్ ని ఎంపిక చేయడం జరిగిందని వీటి పనులకు సంబంధించి నాలుగు కోట్ల నలబై రెండు లక్షల నాలుగు వేల రెండు వందల తొంబై ఒక్క రూపాయలు మంజూరు అయినవి అని తెలిపారు . మొత్తంపదహారు స్కూల్ లలో ప్రహరీ గోడనిర్మించవలసివున్నదని తెలిపారు .మొత్తం తొమ్మిది రకాలపనులుచేయవలసిఉందన్నారు .పెయింటింగ్ ,ఎలక్ట్రికల్ ,ప్లంబింగ్ ,శానిటేషన్,మేజర్ అండ్ మైనర్ వర్క్ , మినరల్ వాటర్ స్కూల్ కి అవసరమైన టేబుల్స్ మొదలైనవన్నీ జూలై 31 కి పూర్తి చేయవలసిందిగా ఆదేశించామన్నారు ఆగస్టు మూడు కి స్కూల్స్ ప్రారంభించే టప్పటికీ అన్ని వసతులతోతీర్చిదిద్దుతామని తెలియజేశారు .మనుబోలు లోని చంద్రమౌళినగర్ నందు మరియు బద్దవోలు, వెంకన్నపాలెం నందు గల స్కూల్ నందు జరుగుతున్న పనులను పరిశీలించారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి,నాడు నేడు మనుబోలు ఏ.ఇ సుబ్బరాయలు, జడ్పీ బాయ్స్ హెడ్ మాస్టర్ ఎం.రమేష్ కుమార్ ,జడ్పీ గర్ల్స్ హెడ్మాస్టర్ జె.పద్మజ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

*నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర* 

*నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర* ఆంద్రప్రదేశ్ లో నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్రలో భాగంగా ఈ రోజు లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయనుంది.ఈ పధకం ద్వారా *2,62,493* మందికి *262,49కోట్లు* ఆర్థిక సాయం అందనుంది.   స్వంత వాహనం కలిగిన.ఆటో. టాక్సీ.మ్యాక్సీ క్యాబ్. డ్రైవర్ల బ్యాంక్ అకౌంట్లోఈ రోజు జమ కానుంది   గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా. *37,756* మంది లబ్ధిదారులజాబితాలోచేరారు. కాగా ఈపధకం కింద ప్రతి ఏటా రూ. పది వేలుఇవ్వనున్నారు.

ప్రకాశం

సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన వాహనమిత్ర లబ్ధిదారులు

దర్శి, జూన్ 4, 2020(పున్నమి విలేఖరి):  మల్లవరం గ్రామంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనీమూన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఎంఎల్ఎ కుందురు నాగార్జున రెడ్డి పాలాభిషేకం నిర్వహించిన వైస్సార్ వాహనమిత్ర పథకం లబ్ధిదారులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనీమూన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కరోనా కారణంగా పనుల్లేక, క్యాబ్‌లు తిప్పేందుకు వీల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిన ఈరోజుల్లో, ఎవరూ అడగకుండానే ఈ ఏడాదికి గాను నాలుగు నెలలు ముందుగానే వైస్సార్ వాహన మిత్ర పధకం కింద రూ.10 వేల సాయం అందించిన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. లబ్ధిదారుల్లో అత్యధికులు బిసిలే అని తెలియచేసారు. ఈ సంవత్సరం 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేలు చొప్పున జమ చేయబోతున్నారు అన్నారు.  మొత్తం లబ్ధిదారుల్లో 61,390 మంది ఎస్సీలు, 1,17,096 మంది బీసీలు, 14,592 మంది ఈబీసీలు, 29,643 మంది కాపులు, 10,049 మంది ఎస్టీలు, 28,118 మంది మైనార్టీలు, 581 మంది బ్రాహ్మణులు, 1,026 మంది క్రైస్తవులు ఉన్నారు. అడగకుండానే ఆదుకుంటున్నారు. కరోనా కారణంగా పనుల్లేక, ఆటోలు తిప్పలేక అనేక ఇబ్బందులు పడుతున్న రోజుల్లో మేం అడగకుండానే నాలుగు నెలలు ముందుగానే రూ.10 వేల సాయం అందించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. గతేడాది అందించిన ఆర్థిక సాయంతో వాహనాలకు బీమా, ఫిట్‌నెస్, మరమ్మతులు చేయించుకున్నాం. తాళ్లూరి యోహాను, ఆటోడ్రైవర్, మల్లవరం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనీమూన్ శ్రీనివాసరెడ్డి, వైస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులు, చిన్నబ్బయ్య, మాజీ ఎంపీపీ వై వెంకటేశ్వర్లు, ఆర్. శ్రీను, ఆర్. హనుమంతరావు, ఆర్. నరసింహారావు, యేసురావు, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Featured

వాకాటి స్వగ్రామంలో నిత్యవసర సరుకులు పంపిణి

తడ మండలం చేనిగుంట గ్రామంలో BJP పార్టీకి చెందిన జిల్లాMLC వాకాటి నారయణరెడ్డి ఆయన సొంత స్వగ్రామమైన చేనిగుంటలో ఆయన సొంత నిధులతో సుమారు 10లక్షల రూపాయలతో నిత్యవసర సరుకులు పంపిణి చేసారు. గ్రామంలో ఒక్కో కుటుంబానికి 20kg బియ్యం, 1 kg నూనె,1 kg కందిపప్పు,1kg పెసలపప్పు, 1kg ఉల్లిపాయలు, ఆడవారికి చీర,మగవాళ్ళకు పంచెలు 450 మంది కుటుంబాలకు పంచి పెట్టారు.. కార్యక్రమంలో BJP తిరుపతి పార్లమెంట్ అద్యక్షుడు దయకర్ రెడ్డి గారు, సూళ్లూరుపేట నియోజకవర్గ BJPపార్టీ కన్వీనర్ క్రిష్ణమూర్తి, గ్రామస్థులు పాల్గొన్నారు .

ఆంధ్రప్రదేశ్

టీచర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్

ప్రభుత్వ టీచర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. టీచర్ల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సీఎం ఆదేశాలకు మేరకు త్వరలోనే(పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాక) ప్రక్రియ స్టార్ట్ చేస్తామని, స్కూళ్లు ప్రారంభమయ్యేలోపు ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామన్నారు.   వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయని మంత్రి చెప్పారు. ట్రాన్సఫర్ల కోసం టీచర్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, రెకమెండేషన్ల అవసరం లేదని మంత్రి అన్నారు. విద్యార్థులు లేరన్న సాకుతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నారనే ఆరోపణలపై మంత్రి స్పందించారు. అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చారు.

Featured

రోడ్డును కప్పేసిన ముళ్ల పొదలు- రాకపోకలకు అంతరాయం

రోడ్డును కప్పేసిన ముళ్ల పొదలు- రాకపోకలకు అంతరాయం పలమనేరు జూన్3,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం గంగవరం పంచాయతీ పరిధిలో గల కుర్నిపల్లి గ్రామం రహదారిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలు వర్షాలకు రోడ్డుపైకి పడిపోయాయి. గంగవరం పంచాయతీ కార్యదర్శులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఈ గ్రామీణ రహదారిల రహదారిలో కుర్నిపల్లి, చీళ్ళవారి పల్లి,ఒడ్డిఇండ్లు, ఉయ్యాల మిట్ట, తమ్మిరెడ్డి పల్లి, తాళ్లపల్లి ఏడురు,దండపల్లి పాటు ఇంకా పలు గ్రామాలు ఉన్నాయి. ఈ రహదారిపై ప్రతి రోజూ వందలాది మంది ప్రజలు, రైతులు వెళ్తుంటారు అలాగే ఆటోలు, ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాక్టర్లు, లారీలు, బస్సులు కూడా వెళుతుంటాయి పది గ్రామాల ప్రజలు ఈ రహదరిలోనే ప్రయాణిస్తుంటారు. ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది ఇలాంటి రహదారిలో వర్షాలకు రోడ్డుపై పడిపోయిన ముళ్ల పొదలను తొలగించాలని వారం రోజులుగా పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. ముళ్ళ పొదలు రోడ్డుపై పడిపోవడంతో దారి కనిపించకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై పడిపోయిన ముళ్ళ పొదలు తొలగించాలని పలువురు కోరుతున్నారు.

Featured

లబ్ధిదారుల నోట్లో మట్టి కొడుతున్నారు

పలమనేరు, జూన్3,2020(పున్నమి విలేకరి): ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకొంటూ,నాణ్యమైన ఇసుక కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరను మీసేవ ఆన్ లైన్ లో చెల్లించి నిబంధనలను పాటిస్తున్న లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టి చేతులు దులుపుకుంటున్నారు కొందరు అధికారులు..పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం గండ్రాజుపల్లెకు చెందిన బత్తి గౌడ్ కుమారుడు భానుచందర్ మే నెల 30వ తేదీన ఆన్ లైన్ ద్వారా ఇసుకకు డబ్బులు చెల్లించాడు. ఈ రోజు శంకర్ రాయల్ పేట రీచ్ నుండి ట్రాక్టర్ ద్వారా పంపిణీ చేశారు. ఇసుక కి బదులుగా బంకమట్టి, మట్టిని తోలారు. డ్రైవర్ ని ప్రశ్నించగా ఇసుక రీచ్ నుండి ఇదే ఇవ్వమన్నారు. దీని గురించి మాకు తెలియదు అని అన్నారు. దీంతో ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు తెలియజేసేందుకు ప్రయత్నించినా వారి నుంచి ఎటువంటి స్పందనా లేకపోయింది. దీనిపై ఉన్నతాధికారులైనా చర్యలు తీసుకొని లబ్దిదారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాడు. రీచ్ నుంచి తీసుకొచ్చిన బంకమట్టితో ఇళ్ళ నిర్మాణాలను చేపడితే మా పరిస్థితి ఏంటని బాధితుడు ప్రశ్నిస్తున్నాడు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Featured

మోర్ల భరత్ కుమార్ ను పరామర్శించిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి.

03-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం కు చెందిన వై సి పి నాయకుడు మోర్ల భరత్ కుమార్ సోదరుడు మోర్ల వేణు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మోర్ల భరత్ ను వారి కుటుంబసబ్యులను పరామర్శించారు. మృతికి గల వివరాలను అడిగి తెలుసుకొని సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట బుచ్చి నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాస రావు, వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి, సీతారామ రెడ్డి, మల్లికార్జునరెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, వైసిపి కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.