Thursday, 5 March 2026

Blog

Featured

కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాపూరు పోలీస్ స్టేషన్ కు శానిటైజర్,మాస్కులు పంపిణీ

రాపూరు, జూన్ 06, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణము లో వెంకటగిరి కి చెందిన కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాపూరు పోలీస్ స్టేషన్ కు శానిటైజర్,మాస్కులు మరియు ఆయుర్వేదిక్ మందులు ట్రైనింగ్ డిఎస్పి షేక్ .షాను చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ లోని సిబంధికి అందించారు ఈ కార్యక్రమంలో కవచ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుండు. మనోజ్ కుమార్ మాట్లాడుతూ కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెంకటగిరి నియోజకవర్గంలోని పేదలకు,చెల్లా యనాధులకు కరోనా కష్ట కాలంలో నిత్యావసర వస్తువుల, మస్కలు,శానిటైజర్ పంపిణీ చేశాము మరియు నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లు డక్కలి, సైదాపురం, బాలాయపల్లి,రాపూరు శానిటైజర్,మాస్కులు మరియు ఆయుర్వేదిక్ మందులు పంపిణీ చేస్తున్నము ఇలాగే ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తలియజేశారు ట్రస్ట్ సభ్యులు జల్లి. జోతిర్ మయ, విజయ్,రాజేష్ పాల్గొన్నారు.

Featured

దుగరాజపట్నం ( ఆర్మోగాన్ ) వెలుగు నీడలు

నా చిన్నప్పటినుండి వింటున్నాను! నెల్లూరుజిల్లాలోని దుగరాజపట్నాన్ని” పేద్ద ఓడ రేవుగా ” అభివృద్ధి చేస్తారని. ఎన్నికలు వచ్చినప్పుడల్లా నాయకులు తమకు అలవాటైన రీతిలో చేసే సొల్లు ప్రసంగాలకు దుగరాజపట్నం నెలవుగా ఉండటం తప్ప రాజకీయ నాయకులు చేస్తామన్న అభివృద్ధి జరిగింది లేదు సచ్చింది లేదు. అయిన కొత్తగా అభివృద్ధి ఇప్పుడు చేయడం ఏందీ ఎప్పుడో 2000 సంవత్సరాల కితమే దుగరాజపట్నం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ఉండింది. శాతవాహన కాలానికే వెలసివున్న దుగరాజపట్నం, తూర్పుతీరంలో ఎగుమతులు, దిగుమతులకు ప్రధాన రేవు పట్టణంగా ఉంటూ, మొన్నటి ఆంగ్లేయుల విస్తరణకు సైతం కేంద్ర బిందువైంది. ప్రధానంగా నీలిమందు, ఉప్పు, చక్కర, క్యాలికో గుడ్డలు, తదితర వస్తువులతో నిరంతర వాణిజ్యం జరిగేది. ఇక్కడి దొరికే కలంకారీ వస్త్రం భారతదేశంలోనే మన్నికైనదని, చౌకైనదని మేథోల్డ్ రాసాడు. గుడ్డ వెలిసిపోకుండా ఉంటూ, దాని మనోహరమైన అద్దకం గుడ్డ చినిగిన, రంగు అలాగే ఉండేదని, రాజులు ఇక్కడ దొరికే వస్త్రాలపై ఏంతో మక్కువ కలిగి ఉండేవారని పేర్కొన్నాడు. ఆంటోని స్కోరర్, డచ్ అజ్ఞాత వర్తకుడు లాంటి వారు తూర్పు కోస్తా లోని వ్యాపారాన్ని, సంఘాల్ని గురించి తమ అనుభవాలను రాశారు. శాతవాహన, ఇక్షాకుల కాలంలో వాణిజ్య కేంద్రంగా విరాజిల్లినదనడానికి ఇక్కడ దొరికిన వస్తుసామాగ్రే దానికి సాక్ష్యం. రొయ్యల గుంతలకోసం తవ్వుతున్నప్పుడు శాతవాహనాకాలం నాటి ఇటుకలు, మృణ్మయ పాత్రలు, నాణేలు విరివిగా దొరికాయి. రేనాటి చోళుల కాలంలో క్రీ.శ . 6-7 వ శతాబ్దకాలంలో ప్రముఖ రేవు పట్టణంగా వర్ధిల్లిందని కార్తికేయ శర్మ ధృవీకరించారు. ఆ తర్వాత అడపాదడపా స్పానిష్, అరబ్బుల రాతల్లో మాత్రమే మెరిసి, చరిత్రకారుల దృష్టి ఈ రేవు పట్టణంపై పడకపోవడంవల్ల ఇది సముద్రపు చీకటి లోతుల్లో ఉండిపోయింది. తిరిగి ఎప్పటికో బ్రిటీషువారు ఈ గడ్డపై అడుగుపెట్టి కొండూరుపాళెం నుంచి ఓడపాలెం దాకా ఉన్నటువంటి దుగరాజపట్నం రేవు తమ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందని తలచడంతో మరల ఇది వెలుగులోకి వచ్చింది. ఆంగ్లేయులు భారతదేశంలోని తూర్పుతీరంలో వున్నమచిలీపట్నంలో మొట్టమొదటి ఫ్యాక్టరీ కట్టినప్పటికీ అప్పుడది గోల్కొండ పాలన కింద ఉండి పెద్దగా కలసిరాలేదు. ముఖ్యంగా డచ్చి వారితో పోటీ, ఫోర్చుగీసు వారితో కలహాలు, మచిలీపట్టణం గవర్నరు విముఖత ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండలేని ఆంగ్లేయులు అక్కడి ఫ్యాక్టరీని మూసేసి దక్షిణాదికి వచ్చి కొంతకాలం 1621 లో డచ్చి వారితో పులికాట్లో కలిసి వ్యాపారాన్ని చేస్తారు. అక్కడ డచ్చివారితో ఉండలేక 1626 లో దుగరాజపట్నానికి వస్తారు. అక్కడ కొంత స్ధలాన్ని సేకరించి చిన్న ఫాక్టరీ, ఒక బురుజు నిర్మించుకొంటారు. దీనికి సంభందించి నెల్లూరు మాన్యువల్ లో ఇలా ఉంది. 1625 లో ఇంగ్లీషువారు కోరమాండల్ తీర ప్రాంతంతో వ్యాపార సంభందాలు ఏర్పరచుకోవాలనే భావనతో బటావియా నుండి ఒక ఓడను పంపించారు. అది సరాసరి మన దుగరాజపట్నం రేవుకు వచ్చి చేరింది. అప్పుడు ఆ గ్రామ కారణంగా ఉండిన పట్నస్వాముల ఆర్ముగం మొదలియార్ సహకారంతో ఇంగీషువారు అక్కడ కాలు పెట్టారు. దక్షిణ తీర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా తమ స్థావరం ఏర్పాటుచేసుకొనే అవకాశం ఆర్ముగం మొదలియార్ కల్గించాడు. అందుకు కృతజ్ఞతగా ఆ ప్రాంతానికి ఆర్మగాన్ అని నామకరణం చేశారు. బాస్వేల్ మాన్యువల్ రచనకు ముందే స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ ఏమిటంటే, కంపెనీ వారి కూడా దుగరాజపట్నం రేవు చేరినపుడు ఆ ప్రాంతాన్ని రాజగోపాలనాయుడు ముత్తాత గురవనాయుడు పెద్దగాను, ఆర్ముగం మొదలియార్ గ్రామకరణంగాను ఉండేవారు. ఓడలో వచ్చిన కంపెనీ అధికారులు గురవనాయుడు, ఆర్ముగం మొదలియార్లను పిలిపించి తాము ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయదలచామని, ఒక కోటను నిర్మించదలచామని చెబుతారు. ఆశతో ఇద్దరు పెద్దలు వెంటనే అంగీకరించడంతో ఆంగ్లేయులు ఎట్టకేలకు దుగరాజపట్నంలో పాగా వేస్తారు. అందుకు కృతజ్ఞతగా ఆప్రాంతాన్ని ఆర్మోగాన్ గా నామకరణం చేసి ఆ తర్వాత కొంతకాలానికి దుగరాజపట్నానికి తూర్పుదిశగా కంపెనీవారు కోట బురుజు నిర్మించారు. వాస్తవానికి ఆర్ముగాన్, దుగరాజపట్నం వేర్వేరు ప్రాంతాలు ఆంగ్లేయులు రాకముందే ఆర్మగాన్ రేవుపట్టణం ఉంది. దుగరాజపట్నానికి ఆర్మోగాన్ అనుబంధ గ్రామంగా ఉండింది. ఈ తేడాను పట్టించుకోకుండా ఆంగ్లేయులు రెండింటిని కలిపి ఆర్మోగాన్ గా వ్యవహరించారు. కొంత ద్రవ్యము సంపాదించిన ఆంగ్లేయులు ఒక అడుగు ముందు వేసి తాము నిర్మించిన బురుజు మీదనుంచి తుపాకీ పేల్చితే అది పడమటి దిశగా ఎంతదూరంలోవెళ్లి పడితే ఆమేరకు స్థలం, తమకు స్వాధీనం చేస్తే పెద్ద కోట నిర్మిస్తామని కంపెనీ అధికారులు చెప్పారు. ఆ ప్రాంతమంతా వెంకటగిరి రాజు బంగారు యాచమానాయుడిది కనుక అంతనితో సంప్రదించి అనుమతి తీసుకొనేందుకు గురవనాయుడు, ఆర్ముగం మొదలియార్ లు ప్రయత్నం చేయగా బంగారు యాచమ నాయకుడు అనుమతి ఇవ్వలేదు. దీంతో వీరు కాళహస్తి జమిందారికి చెందిన దామెర్ల చెన్నప్పనాయుడుతో మాట్లాడి, మైలాపూరుకు ఉత్తరంగా ఉన్న చెన్నకుప్పం అనే ప్రదేశాన్ని కంపెనీవారికి దారాదత్తం చేశారు. ఇప్పుడు చెప్పబడిన కథలో కొన్ని అవాస్తవాలున్నాయి. అప్పటి కాలానికి చరిత్రలో, వెలుగోటివారి వంశావళిలో ప్రస్తావించని గొప్ప రాజు వెలుగోటి వెంకటాద్రినాయుడు జమానా నడుస్తుంది. ఈయన రాపూరు రాజధానిగా చేసుకొని ముప్ఫైయ్యేళ్ళు పాలించిన చరిత్రలో ఎక్కడ కనపడడు. బటర్ వర్త్ శాసనాల సంపుటిలో మాత్రం వెంకటాద్రినాయుడిని గురించి కన్పిస్తుంది. ఎందుకనో నెల్లూరు మాన్యువల్లో ఈయన గురించి ప్రస్తావించబడలేదు. ఆనాటి రాజు బంగారు యాచమానాయకుడు కాదు, కాని పొరపాటున బంగారు యాచమానాయకుడికి ఆర్మోగాన్ రేవు కథను అంటగట్టారు. అలాగే మద్రాసులో కొంత భాగాన్ని ఆంగ్లేయుల పరం చేసినవాడు కాళహస్తి జమీందారు దామెర్ల వెంకటాద్రి నాయుడే. నెల్లూరు మాన్యువల్ లో చెప్పినట్టు చెన్నప్పకాదు. ఇవన్నీ పక్కనపెడితే ఈస్టిండియా కంపెనీకి దక్షిణాదిన మొట్టమొదటగా ఆశ్రయమిచ్చిన ఘనత దుగరాజపట్నానికే దక్కింది. ఆంగ్లేయుల అవసరాలకు సరిగ్గా సరిపోయింది ఈ రేవు.” the only place on the coromandel coast which affords any real protection to ships during an easterly gale. during the north-east monsoon the sea breaks very high on the shallow ridge of the shoal rendering the harbour within comparatively smooth”. ఇక్కడవరకు కథ బానే ఉంది. కొంతకాలానికి ఆంగ్లేయులకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. రేవు సౌకర్యంగా ఉండకపోవడం, వ్యాపారకేంద్రంగా ఎదగడానికి సంపన్నప్రాంతం కాకపోవడం, ఎగుమతులకు సరిపడా క్యాలికో గుడ్డలను ఈ ప్రాంతవాసులు అందించకలేక పోవడం, ముఖ్యంగా వెంకటగిరి రాజు వ్యతిరేక వైఖరి లాంటి కారణాలతో ఆర్ముగాన్ అభివృద్ధి కుంటుపడింది. కంపెనీవారు మధ్యవర్తుల ద్వారా స్థానిక నేతగాళ్లకు ముందుగా డబ్బులు ఇచ్చి నూలుగుడ్డలు కొనేవారు. ఇలా అడ్వాన్స్ డబ్బులు డబ్బులివ్వడానికి ఆంగ్లేయుల దగ్గర తగినంత డబ్బులు ఉండేవికావు. పై అధికారులు తగినంత పైకం పంపించేవారు కాదు. ఈ పరిస్థితుల్లో మచిలీపట్టణం, దుగరాజపట్నం రేవులలోని ఫ్యాక్టరీలను మూసివేసి, దక్షిణంగా కిందకు వెళ్లాలనుకొన్నారు. పైగా దుగరాజపట్నం బురుజు క్రమేణా శిథిలావస్థకు చేరుకోవడం, దాని మరమ్మతుకు మచిలీపట్టణం ఏజెంటు డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ప్రాంతాన్ని వదిలి పెట్టసాగారు. 1638 లో కంపెనీ డైరెక్టర్లు ఆర్మగాన్ ఫ్యాక్టరీని రద్దు చేయవలసినదిగా పోర్టు అధికారికి ఫ్రాన్సిస్ డే కి ఉత్తర్వులు పంపారు. ఈ ఉత్తర్వులు అమలుచేయకుండా డే దుగరాజపట్నం కంటే మంచి ప్రదేశము ఏమైనా ఉందా అని శోధించి పాండిచ్చేరికి వెళ్తాడు. అక్కడి అధికారులు వ్యతిరేకిస్తారు. ఈ వార్త కాళహస్తి జమిందారికి చెందిన దామెర్ల వెంకటప్ప ( వెంకటాద్రి)కి తెలుస్తుంది. వెంకటప్ప, అతని సోదరుడు అయ్యప్పలు కంపెనీ వారికి, ఇప్పుడున్న సెయింట్ జార్జి ఫోర్ట్ ప్రాంతాన్ని దారాదత్తం చేస్తారు. ఇది 1639 జులై 22 తేదీన, (1639 ఆగస్టు 22 న) ఆంగ్లేయులకు అప్పగించబడింది. దీంతో ఆంగ్లేయులు 1640 ఫిబ్రవరి 20 వ తేదికి దుగరాజపట్నం నుంచి పూర్తిగా బిచాణా ఎత్తివేశారు. దీని కోసం డే తన ఉన్నతాధికారులతో పొట్లాడం, దామెర్ల వెంకటప్పకు పర్షియన్ గుర్రాలు లంచంగా ఇచ్చి అతన్ని వలలో వేసుకోవడం, డే తన దుర్మార్గపు చేష్టలతో స్థానికులను హింసించడం, తర్వాత అంతుచిక్కకుండా చనిపోవడం లాంటి సంఘటనలు చరిత్రలో లిఖించబడ్డాయి. ఇక మళ్ళీ మొదటికి వస్తే దుగరాజపట్నం అనుబంధంగా ఉన్న ఆర్మోగాన్ గ్రామంలో ఓడలు రాకపోకలకు, లంగరు వేయడానికి ఒక దీప స్థంభం కట్టించుకొన్నారు. భారీ నౌక శ్రయ నిర్మాణానికి 1821 లో బ్లాక్ వుడ్ సర్వే పేరుతో పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించారు. పాత దీప స్తంభము తొలగించిన తర్వాత 1853 తిరిగి కట్టబడి ఆర్మోగాన్ లైట్ హౌస్ గా చరిత్రలో నిలిచిపోయింది. దుగరాజపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకొన్న కొద్దిరోజులకే లైట్ హౌస్ నిర్మించబడి ఆనాటి జ్ఞాపకంగా మిగిలిపోయింది. (ఇప్పుడున్న లైట్ హౌస్ కాదు ). ఈ లైట్ హౌస్ ఉన్న ప్రాంతానికి ఓడపాళెం , మన పాళెంగా నేడు స్థానికులు పిలుస్తారు. ఈ లైట్ హౌస్ గురించి బాస్వేల్ మాన్యువల్, నెల్లూరు జిల్లా గెజిటీర్, ఇతర చరిత్ర ఆధారాల్లో పేర్కొనబడి ఉంది. 1853 లో నిర్మించబడ్డ లైట్ హౌస్ 137 మెట్లతో కట్టబడి గాలి, వెలుతురు వచ్చేవిధంగా పైన పెద్ద దీపం ఏర్పాటు చేయబడింది. పైనుంచి దాదాపు 15 మైళ్ల దూరం వరకు ఓడలు కనిపించేవి. ఇక్కడనుంచి మొట్టమొదటగా టెలిఫోన్ లైనుని సైతం గూడూరు దాకా వేశారు. ఇలా ఓడలకు తమ గమనాన్ని నిర్దేశించిన లైట్ హౌస్ 1923 లో మలేరియా వ్యాధి వ్యాప్తి చెంది ఉద్యోగులు మరణాలకు గురికావడంతో 1938 లో లైట్ హౌసును పూర్తిగా మూసివేశారు. లైట్ హౌస్ మీదున్న దీపం 1937 ప్రాంతంలో విశాఖపట్నంకు తరలించారని అప్పట్లో దాని ఖరీదు లక్షరూపాయలని చెపుతారు. ఆ తర్వాత 1975 లో పాత లైట్ హౌస్కు తూర్పుగా నిర్మాణం కొనసాగించి ఇప్పుడున్న కొత్త లైట్ హౌస్ 1983 లో ప్రారంభించారు. అంటే ఈ ప్రాంతంలో కట్టబడిన మొత్తం 3 లైట్ హౌసులలో ఆంగ్లేయులు కట్టిన రెండు తొలగించబడ్డాయి. భారత ప్రభుత్వంచే కట్టబడిన లైట్ హౌస్ మాత్రమే ప్రస్తుతం నిలిచి వుంది. ఆంగ్లేయులకాలం నాటి పాత లైట్ హౌసును పూర్తిగా తొలగించి ప్రస్తుతం మంచి నీళ్ల

Featured

యూత్ రెడ్ క్రాస్ కో కన్వీనర్ గా డాక్టర్. ఉదయ్ శంకర్ అల్లం

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ ఉదయ శంకర్ యూత్ రెడ్ క్రాస్ కో కన్వీనర్ గా నియమితులయినారు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అధ్యాపకులు అయిన మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఉదయ్ శంకర్ గారిని మన జిల్లా అధికారి కలెక్టర్ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థలో యూత్ రెడ్ క్రాస్ కో కన్వీనర్ గా నియమించారు. అందుకు సంబందించిన ధ్రువపత్రం ఇండియన్ రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా చైర్మన్ చంద్ర శేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం అందుకున్నారు. రక్త దన శిబిరం, పేదలకు నిత్యావసరాలు అందించడం, విశ్వవిద్యాలయ ప్రాంగణం లో వేల మొక్కలు నాటడం, ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించడం, వలస కూలీలకు ఆహార పొట్లాలు అందించడం వంటి ఎన్నో సమాజ సేవ కార్యక్రమాలు ఉదయ్ శంకర్ గారు చేసిన పనులలో మెచ్చుతునకలు, అలాగే తన అపారమైన విద్య ను విద్యార్థులకు అందిస్తూ మరియు జిల్లా ఎంత్రాంగానికి వివిధ సందర్భాల లో  యెనలేని  సహాయం అందించడం లో ముందుంటారని నిరూపించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు గారు మరియు రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్  విజయ కృష్ణ రెడ్డి గారు ఉదయ శంకర్ గారి కి ఈ పదవి ఒక అరుదయిన గౌరవమని ప్రశంసించారు. ఈ సందర్బంగా ఉపకులపతి ఉదయ శంకర్ ని అభినందిస్తూ ఇప్పటివరకు విశ్వవిద్యాలయానికి అందించిన సేవలు మన జిల్లా వాసులకు ఈ పదవి ద్యారా అందించాలని ఆకాంక్షించారు. ఉదయ శంకర్ గారు ఈ పదవి తనకి రావడం అనేది ఎంతో సంతోషానన్ని ఇచ్చింది అని, మరియు జిల్లా కలెక్టర్ గారు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ తనపై నమ్మకం తో ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా వాసులకు ఇంకా ఎక్కువ సేవ చేస్తాను అని చెప్పారు.

Featured

కంటోన్మెంట్ జోన్ గా అయినవిల్లి..

తూర్పుగోదావరిజిల్లా : శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం, అయినవిల్లి, ప్రభుత్వ ఉత్తర్వులు మరియు గైడ్ లైన్స్ అనుసరించి 8 వ తేదీ నుండి స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఆలయ ఈ. ఓ తెలిపారు.కానీ తాజాగా అయినవిల్లి మండలంలో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అయినవిల్లి కూడా కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించినందున శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ది.08-06-2020 తేది నుండి భక్తులు దర్శనములను ఉన్నతాధికార్లు అనుమతి ఉత్తర్వులు వచ్చు వరకు నిలుపుదల చేయడమైనదని, భక్తులకు దర్శనములు తేదీని తదుపరి ప్రకటన ద్వారా తెలియపరచుట జరుగుతుందని , శ్రీ స్వామి వారికి జరుగు సేవలు, దూప, దీప నైవేద్యములు యధాప్రకారము గా ఏకాంతముగా అర్చకులు వారిచే జరుగుతాయని ఆలయ ఈఓ తెలిపారు. శ్రీ స్వామి వారికి పూజాది కార్యక్రమాలు జరిపించుకొనుటకు దేవస్థానము వారు ఆన్ లైన్ సేవలు అందుబాటులో (www.svstemple.com) ఉంచామని ఈఓ. తారకేస్వరారావు తెలిపారు.

ప్రకాశం

ప్రభుత్వం మారింది… పనులు నిలిచాయి..!

దర్శి: జూన్ 6, 2020 (పున్నమి విలేఖరి): దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించ తలపెట్టిన శీతల గిడ్డింగి పనులు ముందుకు సాగటం లేదు. దర్శి చుట్టుపక్కల రైతులు మిరప, కంది, పెసర, శనగ, మినుములతో పాటు ఇతర పంటలు విస్తారంగా పండిస్తారు. వాటిని నిల్వచేసుకోవటానికి శీతలగిడ్డింగి కావాలని కోరటంతో తెదేపా హయంలో అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు 5 కోట్లు మంజూరు చేశారు. అనంతరం శీతల గిడ్డంగికి శంకుస్థాపన చేసి భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. వైకాపా అధికారంలోకి రాగానే గిడ్డంగి పనులు నిలిచిపోయాయి. తెదేపా ప్రభుత్వ హయంలో మార్కెట్ యార్డులో గిడ్డంగి అవసరమని ప్రతిపాదనలు పంపిన అధికారులు ఇప్పుడు గిడ్డంగి అవసరమా లేదా అనే అంశంపై ప్రతిపాదనలు పంపాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రైతులు మాత్రం శీతల గిడ్డంగి నిర్మించాలని కోరుతున్నారు.

Featured

రైతుల సమ్మతితోనే భూసేకరణ – ఆర్ డి ఓ హుస్సేన్ సాహెబ్.

05-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ కింద అ పేదవారికి నివేసన స్థలములను సేకరించు విషయంలో గ్రామస్తులకు ప్రభుత్వ అధికారులకుమధ్య వివాదాలు జరుగుతున్న సందర్భంలో ఆర్ డి ఓ హుస్సేన్ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం లోని దామరమడుగు గ్రామస్తులకు వివరణ ఇవ్వడం జరిగింది. భూసేకరణ విషయంలో లో రైతుల స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ల సమ్మతి తెలిపిన తర్వాతే వారికి సంబందించిన భూములను భూసేకరణ చట్టం ద్వారా రావాల్సిన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే భూ సేకరణ పూర్తయిన దృష్ట్యా మిగిలినటువంటి కార్యక్రమాలు అనగా చదును చేయడం, రోడ్లు డెవలప్ చేయడం, స్టోన్ ప్లాంటింగ్ చేయడం, సర్వే రాళ్లు స్థాపించడం, లాంటి వాటిపై దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు రెవెన్యూ డివిజన్ లో దరఖాస్తు చేసుకున్న వారిలో షుమారు 28 వేల మంది అర్హులైన లబ్దిదారులను గుర్తించడం జరిగింది. దీనిలో భాగంగానే దామరమడుగు లో కొంత భూమిని గుర్తించడం జరిగింది. అయితే ఆ గ్రామస్తులు మేము సన్నకారు రైతులము అప్పటి ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇప్పుడు మీరు తీసుకోవడం సబబు కాదని మేము ఇవ్వకపోయినా బలవంతంగా తీసుకుంటామని కొందరు అధికారులు మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను గ్రామస్తులతో మాట్లాడి వారికి ఈ భూ సేకరణ విషయముపై వివరణ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని మండలాల్లో భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందని ఉదాహరణకు కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, మనుబోలు, విడవలూరు ఇట్లాంటి మండలాల్లో ఇంకా కొంత భూసేకరణ చేయాల్సి ఉంది. ఈరోజు రేపట్లో దానిని కూడా పూర్తిచేయాల్సి ఉన్నామని ఈ కార్యక్రమం అంతా పూర్తి అయిన తర్వాత వచ్చే నెల 8 వ తారీఖున రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తహసిల్దార్ ద్వారా అందివ్వడమే కాకుండా ప్రతి లబ్ధిదారుని ఆయా స్థలం మీద పూర్తి హక్కులు కలిగేటట్టు ఆన్లైన్లో ఉంచడం జరుగుతుంది. ఈమేరకు జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్, అధికారుల ద్వారా ఇటువంటి ఏర్పాట్లను ముమ్మరం చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు బుచ్చిరెడ్డిపాలెం లో దామరమడుగు గ్రామంలో ఇంకా 10 ఎకరాల భూమి నివేసన స్థలాల అవసరాల నిమిత్తం కావాల్సి ఉంది. అంతేకాకుండా వవ్వేరు గ్రామంలో కూడా 7ఎకరాల 56 సెంట్లు భూమి అవసరమై ఉంది. ఈ రెండు ప్రతిపాదనలను పంపించడానికి బుచ్చిరెడ్డిపాలెం తాసిల్దార్ని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో దామరమడుగు కి సంబంధించిన రైతు సంఘం నాయకులు రైతులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారు ఆలోచించుకొని సాయంత్రం లోపు ఇవి ప్రభుత్వం వారికి ఇవ్వడం కుదరని పక్షంలో ప్రత్యమ్యయంగా దీనికి సంబంధించి భూమి ఎక్కడ ఉందొ తెలియజేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు సమ్మతిస్తే రైతుల నుంచి సేకరించిన భూములకు సబ్ రిజిస్టార్ వ్యాల్యూ కు రెండున్నర రెట్లు ప్రభుత్వం వారు నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వ నిబంధనల మేరకు స్వీకరించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే జొన్నవాడ గ్రామంలోని నివేశన స్థలాల కు సంబంధించి కేటాయించిన భూమిని పరిశీలించడం జరిగింది. అంతే కాకుండా బుచ్చిరెడ్డిపాలెం లోని ఫైర్ స్టేషన్ కు సంబంధించి ప్రతిపాదనలో ఉన్న స్థలమును కూడా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లో బుచ్చి ఎమ్ ఆర్ ఓ షఫీ మాలిక్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు యాడ్ముత్యాల గురునాథం, సి పి ఎమ్ కోవూరు డివిజన్ అధ్యక్షుడు వెంకమరాజు, మొదలగు జిల్లాస్థాయి మండలస్థాయి నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

Featured

మధ్యాహ్న భోజన పథకం బకాయిలు, వేతనాలు వెంటనే చెల్లించాలి.

05-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల బిల్లులు బకాయిలు, వేతనాలు బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు మండల కార్యదర్శి చల్ల కొలుసు మల్లికార్జున డిమాండ్ చేశారు. శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి కి కార్మికుల డిమాండ్లపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల జనవరి నెల నుండి బిల్లులు, వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. జనవరి 21వ తేదీ నుండి ప్రభుత్వం ఛార్జీలను పెంచడం జరిగిందని ఆ బకాయిలు కూడా చెల్లించలేదు అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మెను మార్పులు చేసింది కానీ పెరిగిన మెనూ ఛార్జీలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచలేదు అన్నారు. వేరుశనగ ముద్దులు జనవరి 21 నుండి విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుండి కార్మికులు విద్యార్థులకు చిక్కులను ఇస్తున్నారు. ఇప్పటికీ కూడా చిక్కిలకి సంబంధించి డబ్బులు చెల్లించలేదు. కరోనా మహమ్మారి వ్యాప్తిలో కూడా విద్యార్థులకు రైస్, కోడి గుడ్లు తో పాటుగా చిక్కీలు ఇవ్వాలనే ఆఉద్దేశంతో భోజనం కార్మికులు అప్పులు చేసి మరీ చిక్కిలను పెడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా కుటుంబాలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే భోజన కార్మికుల వేతన బిల్లులు బకాయిలను వెంటనే చెల్లించాలి. లాక్ డౌన్ లో ఏప్రిల్ నుండి ఇ జూన్ వరకు వేతనాలు చెల్లించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భోజనం కార్మికులకు జాబ్ కార్డులు ఇవ్వాలి. ప్రైవేటు సంస్థల అకౌంట్ లో పడిన బిల్లులు, వేతనాలను వెంటనే కార్మికులకు చెల్లించాలి. కార్మికులందరికీ ఇండ్ల స్థలాలు, పక్కా ఇల్లు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కార్యదర్శి మల్లికార్జున మరియు మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఇతరులు పాల్గొన్నారు.

Featured

బుచ్చి లో ఘనంగా నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

5-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని రామకృష్ణ నగర్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా వ్యవహరించిన నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ కాలుష్య రహిత పర్యావరణాన్ని భావితరాలకు సంపదగా అందించడదానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర పంచాయతీలోని శ్రీ రామ్ నగర్ ,శివాజీ నగర్,రామకృష్ణ నగర్ తదితర ప్రాంతాలలో మొక్కలు నాటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ స్పృహతో ఈ కార్యక్రమం చేపట్టిన స్థానికులను ప్రత్యేకంగా అభినందించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అడవుల విస్తీర్ణం తగ్గుతూ ఉండటం వలన పర్యావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి అన్నారు. పర్యావరణ అసమతుల్యత వలన కరోనా, ఎబోలా లాంటి వైరస్ లు విజృంభిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఇసుక పాలెం గ్రామ పంచాయతీ బిట్టు 2లో వాలంటీర్లకు గ్రామ సచివాలయం సిబ్బందికి నగర పంచాయతీ కమిషనర్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో వాలంటీర్లు ప్రతిరోజూ చేసే కార్యక్రమాల గురించి వాళ్ల డైరీలో రాసుకోవాలని మరియు ఇంటి పన్నుల వసూలు చేస్తున్నారా లేదా అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు ఇంటికి వద్దకే చేర్చడంలో వాలంటీర్లు ముఖ్య పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇసుక పాలెం పంచాయతీలోని బిట్టు1, బిట్టు2 గ్రామ సచివాలయ సిబ్బంది మరియు వాలెంటర్ల్లు వీఆర్వోలు పాల్గొన్నారు.

Featured

విక్రమ సింహపురి యూనివర్సిటీలో పరియావరణ దినోత్సవం

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఆధ్వర్యం లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా ఆచరించారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమము లో ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారి చేతుల మీదుగా జ్యూట్ బాగ్స్ ను విశ్వవిద్యాలయ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి అందచేశారు. ఈ కార్యక్రమం లో రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి గారు కూడా పాలుగోనారు. తదనంతరం ఉపకులపతి మాట్లాడుతూ మన ఆరోగ్యం మరియు వాతావరణం యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం అభివర్ణించారు. అధిక ఆదాయం, వినియోగవాదం మరియు భూమి మరియు అటవీ నిష్పత్తిలో తేడా ఎక్కువ కాలుష్యం మరియు క్షీణిస్తున్న వాతావరణానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఆహార భద్రత, ప్రజారోగ్యం మరియు జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరియవర్ణని పరిరక్షించడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టింది ఇందులో భాగంగానే ఇప్పటివరకు , గ్రీన్ క్యాంపస్, ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్, శుభ్రమైన మరియు ఆకుపచ్చ ప్రచారాలు, పర్యావరణం పట్ల విద్యార్థుల్లో అవగాహన, సేంద్రీయ సేద్యం, నీటి సంరక్షణ మరియు వంటి వివిధ కార్యక్రమాలు చేపటము. పర్యావరణ సంరక్షణ బాధ్యత భారం పూర్తిగా ప్రభుత్వం మరియు ఇతర NGO లు మోపకుండా సామాన్య ప్రజానీకం కూడా తన వంతు బాద్యేతగా కృషి చేయాలి. పుష్కలమైన సహజ వనరులు దేశ ఆర్థిక శ్రేయస్సుకు ఎల్లవేళలా మద్దతునిస్తామని ఉపకులపతి ఈ సందర్బంగా తెలిపారు. ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ సుజా ఎస్ నాయర్, కార్యనిర్వాహకులు డాక్టర్ అల్లం ఉదయ్ శంకర్, మరియు ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబంది పాలుగోనారు.

Featured

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత-ఎస్.ఐ సూర్యప్రకాష్ రెడ్డి

05-06-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవమును జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు. సమాజంలో ప్రతిఒక్కరు మొక్కలు నాటి పర్యావరనం కాపాడాలని మనుబోలు ఎస్ఐ సూర్య ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఐజేఎం టోల్ ప్లాజా సిబ్బంది ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సహకారం అందించిన ఐజెఎంవారికి ధన్యవాదాలు తెలిపారు. బాధ్యత గా మొక్కలు నాటడంవలన కాలుష్య కోరల్లో నుండి బయటపడే అవకాశం వుందన్నారు. సేఫ్టీ మేనేజర్ లోకేష్ మాట్లాడుతూ మొక్కలు నాటితే ఆక్సిజన్ తోపాటు కాలుష్యం నివారించవచ్చన్నారు. మనుబోలు పోలీస్ స్టేషన్ లోఎస్ఐ చేతులమీదుగా మొక్కలు నాటడంశుభపరిణామంఅన్నారు .ఈకార్యక్రమాల్లోఐజెఎం సిబ్బంది బాలాజీ మరియ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.