Thursday, 5 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరు విద్యుత్‌ ‌శాఖ కార్యాలయంలో పాలనాధికారి లైంగిక వేధింపులు

ఆత్మకూరు, జూన్‌ 10, 2020 (‌పున్నమి విలేఖరి) : నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు విద్యుత్‌ ‌శాఖ కార్యాలయంలో పాలనాధికారి కామాండుద య్యాడు… మహిళా ఉద్యోగిని పట్ల కీచకుడిగా మారాడు..కోర్కె .. లైంగిక వాంచ తీర్చాలంటూ మూడునెలలుగా వెంట పడుతు న్నాడు… ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో సెలవుపై వెళ్లిన ఆ పాలనాధికారి తిరిగి విధుల్లోకి చేరేందుకు సిద్ధమ య్యాడు.. మళ్ళీ తన వక్రబుద్దిని చాటుకొంటున్నట్లు బాధిత మహిళా ఉద్యోగిని బావురమం టోంది…ఇంతకీ ఎవరా పాలనా ధికారి.. ఆ కామాంధుడి మాటలు, మెసేజీల పర్వం ఎలా ఉందో… బాధితురాలి మాటల్లో మీరే చదవండి. నువ్వు నాకు నచ్చావ్‌….ఇం‌త ఫిజిక్‌, ఇం‌త ఫిట్‌గా ఎలా వున్నా వు? నిరంతరం నీవే గుర్తుకొస్తున్నావు. నిద్ర రావట్లా. నువ్వు నాకు ఫోన్‌ ‌చేయాలి. నా ఫోన్‌ ‌లిప్ట్ ‌చేయాలి. నీ అందం రహస్యాలు నాకు చెప్పాలి, చూపాలి. ఇవి విద్యుత్‌శాఖలోని ఓ పాలనాధికారి తమ దిగువ స్థాయి మహిళా ఉద్యోగిని పట్ల వ్యవహ రిస్తున్న తీరు. అడుగడుగునా ఫోన్‌లో మెసేజ్‌లు. దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతున్న ఆ అధి కారి లైంగిక వేధింపులతో విసిగి పోయిన ఆ ఉద్యోగిని ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించి పాలనాధికారికి మొట్టి కాయలు వేశారు. సెలవు పై వెళ్లమ న్నారు. అయినా అతని తీరులో ఏ మాత్రం మార్పు లేదు. చివరకు ఆ మహిళా ఉద్యోగిని కాపురంలో చిచ్చులు పెట్టాడు. అన్యోన్యంగా ఉన్న వారి మధ్య అగాధం ఏర్ప డింది. చివరకు దిక్కుతోచని స్థితి లో ఆ మహిళా ఉద్యోగిని తీవ్ర ఆందోళన చెందుతోంది..

ప్రకాశం

కండువా మార్చిన శిద్దా

దర్శి, జూన్ 10, 2020 (పున్నమి విలేఖరి): గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రి గా కొనసాగిన శిద్దా రాఘవరావు మరియు ఆయన తనయుడు శిద్దా సుధీర్ కుమార్ బుధవారం తెదేపాను వీడి జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

Featured

అధైర్యపడొద్దు అండగా నేను ఉన్న: శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

09-06-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో రెడ్ జోన్ ప్రాంత మైన మనుబోలు మండలం చెరుకుమూడి గ్రామం లో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కుల పంపిణీ. రెడ్ జోన్ ప్రాంతాలలో అధికారులకు, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్ల కు, ప్రజలకు పలు సూచనలు సలహాలు ఇచ్చిన ఎమ్మెల్యే కాకాణి. ఈ ప్రాంతంలో కరోనా పాజిటివ్ రావడంతో నేను ఇక్కడకు వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడంతో పాటు, మీకు ధైర్యాన్ని ఇచ్చేందుకు వచ్చాను. కరోనా అనేది ప్రాణాంతకర వ్యాధి కాకపోయినా, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వస్తే ఇబ్బందులు కలుగుతాయి. కరోనా వైరస్ పై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.ఎవరూ ఆందోళన చెంది, భయపడాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ వ్యక్తి ని మనమందరం వారిని కుటుంబ సభ్యులుగా భావించి, అండగా “చేదోడు – వాదోడు” గా ఉండాలి. అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీ అవసరాల కోసం మీకు ఈ ప్రాంతంలో ఉంటూ ఈ సమస్యను పరిష్కరించుకుందాం. మీకు నేను అండగా ఉంటాను, ఎక్కడా విభేదాలకు పోకుండా సమస్యను అధికమించుదాం. ఏ సమయంలోనైనా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, నాకు ఫోన్ చేస్తే తక్షణమే స్పందించి పరిష్కరించేందుకు కృషి చేస్తాను.ఈ కార్యక్రమంలో వై. యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి ,బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి ,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్,కిరణ్ కుమార్ రెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,చాంద్ భాషా,కరిముల్లా, మోహన్ నాయుడు మరియు మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Featured

శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం భక్తులకు అనుమతి

రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రం నందు స్వయంభుగా వెలసి భక్తుల ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం భక్తులను 8 వ తేదీ నుంచి వివిధ ఆంక్షలతో అనుమతిస్తున్నట్లు ఏ.ఓ జోల్లు. వెంకటసుబ్బయ్య తెలిపారు కరోనా రీత్యా 81 రోజులు ఏకాంతంగా సేవలు అందించాము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు సోమవారం నుండి స్వామి దర్శనార్థం సామాజిక దూరం పాటిస్తూ మీటరు దూరం ఉండేటట్టు సర్కిళ్లు క్యూలైన్లలో ఏర్పాటు చేయడం జరిగినది అలాగే వివిధ సూక్ష్మక్రిములు చనిపోయే ద్రావణాల తో దేవస్థానాన్ని శుభ్రపరిచి ముఖ్యముగా కళ్యాణ కట్ట వద్ద వేడి నీళ్ల కోసం గ్రిజర్లు, కత్తులు శుభ్రపరిచేందుకు డేటాల్ లు ఏర్పాటు చేశాము దేవస్థానం కు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని రావలసి ఉన్నది ముఖ్యముగా పది సంవత్సరాలలోపు పిల్లలకు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు అనుమతి లేదు మరియు ధర్మల్ స్కానర్ లతో చెక్ చేసి 38 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వాళ్లను దర్శనానికి పంపించడం జరుగుతుందని ఆలయ ఏ.ఓ జోల్లు.వెంకటసుబ్బయ్య తెలియజేశారు.

Featured

స్త్రీ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధా భారతి ఐ సి డి ఎ కార్యాలయం సందర్శించారు

రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి): రాపూరు లోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అధికారిని కార్యాలయాన్ని స్త్రీ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధా భారతి సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు తదుపరి గ్రామ పోలీసులు అంగనవాడి మహిళలకు మీటింగ్ నిర్వహించి ఈ మీటింగ్ నందు ప్రభుత్వం తీసుకు వచ్చే ప్రతి పథకాలను ప్రజలకు చేర్చే విధంగా చర్యలు చేపట్టాలని క్వాంటిటీ, క్వాలిటీ మరియు 100% అటెండెన్స్ లు చేరిందా లేదా అని సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు-నేడు అంగనవాడి లో ప్రవేశ పెట్టాలి అనే నేపథ్యంలో డైరెక్టరేట్ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం స్కూళ్లను పరిశీలించి ఇన్స్టా స్ట్రక్చర్ డేటాను కలెక్ట్ చేసుకుని పరిశీలించడం, మహిళా పోలీసులు మరియు గ్రామ వాలంటీర్లు అంగన్వాడి మహిళలచే పౌష్టికాహారం లోపం లేకుండా గర్భవతులు ఆరు సంవత్సరాల లోపల పిల్లలను ఎంపిక చేసి వారిని సరైన గైడెన్స్ ఇవ్వడం మరియు యాక్షన్ ప్లాన్ తయారు తయారు చేశామని తెలియజేశారు మరియు గురుకుల పాఠశాల నుంచి వచ్చిన సరుకులను శానాయ పాలెం ,సంక్రాంతి పల్లి ఎస్సీ కాలనీ లో పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎ శంషాద్ బేగం గ్రామ పోలీసులు అంగన్వాడీ మహిళలు పాల్గొన్నారు .

Featured

ఆనం రామనారయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ పరిధి లోని తెలుగు గంగ బ్రాంచ్ కాలువ పరిశీలిన.

రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి): రాపూరు మండలంలోని సంక్రాతిపల్లి వద్ద తెలుగుగంగ 1 వ బ్రాంచి కాలువ వద్ద త్రాగు,సాగు నీటి అవసరాల కోసం అదనంగా 20 క్యూసెక్కుల నీటిని వెంకటగిరి నియోజకవర్గ శాసన సభ్యులు ఆనం రామనారయణ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుల కష్టాలను గుర్తించి వారి పక్షాన వుండి అవసరమైన సందర్భంలో తెలుగు గంగ నుండి నీటిని విడుదల చేయడానికి అనుమతులు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తదుపరి సంక్రాంతి పల్లి సమీపాన (11.8 కిలోమీటర్ వద్ద) 2A బ్రాంచి కాలువను,చెర్లోపల్లి సమీపాన (19.00 కిలోమీటర్ల వద్ద) 2B బ్రాంచి కాలువ.అనంతరం గూడూరు-రాపూరు-వెంకటగిరి ఆర్ అండ్ బి మెయిన్ రోడ్ మీదుగా ప్రయాణంచేసి. డక్కిలి మండలం వెలికల్లు మెయిన్ రోడ్డు సమీపాన (28.56 కిలోమీటర్ల వద్ద) 3వ బ్రాంచ్ కాలువ,మోపూరు వడ్డిపల్లి సమీపాన (39.4 కిలోమీటర్ల వద్ద) 4వ బ్రాంచ్ కాలువ.వెంకటగిరి మండలం జంగాలపల్లి (48.32 కిలోమీటర్ల వద్ద) 5ఏ బ్రాంచ్ కాలువ.(బంగారు పేట సమీపాన),బాలాయపల్లి మండలం ఉాట్లపల్లి సమీపాన – నాయుడుపేట రోడ్డు వైపు (53.4 కిలోమీటర్ల వద్ద) 5వ బ్రాంచ్ కాలువ లను స్థానిక రైతులతో కలసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో తెలుగు గంగ అధికారులు,ఇరిగేషన్ అధికారులు రాపూరు,సైదాపురం మండలం వై.సి.పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Featured

శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి

రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి): సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం పొట్టెంపాడు గ్రామంలో సుమారు 1.33 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.కరోనా కష్టకాలంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు తోడుగా నిలిచాము.లాక్ డౌన్ కారణంగా అభివృద్ధి పనులపై దృష్టి సారించలేక పోయాము.ప్రస్తుతం తిరిగి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో గ్రామాల్లో సమస్యలు చాలా వరకు పరిష్కరించబడుతున్నాయి. గ్రామ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు.ఇంటి ముంగిటకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.కరోనా నియంత్రణ లో వాలంటీర్ల పాత్ర మరిచి పోలేనిది.కరోనా కష్ట కాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష కుటుంబాలకు పైగా బియ్యం, వంట నూనె పంపిణీ చేయడం జరిగింది.అందరి సహాయ సహకారంతో “సర్వేపల్లి రైతన్న కానుక” సమర్ధవంతంగా పంపిణీ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు.నాడు – నేడు ద్వారా పాఠశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది.గత ఐదు సంవత్సరాల్లో నిలిచిపోయిన అభివృద్ధి కలిపి, 15 సంవత్సరాల అభివృద్ధి ని చేసి చూపిస్తాను.చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, కరువు విలయ తాండవం చేస్తుంది.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే మహానేత రాజశేఖర్ రెడ్డి గారి పాలన తిరిగి రావడం, వర్షాలు సకాలంలో పడి, జలాశయాలు నిండి, రైతులు సంతోషంగా ఉన్నారు.చంద్రబాబు నాయుడుకు భవనాల రంగులతో ఏమి ఇబ్బందులు వచ్చాయో చెప్పమనండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భవనాలు, స్కూళ్లు, వాటర్ ట్యాంక్లు, అన్న క్యాంటీన్లు, బస్టాండ్లు చివరకు స్మశాన వాటికలకు కూడా పసుపు రంగు పులిమిన సంగతి మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు.చంద్రబాబు ఉనికిని కాపాడుకునేందు పాటు పడుతున్నాడు తప్ప ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకునే పరిస్థితిలో లేదు.గ్రామాల్లో పూర్తి స్థాయిలో “తన -మన” అనే భేదం లేకుండా అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాము అని తెలిపారు

Featured

కరోనా వైరస్ పై పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నందు అవగాహన కార్యక్రమం

రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి): రాపూరు మండలం లోని శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నందు రెండు రోజులు సిబ్బందికి,లోకల్ భక్తులకు దర్శనం ట్రైల్ రన్ నిర్వహించు భాగముగా ఆలయ అర్చకులు సిబ్బందికి ఎపినాపి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ వారి సిబ్బంది కలసి దేవస్థానం కార్యాలయం వద్ద కరోనా వైరస్ దృష్ట్యా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కోసం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వ్యాధిగ్రస్తులను ఎలా గుర్తించాలి, ధర్మల్ టెంపరేచర్ ఏ విధంగా ఉపయోగించాలి, ఒకవేళ ఎవరికైనా వ్యాధి ఉన్నది అని గుర్తించిన ఎడల వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏ.ఓ జోల్లు.వెంకటసుబ్బయ్య, ఆలయ పాలకమండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు

Featured

మేమూ మనుషులమే మమ్మల్ని గుర్తించండి – భవన నిర్మాణ కార్మికులు

08-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రెసిడెంటు బంకా తిరుపతి రెడ్డి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ఆనాటి ప్రభుత్వాలు 1996 సంవత్సరంలో ఒక చట్టాన్ని కూడా రూపొందించారని దానికి 1000 కోట్ల నిధులను కూడా మంజూరు చేశారని ఆయన తెలిపారు. దీనిని నేటి ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని అన్నారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్నారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు అంటే బేల్దారులు, కొయ్యి పని, కరెంటు పని, పెయింట్ పని, ఇలా ఇరవై మూడు రకాల పనులు చేసుకునేవారు ఈ సంఘం పరిధిలోకి వస్తారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల కార్య సాధనకై ఒక బోర్డులు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నిధులను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి కార్మికుడికి 110 రూపాయలను కట్టించుకుని ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగిందని, ఈ గుర్తింపు కార్డు గడువు తర్వాత రెన్యువల్ చేసుకోవడానికి కూడా సౌకర్యం ఉందని చెప్పారు. ఈ గుర్తింపు కార్డు ఉన్న వారికి కాన్పు కానుక కింద 20 వేల రూపాయలను అలాగే సహజ మరణానికి 80,000, ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల నలభై వేలు ఇస్తారని అన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా బోర్డు నిధుల ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇదే కాకుండా ఉదాహరణకి 10 లక్షల రూపాయలు భవన నిర్మాణం జరుపుతున్న యజమాని మున్సిపాలిటీ పరిధిలో అయితే చెస్సు రూపంలో లక్ష కి వెయ్యి రూపాయలు లేబర్ డిపార్ట్మెంట్ కు కడుతున్నారని అన్నారు. ఇలా బోర్డు కు వచ్చిన ప్రతి రూపాయి ని భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి నియోగించాలని తెలియజేసారు. భవన నిర్మాణంలో పని చేసే ప్రతి కార్మికుడు ప్రతి క్షణం తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నారని అంతేకాకుండా ఈ భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ కాలం బ్రతకడని శ్వాసకోశ వ్యాధులతో చనిపోతున్నారు అని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వాలు చేతి వృత్తి పనులు చేసుకునే ఇతర కులాల వారికి ఏ విధంగా అయితే పథకాలను ప్రవేశపెట్టి లబ్ధి చేకూరుస్తున్నారో అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కూడా గుర్తించాలని అంటున్నారు. జిల్లా మొత్తం మీద 10 ఆఫీసులు ఉండగా ఏ ఆఫీసులోనూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కార పనితీరుపై అసంతృప్తికరంగానే ఉందని అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు చాలా పర్యాయాలు ఫిర్యాదు చేసి ఉన్నామని అన్నారు. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు మూడు నెలలు లాక్ డౌన్ విధించడంతో అనేక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులు ఎవరూ పట్టించుకోలేదని తన ఆవేదనను వ్యక్తస్తున్నాడు. రాష్ట్రంలోని మిగతా మంత్రులు లాగా కార్మిక శాఖ మంత్రి కూడా ఉన్నాడా లేడా అని ఆయన ప్రశ్నించాడు. ఒకవేళ ఉంటే మిగతా మంత్రులు లాగే కార్మికుల గురించి స్టేట్మెంట్లు కానీ లేదా ప్రెస్ మీట్ లో గానీ ప్రస్తావించిన దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు. కాబట్టి భవన నిర్మాణ కార్మికుల ను గుర్తించి వారి యొక్క సమస్యలపై దృష్టి సారించి ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం తరఫున కోరుకుంటున్నానని అన్నారు.

Featured

జొన్నవాడ కామాక్షమ్మ దర్శనానికి సర్వం సిద్ధం.

08-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని జొన్నాడ గ్రామంలో వెలసివున్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయం లో నేటి నుండి స్వామి అమ్మవార్ల దర్శనాలు పునః ప్రారంభం కానున్నాయి. మన రాష్ట్రం లోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో జొన్నవాడ కామాక్షమ్మ దేవస్థానం ఒకటి. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా సుమారు మూడు నెలల పాటు ఆలయం మూత పడటంతో భక్తులు అమ్మవారి దర్శన భాగ్యంకు నోచుకోలేక పోయారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించి దేవాలయాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో రేపటి నుండి జొన్నవాడ ఆలయంలో భక్తుల దర్శనార్థం మల్లికార్జున స్వామి సమేత అమ్మవార్ల దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను ఆలయ సిబ్బంది ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి రెండు రోజులు జొన్నవాడ గ్రామస్తులకు దర్శనాలు అనుమతి ఉందని, ట్రైల్ రన్ పూర్తయిన తర్వాత అందరిని అనుమతిస్తామని ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీని వాసులరెడ్డి తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.