Thursday, 5 March 2026

Blog

Featured తూర్పు గోదావరి

వాలెంటర్ వేధిస్తున్నాడని మహిళా ఆరోపణ.

అనపర్తి ( పున్నమి విలేకరి) :- అనపర్తి మండలంలోని కొప్పవరం గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్న వ్యక్తి వేధిస్తున్నాడని వివాహిత మహిళ ఆరోపించింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన వివరాల ప్రకారం తన భర్త వ్యాపారం నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లడంతో మండలం లోని కొప్ప వరం గ్రామం లో తన తల్లిదండ్రులు ఇంటివద్ద ఉంటున్నానని, అయితే తమ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు గొలుగూరి దుర్గారెడ్డి గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్నాడని, అతను నన్ను అక్క అని పిలుస్తూ మా ఇంట్లో సన్నిహితంగా ఉండేవాడిని, క్రమేపీ అతని మనసులో చెడు ఆలోచనలు కలిగి వరసా వాయ లేకుండా నన్ను లొంగ దీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించడని, నేను వ్యతిరేకించడంతో నాపై కక్ష కట్టి ఫేస్ బుక్ లో నా పేరున ఫేక్ ఐడిని సృష్టించి నావి, నా కుటుంబముతో ఉన్న అనేక ఫోటోలను అప్లోడ్ చేసి వేధిస్తున్నాడని, ఈ వ్యవహారంపై నేను అనపర్తి పోలీసులను ఆశ్రయించడంతో కొప్పవరం గ్రామ పెద్దలు రాజీ కుదుర్చారని, ఫేస్ బుక్ లో ఫోటోలు డిలీట్ చేయకపోతే అరెస్ట్ చేస్తానని అతన్ని పోలీసులు కూడా హెచ్చరించారని, ఈ వ్యవహారము జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అతను ఫేస్ బుక్ లో ఫోటోలు డిలీట్ చేయలేదని, ఎందుకు డిలీట్ చేయలేదని అతని నిలదీస్తే నన్ను పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడని తెలిపింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త ఆమెను తల్లిదండ్రుల ఇంటికి పంపించడంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సదరు వాలంటరీ ఇంటివద్ద ధర్నాకు దిగింది. పోలీసులు గ్రామ పెద్దలు నాకు న్యాయం చేయడం లేదని, తనకు న్యాయం చేయాలని కన్నీటితో విలపిస్తుంది. వాలంటీరుగా పని చేస్తూ ఉన్నతమైన స్థానంలో ఉంది ఇటువంటి అసభ్యకరమైన వ్యవహారం చేయడం మంచిది కాదని ప్రజలు అనుకుంటున్నా రు.

Featured ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి

కరోనా పట్ల ప్రజల్లో అవగాహన ముఖ్యం – డి.యస్.పి.షేక్ మాసుం భాషా

￰తూర్పుగోదావరిజిల్లా ,అమలాపురం కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉండడంతో ప్రజల్లో వైరస్ పట్ల అవగాహన కల్పించే దిశగా అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ భాష మరియు అధికారులు చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా అమలాపురం పట్టణ సి.ఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో కరోన వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.మాస్కులు తప్పని సరిగా ధరించాలని లేనియెడల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.పట్టణం లోని ప్రధాన కూడళ్లలో ఎస్ఐ శ్రీనివాస్, శివ ప్రసాద్, ఏసుబాబు లు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నవారికి కరోనా వైరస్ గురించి దాని వ్యాప్తి పట్ల అవగాహన కల్పించారు.బయటికి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పక ధరించాలని సూచించారు. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లి సెంటర్లో అమలాపురం రూరల్ ఎస్.ఐ రాజేష్ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.మాస్కులు లేకుండా సంచరిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు. షాపుల వద్ద జనాలు గుమిగూడి ఉండరాదని, భౌతిక దూరం తప్పక పాటించాలని సూచించారు.మాస్కులు ధరించకపోతే జరిమానాలు తప్పవని హెచ్చరించారు.

Featured

ఇసుకాసురుల ఇంద్రజాలం చూసి అవాక్కైన మంత్రి…

తూర్పుగోదావరిజిల్లా , అమలాపురం : ఇసుక సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది.ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకున్నా రోజుల తరబడి ఎదురుచూపులు అయినా కూడా రాని పరిస్థితి నెలకొని ఉంది.బుక్ చేసిన ఇసుక వచ్చినా కూడా పనికిరాని మట్టితో కూడిన తువ్వ ఇసుక వస్తుండడంతో ప్రజలు అవాక్కయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అయితే తాజాగా సాక్షాత్తు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కే ఈ చేదు అనుభవం ఎదురైంది.రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ భట్నవిల్లిలో నూతనంగా గృహాన్ని నిర్మిస్తున్నారు. ఆన్లైన్ లో ఆయన నాలుగు లారీలు ఇసుక బుక్ చేసుకున్నారు. మట్టి తో కూడిన తువ్వ ఇసుకను తెచ్చి సైట్లో దింపేశారు. సైట్ ఇంచార్జ్ అల్లాడ వెంకటరమణ దీనిని గుర్తించి మంత్రి విశ్వరూప్ కు ఫిర్యాదు చేశారు. నాకే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్య మానవుని పరిస్థితి ఏమిటని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే జిల్లా కలెక్టర్ కు విషయాన్ని వివరించారు.ఈ విషయం పై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వెంటనే అమలాపురం ఆర్టీవో భవానీ శంకర్ భట్నవిల్లి సైట్ లోకి వెళ్ళి ఇసుకను పరిశీలించారు. తువ్వ ఇసుకను చూసి ఆర్. డి. ఓ.అవాక్కయ్యారు విషయాన్ని కలెక్టర్ కు వివరించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ అతి దగ్గరలో ఉన్న రాంపుల నుంచి ప్రజలకు ఇసుక అందించాలని అది నాణ్యమైన ఇసుక అయ్యి ఉండాలని మంత్రి అధికారులును ఆదేశించారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని ప్రజారోగ్య వేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన వినతి పత్రం.

ఆర్యా. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి జోరందుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడటం తప్ప మరొకటి కాదు. ఓ వైపున ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు, భారత వైద్య పరిశోధన మండలి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ వైద్యులు ఈ కరోనా వైరస్ బారి నుండి పిల్లలను, వృద్ధులను కాపాడుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. నిరంతరం ఆరోగ్య పరిరక్షణలో భాగంగా బయట తిరగకుండా చూడడం, ఇంట్లోనే ఉంటున్నా శానిటైజర్ లతో మోచేతుల దాకా చేతులు శుభ్రం చేసుకునేలా చూడడం, తప్పని సరి పరిస్థితుల్లో బయటకు వెళ్లి వచ్చిన వారికి తల స్నానం చేయించడం లాంటి చర్యలు తీసుకోవాలి.పౌష్టికాహారం అందించడం ద్వారా వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించాలి. ఇలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలని పదే పదే చెప్తున్నా ప్రభుత్వం బ్రిడ్జి కోర్సులు, అవగాహన తరగతుల నిర్వహణ పేరుతో ఉపాధ్యాయులను పిల్లలను పాఠశాలకు హాజరు కావాలని ఆదేశించింది. వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. ఓవైపున రోజు రోజుకు కరోనా విజృంభిస్తూ రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతూ మరణ మృదంగాలు మోగిస్తుంది. తుఫాన్ వేగంతో వ్యాప్తి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా పంజా విసిరితూ మానవాళి మనుగడకే సవాల్ విసురుతుంది. అందుకే ప్రమాదకరమైన ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న దేశంలోని అనేక రాష్ట్రాలు పదోతరగతి పరీక్షలే కాకుండా ఇంటర్, డిగ్రీ, పిజి, ఇంకా అనేక ఎంట్రన్స్ పరీక్షలను కూడా రద్దు చేశాయి. ఈ విద్యా సంవత్సరంలో కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధన మండలి మార్గదర్శకాలు, ఉపాధ్యాయుల మరియు పిల్లల తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ, తమిళనాడు, ఒడిసా,చత్తీస్ గఢ్ రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని ప్రజారోగ్య వేదిక కోరుతున్నది. పిల్లలు సాధించిన అంతర్గత మార్కులు, హాజరు ప్రాతిపదికగా ప్రభుత్వమే పదవ తరగతి ఫలితాలు ప్రకటించాలి. అలాగే కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు, పిల్లలను సంరక్షించుకునేందుకు రాష్ట్రంలో బ్రిడ్జి కోర్సులు, ఇతర అన్ని రకాల పరీక్షలను కూడా రద్దు చేసి ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించాలని ప్రజారోగ్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కోరుతుందికుప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ కోరుతుంది.

Featured

రాజమండ్రి ఓ.ఎన్.జీ.సి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆదేశ్ కుమార్

తూర్పుగోదావరిజిల్లా , అమలాపురం రాజమండ్రి ఓ.ఎన్.జీ.సి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆదేశ్ కుమార్ గురువారం అమలాపురం పార్లమెంట్ సభ్యులు,కేంద్ర పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి చింతా.అనురాధను మర్యాదపూర్వకంగా కలిశారు.గురువారం ఈ.డి అల్లవరం మండలం మొగళ్ళమూరు లోని ఎం.పి స్వగృహంలో ఎం.పి.అనురాధను కలిశారు.ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు నూతన ఈ.డి కి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఈ.డి తో పాటు హెచ్.ఆర్ జీ.ఎం దినేష్ జైన్ ,సీజిఎమ్ ప్రసాద్ రావు పాల్గొన్నారు.

Featured

కరోనా వైరస్ పట్ల జాగ్రత్త అవసరం..

తూర్పుగోదావరిజిల్లా , బండారులంక.. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలలో అవగాహన కల్పించడంలో భాగంగా అమలాపురం మండలం బండారులంక సెంటర్ నందు రూరల్ ఎస్సై రాజేష్ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.మాస్కులు లేకుండా సంచరిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కరోనా విజృంభణ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని,అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు.జనాలు రద్దీగా గుమిగూడరాదని తెలిపారు. మాస్కులు లేకుంటే జరిమానాలు తప్పవని హెచ్చరించారు.మాస్కులు తప్పక ధరించాలని,సానిటైజర్ వాడాలని,భౌతిక దూరం తప్పక పాటించాలని రూరల్ ఎస్సై రాజేష్ ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు.

Featured

మనుబోలు లో బి.జె.పి జన జాగరణ కార్యక్రమం ప్రారంభించిన :ఓడూరు శ్రీనివాసులు రెడ్డి

17-06-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి)భారతీయ జనతా పార్టీ సంకల్పించిన ‘జన జాగరణ’ కార్యక్రమాన్ని బిజెపి మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు.  రెండవ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు అని గడిచిన సంవత్సర కాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మోదీ ప్రధానిగా రెండో సారి ప్రమాణం చేసి ఏడాది దాటిందన్నారునరేంద్ర మోడీ గారు అవినీతి రహిత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు కేంద్రం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు వివరించే లక్ష్యంతో జన జాగరణ కార్యక్రమచేపట్టామన్నారు.  కరోనా జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు గత ఆరేళ్లుగా పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలు వారిని ఎంతగానో ఆదుకున్నాయన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను మోదీ పరిష్కరించి చూపారన్నారు. మోదీ ముందు చూపు వల్ల కరోనా ఉధృతి కాకుండా కట్టడి చేయగలిగామన్నారు. కరోనా సమయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు రెండు సార్లు ప్యాకేజి ప్రకటించారన్నారు. భారతదేశం మళ్లీ పుంజుకునేలా ఈ ప్యాకేజ్ ఉపయోగపడిందని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన చేస్తూ, గడిచిన ఐదు సంవత్సరాలలో అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తేలిపినారు. ఏడాది పాలనలో మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను ప్రజలకు వివరించారు. ఇందులో భాగంగా ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు 15వ ఫైనాన్స్ నిధులు 2020-21 కి గాను 1893 కోట్లు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 46,95,800 మంది రైతులకు నేరుగా 939 కోట్లు ఇలా ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి మొత్తంగా పథకాలకు 4,227 కోట్లు ఇవ్వటం జరిగింది.ఈ సందర్బంగా మండలం లో ప్రతి ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనపై కర పత్రాలను పంపిణీ చేశారు. ప్రధాని మోడీ ఏడాది పాలనపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఓడూరు.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ కేవలం ఒక్క ఏడాదిలో ప్రధాని నరేంద్ర మోడీ దేశం గర్వించదగ్గ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటూ పౌరసత్వ బిల్లు తీసుకురావడం, రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయడం, త్రిబుల్ తలాక్ రద్దు లాంటి బిల్లులతో మోడీ చరిత్రలో నిలిచిపోతరని గుర్తు చేశారు. బిజెపి జిల్లా నాయకులు బోల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, జన్ ధన్ ఖాతాదారులకు నగదు జమ చేశారని చెప్పారు. కరోనా కష్టకాలంలో ఉజ్వల యోజన పథకం ద్వారా నిరుపేదలకు2,72,179 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించారని 1.7 లక్షల కోట్లతో కరోనా రిలీఫ్ ప్యాకేజీ విడుదల చేశారన్నారు. మోడీ పాలనలో అన్నీ వర్గాల ప్రజల సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ముప్పవరపు చిన్న, ఓ.బి.సి మోర్చా రాష్ట్ర కార్యదర్శి చల్లా.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వెంకయ్య, మండల కార్యదర్శి కంటే సుధాకర్ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

అచ్చెన్న లేని అసెంబ్లీ !

అచ్చెన్న లేని అసెంబ్లీ ! అసెంబ్లీ స‌మావేశాలు వాడీవేడీగా జ‌రుగుతాయి. అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య వాదోప‌వాదాలు… మాట‌ల యుద్దాలు, వాకౌట్లు… గంద‌ర‌గోళాలు చోటు చేసుకుంటుంటాయి. ఎక్కువ రోజులు జ‌ర‌గాల్సిన స‌మావేశాలు ఈసారి క‌రోనా నేప‌ధ్యంలో కుదించ‌బ‌డ్డాయి. కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రగ‌నున్నాయి. ఇక అసెంబ్లీ అనగానే కొంతమంది నేతలు కళ్ల ముందు మెదులుతుంటారు. వాళ్ళు ఫైర్ బ్రాండ్లు. అధికార పక్షం నుంచి చూస్తే కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా, ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి, అంబ‌టి రాంబాబు, బొత్స స‌త్య‌నారాయ‌ణ క‌నిపిస్తారు. ఇక సీఎం జ‌గ‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న గొంతెత్తితే ఎదుటివారికి చాకిరేవు త‌ప్ప‌దు. ఇక ప్ర‌తిప‌క్ష పార్టీ విష‌యానికి వ‌స్తే అచ్చెన్నాయుడు, బుచ్చ‌య్య చౌద‌రి, చిన‌రాజ‌ప్ప వంటి స‌భ్యులు గుర్తుకొస్తారు. అయితే ఈ సారి అచ్చెన్నాయుడు లేని అసెంబ్లీ క‌నిపించింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బిజినెస్ అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడు పాల్గొనాలి. గత అసెంబ్లీ సమావేశాల్లో బీఏసీ సమావేశాలకు టీడీఎల్పీ నేత‌గా ఉన్న అచ్చెన్నాయుడు హాజరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయి, రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో, మరో ఉపనేత నిమ్మల రామానాయుడుని బీఏసీకి వెళ్లి, టీడీపీ వాదన వినిపించాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఆయన బీఏసీ సమావేశానికి వచ్చారు. ప్ర‌తిప‌క్షంలోని టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో మాట్లాడే సత్తా ఉన్న వారు మాత్రం కొద్ద‌మందే. వారిలో చంద్ర‌బాబుకి రైట్ అండ్ లెఫ్ట్ గా వుంటుంది అచ్చెన్నాయుడు, బుచ్చ‌య్య చౌద‌రి మాత్ర‌మే. ఇక ఈ ఇద్ద‌రిలో ముందుగా ఒక‌రి పేరు చెప్పాల్సి వ‌స్తే ఖ‌చ్చితంగా అచ్చెన్నాయుడు పేరునే చెప్పాలి. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు వుంటే ఆ తీరే వేరు. అధికారంలో ఉన్నా లేక‌పోయినా త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపిస్తుంటారు. ఎంత‌టి వారిపైనైనా స‌రే నోరేసుకుని ప‌డిపోతుంటారు. చ‌ర్చ ఎలాంటిదైనా ప్ర‌త్య‌ర్థుల‌ను దుమ్మెత్తిపోయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఈ విష‌యంలో ఆయ‌న రూటే సెప‌రేటు. అలాంటి అచ్చెన్న ఈసారి అసెంబ్లీలో కనిపించ‌లేదు. అసెంబ్లీ సమావేశాలు జ‌రుగుతుంటే ఆయ‌న మాత్రం రిమాండ్ లో వుండాల్సివ‌చ్చింది. ఈ నేప‌ధ్యంలో ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే అచ్చెన్న‌ను అక్ర‌మంగా అరెస్టు చేయించిందంటూ టీడీపీ వాదిస్తోంది. ఏదేమైనా అచ్చెన్న లేని అసెంబ్లీ కాస్త బోసిపోయిన‌ట్లే క‌నిపిస్తోంది.

Featured ఆంధ్రప్రదేశ్

పెరుమాళ్లపాడు గ్రామంలో బయటపడ్డ పురాతన ఆలయం

పెరుమాళ్లపాడు గ్రామంలో బయటపడ్డ పురాతన ఆలయం (పున్నమి ప్రతినిధి) రాజులు పోయారు… రాజ్యాలు పోయాయి. శిథిలాల క్రింద చారిత్రక అవశేషాలు చెక్కు చెదరకుండా నిక్షిప్తిమై ఉన్నాయి. చరిత్రకారులు, పురావస్తు శాఖ వారు చేపట్టిన తవ్వకాల్లో అనేక విశేషాలు, చారిత్రక విశిష్టతలు వెలుగు చూస్తున్నాయి. నాటి నేటి జీవిన విధానానికి, చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి చారిత్రక అవశేషాలు కలిగిన ఓ ఆలయాన్ని ఆ గ్రామస్తులు వెలికితీశారు. గ్రామానికి చెందిన పాతకాలపు పెద్దల ద్వారా విశిష్టతను తెలుసుకుని చేపట్టిన తవ్వకాల్లో ఓ ఆలయం బయటపడింది. ఇప్పుడది పెన్నా పరివాహకంలో అందరిని ఆకర్షిస్తోంది. శతాబ్దాల క్రితం నిర్మించిన ఆ ఆలయం ఎక్కడ బయటపడింది.. అందులో విశేషాలేంటి? ఆ ఆలయాన్ని నిర్మించింది ఎవరు? తెలుసుకుందాం. పెరుమాళ్లపాడు గ్రామం, నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పవిత్ర పినాకిని నదీ తారాన దక్షిణం వైపున ఉన్నది. ప్రస్తుతం ఇక్కడ గ్రామానికి చెందిన కొందరు ఔత్సాహికులు మేటలు వేసిన ఇసుక తిన్నెలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ అద్భుత ఆలయం ఆనవాళ్లు బయటపడ్డాయి. పూర్తి స్థాయిలో గ్రామస్తులు ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. గత అయిదు రోజులుగా గ్రామస్తులు చేస్తున్న ఈ ప్రయత్నంలో మంగళవారం నాటికి ఆలయ ప్రాకారం, గర్భగుడి సహా వెలుగులోకి వచ్చాయి. ఎప్పుడో శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం మూతపడడం, ఇసుక తిన్నెల్లో మునిగిపోవడం వెనుక ఓ కథ వుందని గ్రామస్తులు చెబుతున్నారు. పరశురాముడి హయాంలో పాపప్రక్షాళన కోసం చేపట్టిన ఈ నిర్మాణం అనేక విశిష్టతలను, ప్రత్యేకతలను కలిగివుంది. ఇంతకి ఈ ఆలయం ఇంతగా పూడిపోవడానికి కారణాలేంటి? అన్నది పరిశీలిస్తే ఒకప్పుడు వరదలతో పరవళ్లు తొక్కే పెన్నా నదిలో ప్రస్తుత సోమశిలకు దిగువ భాగాన ఉన్న ఈ గ్రామానికి నది తాకిడి ఎక్కువగా వుండేది. వర్షా కాలంలో వరదలు, వేసవిలో ఇసుక తుఫానులను తలపించే ఇసుక మేటలు పెరుమాళ్లుపాడు గ్రామాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేవి. దాంతో సరిగ్గా 101 సంవత్సరాల క్రితం పెన్నానది గట్టు నుంచి కాస్త దూరంగా మెరక ప్రాంతానికి వెళ్లి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక శతాబ్దం పాటు వరదలు, ఇసుక మేటల కారణంగా పురాతన గ్రామంతో పాటు ఆలయం ఇసుక తిన్నెల్లో భూగర్భంలో కలిసిపోయింది. గ్రామంలో పెద్దలు, పాత తరానికి చెందిన వారు అప్పుడప్పుడు పాత గ్రామాన్ని గురించి చెబుతుండడం ఈ తరం యువకులను ఆకర్షిస్తూ వుండేది. ఇటీవల కరోనా నేపథ్యంలో ఎక్కడెక్కడో వున్న గ్రామానికి చెందిన అనేక మంది యువకులు, పలువురు ప్రముఖులు పెరుమాళ్లుపాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రచ్చబండ వద్ద జరిగిన సమావేశాల్లో పాత గ్రామం ఆనవాళ్లు చూడాలని కొందరు కుతూహలం చూపారు. ఉబలాటపడ్డారు. పాత ఆనవాళ్లను వెలికితీయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. అలా మొదలైన వారి ఆలోచన అయిదు రోజుల క్రితం ఆచరణకు శ్రీకారం చుట్టింది. కొన్ని ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లతో ఇసుక తిన్నెలను తొలగిస్తుండగా గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఆలయం ఆనవాళ్లు ఉన్న ప్రాంతాన్ని చూపారు. దాంతో అక్కడ తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో ఈవాళ ఆ ఆలయం ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ సందర్భంగా గ్రామస్తులుసమాచారం మేరకు ఎంతో చరిత్ర కలిగినటువంటి శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం వెలికితీసి గతంలో లాగే పూజలు నిర్వహించాలని వైభవంగా దేవాలయాన్ని తీర్చిదిద్దాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

Featured

నెల్లూరులో జిల్లా నమోదైన కరోనా కేసుల వివరాలు ✍️

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️✍️ నెల్లూరు జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.గడిచిన 24 గంటల్లో జిల్లాలో 16 కేసులు నమోదు కావడంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 457 చేరుకుంది. వెంకటగిరిలో 1 అల్లూరులో 1 వెంకటాచలం చెముడుగుంట 1 టిపి గూడూరులోని మండపంలో 1కావలి అర్బన్ 1 నెల్లూరులొనే 9 సత్యనారాయణ పురం 2 ములపేట 3 పొదలకూరు రోడ్డు 1 వేదాయ పాలెం 2 దర్గామిట్ట 1 ఒంగోలు 1 కృష్ణ పట్నం పోర్టు 1 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.