Thursday, 5 March 2026

Blog

Featured

భారీవర్షం నేలకూలిన చెట్టు

పలమనేరు,30,2020(పున్నిమి విలేఖరి): పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని రాత్రి కురిసిన ఈదురు గాలులతో వర్షం కురియడం వల్ల బైరెడ్డిపల్లి – పుంగనూరుకు వెళ్లే రహదారిలో హెచ్.పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్నటువంటి చింత చెట్టు నేల వాలినది. రాత్రి నుండి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.వాహన దారులకు చాల ఇబ్బంది కరంగా మారింది స్థానికలు బైరెడ్డిపల్లి పంచాయితీ సిబ్బందికి తెలియజేసారు. తొలగించే యత్నంలో లీనమైనా పంచాయతీ సిబ్బంది.

Featured

జిల్లా జాయింట్ కలెక్టర్ చేతులమీదుగా కరోనా నియంత్రణ చర్యల పోస్టర్ ఆవిష్కరణ ✍✍

పున్నమి తెలుగు దిన పత్రిక ✍ కరోనా అంటువ్యాధి. ఇది ఏ తప్పు చేస్తేనో వచ్చేది కాదు, ఇది పూర్తిగా వ్యాధి సోకిన వ్యక్తి నుండి లేక వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకొనటం ద్వారా ఒకరిని నుంచి ఒకరికి వ్యాపిస్తుందని సామాజిక దూరం పాటించకపోవడం, కరచాలనాలు చేయడం, మాస్క్ ధరించకపోవడం వల్లన ఈ వ్యాధి సోకుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. యన్ ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేశారు. వి ఎస్ యు యన్ యస్ యస్ వారు చేసిన పోస్టర్స్నును జాయింట్ కలెక్టర్ గారి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ దురదృష్టవశాత్తు సుమారు నూటికి 50 నుంచి 60 శాతం మందిలో రోగ లక్షణాలు బయటపడవు . కావున, మనము, మన కుటుంబసభ్యులు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే, పోస్టర్ లో పేర్కొన్న మూడు ముఖ్యమైన పద్దతులను మన దైనిక జీవితం లో ఒక భాగంగా అలవాటు చేసుకోవటమే ఉత్తమమైమన మార్గం అని ఆయన సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే మనతో పాటు మన కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.యెస్.రాజ్యలక్ష్మి గారు , జాతీయ సేవా పథకం సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం గారు , యన్ యస్ యస్ వాలంటీర్స్ పార్థసారధి, రాజేష్ తధితరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

Featured

కరోనా వైరస్ వ్యాప్తి పై మనుబోలు లో అవగాహన ర్యాలీ

29-06-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) మనుబోలు లో కరోనా పై అవగాహనా ర్యాలీ & మానవహారం ———————————————————— ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విన్నూత రీతిలో గొడుగులతో వైఎస్ఆర్ సర్కిల్ నుంచి నుండి కేర్ పురం మీదుగా కరోనా పై అవగాహనా ర్యాలీ నిర్వహించారు… ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… జిల్లాఅధికారుల ఆదేశాల మేరకు అవగాహన ర్యాలీ చేపడుతున్నామని తెలియజేశారు అధికారులు ఎంతో శ్రమ తీసుకొని కరోనా నివారణకు పాట్లు పడుతున్నా, ప్రజలు అవగాహనా రాహిత్యంతో కరోనా కేసులు పెరుగుతున్నాయని… కావున కేవలం అధికారులే చర్యలు తీసుకుంటే సరిపోదు అని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి సహకరించాలని కోరారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ప్రతి గంటకు చేతులను శుభ్రం చేసుకోవాలని, తాగు నీరు ఎక్కువగా తాగాలని, ఎక్కువమంది ఒకచోట ఉండకూడదని నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు ప్రస్తుతం మనుబోలు మండల పరిధిలో అధికారుల పగడ్బందీ చర్యలతో కరోనా నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా వైరస్ సోకకుండా ముందస్తు చర్యలు తీసుకొని అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సీ.పీ నాయకులు దాసరి మహేంద్ర వర్మ ,దువ్వూరు సుధాకర్ రెడ్డి మనుబోలు గ్రామ పంచాయతీ కార్యదర్శిఅశోక్ కుమార్,పోలీస్ సిబ్బంది,సచివాలయ సిబ్బందిమరియు వాలంటీర్లుగ్రామప్రజలుపాల్గొన్నారు.

Featured

పేకాట రాయళ్లు అరెస్టు

పలమనేరు, జూన్29,2020(పున్నమి విలేకరి):పలమనేరు నియోజవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని మిట్టపల్లి అటవీ సరిహద్దులో జూదం ఆడుతున్నరని పక్క సమాచారం రావడంతో రంగంలోకి దిగిని స్థానిక యస్.ఐ మునుస్వామి మరియు పోలీస్ సిబ్బంది.13 మందిని అరెస్ట్ చేసి,వారి వద్ద లక్ష తొంబై మూడు వేలు రూపాయిలు స్వాధీనం చెసుకొనట్టు స్థానిక యస్.ఐ తెలిపారు.వీరిలో నలుగురు కర్ణాటక వాసులు మంజునాథ్, హసిప్ ఖాన్,ప్రశాంత్ కుమార్,రవిప్రసాద్,గా గుర్తించారు.మిగతవారు పలమనేరు నియెజకవర్గ వాసులు ధనుంజయ్,వేణుగోపాల్, వెంకటరమణారెడ్డి,లింగప్ప,రామకృష్ణ,సుబ్రమణ్యం, నారాయణస్వామి, గురునాథ్ గా గుర్తించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యస్.ఐ మునుస్వామి,మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Featured

నాటు బాంబు కొరికిన ఆవు చిద్రమైన నోరు

పలమనేరు ,జూన్29,2020(పున్నమి విలేకరి): నాడు కేరళలో ఏనుగు.. నిన్ను తెలంగాణలో కోతి.. నేడు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజవర్గం లో ఆవు . ఇలా వరుసగా మూగజీవాల పై అమానుష ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళితే…పలమనేరు నియోజవర్గం పెద్దపంజాణి మండలం కొగిలేరు గ్రామ సమీపంలో సాకార్డు అనే స్వచ్ఛంద సంస్థ శ్రీకృష్ణ గోమాత పీఠాన్ని నిర్వహిస్తుంది. పీఠానికి చెందిన ఆవు మేతకు వెళుతున్న సమయంలో దారిలో వేటగాళ్ల పెట్టిన నాటు బాంబు కొరకడంతో నోటి భాగం చిద్రమైంది. దీనిని గమనించిన స్థానికులు ఆవును పశువైద్యశాలకు తరలించారు. వైద్యులు ప్రధమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని పశువైద్యశాల కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Featured

ఫోటో ,వీడియో గ్రాఫర్ లకు జగనన్న చేయుత పథకం అందించాలి.

పలమనేరు, జూన్29,2020(పున్నమి విలేకరి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్లకు జగనన్న చేయూత పథకం అందించి ఆదుకోవాలని పలమనేర్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు.రాష్ట్ర పిలుపు మేరకు సోమవారం పట్టణంలోని నెహ్రూ విగ్రహం వద్ద ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు, మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో వృత్తిరీత్యా, పనులు దొరక్క పస్తువులతో అల్లాడుతున్నమని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వృత్తిని నమ్ముకొని కుటుంబాలను పోషించుకునేవారని వ్యాపారం లేక కుటుంబాలు వీధిన పడి, అలమటిస్తూ బాధలు చెప్పుకోలేక రాష్ట్రంలో ఇప్పటికీ 16 మంది ఫోటో ,వీడియో గ్రాఫర్ లు ఆత్మహత్యలు చేసుకున్నారని కంటతడి పెట్టారు.ఈ కార్యక్రమంలో బాబు,మురళీ, దేవేంద్ర,సురేష్ బాబు,ధనంజనేయులు , రాఘవేంద్ర,పోటో & వీడియో,గ్రాఫర్లు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు జీతాలు వెంటనే ఇవ్వాలి ఎస్ఎఫ్ఐ

ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు గత నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని ఎవరినీ తొలగించకుండా సంక్షేమానికి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత నాలుగు నెలల నుంచి లాక్ డౌన్ కారణంగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నెల్లూరు జిల్లా మొత్తం సుమారు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేటు ఉపాధ్యాయులు సుమారు 30 వేలకు పైగానే ఉన్నారు ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న కొంతమంది టీచర్లు ఇప్పటికీ అరటి పండ్లు మరియు కూరగాయలు అమ్ముకునే దయనీయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఏ అవకాశం లేని టీచర్లు మొన్న అనంతపురంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు నిన్న శ్రీకాకుళం జిల్లాలో కేశవరావు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఆత్మహత్యలను వెంటనే నివారించాలని టీచర్లకు మరియు సిబ్బంది కి నెలకి పదివేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలి అనంతరం కూడా ఎవరిని నిధుల నుంచి తొలగించకుండా చర్యలు తీసుకోవాలి సంక్షేమానికి ఒక బోర్డును ఏర్పాటు చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్ల అందరికీ గుర్తింపు కార్డును వెంటనే ఇవ్వాలి ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని జిల్లా మొత్తం ఆందోళన చేస్తారని హెచ్చరించారు

Featured

పంట పొలాలపై గజరాజులు దాడులు

పలమనేరు జూన్28,2020(పున్నమి విలేకరి) పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని వెంగమవారిపల్లి గ్రామంలో రాత్రి రెండు ఏనుగులు రాజగోపాల్ అనే రైతు పంట పొలాలపై పడి తీవ్ర నష్టం పరిచాయి. ఒక ఎకరా పొలంలో బీర ,టమోటా పంటలను వేసి,మార్కెట్ కు తరలించే దశలలో ధ్వంసం చేసి, లక్ష రూపాయలు నష్టం వాటిల్లేటట్టు చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. తరుచుగా ఈ మధ్యకాలం ఏనుగులు వస్తూనే ఉన్నాయి,పోయిన వారం మేకలనాగిరెడ్డిపల్లిలో కూడ ఇదే పరిస్థితి నెలకొంది,మండల కేంద్రంలోనే అటవీ సరిహద్దు ప్రాంతాలు కావడంతో సుమారు ఏడూ ఏనుగులు తిష్ట వేసుకొని అడవిలో ఉన్నట్టు సమాచారం. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

Featured

పోలీసులకు థర్మామీటర్ వితరణ

పలమనేరు, జూన్28,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం నేషనల్ ఏహ్యూమన్ రైట్స్ కరప్షన్ అండ్ ఎరడ్యుకేషన్ ఫోరమ్ జాతీయ ఉపాధ్యక్షుడు దండు రవి ఆదివారం గంగవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణఆచారికి ఇన్ ఫ్రారెడ్ ధర్మామీటర్ వితరణ చేశారు. ఈ సందర్భంగా దండు రవి మాట్లాడుతూ… పోలీసులు కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులకు తన వంతు సాయంగా ఇన్ ఫ్రారెడ్ థర్మామీటర్, శానిటైజర్ వితరణ చేసినట్లు ఆయన తెలిపారు.

Featured

గ్రామంలో కరోనా పట్టించుకొని అధికారులు

నెల్లూరు జిల్లా తడ మండలం చేనిగుంట గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా వచ్చిందని శనివారం నాడు వైద్యశాఖ అధికారులు తెలిపారు, ఈ విషయం తెలియగానే గ్రామంలో భయాందోళనలు.., కాని గ్రామరెవిన్యూ అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదు … కనీసం గ్రామంలో ఇప్పటివరకు శానిటైజ్ చేయకపోవడం విడ్డూరం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.