Thursday, 5 March 2026

Blog

Featured

అమరావతిని కాపాడుకొందాం

పలమనేరు, జులై4, 2020(పున్నిమి విలేకరి): రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు, ఆ ప్రాంత ప్రజలు చేపట్టిన ఆందోళనలు నేటికి 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి సంఘీభావంగా అమరావతిని కాపాడుకొందాంని నిరసన చేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుట్టి,బ్రహ్మయ్య,శ్రీధర్,గిరి,మదన్,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Featured

మాస్క్ లేకుంటే జరిమానా ఏస్ఐ

పలమనేరు, జూన్ 30 2020(పున్నమి విలేకరి): పట్టణంలో కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో పలమనేరు బజార్ వీధిలో పలమనేరు ఎస్ ఐ నాగరాజు ఆధ్వర్యంలో మాస్కులు ధరించ కుండా నిబంధనలను అతిక్రమించిన వారికి రూ135/- జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలులో తిరిగే వారికి జరిమానా విధించినట్లు చెప్పారు. ఇకపై నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రజలు అందరు సహకరించాలని తెలిపారు.

Featured

జెవిస్ ఆధ్వర్యంలో జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ

పలమనేరు ,జూలై 3,2020 (పున్నిమి విలేకరి): కోకో కోలా కంపెనీ వారి సహాయంతో తో గ్రేడ్స్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తో జన వికాస్ ఆధ్వర్యంలో శుక్రవారం జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ చేసారు.పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని బీడీ కాలనీ లోని వృద్ధాశ్రమం తరువాత రిమర్స్ ప్రత్యేక ప్రతిభావంతలకు, అంబేద్కర్ నగర్ పిల్లలుకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జెవిస్ ప్రమీల మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి జాగ్రత్త పాటిస్తే కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టొచ్చున్నారు. ఈ కార్యక్రమంలో రిమర్స్ ప్రిన్సిపాల్ గాయత్రీ, వృద్ధాశ్రమం నిర్వాహకులు మంజుల తదితరులు పాల్గొన్నారు.

Featured

కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి.

పలమనేరు, జులై 3,2020(పున్నమి విలేకరి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను పూర్తి స్థాయిలో అమలు పరిచి కనీస వేతనాలు ఇవ్వాలని ఐఎఫ్ టి యు, అంగన్వాడి పలమనేర్ డివిజన్ కార్యదర్శి జ్యోతి డిమాండ్ చేశారు.అందులో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం మదనపల్లి రోడ్డు నందుగల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపములో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రోజురోజుకు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉందని, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఇప్పటికీ వెట్టి చాకిరి చేస్తూ కనీస వేతనాలు లేకుండా దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదే విధంగా ఐసిడిఎస్ ప్రారంభం నచేశారుప్రజలకు ఎన్నో కష్టాలు పడి సేవలు అందించామని అటువంటి వారిపై ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు పెత్తనం చలాయిస్తున్నారని, ప్రభుత్వం అటువంటి ఆలోచనలు విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వాలకు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

Featured

కరోనా పరీక్షలు చేయించుకోవాలి

పలమనేరు, జూలై 3,2020(పున్నిమి విలేఖరి): పలమనేరు పురపాలకసంఘం పరిధి లోని వార్డు నెం.13, శ్రీనగర్ కాలని నందు నివాసముంటున్న ఒకరికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు నిర్ధారించడమైనది. కావున, వార్డు నెం.13 లో 300 మీటర్ల కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడమైనదన్నారు. సదరు వార్డు నివాసితులు సదరు వ్యక్తితో సన్నిహితముగా ఉన్న వారు ఎవరైనా స్వచ్ఛందంగా పలమనేరు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి కరోనా పరీక్షలు చేయించు కోనవలసినదిగా మున్సిపల్ కమిషనర్ విజయసింహ రెడ్డి కోరారు.

Featured

రోగులకు ఆహార ప్యాకెట్లు వితరణ

పలమనేరు, జులై3,2020(పున్నిమి విలేకరి): పలమనేరు లారీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు జిలానీ ఆధ్వర్యంలో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు ఆహార ప్యాకెట్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన కుమారుడు,కుమార్తె ఇద్దరు కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులతో పాటు ఆటోనగర్ వర్కర్స్ లకు,పలమనేరు పట్టణ పరిధిలోని వృద్ధులకు ఆహార ప్యాకెట్లను వితరణ చేసినట్లు తెలిపారు.

Featured

ఉద్యోగ వ్యతిరేక ధోరణి సమర్ధనీయం కాదు

పలమనేరు ,జులై3,2020(పున్నిమి విలేకరి): జాతీయ స్థాయి కార్మిక ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, ఉద్యోగుల వ్యతిరేక విధానాలపై స్ధానిక ఎన్జీఒ హోం ముందర ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎపీఎన్జీఒ సంఘం పలమనేరు తాలూకా అధ్యక్షుడు ఆనందబాబు మాట్లాడుతూ… ఉద్యోగ వ్యతిరేక ధోరణి సమర్ధనీయం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం PFRDA బిల్లు రద్దు చేయాలని, వెంటనే కరువుభత్యం నిలుపుదల ఉత్తర్వుల ఉపసంహరణ చేయాలని కోరారు . సంఘం కార్యదర్శి సి.కె.బాలాజీ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని , ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని అదేవిధంగా, కోవిడ్-19 బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులు ,వర్కర్స్ కు ఇన్సూరెన్స్ వర్తింపు, అధిక ధరలను అరికట్టడం తదితర డిమాండ్స్ నెరవేర్చాలని తెలిపారు. ఉద్యోగులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గురుకుమార్,సురేష్, సోమసుందర్ ,మోహన్, రాంప్రసాద్, మోగిలప్ప,నారాయణ,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Featured

అర్హులందరికి సంక్షేమ పథకాలు: కాకాణి

02-07-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం, వడ్లపూడి, గొట్లపాళెంగ్రామాలలో పర్యటించి,₹ 1కోటి2లక్షలరూపాయలతోచేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అన్ని వర్గాలకు , అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. సర్వే పల్లి నియెజకవర్గంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడి న సంవత్సరకాలంలో 800కోట్లు కుపైగా అభివృద్ధి సంక్షేమం చేశామని ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు. గురువారం ఆయన మనుబోలు మండలం వడ్ల పూడి గొట్లపాలెంలో సిమెంట్ రోడ్లు ప్రారంభిఃచారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూవైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తూ గ్రామాలకు అవసరమైన అభివృద్ధి పనులు చేస్తూ 3648 కిలోమీటర్లసుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సంక్షేమ పథకాలు ప్రారంభించి ప్రతి కుటుంబానికి అందజేస్తూ ముందుకు పోతున్నారు అన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమికమిటీ సభ్యులకు అధికారం ఇచ్చివాళ్ల దగ్గరకు పోతే గాని పెన్షన్లు ఇల్లు మంజూరు అయ్యేవి కావు లోన్లు మంజూరయ్యే వి కావు ఆ పరిస్థితుల్లో మార్పు రావాలని మరలా రాజశేఖర్ రెడ్డి పరిపాలన తిరిగి ప్రారంభించాలని రాజశేఖర్ రెడ్డి రాజ్యాన్ని మరలా స్థాపించాలని వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన వెంటనే ఎవరు ఎవరి దగ్గర కి వెళ్లాల్సిన సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా రాజకీయాలతో తో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి అన్నారు ముందుగానే సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేసి దాని ప్రకారం సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అమలు చేస్తున్నారు అన్నారు గతంలో పని చేసిన ప్రభుత్వం డేగపూడి బండేపల్లికాలువకు ఒక్క రూపాయి అన్న మంజూరు చేశారా అని అన్నారు వైయస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే నేను శాసనసభ్యునిగా అవ్వగానే అడిగిన ప్రధాన పనుల్లో బండేపల్లి కాలువ అని అన్నారు.ఈ కాలువకు సంబంధించిన భూసేకరణ పూర్తిచేసిపనులుప్రారంభించడానికిసిద్ధంగాఉన్నామన్నారు రాబోయే రోజుల్లో గ్రామాల్లో సమస్యలు లేకుండా చేస్తము అన్నారు . గతప్రభుత్వంలో నీరుచెట్టులాంటి భోంచేసే పధకాలు ప్రవేశపెట్టమని శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే పధకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. పెన్షన్లు ఇళ్ళు కావాలంటే జన్మభూమి కమిటీల సంతకాలు అవసరంలేదని సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు ఇంటివద్దకే వచ్చి సేవలందిస్తున్నారన్నారు దివంగత రాజశేఖర్ రెడ్డి 108సేవలను ప్రారంభిస్తే టీడీపీ హయంలో నత్తనడకన సేవలందాయని విమర్శించారు. 1088వాహనాలనుప్రారంభించినఘనతసీఎంజగన్మోహన్ రెడ్డి దేనన్నారు. ప్రభుత్వ నిధులతోపాటుప్రవేటునిధులు తీసుకొచ్చి అభివృద్ధి కిపాటుపడుతున్నామన్నారు. మెజార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నిగ్రామాలను ఒకేవిధంగా చూస్తామన్నారు. ఒక్క వడ్లపూడికే కోటికిపైగా అభివృద్ధి పనులుచేశామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు పైసా నిధులు ఇవ్వలేదు. వై.యస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తాము. టిడిపి ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చి, కనీసం స్థలాలు చూపని పరిస్థితి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థలాలను చూపించి, పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తాము. చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు మాత్రం పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్నారు. పేదవాళ్లకు వ్యతిరేకంగా, బాడాబాబులకు అనుకూలంగా టిడిపి నాయకులు పనిచేశారు తప్ప పేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అన్ని వర్గాలకు , అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రజలకు చేసిన ద్రోహం వల్ల తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చాయి. డేగపూడి- బండేపల్లి కాలువ పూర్తి చేస్తానంటూ గతంలో తిరిగిన ఒక పెద్దాయన ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయకుండా హడావుడి చేశాడు. నేను ముఖ్యమంత్రి దగ్గరకి వెళ్లి బండేపల్లి కాలువ నిర్మాణానికి 26 కోట్లు మంజూరు చేయించాను, త్వరలోనే ఈ కాలువను పూర్తి చేస్తాము. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏడాది కాలంలో వ్యవసాయానికి సాగునీటి పారుదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 50కోట్ల రూపాయలు మంజూరు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అవసరమైన నిధులను మంజూరు చేయించి, శాశ్వత ప్రాతిపదికన తాగు నీటి సమస్యను పరిష్కరిస్తాను. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా *”104,108 అంబులెన్స్”* లను ఒకే రోజు 1088 ప్రారంభించి, జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేందుకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేయిస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి ముఖ్య నాయకులు మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు .

Featured

తెలుగు యువత ఆధ్వర్యంలో అమరన్న జన్మదిన వేడుకలు

పలమనేరు ,జూలై 2 ,2020(పున్నమి విలేకరి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పరిశ్రమల శాఖ మంత్రి, పలమనేరు మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం లోని రిమర్స్(మానసిక వికలాంగులు) పాఠశాలలో తెలుగు యువత నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలల్లోని బుద్ధిమాంద్యం విద్యార్థులకు కేక్ కట్ చేసి తినిపించారు. అలాగే మధ్యాహ్నం విద్యార్థులకు అన్నదానం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు గిరిధర్, గోపాల్, అరుణ్, మురళీ,రిమర్స్ ప్రిన్సిపాల్ గాయత్రీ తదితరులు పాల్గొన్నారు.

Featured

కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన

పలమనేరు, జులై2,2020(పున్నిమి విలేకరి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, ఉద్యోగుల వ్యతిరేక విధానాలపై వ్యతిరేకిస్తూ నేడు జాతీయ స్థాయి కార్మిక, ఉద్యోగ సంఘాలు ఒకరోజు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎపీఎన్జీఒ సంఘం పలమనేరు తాలూకా అధ్యక్షుడు కె.ఆనందబాబు , కార్యదర్శి సి.కె.బాలాజీ , జిల్లా ఉపాధ్యక్షుడు వై. లక్ష్మీపతి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… PFRDA బిల్లు రద్దు, కరువుభత్యం నిలుపుదల ఉత్తర్వుల ఉపసంహరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయడం, కోవిడ్-19 బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులు ,వర్కర్స్ కు ఇన్సూరెన్స్ వర్తింపు, అధిక ధరలను అరికట్టడం వంటి డిమాండ్స్ చేయనున్నట్లు వారు తెలిపారు. ఉద్యోగులు పలమనేరు ఎన్జీఒ హోం వద్దకు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తప్పక హాజరై మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ విజయవంతం చేయవలసినదిగా వారు పిలుపునిచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.