Thursday, 5 March 2026

Blog

Featured

ఉధృతంగా ప్రవహిస్తున్న కైగల్ జలపాతం

పలమనేరు జూలై 13 పలమనేరు నియోజకవర్గంబైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ దుమకురాళ్ళు జలపాతంలో ఉదృతంగా నీరు ప్రవాహం ప్రవహిస్తోంది. కర్ణాటక లో కురిసిన భారీ వర్షాలకు నీరు వచ్చి చేరుతుంది. నీటి ప్రవాహం చూపరులకు ఎంతోగానో ఆకట్టుకుంటుంది. జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన కైగల్ నీటిప్రవాహం ప్రాంతంనికి పోలీస్ అధికారులు నిషేధం విధించడంతో పర్యాటకులు లేక వెలవెలబోతుంది. గతంలో ఇక్కడ నీటి ప్రవాహం చూడడానికి, ప్రకృతి అందాలు వీక్షించడానికి అనేక మంది మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా అధిక సంఖ్యలో ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేవారు. అయితే ఇక్కడ దట్టమైన అడవి, నిర్మానుష్య ప్రాంతంలో ఉండటం వలన అనేక అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉందని అధికారులు ఇక్కడ నిషేధం విధించారు. ఇక్కడ ఉదృతంగా ప్రవహిస్తున్న నీరు మన రాష్ట్రానికి ఉపయోగపడకుండా ప్రక్క రాష్ట్రామైన తమిళనాడుకు నీరు వృధాగా వెళుతుంది. ఇక్కడ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే సుమారు వెయ్యి ఎకరాల భూములకు నీటిని చెరువులకు సరఫరా చేసే అవకాశం ఉందని, ప్రభుత్వం స్పందించి నీటిని అడ్డుకట్ట వేయడానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని జిల్లా, మండల ప్రజలు కోరుతున్నారు.

Featured

ప్రభుత్వనికి చిత్తశుద్ధి లేదు – మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి

పలమనేరు, జులై12,2020 (పున్నిమి విలేకరి): హంద్రీ-నీవా సుజల స్రవంతి అంశంలో ప్రభుత్వానికి చిత్తశుధ్ధి లేదని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…అధికారం చేపట్టిన 13 నెలలుగా ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోకపోవడం బాధాకరంని ప్రజా వ్యతిరేక పాలనగా కొనసాగుతుందన్నారు. కుప్పం నియోజకవర్గాలకు చెందినటువంటి హంద్రీనీవా కాలువ పూర్తిగా రైతుల కోసం, తాగునీటి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం తీసుకొచ్చిన ఈ కాలువ నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఏపార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలపై, మాట్లాడడం అతని చేతనైతే హంద్రీనీవా కాలువ తీసుకొని రావాలన్నారు.గత ప్రభుత్వ హయాంలో నిర్మాణానికి శ్రమించి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి మండలాల అయినా పలమనేరు,కుప్పం రైతులు ప్రజలు తాగునీటి సమస్య కోసం తీసుకోని రావడం జరిగిందని అన్నారు. నేడు ఆ కాలువ కొనసాగింపులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్ర నాయుడు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ

ఖండాంతరాలకు పాకిన వెంకటగిరి ఖ్యాతి

                                 ఓ మధ్యతరగతికి చెందిన కుటుంబం హడావుడిగా పిల్లవాడిని లాక్కుంటూ కూతవేస్తున్న ట్రైన్లోకి ఎక్కి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం జరిగింది. బోగీలో సందడిగా ఉన్నప్పటికి పిల్లవాడు మాత్రం వాటిని పట్టించుకోకుండా కిటికీవైపుకి చేరిపోయాడు. ఎప్పుడూ ఓజిలి గ్రామంలోని పీతిరి గుంటలు, మట్టిగోడలు, గబ్బుకొట్టే కోట శిధిలాలు ఇదే మన పూర్వీకుల ఆనవాళ్లు అని చూపించే అమ్మమ్మ మొదటిసారి నాన్నగారి వూరికి తీసుకువెళుతుండటంతో, ఆ కుటుంబానికి చెందిన పిల్లవాడు చాలా కుతూహలంగా ఉన్నాడు. ట్రైను గూడూరు నుండి బయలుదేరి తిరుపతి వైపు వెళ్లడం సాగింది. కిటికీలోనుంచి చూస్తుంటే భూమి గుండ్రంగా తిరుగుతూ, చెట్టు పుట్ట తనను చూసి పలకరిస్తున్నట్టు ఆ పిల్లవాడు తన మొదటిసారి ప్రయాణాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. తాము చేరవలసిన గమ్యానికి వచ్చిన వెంటనే ఆ కుటుంబ సభ్యులు రైలు దిగి స్టేషన్ బయట ఆగి ఉన్న జట్కా బండి ఎక్కారు. జట్కాబండి ప్రయాణం రైలు ప్రయాణం కంటే హాయిగా ఉన్నట్టు పిల్లవాడు తెగ ఆనందపడిపోతున్నాడు. ఎదురుగా ఆకాశాన్నంటే కొండలు, చుట్టూ పచ్చదనం, పాత పెంకుటిల్లులు, విశాల ప్రార్ధనాలయాలు, పెద్ద పెద్ద కోటలు, ఇవన్నీచూస్తుంటే పిల్లవాడికి అమ్మమ్మ చెప్పిన రాజు కథల్లో లాంటి వాతావరణ ఇక్కడ కనిపిస్తుంటే, ఎదో ఇంకొక దేశంలో ఉన్నట్టు ఆ పిల్లవాడు సంబరపడిపోసాగాడు. అక్కడి మనుషుల తీరు, ఆప్యాయత, కలుపుగోలుతనం, భారతదేశమంటే ఇదేనేమో నన్న భావన ఆ చిన్నవాడిలో బలంగా నాటుకుపోయింది. అది మొదలు పదేపదే ఆ వూరికి వెళ్లిన, తరువాత కొంతకాలం అక్కడే స్థిరపడిన, తాను చిన్నవాడిగా ఉన్నప్పుడు చూసిన ఆ సుమధుర దృశ్యకావ్యం తన స్మృతిపధంలో చెరపలేని ముద్రవేసింది. చిన్నపిల్లాడిగా ఈ వ్యాస రచయితకు అక్కడ అడుగుపెట్టినప్పుడు కలిగిన అనుభూతి అత్తరు సువాసనల వలె శరీరంలో ఇంకిపోయింది. తర్వాత ఎందరో ఈ పెక్యులియర్ ప్రాంతానికి వచ్చి తామనుభవించిన అనుభూతుల సజీవ సాక్ష్యాలకు అక్షర రూపమివ్వడం జరిగింది. ఆ ప్రాంతం మరేదోకాదు, ఆతిథ్యసత్కారాలకు, వైభవాలకు నెలవైన వెంకటగిరి గడ్డ అది. మద్రాస్ ప్రెసిడెన్సీ ఏర్పడక ముందే దక్షిణభారతంలో దేదీప్యమానంగా ఓ వెలుగు వెలిగిన వేంకటగిరి ప్రాంతమది, వెలమల కంచుకోటగా, సువిశాల భూభాగంతో ఎనలేని సంపదతో అలరాలిన వెలుగోటి వారి స్థావరంగా, కాలక్రమంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసి నేటికీ చిరస్థాయిగా నిలిచి ఉన్న ప్రాచీన రాచరిక వైభవం వెంకటగిరి సొంతం. ఈ వ్యాస రచయితే కాదు ఎందరో మహానుభావులు, కవులు, రాజులు, దేశ విదేశీయులు, అధికారులు, ఒక్కరేంటి ప్రతి ఒక్కరూ వెంకటగిరి ఆతిధ్యాన్ని పొందినవారే. ఇలాంటి సహజ నేపథ్యం కలిగిన వెంకటగిరికి 1888 లో సందర్శించిన లార్డ్ కన్నెమెరా, వెంకటగిరి వైభవాన్నిచూసి “ వెంకటగిరి ప్రాంతం బ్రిటీషువారి అధీనంలో ఉందా, బ్రిటిషువారే వెలుగోటివారి పాలనలో ఉన్నారా “ అని ఆశ్యర్యానికి గురవుతాడు. అక్కడి స్వాగత సత్కారాలకు ముగ్ధుడైన లార్డ్ కన్నెమెరా వ్యక్తిగత సహాయకుడు రీస్ తన వెంకటగిరి అనుభవాలను ఇంగ్లాండ్ పత్రిక అయిన ది మార్నింగ్ పోస్ట్ లో రాయడం జరిగింది. ఇతర విదేశీ పత్రికలు సైతం వారి అనుభవాల్ని వెంకటగిరి ప్రాంత వైభవాన్ని విశేషంగా ప్రచురించాయి. కన్నెమెరా బృందం యొక్క భారతదేశ పర్యటనలో భాగంగా 1888, నవంబర్ 13 వ తేదీన నెల్లూరు నుంచి ప్రత్యేక రైలులో వెంకటగిరిలో దిగిన బ్రిటిషువారికి అఖండ స్వాగతం లభించింది. రీస్ మాటలలో…..                                                 మొదటగా ఎత్తయిన కోటల్లాంటి అంబారీలతో ఏనుగులు, చుట్టూ ప్రజలతో రద్దీగా ఉన్న వీధుల గుండా నెమ్మదిగా ఊరేగింపుగా కదిలాయి, అంబారీలన్నీ ఒకే స్థాయిలో ఉన్నాయి. ఇళ్ళ పై అంతస్తులన్నితెలుపు మరియు రంగురంగుల వస్త్రాలు ధరించిన వ్యక్తులతో నిండిపోయి ఉన్నాయి. గుర్రాలపై స్వాగత బ్యానర్లు మోస్తు కొందరు వూరేగింపుకు నాయకత్వం వహిస్తున్నారు. వారి తరువాత నీలం తెలుపు రంగుల యూనిఫాం ధరించిన అశ్వికదళ బృందం, తరువాత అందమైన అమ్మాయిలు నృత్యం చేస్తూ సిగలో మల్లెల వాసనతో, బంగారపు వస్త్రాలతో మెరిసిపోతూ నృత్యం చేయసాగారు. వెనుకనే జాపత్రి మోసుకొంటూ కొందరు, ఈటెల ధారణతో మరి కొందరు, దివిటీలు చేతపట్టుకొని గుర్రాలపై వరుసగా వస్తున్నారు. గుర్రాలన్ని బంగారు వస్త్రాలతో మెరిసిపోతున్నాయి. వీటితోపాటు కొన్ని బంగారు మరియు వెండి పల్లకీలు మోస్తూ వెంట వస్తున్నాయి. సంగీతకారుల బృందం ఒంటెలపై డ్రమ్స్ వాయిస్తు, మెరిసే స్టార్‌లైట్ కింద ఆడుతుండగా, ఆ ప్రాంతమంతా తాళాలు తప్పెట్లతో మారుమోగాయి. పొడుగాటి ఇత్తడి కొమ్ముల ధ్వని ఘీంకారాలతో, బాకాల గర్జనలతో వీధులన్నీదద్దరిల్లాయి, అపారమైన పొడవు, పరిమాణం కలిగిన బాకాలు జెరిఖో (పాలస్తీనాలోని పురాతన పట్టణం) గోడలతో పోటీపడుతున్నాయి. ప్రధాన వీధిలో బల్లెములతో నిండియున్నసైనికులు వరుసగా నిలబడి వున్నారు. వారిచేతిలో అత్యంత పొడవైన బరిసెలు కన్పిస్తున్నాయి. ఇవి అంబారీల ఎత్తుతో పోటీ పడుతున్నాయి. వీధులన్ని చదునైన ఇళ్లతో ఉండి పైకప్పులలో కిక్కిరిసిన జనాభా కలిగి ఉన్నారు. వీధికిరువైపులా చింతచెట్లు, వాటివెనక పర్వతాల మధ్య మెరుస్తున్న వెంకటగిరి యొక్క గొప్ప నిధి శిఖరం (దుర్గం), వీరి అనాగరిక ఆడంబరం మరియు వైభవం యొక్క దృశ్యాన్ని ప్రతిబింబిస్తుందని చెపుతూ బ్రిటిషువారికున్న సహజ అసూయను వెళ్లగక్కుతాడు. ఈ రోజుల్లో తూర్పుప్రాంతాన అత్యంత అరుదుగా కనిపించే ఈ ఆడంబరం, పురాతన కాలంనుంచి యోగ్యతగా చెలామణి అవుతున్నట్టు చెప్పుకువచ్చాడు.                                               ‘బ్రహ్మాండమైన’ వారి వైభవానికి చిహ్నంగా భారీ ఏనుగుపై రాజు (రాజగోపాలకృష్ణ యాచేంద్ర) గొప్పగా కూర్చొని ఉన్నాడు. గవర్నర్‌తో కలిసి ఉన్నరాజు తన కిరీటంలో కోడి గుడ్డు సైజు కలిగిన పెద్ద ఎమెరాల్డ్ ధరించి ఉన్నాడు. అతని సోదరులు క్రాస్బెల్టులు ధరించి, విలువైన రాళ్లతో కప్పబడిన కత్తులు కలిగిఉన్నారు. మార్మిక సంకేతంతో ఏనుగులు పూర్తిగా మత్తులోకి ప్రవేశించి నెమ్మదిగా, గత వైభవానికి నిదర్శనంగా, మనోహరమైన నడకతో నడుస్తున్నాయి. తెలుగు సాహిత్యంలో రాయబడిన స్త్రీల వయ్యారపు నడక మాదిరి, ఏనుగులు లయబద్దంగా నడుస్తున్నట్టు రీస్ చెప్పాడు. రాజు (రాజగోపాలకృష్ణ యాచేంద్ర) అత్యంత విలువైన గొప్ప ఆభరణాలను ధరించి ఉన్నాడు. కొన్నిసంవత్సరాల క్రితం అతని తండ్రి (కుమారయాచమ నాయకుడు) స్వచ్ఛందంగా తన వద్ద ఉన్నఅన్ని ఆస్తులను కుమారుడికి ఇచ్చి, తాను మాత్రం మతపరమైన కార్యక్రమాల్లోనిమగ్నమైనాడని రీస్ తెలిపాడు. (కుమార యాచముడి స్వచ్చంద పదవీత్యాగం పై చరిత్రకారుల్లో పలురకాల అభిప్రాయాలున్నప్పటికీ అవి అప్రస్తుతం ) అతని పెద్ద కుమారుడు, మా హోస్ట్ అయిన రాజు తన చిన్నతనంలోనే ఎస్టేట్ ని విజయవంతంగా నిర్వహిస్తు వెంకటగిరి నికర ఆదాయం సంవత్సరానికి 40,000 పౌండ్లను పెంచాడని, రాజు స్వభావం అతని నడవడిక మరియు మర్యాదలు ఒకే విధంగా సరళంగా మరియు సూటిగా ఉన్నాయని రాజగోపాలకృష్ణ యాచేంద్రను ప్రశంసించడం జరిగింది. ఇతని పరిపాలనలో అద్దెదారుల ఆర్ధిక పరిస్థితి చాలా బాగున్నట్టు రీస్ పేర్కొన్నాడు.                                       మా ప్రభుత్వ అజమాయిషీలో కానీ లేక బయటకాని మరెక్కడకాని మేము విన్నదానికంటే వెంకటగిరి మెరుగ్గా ఉందని రీస్ చెప్పుకొచ్చాడు. ఇలా దక్షిణ భారతదేశంలో అన్ని ప్రాంతాలు పర్యటించిన బ్రిటిషు బృందానికి ఆతిధ్య సత్కారంలో వెంకటగిరికి మరేదీ సాటిరాదని రీస్ తన అభిప్రాయాల్ని ఆంగ్లపత్రికల్లో రాయడం అతిశయోక్తి కాదని చెప్పవచ్చు. లార్డ్ కన్నెమెరా తర్వాత ఎందరో బ్రిటిషు గవర్నర్లు వెంకటగిరికి రావడం పోవడం జరిగింది. బ్రిటిషు అధికారులు వెంకటగిరిని ప్రత్యేక దృష్టితో చూడగా, ఇంగ్లాండ్లోని పత్రికలైతే వెంకటగిరిని ఓ రాష్ట్రంగా భావించి వెంకటగిరిలో చీమ చిటుక్కుమన్న తమ పత్రికల ద్వారా స్పందించేవారు. వెంకటగిరి రాజులు కూడా బ్రిటిషువారితో అంతే భయభక్తులతో ఉండేవారు. స్వదేశీ సంస్థానాల రద్దు వరకు వీరి మైత్రి కొనసాగింది.   

Featured

ఘనంగా కెమెరా సృష్టి కర్త వర్థంతి

పలమనేరు,జులై10,2020(పున్నమి విలేకరి):పలమనేరు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురె 169వర్ధంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక నెహ్రు విగ్రహం అధ్యక్షులు వెంకటేష్ గారు లూయిస్ డాగురే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ప్రపంచంలో జరిగే ప్రతీ విషయాన్ని కళ్ళకు కట్టేటటు చూపించటానికి ప్రధాన కారకుడు కెమెరాసృష్టి కర్త లూయిస్ డాగురే కు ప్రతీ ఒక్కరు ఋణపడి ఉన్నారన్నారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన కనిపెట్టిన కెమెరా వల్ల ప్రపంచం దగ్గరగా చేరింది అనే విషయం గుర్తెరిగి ఆయనను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పైన ఉన్నది అని కొనియాడారు.తరువాత పట్టణం లో ఉన్న పేదలకు అన్న దానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్, దేవేంద్ర.సురేష్, రాఘవ, చందు, సూర్యప్రకాష్, ధన,రాధాకృష్ణ, బాబు,శ్యామ్,ప్రభాకర్, పూర్ణచంద్ర ,అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Featured

మరణం లేని మహా నేత వై.ఎస్.ఆర్ : కాకాని గోవర్ధన్ రెడ్డి

08-07-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) మనుబోలు గ్రామం లో జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి మరియు ఆచార్య యన్.జి.రంగా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ వై.మధుసూదన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు గారితో కలిసి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పాల్గొన్నారు మొదటగా మనుబోలు మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్ లను మధుసూదన్ రెడ్డి గారు, శేషగిరి బాబు గారు, ఎమ్మెల్యే కాకాణి ప్రారంభించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వినూత్న రీతిలో నూతన పద్ధతుల్లో వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టిన ఆదర్శ రైతులకు సన్మానించారు.వ్యవసాయ శాఖలో అనేక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కోదండరామిరెడ్డి గారికి ఘనంగా సన్మానించారు . రైతుభరోసా కేంద్రాల ద్వారా పలువురు రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కాకాని గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రైతుల అభివృద్ధి, సంక్షేమం అంటేనే రాజశేఖర్ రెడ్డి గారి పాలన గుర్తుకు వస్తుంది అన్నారు 2004కు ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ పై పెట్టి రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా నిలిచారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపించడం, పోలీసు కేసులు బనాయించి వేధింపులకు గురిచేసి రైతులను అవమానపరిచారు. వై.యస్.ఆర్.హయాంలో సకాలంలో రుణాలు చెల్లించి, రుణమాఫీ ద్వారా లబ్ధి కలగని రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో రైతుకు 5 వేలు ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది అన్నారు. రాజశేఖర్ రెడ్డి లాంటి మహనీయుడి పుట్టిన రోజు రైతు దినోత్సవం గా జరుపుకోవడం మన అదృష్టం. సర్వేపల్లి నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాల్లో మహానేత రాజశేఖర్ రెడ్డి దయవల్ల, సాగు నీరు అందించడంతో ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నారు. రైతాంగం శ్రేయస్సు కోసం సొంత జిల్లా కడపలోని పలు గ్రామాలను ఖాళీ చేయించి, సోమశిల రిజర్వాయరుకు 78 టీ.ఎం.సీ.ల సామర్థ్యం పెంచిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది.మహానేత మరణం తరువాత రైతులు అన్ని విధాలా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పాలనను చూస్తున్నాము. చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన హామీ కన్నా మిన్నగా, ముందుగా అమలు చేసి, రైతులపై ఆయనకున్న ప్రేమను కనబరిచారు అన్నారు రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా ప్రభుత్వం చేయూతనందిస్తుంది అన్నారు ఆక్వా రైతులను చంద్రబాబు మోసం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆక్వా రైతులను అన్ని విధాలా ఆదుకున్నారు. మహానేత ఏ లోకంలో ఉన్నా రాష్ట్ర ప్రజల హృదయాల్లో, రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజశేఖర్ రెడ్డి గారిని కోల్పోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల శాపం అయితే జగన్మోహన్ రెడ్డిగారి లాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావడం దేవుడిచ్చిన వరం అన్నారు . అభివృద్ధి సంక్షేమంలో తండ్రి ఒకడుగు వేస్తే తనయుడు రెండడులు వేస్తున్నారన్నారు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు మాట్లాడుతూ 660 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సహకార సంఘం ద్వారా రైతుల శ్రేయస్సు కోరిన ముఖ్యమంత్రి వైఎస్ అన్నారు. అనంతరం నియెజకవర్గంలో ని ఐదుమంది ఆదర్శ రైతులకు పూలమాల శాలువాలతో సన్మానించి రైతుశ్రేయస్సు పోష్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, వ్యవసాయ శాఖ జెడి ఆనందకుమారి ,ఏడి శివనాయక్ ,ఏ.ఓ జహీర్ బాష ,ఎమ్మార్వో నాగరాజు ,ఎంపిడిఓ వెంకటేశ్వర్లు పశు ఉద్యాన శాఖ ల జెడిలు అన్ని శాఖ ల అధికారులతోపాటు వైకాపా నాయకులు బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి , కడి వేటిచంద్రశేఖర్ రెడ్డి , దాసరి భాస్కర్ గౌడ్ ,చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి,మన్నేమాల సాయి మోహన్ రెడ్డి కిషోర్ నాయుడు దాసరి మహేంద్ర వర్మ ప్రదీప్ కుమార్ రెడ్డి సురేంద్ర రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి మండల వ్యాప్తంగా నాయకులు,రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు

Featured

బిజెపి-జనసేన కూటమి ఆత్మీయ సమావేసం

08-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రం లోని బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి-జనసేన కూటమి ఆత్మీయ సమావేశం బిజెపి మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి -జనసేన నాయకులు మరియు కార్య కర్తలు పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో మండల స్థాయిలో బిజెపి-జనసేన కూటమిగా ఏర్పడి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు.జనసేన నాయకులు మాట్లాడుతూ గతంలో అనేక సమస్యల మీద మనుబోలు మండలం లో జనసేన పార్టీ పోరాటం చేయడం జరిగిందని కొన్ని సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడం జరిగింది అని తెలిపారు రాబోయే రోజుల్లో బిజెపి-జనసేన కలిసి ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేస్తామని అన్నారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలియజేస్తూ బిజెపి- జనసేనకూటమి పని చేస్తుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యాచవరం గ్రామానికి చెందిన గుంజి.రామయ్య బిజెపి పార్టీలో చేరడం జరిగింది అని అన్నారు రాబోయే రోజుల్లో మండల స్థాయిలో బిజెపి -జనసేన పార్టీ బలోపేతానికి కలసి కట్టుగా కృషి చేస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బోలా.శ్రీనివాసులు, చల్లా.లక్ష్మయ్య, ఇరగరాజు.వెంకయ్య, యాళ్ల. శ్రీనివాసులు, గణేశ్ జనసేన నాయకులు ప్రసాద్, జాకీర్ మరియు బీజేపీ ,జనసేన కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.

Featured

వై.ఎస్.ను నిత్యం అందరూ స్మరించుకుంటారు.డా.ఎల్వికే ✍️✍️

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ దివంగత ముఖ్యమంత్రి మహానేత డా.వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు నిత్యం స్మరించుకుంటూ ఉంటారని లెబాకు నారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ లెబాకు విజయకృష్ణా రెడ్డి చెప్పారు.సున్నిత మనస్కులైన  డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లో మానవీయత ఉట్టి పడేదని,బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేవారని అన్నారు.ముఖ్యమంత్రిగా ఆయన చూపిన మానవీయత వెలకట్టలేనిది కొనమానానికి అందనిదని కొనియాడారు. వైఎస్ జయంతి సందర్భంగా లెబాకు నారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరులోని  ప్రభుత్వ బాలసదన్ విద్యార్థులకు పలహారాలు పండ్లు పంపిణీ చేశారు. బాలబాలికలంటే  వైఎస్ కు ఏనలేని అభిమానమని అందరూ మంచిగా చదువుకోవాలని,ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రగాఢంగా కోరుకునే వారని అన్నారు.రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు గురించి ప్రస్తావించాలంటే కొన్ని గంటలు  చెప్పాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు

Featured

పేదల గుండె చప్పుడు వైఎస్సార్…

పలమనేరు, జులై8,2020( పున్నమి విలేఖరి): పేద ప్రజల గుండె చప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అని ఎమ్మెల్యే వెంకటే గౌడ అన్నారు. వైఎస్ 71 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.వైయస్ రాజశేఖర్రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటే గౌడ మాట్లాడుతూ..పేదల గుండెల్లో గూడుకట్టుకున్న మహానుభావుడు అని కొనియాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం రైతు దినోత్సవంగా గా పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న నూతన పథకాలు రైతాంగానికి చేయూతనిస్తున్నారు. కరోనా కష్టాల కాలం లో ఆర్థిక ఇక్కట్లు ఎన్ని ఉన్నా ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి దక్కిందన్నారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాల ఆదుకున్న గొప్ప నేతగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆమె మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి, వైసిపి పట్టణ కన్వీనర్ మండి సుధా,బాలాజీ నాయుడు,ఫయాజ్,జాఫర్,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Featured

మెకానిక్ కి 10 వేల ఆర్థిక సహాయం

పలమనేరు, జులై5 2020(పున్నమి విలేకరి): పలమనేరు పట్టణానికి చెందిన టూవీలర్ మెకానిక్ ఫారుక్ గత ఇరవై రోజుల క్రితం టూ వీలర్ లో రోడ్డు ప్రమాదంలో కుప్పం మెడికల్ హాస్పిటల్ లో చికిత్స చేయడం జరిగింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి మెకానిక్ ఫారుక్ అతని గ్యారేజ్ తీయ లేని స్థితిలో ఉండడం వలన పలమనేరు టూ వీలర్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్ ఫారుక్ కి పదివేల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు సయ్యద్ మహబూబ్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో టూ వీలర్స్ కార్మికులు ఒక లక్షకు పైగా ఉన్నారని ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ ఒక్క ప్రభుత్వము టూ వీలర్స్ కార్మికులకు ఎటువంటి సహాయాలు చెయ్యలేదని, గ్యారేజ్ లకు బాడుగ కట్టలేని స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో ఇంటి అద్దెలు కూడా కట్టలేక పోతున్నామరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టూ వీలర్స్ వర్కర్స్ కార్మికులకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గణపతి, అక్బర్,సుబ్రహ్మణ్యం, దిన, నజీర్, హమద్ తదితరులు పాల్గొన్నారు.

Featured

ట్రాక్టర్ – బొలెరో వాహనం ఢీ…ఒక్కరు మృతి

పలమనేరు, జులై5(పున్నిమి విలేకరి):చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి జగమర్ల క్రాస్ వద్ద ఇటుకల లోడ్డుతో వెల్లుతున్నా ట్రాక్టర్ ను బోలేరో వాహనం ఢీ కొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు.మృతుడు పరదేసి బంగారుపాళ్యం మండలంలోని టేకుమంద గ్రామం చెందిన వాడుగా గుర్తించారు. సంఘటన స్థలానికి 108 చేరుకునే లోపే అతను మృతిచెందారు. కారు డ్రైవర్ పరారి అయినడుని స్థానికులు సమాచారం.ఏస్ఐ నాగరాజు తన సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకుని మృతిని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏస్ఐ తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.