Thursday, 5 March 2026

Blog

Featured

ప్రైవేటు టీచర్లను,లెక్చరర్లును ప్రభుత్వం ఆదుకోవాలి

పలమనేరు, జూలై27,2020(పున్నమి విలేకరి): కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులను,కళాశాలల లెక్చరర్లు ను ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకోవాలని ప్రైవేటు ఉపాధ్యాయులు,లెక్చరర్లు సంఘం డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీచర్లు సంఘం అధ్యక్షుడు దేవేంద్ర, మాట్లాడుతూ… మార్చి నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.జీతాలు లేక కొందరు ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు పూట గడవక వీధుల్లో పండ్లు, కూరగాయలు అమ్మ్ముకుంటూ జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడిందిని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులు,లెక్చరర్లు జీతాలు లేక అప్పులుపాలై ఆతహత్యలకు పాల్పడుతున్నారు. గతంలో ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడు ఆ ఘనత మా ఉపాధ్యాయులదేనని సన్మానించి ప్రచారం చేసుకున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రస్తుతం స్పందించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రేమకుమార్,రెడ్డి శేఖర్, రాజేశ్వరరావు, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Featured

భార్య చేతిలో భర్త దారుణ హత్య

పలమనేరు, జులై 22,2020 (పున్నమి విలేకరి): భార్య చేతిలో భర్త దారుణ హత్య ఘటన పలమనేరు రూరల్ మండలం నక్కపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి పలమనేరు రూరల్ మండలం నక్కపల్లి చెందిన గోపినాథ్ రెడ్డి, సునీత దంపతులు. వారికి పదమూడేళ్ల క్రితం వివాహం కాగా వారికి పదేళ్ల కొడుకు ఉన్నాడు.గోపీనాథ్ రెడ్డి బెంగళూరు లో ట్యాక్సీలు ను అద్దె ఇచ్చే వ్యాపారం చేసేవాడు.అయితే కరోనా కారణంతో వ్యాపారం సాగక పోవడంతో రెండు నెలల క్రితం స్వగ్రామం మైన నక్కపల్లి వచ్చి ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో వారికి గ్రామంలో ఉన్న మూడు ఎకరాల భూమిని అమ్మడంతో వచ్చిన సొమ్మును భార్య సునీత, అత్త చంద్రమ్మ తీసుకున్నారు.అందుకు సంబంధించిన సొమ్మును అడిగిన ప్రతీసారి భార్య సునీత గోపీనాథ్ రెడ్డితో గొడవపడేది. భార్య సునీత,అత్త చంద్రమ్మ గోపీనాథ్ రెడ్డి తరుపున కుటుంబ సభ్యులు, బంధువులును రనిచ్చే వాళ్లు కాదని సమాచారం.దేనికి తోడు తరచు గోపీనాథ్ రెడ్డితో భార్య సునీత వివాదం జరిగేది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గొడవ జరుగగా భార్య సునీత, అత్త చంద్రమ్మ ఇద్దురు కలిసి గోపీనాథ్ రెడ్డిని క్రికెట్ బాట్ తో తల,మర్మాగంపై బలంగా కొట్టారు.దింతో గోపీనాథ్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.స్థానికులు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడు గోపీనాథ్ రెడ్డిని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Featured

అర్హతే ప్రామాణికంగా ఇళ్ళస్ధలాలు పంపిణీ : ఎమ్మెల్యే కాకాణి

21-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి ) మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పధకంపై అధికారులతో సమీక్షించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే కాకాని మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా సమీక్షలు నిర్వహించి, సమస్యలు గుర్తించి అర్హులైన ప్రతి కుటుంబానికీ ఇళ్ల పట్టాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నము పట్టాల పంపిణీలో రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా పంపిణీ చేస్తామని అన్నారు అధికారులు అనర్హులుగా ఉన్న వారి పేర్లు జాబితా నుండి తొలగించి, అర్హులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలి అన్నారు గ్రామాల్లో అర్హత ఉండి సాంకేతిక లోపంతో పేరు మంజూరు కాకపోయినా, వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులకు సూచించామని అన్నారు బడాబాబుల కబంధ హస్తాల చెరలో ఉన్న భూములను విడిపించి, అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందివ్వడం జరుగుతుందని అన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే అత్యంత ఖరీదైన భూములలో లేఅవుట్లు అభివృద్ధి చేసి, పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తున్నాం. కోర్టులకు వెళ్లిన స్థలాలకు సంబంధించి, వాస్తవాలను న్యాయస్థానం దృష్టికి తీసుకొని వెళ్లి, స్థలాలను సేకరించి, పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తాం. గ్రామాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందడం ఇష్టంలేని కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతూ గ్రామాల్లో చిచ్చు రేపుతున్నారు అన్నారు. గత ప్రభుత్వాలలో వివాదాస్పద భూములకు పట్టాలు ఇచ్చి, పట్టాలు పేద వాడి చేతిలో ఉంటే, భూములు బడాబాబుల ఆధీనంలో ఉన్నాయి. పట్టా ఇవ్వడమే కాకుండా ఇళ్ల స్థలాన్ని చూపించి, శాశ్వత ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో ఇళ్ల పట్టాల ఎంపికలో ఎక్కడా పొరపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది. అన్ని స్థాయిలలోని అధికారులు ఇళ్ల స్థలాలను గుర్తించి, పంపిణీ చేయడానికి విశేషంగా కృషి చేస్తూ, నిరంతరం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అర్హతే ప్రామాణికంగా ఇళ్ళ స్ధలాలను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాణి స్పష్టం చేశారు. పార్టీ లతో సంబందంలేకుండా అర్హత గలిగిన ప్రతిపేదవాడికి ఆగస్టు 15న ఇళ్ళపట్టాలు అందచేస్తామన్నారు. అదేవిధంగా అనర్హులను జాబితా నుండి తొలగిస్తామన్నారు. గ్రామాల్లో ఇళ్శ స్ధలంలేదు అని ఏఒక్క అర్జీకూడా రాకూడదని ముఖ్యంగా విఆర్వో లు పారదర్శకంగా పనిచేయాలని లేదంటే మూల్యం చెల్లించుకుంటారన్నారు. రేషన్ కార్డు లేనివారికి ఇళ్ళస్ధలాలు రిజర్వ్ లో వుంచి కార్డులు వచ్చాక పంపిణీ చేస్తామన్నారు. మండలంలోని 19 పంచాయతీ లలో చెర్లోపల్లి, వెంకన్నపాలెం లో సమస్యలు అధికమించామని ఇంకా చిన్న చిన్న సమస్యలు వున్నాయని వాటిని కూడా అధికమిస్తామని పేర్కొన్నారు. ప్రతిపేదవాడికి ఇళ్ళు ఇవ్వాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకుసాగుతున్నారని టీడీపీ మాత్రం ఏవిధంగా బురదజల్లాలని ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అంతకముందు గ్రామాలవారిగా అధికారులు నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పలుసమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలోబొమ్మి రెడ్డి హరగోపాల్ రెడ్డి,కడివేటి చంద్ర శేఖర్ రెడ్డి, బాస్కర్ గౌడ్, సుధీర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి,దాసరి మహేంద్ర వర్మ ,శివకుమార్ రెడ్డి, ఆదినారాయణ ,తులసి ,రమేష్, రాజా వైఎస్ఆర్సిపి నాయకులు అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.

Featured

కరోన కట్టడికి వై.కా.పా నేత కిరణ్ కుమార్ రెడ్డి ముందడుగు రెండు లక్షల రూపాయల సామగ్రి అందజేత

కరోనా కట్టడికి కిరణ్ కుమార్ రెడ్డి ముందడుగు రెండు లక్షల విలువ చేసే సామాగ్రి పంపిణీ 20-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం లో కరోనా వ్యాప్తి అరికట్టేందుకు మనుబోలు మండలం అక్కంపేట మాజీ సర్పంచ్ వైకాపా యువనేత నారపనేని కిరణ్ కుమార్ రెడ్డి ముందడుగువేశారు. సుమారు రెండు లక్షల విలువ చేసేపల్స్ ఆక్సిమీటర్లు ,ధర్మ మీటర్లు శానిటైజర్,మాస్కులు తహశీల్దార్ ,ఎంపిడిఓ,వెలుగు,ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ స్టేషన్ మొదలగు కార్యాలయమునకు మండలంలో గల 14సచివాలయాలకు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకాణి ఆదేశాల మేరకు కరోన ప్రత్యేక పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతిఒక్కరు ఎంతలే అనుకోకుండా జాగ్రత్తలు తప్పనిసరి గా పాటించాలన్నారు. కరోనా నియంత్రణ లో మండల అధికారులు ఆదర్శంగా నిలువాలన్నారు. తహసిల్దార్ మాట్లాడుతూ కరోనా ను ఎదుర్కొనాలి అంటే ప్రభుత్వం వారు మనకు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి అన్నారు ప్రజలందరూ పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలి అన్నారు రాబోవు రెండు నెలల్లో కరోనా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ బయటికి వచ్చేటప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కు ధరించాలి అని తెలియజేశారు ఏ మండలం లేనివిధంగా మనుబోలు మండలం లో కరోనా నిర్మూలనకు కిరణ్ కుమార్ రెడ్డి చేయూత మరువలేనిదన్నారు. అనంతరం వైకాపా నాయకులు కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,బొమ్మిరెడ్డి హరరగోపాల్ రెడ్డి కిరణ్ దాతృత్వాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలోవైద్యాధికారి సుబ్బరాజు వైకాపా నాయకులు దాసరి బాస్కర్ గౌడ్,చేరెడ్డి పట్టాభి రామిరెడ్డి, దాసరి మహేంద్ర వర్మ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి ,గుంజి రమేష్ తులసి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Featured

పోలీసులు అధైర్యపడవద్దు అండగా నేనున్నాను: శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

17-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలుమండలం పోలీస్ స్టేషన్ నందు ఎస్సై తో సహా 11 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయిన నేపథ్యంలో శుక్రవారం నాడు సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మనుబోలు మండల కేంద్రంలో పర్యటించి పోలీసులను అధైర్యపడవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ నందు మాస్కులు , శానిటైజర్లు పంపిణీ చేశారు. విస్తృతంగా శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని , మెరుగైన సేవలు అందించాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూచెర్లోపల్లి వడ్లపూడి గ్రామంలో కూడా కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు కరోనా పాజిటివ్ విషయం తెలుసుకున్న తాను చాలా బాధపడ్డానని , చాలా దురదృష్టకరమన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కరోనా నివారణకు అన్ని రకాలుగా సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.ఆయన వెంట తహశీల్దార్ నాగరాజు , ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ,వైద్యాధికారి సుబ్బరాజు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్, దాసరి మహేంద్ర వర్మ ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి,కిషోర్ నాయుడు ,గుంజి రమేష్ ,కోటేశ్వరరావు గౌడ్,చల్ల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు .

Featured

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

పలమనేరు, జూలై 16,2020 (పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గంలో పలువురు లబ్దిదారులకు గురువారం ఎమ్మెల్యే వెంకటే గౌడ తన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన మొత్తం, రూ5,41,000 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద, మధ్య తరగతి ప్రజలు అనారోగ్యానికి గురై ఉన్నత వైద్య పొందిన వెంటనే సీఎం సహాయనిధి నుండి ఆస్పత్రి ఖర్చులను అందించడం జరిగిందని వివిధ కారణాల చేత అనారోగ్యం పాలైన పలువురికి మంజూరు అయిన సీఎం సహాయనిధి చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు అందించడం జరిగిందని ఆయన తెలిపారు.

Featured

ఆపరేషన్ ముస్కాన్ ను ప్రారంభించిన డీ ఎస్పీ మాసుం భాషా

తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం అమలాపురం డివిజన్ పరిధిలో వీధి బాలలను కాపాడేందుకు,వారికి భద్రత కల్పించి,విద్యను అందించేందుకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ ఫేజ్ 6 ను ఈరోజు అమలాపురం డీ.యస్.పి షేక్ మాసుం భాషా ప్రారంభించారు.అమలాపురం లో ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా డీఎస్పీ మాసుం భాషా ఆధ్వర్యంలో పట్టణ వీధుల్లో అవగాహన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎస్పీ భాషా మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ కు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఉదయం 11 గంటల తరువాత అన్ని వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయలని వ్యాపారులకు తెలిపారు.రోడ్లపై మాస్కులు ధరించకుండా తిరుగుతున్న యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించి, రోడ్డు ప్రక్కన కరోనా నియంత్రణ ప్లకార్డులను ప్రదర్శింప చేశారు. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వీధి బాలలను గుర్తించి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అమలాపురం రూరల్ సీఐ సురేష్ బాబు,అమలాపురం రూరల్ ఎస్.ఐ రాజేష్,సఖినేటిపల్లి ఎస్ ఐ భవాని మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Featured

కరోనా ను సమర్ధవంతంగా ఎదుర్కొందాం :ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

13-07-2020మనుబోలు( పున్నమి ప్రతినిది) మనుబోలు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయుటకు సందర్శించి, వసతి, సదుపాయాలను పరిశీలించి, అవసరమైన అదనపు ఏర్పాట్లను అధికారులతో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సమీక్షించారుఅనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరోనా త్వరగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వాటి జాగ్రత్తల కోసం కోవిడ్ సెంటర్లతో పాటు క్లినిక్ ను కూడా ఏర్పాటు చేశాము సర్వేపల్లి నియోజకవర్గంలో ని ప్రతి మండలంలో ఒక క్వారంటైన్ సెంటర్ ను మరియు వెంకటాచలం మండల కేంద్రంలో 200 పడకలతో కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాము అన్నారు. వెంకటాచలం మండలం లో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ సెంటర్లో గానీ మండలాల్లో ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ సెంటర్లలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల అవసరాలకు మాత్రమే పరిమితం చేస్తాం. అధికారులతో మాట్లాడి అన్ని అనుకూలంగా, ఎవరికీ ఇబ్బందులు లేని ప్రాంతాల్లో కోవిడ్ సెంటర్ లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో కోవిడ్ నియంత్రణకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరూ ఆందోళన చెందకుండా, కోవిడ్ సోకిన వారి పట్ల ఎటువంటి వివక్షత లేకుండా, అందరూ తగిన జాగ్రత్తలు పాటించిఅధికారులు, వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తూ, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదనితెలియజేశారు కోవిడ్ సమయంలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు, స్వచ్చంద సంస్థలు ఎన్నో ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. కరోనా సోకిన వ్యక్తి, కుటుంబం పట్ల వివక్షత అనేదానికి తావు ఉండకూడదు అన్నారు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడంతో, మనం కరోనా సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం. కరోనా సమయంలో మన నియోజకవర్గంలో చేసిన సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాయి.ముఖ్యంగామనుబోలు మండలం లో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని శాఖల అధికారులు సిబ్బంది కృషి చేశారని అన్నారు రాబోవు రోజుల్లో అందరం కలిసికట్టుగా కరోనా వ్యాప్తి చెందకుండా కృషిచేయాలని తెలియజేశారుఎంపీడీవో ఆఫీసులో మండల పరిధిలోని సమస్యలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళికలతో పని చేయాలని ఆదేశించారు కోవిడ్ నియంత్రణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి,దాసరి భాస్కర్ గౌడ్ కిరణ్ కుమార్ రెడ్డి,మనోహర్ రెడ్డి దాసరి మహేంద్ర వర్మ, గుంజి రమేష్ తహసిల్దార్ నాగరాజు ,ఎంపీడీవో వెంకటేశ్వర్లు ,ఎస్సై సూర్యప్రకాష్ రెడ్డి వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు .

Featured

ఉద్యానవనశాఖ అధికారికి జరిమానా

పలమనేరు, జులై13,2020 (పున్నిమి విలేకరి): పలమనేరు ఉద్యానవనశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డికి రూ120 జరిమాన విధించినట్టు ఎస్ఐ ప్రియాంక తెలిపారు.చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి అంబేద్కర్ సర్కిల్ సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న అధికారికి జరిమాన విధించినట్టు ఎస్ఐ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలులో తిరిగే వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005 మేరకు జరిమానా విధించినట్లు చెప్పారు. ప్రభుత్వ నియమనిబంధనలను ఉల్లంగిస్తే ఎంతటి వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Featured

ప్రాణాలు తీసిన పబ్జీ గేమ్

పలమనేరు, జులై13,2020 (పున్నిమి విలేకరి):పబ్జీ గేమ్ అడవద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన కొడుకు ఉరేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి పలమనేరులో చోటు చేసుకుంది. పలమనేరు సీఐ శ్రీధర్ కథనం మేరకు… పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రకాష్ కుమారుడు శ్యామ్ శ్రీధర్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా స్కూల్ తెరవకపోవడంతో ఇంట్లో స్మార్ట్ఫోన్లో నిత్యం పుబ్జి తదితర గేమ్స్ ఆడుతుండడం తో తల్లి మందలించింది.దీంతో శ్యామ్ శ్రీధర్ ఇంట్లోని ఒక గది లోకి వెళ్లి తల్లి చున్నీతో ఫ్యాన్ కొక్కికి ఉరి వేసుకున్నాడు. బిడ్డ కనిపించకపోవడంతో గదిలో చూడగా ఉరేసుకుని వేలాడుతున్న బిడ్డను చూసి వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెల్లారు,పరిస్థితి విషమంగా ఉండడంతో బాలున్ని చిత్తూరు ఆసుపత్రికి ఇక్కడి వైద్యులు రెఫర్ చేశారు,అక్కడ చికిత్సపొందుతూ బాలుడు మృతి చెందాడు. పలమనేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.