Thursday, 5 March 2026

Blog

Featured

బిజెపిలో చేరుతున్నభాస్కరరావు

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి సమక్షంలో ప్రముఖ శాస్త్రవేత్త మరియు సామాజిక వేత్త అయినటువంటి భాస్కరరావు గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా సూళ్లూరుపేట నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిజెపి తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి గారు తదితర నాయకులతో కలిసి బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి మరియు చిత్తూరు పార్లమెంటు జిల్లా ఇంఛార్జి శ్రీ ఆనందకుమార కోలా గారు పాల్గొన్నారు.

Featured తెలంగాణ

కొత్తరకం’పై ఆందోళన వద్దు..! సీసీఎంబీ

‘కొత్తరకం’పై ఆందోళన వద్దు..! సీసీఎంబీ జాగ్రత్తలు పాటించాలని సూచన బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్‌ మూలాలు భారత్‌లోనూ బయటపడ్డట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. యూకే నుంచి భారత్‌కు వచ్చిన వారిలో దాదాపు 40మందికి పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయోలజీ(సీసీఎంబీ) విశ్లేషిస్తోంది. ఇప్పటివరకు జరిపిన విశ్లేషణలో ముగ్గురిలో కొత్తరకం వైరస్‌ గుర్తించినట్లు సీసీఎంబీ వెల్లడించింది. ‘బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ తేలిన 40శాంపిళ్లు మాకు చేరాయి. కొత్తరకం వైరస్‌ను కనుగొనేందుకు ఇప్పటివరకు 20శాంపిళ్ల విశ్లేషణ పూర్తిచేశాం. వీటిలో మూడు శాంపిళ్లలో బ్రిటన్‌ కొత్తరకం వైరస్‌ మూలాలు గుర్తించాం’ అని సీసీఎంబీ డైరెక్టెర్‌ రాకేశ్‌ మిశ్రా మీడియాకు వెల్లడించారు. కొత్తరకం వైరస్‌ కనిపించడం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని.. అయితే పెద్ద ఎత్తున కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. *ఆందోళన వద్దు* ఈ కొత్త రకం వైరస్‌ బయటపడినప్పటికీ దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీసీఎంబీ డెరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా స్పష్టంచేశారు. ఇది చూడడానికి కొత్తగా కనిపించినప్పటికీ, ఇది కూడా కరోనా వైరస్‌ కావడంతో ఎలాంటి సమస్య ఉండదని పేర్కొన్నారు. లక్షణాలు, తీవ్రత అన్నీ ఒకేవిధంగా ఉంటాయని, కేవలం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. అయితే, ఈ కొత్తరకం వైరస్‌ మాత్రం అత్యధిక వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నట్లు రాకేశ్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇదిలాఉంటే, డిసెంబర్‌ 9వ తేదీ తర్వాత యూకే నుంచి తెలంగాణకు దాదాపు 1216 మంది వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 1060 మందిని ట్రాక్‌ చేసి వైద్య పరీక్షలు నిర్వహించింది. మరో 156 మంది ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇప్పటికే ఆరుగురు తిరిగి విదేశాలకు వెళ్లిపోగా, మరో 58 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఇక కొవిడ్‌ టెస్ట్‌ నిర్వహించిన 996 మందిలో 21 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Featured గుంటూరు

పవన్‌ కు నాని కౌంటర్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని ఘాటుగా ప్రతిస్పందించారు.మంగళవారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా పేకాట క్లబ్బులు నిర్వహించడం లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్లబ్‌లను మూసివేయిస్తోంది తప్ప ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చిన నాని.. బాధ్యత గల మంత్రిగా ప్రజలకు సమాధానం చెప్పేందుకే స్పందిస్తున్నానన్నారు. పవన్‌ కల్యాణ్‌ తనని తాను వకీల్‌ సాబ్‌ అనుకుంటే జనం మరో విధంగా భావిస్తున్నారని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాలు ఆపాలని ఎవరూ కోరలేదని, తనంతట తానే స్వయంగా సినిమాలు ఆపేస్తున్నట్టు గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. చంద్రబాబు సొంత పుత్రుడు ఒకవైపు, దత్త పుత్రుడు మరో వైపు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని విమర్శించారు. పవన్‌కు మరోసారి ప్యాకేజీ అందడంతో పర్యటనలు వేగవంతం చేశారని ఎద్దేవా చేశారు.

Featured

పన్నుల మోతతో ప్రజలు అధోగతి పాలవుతున్నారు….సీపీఎం ,బుచ్చి పౌర సమాఖ్య

ఇంటి పన్నులను ఆస్తి విలువ ఆధారంగా పెంచేందుకు కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు నిర్ణయించడం వల్ల ప్రజల అధోగతి పాలవుతున్నారు అని సీపీఎం నాయకుడు చల్లకొలుసు మల్లిఖార్జున అన్నారు.మంగళవారం పట్టణంలోని స్థానిక 5 వ సచివాలయం వద్ద ఆస్తి పన్నుల పెంపు పై సీపీఎం పార్టీ, సి ఐ టి యు,బుచ్చిరెడ్డి పాలెం పౌర సమాఖ్య, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, సచివాలయం కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీపీఎం,బుచ్చి పౌర సమాఖ్య నాయకులు చల్లకోలుసు మల్లిఖార్జున మాట్లాడుతూ ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంచడంతో పాటు నీటి పన్నులు,డ్రైనేజ్ చార్జీలు పెంచడం,చెత్త పై కొత్తగా పన్నులు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవించడం దుర్మార్గపు చర్య అని అన్నారు.ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలా ప్రజలపై మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అనే రీతిలో వ్యవహరిస్తున్నాయని అన్నారు.రానున్న ఏప్రిల్ నెల నుండి పన్నుల మోత అమలులోకి రానున్న నేపథ్యంలో కోటి అరవై లక్షల మంది ప్రజలపై పది వేల కోట్ల రూపాయల భారం పడనుంది అని తెలిపారు.73,74 రాజ్యంగా సవరణ ప్రకారం స్థానిక ప్రభుత్వాలకు పన్నులు నిర్ణయించే అధికారం ఉందని,కానీ రాష్ట్రం లో స్థానిక ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన సభ్యులు పన్నులు నిర్ణయించాలని పేర్కొన్నారు.ఒక వైపు కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు కార్పోరేట్ పన్నులలో రాయితీలు ఇస్తూ పట్టణ ప్రజలపై పన్నుల భారం మోపుతోంది అని ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో ఈ విధంగా పన్నులు పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజానీకం అవస్థలు ఎదుర్కుంటారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై మొండి వైఖరి అవలంబిస్తునదని అన్నారు. పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలపై భారాలు మోపే చట్టాలను ప్రభుత్వం తీసుకొని వచ్చింది అని అన్నారు.దీని వల్ల ఇంటి యజమానులు ఇంటి అద్దెలు అధికంగా పెంచే అవకాశం ఉందని వలస వెళ్ళే అవకాశం ఉందని అన్నారు.ఇకనైనా ప్రభుత్వ ప్రజల సంక్షేమానికే అడ్డుకునే చట్టాలను వెంటనే వెనుకకు తీసుకోవాలని,అలా కాని పక్షంలో ప్రజలతో మమేకమై ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు.2021 వ సంవత్సరం జనవరి 6 వ తేదీన పన్నుల రద్దుకు ప్రజలు భాగస్వామ్యులు కావాలని,మునిసిపల్,కార్పోరేషన్,పట్టణ పంచాయతీ కార్యాలయాల వద్ద చేపట్టిన నిరసనలను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జానీ బాష, పోతంశెట్టి శ్రీనివాసులు మల్లికార్జున, సి ఐ టి యు జిల్లా కార్యదర్శి సురేష్, మండల కార్యదర్శి మునీర్ భాషా, సీఐటీయూ నాయకులు,సీపీఎం నాయకులు బుచ్చి పౌర సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.

Featured సాహితీ

మండికారి బాలాజీ గారికి *కరోనా వారియర్* అవార్డు

లాక్డౌన్ సమయంలో పేదలకు నేను చేసిన సహాయమును గుర్తించి *విశ్వగురు వరల్డ్ రికార్డ్స్* వారు అచ్చంపేట కు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మండికారి బాలాజీ గారికి *కరోనా వారియర్* అవార్డును అందజేసిన సందర్భంగా *మిత్రమండలి సేవాసంస్థ* ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఎన్నో ఏండ్లుగా సేవలందిస్తున్న మండికారి బాలాజీ గారికి ఈ అవార్డును అందజేసిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అధినేత రాం బాబు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బాణాల హరీష్ కుమార్ , గంగాపురం శ్రీనివాస్, పోల సాయిబాబు , చంద్రమోహన్ ,భీరం నరేందర్ రెడ్డి, పోల అశోక్ , ఆకుతోట కాశీలింగం,శ్రీమతి కేతరాజు కమల రాణి , శ్రీమతి ఉమాదేవి , శ్రీమతి పెద్ది మాధవి , బాలమని , గార్లపాటి శ్రీనివాస్, శ్యామ్ సుందర్ ,మేడిశెట్టి రమేష్ ,ఫుల్జాల శ్రీనివాస్ ,శ్రీధర్ శర్మ,నారాయణలు పాల్గొన్నారు.

Featured అనంతపురం

శ్రీ కృష్ణదేవరాయ ఉత్తమ సేవా పురస్కారం: టి.వి.రెడ్డి

పెనుగొండ పట్టణం లోని నామా రామయ్య ఫంక్షన్ హాలులో మనం ఫౌండేషన్ మరియు శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన “శ్రీకృష్ణదేవరాయ జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలు”కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు సాహిత్య,సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ,కవి టి.వి.రెడ్డి కి ప్రముఖకవి,కళారత్న శ్రీ.బిక్కికృష్ణ ,మదర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ.అశోక్ కుమార్ చేతులమీదుగా “శ్రీ కృష్ణదేవరాయ జాతీయ ఉత్తమ సేవా పురస్కారం”అందజేశారు.టి.వి.రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల ఉద్యోగ పర్వం అనంతరం విశ్రాంత జీవితంలో కూడా సాహిత్య,సామాజిక సేవలపై ఉన్న మక్కువ చేత “తెలుగు వెలుగు సాహిత్య,సామాజిక సేవా సంస్థను స్థాపించి,ఒంటరిగా ఏమిచేయలేము అనుకునే వారిని సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేస్తూ,”కలిసిఉందాం -కలుపుకుపోదాం”అనే లక్ష్యంతో అటు సాహిత్యంలోను,ఇటు సామాజికంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.ముఖ్యంగా కరోనా విజృంభించిన రోజులలో దేవుడికంటే మిన్నగా సేవలు చేస్తున్న పోలీసులకు,పారమెడికల్ సిబ్బందికి,పారిశుద్ద కార్మికులకు,పాత్రికేయులకు,వలస కార్మికులకు,నిరుపేదలకు టీ,బిస్కెట్స్, మాస్క్ లు,నిత్యావసర సరుకులు దాతల సహాయంతో పంపిణీ చేయడం జరిగింది.”కరోనాపై కలం” అంటూ జాతీయ స్థాయిలో ఆన్లైన్ లో కవి సమ్మేళనం నిర్వహించి బహుమతులతో కవులను ప్రోత్సహించాము.పై సేవలకు గుర్తింపుగా పురస్కారం అందుకున్నందులకు సహకరించిన మిత్రులందరికి కృతజ్ఞతలు తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

గుడివాడ రైతుబజార్ ప్రతిపాదనలను సిద్ధం చేయండి*

*గుడివాడ శాంతినగర్లో రైతుబజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయండి* *మున్సిపల్ కమిషనర్‌కు మంత్రి కొడాలి నాని ఆదేశం* గుడివాడ పట్టణం శాంతినగర్లో 2 వ రైతుబజార్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ఆదేశించారు. గురువారం స్థానిక రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా రైతుబజార్ ఏర్పాటుపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో గతంలో గుడివాడ రైతుబజార్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గుడివాడ పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు రైతుబజార్ కు కూరగాయలను తెచ్చి విక్రయిస్తున్నారని, స్టాల్స్ చాలక రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యం 10 వేల మందికి పైగా వినియోగదారులు రైతుబజార్‌కు వస్తుంటారన్నారు. అయితే పట్టణంలో ఒకచోట మాత్రమే రైతుబజార్ ఉండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు కూరగాయలను కొనుగోలు చేయాలంటే రైతుబజార్ ఉన్న ప్రాంతానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు, వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గుడివాడ పట్టణం శాంతినగర్లోని మంచినీటి రిజర్వాయర్ సమీపంలో 2 వ రైతుబజార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ 2 వ రైతుబజార్లో 16 నుండి 20 స్టాల్స్ ఉంటాయన్నారు. నాగవరప్పాడు, వలివర్తిపాడు, పరిసర ప్రాంతాలకు చెందిన రైతులకు ఈ 2 వ రైతుబజార్ అనుకూలంగా ఉంటుందన్నారు. తక్కువ సమయంలో, రవాణా ఖర్చుల భారం లేకుండా రైతులు తమ కూరగాయలను రైతుబజార్ కు తెచ్చి అమ్ముకునే వీలు కలుగుతుందన్నారు. మరోవైపు శాంతినగర్ పరిసర ప్రాంతాల వినియోగదారులకు కూడా 2 వ రైతుబజార్ సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. 2వ రైతుబజార్లో స్టాల్స్ నిర్మాణానికి రూ. 40 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి తనకు అందజేయాలని, ప్రభుత్వం నుండి నిధులు మంజూరయ్యేలా చూస్తానని మంత్రి కొడాలి నాని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రైతుబజార్లో స్టాల్స్ కొరత ఉందని, 2 వ రైతుబజార్ ఏర్పాటైతే మరికొంత మంది రైతులు తాము పండించే కూరగాయలను కూడా విక్రయించే అవకాశం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులకు కూడా నాణ్యమైన కూరగాయలు అతి తక్కువ ధరలకే అందుతాయని చెప్పారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని శాంతినగర్ ప్రాంతంలో 2 వ రైతుబజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి కొడాలి నాని ఆదేశించారన్నారు. అంచనాలను వెంటనే రూపొందించి నివేదికను మంత్రి కొడాలి నానికి అందజేస్తామని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

కరోనా వ్యాక్సిన్ ను ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచితంగా అందించాలి: . …….  యం.వి.రమణయ్య          

కరోనా వ్యాక్సిన్ ను ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచితంగా అందించాలి .శ్రీ. వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు…  ఆర్యా! విషయం: రాష్ట్రంలో ప్రజలందరికీ సురక్షితమైన కోవిడ్  టీకా ఉచితంగా ఇవ్వాలని ……. కోటి మంది ప్రజలకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  దేశంలోనే అగ్రగామిగా నిలవడాన్ని యావత్ దేశ ప్రజలు హర్షించారు. అలాగే ప్రజారోగ్య వేదిక కూడా అభినందిస్తున్నది. నేడు కరోనా విపత్తు నుండి ప్రజలు తమ ప్రాణ రక్షణకై వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారుు. ఎందుకంటే ఇంత వరకు కోవిడ్ నివారణకు మందులు అందుబాటులో లేవు. ఈ పరిస్థితులలో వ్యాక్సిన్ మూడవదశ క్లినికల్ ట్రైల్స్ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని కంపెనీలు ప్రభుత్వ అనుమతుల కోసం సిఫార్సు చేసుకుని ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం కూడా దీనికి తగినట్లుగా మార్గదర్శకాలను, ప్రణాళికలను మరియు మౌలిక సదుపాయాల ఏర్పాటులో నిమగ్నమై ఉందని తెలుస్తున్నది.  ఇప్పటికే కేరళ, తమిళనాాడు, మధ్యప్రదేశ్ మరియు బీహారు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తామని బహిరంగ ప్రకటనలు చేశాయి. కోవిడ్ మరియు  లాక్ డౌన్ అనంతర కాలం లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయిన నేపథ్యంలో ప్రజలు కోవిడ్ టీకానీ కొనుక్కొని తీసుకునే పరిస్థితి లేదు. కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సురక్షితమైన  టీకాను ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని ప్రజారోగ్య వేదిక విజ్ఞప్తి చేస్తోంది. అలాగే ఈ మొత్తం నిర్వహించే కార్యక్రమం, ఇచ్చే టీకా ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ  ఎంతమందికి ఇస్తారు, అలాగే టీకా వివరాలు దాని సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలగు అంశాలతో కూడిన సమగ్రమైన వివరాల ప్రకటనను ముందుగానే విడుదల చేయాలని కూడా ప్రజారోగ్య వేదిక విజ్ఞప్తి చేస్తున్నది.  ఈ మొత్తం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రభుత్వ అజమాయిషీ లోనే జరగాలని, అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులలోని మౌలిక సదుపాయాలను మరియు ప్రైవేటు వైద్య సిబ్బందిని కూడా వినియోగించుకుని ఈ సురక్షిత ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాలని కోరుతున్నాం. …….  యం.వి.రమణయ్య          ( రాష్ట్ర అధ్యక్షులుు)     …   కామేశ్వరరావు       (  రాష్ట్రర ప్రధాన కార్యదర్శి)

Featured

వైకుంఠరావు??సంస్మరణ సభ*??..: సురేంద్ర రెడ్డి,

ప్రచురణార్థం* *??సంస్మరణ సభ*??.. *APTF లో జిల్లా, రాష్ట్ర స్థాయిలలో వివిధ పదవులలో పనిచేసి* *నెల్లూరు జిల్లా ఉపాధ్యాయ ఉద్యమం లో చెరగని ముద్ర వేసిన C.వైకుంఠరావు గారు* *7.12.2020 న అనారోగ్యంతో మరణించారు. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ వారి ఆశయాలు కొనసాగించే లక్ష్యం గా ఆయన జ్ఞాపకాలను, అనుభవాలను చర్చించే లక్ష్యం తో 20.12.2020 న ఉదయం 9.00 గంటలనుండి 12.30 వరకు నెల్లూరు B.V.నగర్ లోని సంఘమిత్ర విద్యాలయం నందు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సంస్మరణ సభ నిర్వహించుచున్నాము. కావున పై సంస్మరణ సభలో వారి సమకాలీనులు మరియు నేటియువతరం ముఖ్యంగా హాజరై వారి ఆశయాలను, విలువలను పుణికిపుచ్చుకోవాలి*. *కావున ఎక్కువ మంది ఉపాధ్యాయులు, అభిమానులు హాజరు కావాలని మనవి చేయుచున్నాము*. *ఇట్లు* *ఎ.సురేంద్ర రెడ్డి,అధ్యక్షుడు*. *యం.పిచ్చిబాబు,ప్రధాన కార్యదర్శి* *APTF జిల్లా శాఖ* ………………………….. Lunch follows.

Featured సాహితీ

కొల్లాయి గట్టితేనేమి” గ్రంథావిష్కరణ: డా.ఏనుగు నరసింహారెడ్డి

కరీంనగర్ అదనపు జిల్లా పాలనాధికారి శ్రీ డా.ఏనుగు నరసింహారెడ్డి గారు,సంస్కృతి పరిరక్షణ సేవా సమితి,హైదరాబాద్ సంస్థ గాంధీ జీవితం,ఆదర్శాలు,వ్యక్తిత్వం పై నిర్వహించిన కవితల పోటీలో ఎంపికైన కవితలతో ప్రచురించబడిన “కొల్లాయి గట్టితేనేమి” 90 మంది కవుల కవితా సంకలనాన్ని కరీంనగర్ జిల్లా అదనపు పాలనాధికారి శ్రీ డా. ఏనుగు. నరసింహారెడ్డి గారు17 గురువారం సాయంత్రం తమ కార్యాలయంలో విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ జీవితంపై ఎన్ని కవితా సంకలనాలు వచ్చినా వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయని,ఆ మహనీయుని జీవితం,మార్గం సదా ఆచరణీయాలని అన్నారు”జాతీయోద్యమంలో చెరగని ముద్ర వేసిన జాతిపిత, మహాకవి రవీంద్రనాధ్ ఠాగూర్ చే ‘మహాత్మా’ అనిపించుకున్న నిరాడంబరుడు,రవి అస్తమించని సామ్రాజ్యపు పునాదులను సత్యాహింసలతో కదిలించిన స్వరాజ్య సమరయోధుడు మహాత్మాగాంధీ” అని అన్నారు”గ్రామ స్వరాజ్యం కోసం పరితపించిన గాంధీ కులవృత్తులను గౌరవించారని,అస్పృశ్యతా నివారణ కు కంకణం కట్టుకున్న గొప్ప సంస్కర్త”అని సంస్కృతి పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చింతపట్ల వెంకటరమణాచారి మౌనయోగి అన్నారు.కార్యక్రమంలో చింతపట్ల వెంకట రమణాచారి, ఉదయసాహితి కరీంనగర్ అధ్యక్షులు,కవి శ్రీ వైరాగ్యం. ప్రభాకర్,అండాల్ ప్రింటర్స్ అధినేత శ్రీ ఎర్రమరాజు. రామరాజు, కొల్లాయి గట్టితేనేమి కవితా పోటీలో ద్వితీయ బహుమతి పొందినశ్రీమతి సి.హెచ్.రజిత తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.