Thursday, 5 March 2026

Blog

Featured

వివాహేతర సంబంధం వీడలేకే. బలవన్మరణం

వివాహేతర సంబంధం వీడలేకే బలవన్మరణం నెల్లూరు జనవరి (పున్నమి- విలేఖరి ): వివాహేతర సంబంధం పెళ్ళైనఇద్దరు దంపతుల బలవన్మరణానికి దారి తీసింది.ఇద్దరు సచివాలయ ఉద్యోగుల ప్రాణాలు గాలిలోకలిశాయి..రెండుకుటుంబాల్లో విషాదాన్ని నింపింది..ప్రభుత్వ ఉద్యోగంలోఉంటూ ఉన్నతస్థితికి ఎదగాల్సిన వారిజీవితాలు విషాదంతోముగిశాయి…వివాహేతరబంధాలు ఎలాంటి పరిణామాలు..ఎంతటి దారుణదారుణానికి దారి తీస్తుందో ఇవాళ నెల్లూరు జిల్లాలోజరిగిన ఘటన ప్రత్యక్షతార్కాణంగా ఉంది.. నెల్లూరు నగరంలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర బంధం వీడమన్నందుకు…జీర్ణించుకోలేని ఆజంట ప్రాణాలు తీసుకుంది.. పెళ్ళై భార్యా, భర్తలు ఉన్న వారు తాము విడిపోము… మమ్మల్ని క్షమించండి ..అంటూ ఓలేఖరాసి..బలవన్మరానికి పాల్పడ్డారు. ప్రేమించుకున్నట్లు చెబుతున్న ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు నగర శివారులోని ఓ నందా ఓయో లాడ్జిలో ఈ దుర్ఘటన జరిగింది. ఓకే చున్నికీ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. నెల్లూరు నగర శివారులోని ఓ లాడ్జిలో సచివాలయ ఉద్యోగులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది..నెల్లూరు రూరల్ మండలానికి చెందిన హరీష్, చిట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అదే సచివాలంలో నాయుడుపేటకు చెందిన లావణ్య వీఆర్వో గా పని చేస్తున్నారు. వీరిద్దరూ శుక్రవారం విధులకు హాజరుకాలేదు. వివాహితులైన వీరిద్దరూ కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కలిగిఉన్నారు..ఈవిషయం కుటుంబ సభ్యులకు తెలిసింది.. వారు ఇద్దరినీ మందలించారు. అయినా వారిలో మార్పు రాకపోగా.. వీళ్ళిద్దరూ అనధికారికంగా వివాహం చేసుకున్నారు.ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు నగర శివారు ప్రాంతమైన పడారుపల్లి సమీపంలోని నందా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు వెళ్తున్నాం.. అన్న హరీష్,లావణ్య ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత అర్ధరాత్రి దాటాక ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు ముందు హరీష్ రావ్ అన్న రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పని చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి.. అంటూ రెండు లైన్లలో ఆ లేఖను ముగించారు…బలవన్మరణానికి పాల్పడిన హరీష్, లావణ్య లు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లావణ్యకు గతంలో సైదాపురం మండలం లోని సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి వివాహం కాగా.. హరీష్ కు తమ సమీప బంధువుల అమ్మాయితో వివాహమైనట్లు పోలీసులు తెలిపారు. వివాహేతరబంధం వీడలేక వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.

Featured

గాంధీ స్మారక నిధి సత్కారం”తిరుమలరావుకు”

    శ్రీకాకుళం జిల్లా కేంద్రాన గాంధీ స్మారక నిధి వారి నేతృత్వంలో నిర్వహించిన గాంధీవర్ధంతి సభలో రాజాం రచయితల వేదిక సభ్యులు కుదమ తిరుమలరావుకు సత్కారం జరిగింది. గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం శాంతినికేతన్‌ లో గాంధీ స్మారకనిధి అధ్యక్షులు సురంగి మోహనరావు అధ్యక్షతన జరిగిన ‘గాంధేయం- భారతీయ జీవనవేదం’ అను పుస్తకాన్ని రాష్ట్ర కవిటీ సభ్యులు, జిల్లా కన్వీనర్ మేడూరి ప్రసాదరావు, కార్యనిర్వాహక సభ్యులు ఎం వి ఎస్ ఎస్ శాస్త్రి ఆవిష్కరించీ, అనంతపురం తిరుమలరావును సత్కరించారు. తిరుమలరావు రచించిన ‘సమతాదీప్తి – శాంతికి స్ఫూర్తి’ అను కవిత ఎంపికై, ఈ పుస్తకంలో స్థానం పొందింది. ఈ సందర్భంగా తిరుమలరావు గాంధీపుట్టినదేశం గీతాన్ని, వేదికపై వినిపించీ సభికుల ప్రశంసలు పొందారు. గాంధీ స్మారకనిధి సభ్యులు బి లక్ష్మణరావు, జామి భీమశంకర్, గాంధేయవాది బరాటం కామేశ్వరరావు, సాహితీవేత్తలు పులఖండం శ్రీనివాసరావు, పివిఎస్ రామమోహన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పి.రామమోహనరావు, తెలుగు రచయితల వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉత్తరావిల్లి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకట రమణమూర్తి, తెరవే సభ్యులు వావిలపల్లి రాజారావు, ఐ ఎన్ డి ప్రసాదరావు, మంగిపూడి శ్రీనివాసరావు తదితరులు తిరుమలరావును సత్కరించారు. అహింసనే పవిత్రతను లోకానికి అందించి, శతాబ్ధి వ్యక్తిగా నిలిచి, పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాసమే స్వాతంత్ర్యమని పిలుపునిచ్చి, భారతదేశానికి జాతిపితగా, సమతాదీప్తిగా, శాంతికి స్ఫూర్తిగా మహాత్ముడైనారని తిరుమలరావు తన రచనలో గాంధీజీ గూర్చి పలు భావాలను వెలిబుచ్చిరి. గాంధేయం- భారతీయ జీవనవేదం పుస్తకంలో తిరుమలరావు కవిత చోటు దక్కించుకొని, గాంధీ స్మారక నిధి వారిచే సత్కారాన్ని పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్‌ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.

Featured

iTDA కార్యాలయ ప్రాంగణంలో క్లీన్ & గ్రీన్ మరియు మొక్కలు నాటడం

ఈరోజు నెల్లూరు ITDA (YANADIS) కార్యాలయం ప్రాంగణంలో ఎప్పటినుండో పేరుకుపోయిన చెత్త మరియు అపరిశుభ్రంగా వున్న కలుపు పిచ్చి మొక్కలను ఉదయం 7.00 గంటల నుండి 10.30 వరకు శుభ్రం చేయడం జరిగింది. పలుగు,పారా పట్టీ వ్యవసాయ కూలి గా మారిన ప్రాజెక్టు అదికారి C.A మణికుమార్ గారు, తాము పనిచేస్తు సిబ్బంది లో స్పూర్తి నింపిన ITDA development officer వై. రోశిరెడ్డి గారు మరియు APO (monitoring and evaluation) పులి చెంచయ్య.మేము సైతం అంటు ముందు కొచ్చి శ్రమించిన మహిళ అధికారులు APO (lands ) రాజ్యలక్షి, APO ( agriculture) అనురాధ ,APO (horticulture) L. శ్రీనివాసులు మేనేజర్ కోటేశ్వరరావు , సూపండేంట్ నవీన్ ,FO రమేష్ గారు పర్యవేక్షించడం జరిగింది.

Featured ఆంధ్రప్రదేశ్

మహాత్మా గాంధీకి నివాళులు

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, చిత్రంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు.

Featured ఆంధ్రప్రదేశ్

అంధుల పాఠశాలకు ఆదాల వింధ్యావళి లక్ష విరాళం

  నెల్లూరులోని విశ్వభారతి అంధుల పాఠశాలకు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శ్రీమతి ఆదాల వింధ్యావళి లక్ష రూపాయల విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తాన్ని విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి తన మిత్రబృందంతో కలిసి వింధ్యావళి తరఫున అంధుల పాఠశాల కరస్పాండెంట్కు లక్ష రూపాయల నగదును శనివారం అందజేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ అంధుల పాఠశాలలోని విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఆదాల వింధ్యావళమ్మ లక్ష రూపాయల మొత్తాన్ని పంపారని తెలిపారు. అలాగే ఆదాల కుటుంబం కూడా చల్లగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, అబూబకర్, ఇక్బాల్, విజయ డైరీ డైరెక్టర్ సునీల్ రెడ్డి, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ గతంలో ఎన్నో సార్లు విరాళాలు అందజేసి విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలని కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే వారి సహకారం మాకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

ఔషధ గుణాల అద్భుతం బెల్లం!

ఔషధ గుణాల అద్భుతం బెల్లం! బెల్లం మలబద్దకానికి మంచి మందులా పని చేస్తుంది. దగ్గు జలుబు లాంటి వాటికి బెల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది. మనం పిండివంటల్లో విరివిగా వాడే బెల్లం నిజానికి ఒక గొప్ప ఔషధం. ఇందులో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీన్ని అప్పుడప్పుడు కాక తర చుగా ఆహారంలో భాగంగా తీసుకోవడం అత్య వసరమని కూడా అనిపిస్తుంది. ఇందులో ఉన్న మంచి లక్షణాలు తెలుసుకున్నాక దాని తీపి మరికాస్త పెరిగినట్టనిపిస్తుంది- జీర్ణక్రియకు పనికొచ్చే ఎంజై ములు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. పేగుల పని తీరుని మరింత ఉత్తేజపరుస్తుంది. అందుకే బెల్లం మలబద్దకానికి మంచి మందులా పని చేస్తుంది. లివర్‌లోని హానికరమైన విషాలను బయటకు తోసేందుకు తోడ్పడుతుంది. శరీరం లోని వ్యర్థాలను సమర్ధవంతంగా బయటకు నెడుతుంది. దగ్గు జలుబు లాంటి వాటికి బెల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇలాంటి లక్ష ణాలు కనిపించినపుడు దీన్ని వేడి నీటితో కానీ టీలో వేసుకుని కానీ తాగితే మంచిది. రక్తాన్ని శుద్ధి చేసే లక్ష ణాలు బెల్లంలో ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లకు వ్యతి రేకంగా పోరాడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ ‌శాతాన్ని పెంచుతుంది. శ్వాసనాళం, ఊపిరి తిత్తులు, పేగులు, పొట్ట, అన్న వాహిక వీటన్నింటినీ శుభ్రం చేసే శక్తి బెల్లంకి ఉంది. గనులు, ఫ్యాక్ట రీలు, సిమెంటు పనులు, ఇంకా కాలు ష్యంతో కూడిన ప్రాంతాల్లో పని చేసే వారికి ఇది మంచి ఔషధంలా పని చేస్తుంది. ప్రి మెన్‌‌స్ట్రువల్‌ ‌సిండ్రోమ్‌ ‌కారణంగా నెలసరికి ముందు ఇబ్బం దులు పడేవారు, ఆ సమయంలో నొప్పు లను అనుభవించేవారు దీన్ని తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి. బెల్లంలో ఐరన్‌, ‌ఫోలిక్‌ ‌యాసిడ్‌ ఉం‌డటం వలన రక్తలేమిని నివారిస్తుంది. ఎర్ర రక్త కణాలు తగ్గ కుండా కాపాడుతుంది. ముఖ్యంగా గర్భిణులకు మరింత మేలు చేస్తుంది. ఇందులో మెగ్నీషియం ఎక్కువ మోతా దులో ఉండటం వలన పేగులకు బలం చేకూ రుస్తుంది. ప్రతి పది గ్రాముల బెల్లంలో 16 మిల్లీ గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. అంటే ఇది మనకు ఒకరోజుకి కావాల్సిన మెగ్నీషియం లో నాలుగోవంతుని అందిస్తున్నట్టు లెక్క. ఇది మన శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధీక రిస్తుంది. దీని వలన శరీరం చల్లబడుతుంది. అందుకే ఎండా కాలంలో చల్లని నీళ్లలో బెల్లం కలుపుకుని తాగమని ఆరోగ్యనిపుణులు చెబు తుంటారు. ఇందులో పొటాషియం, సోడియం ఉండటం వలన శరీరంలో యాసిడ్స్ ‌లెవల్స్ ‌సక్రమంగా ఉంచేశక్తి దీనికి ఉంది. రక్తపోటుని సైతం క్రమబద్ధీక రిస్తుంది. శ్వాస క్రియ సమర్ధవంతగా ఉంచ డంలో బెల్లం శక్తిమంతంగా పనిచేస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్‌లాంటి సమస్యలను దూరం చేస్తుంది. నువ్వులతో కలిపి దీన్ని తీసుకుంటే శ్వాసకోశ వ్యవస్థకు అద్భుతమైన చక్కని మేలు చేస్తుంది. జాయింట్‌ ‌నొప్పులతో బాధపడుతున్న వారికి బెల్లం మంచి ఔషధంగా పని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాస్తం బెల్లం ముక్కని అల్లంతో కలిపి తీసు కుంటే నొప్పులకు ఉపశమనంగా ఉంటుంది. అలాగే పాలల్లో బెల్లం కలుపుకుని తాగినా ఎముకలకు మం చిది. బెల్లం బరువు తగ్గడానికి దోహద పడుతుంది. ఇందులో ఉన్న పొటాషియం, కండరాల నిర్మాణంలో మెటబాలిజంని పెంచ డంలో శరీరంలో నీటిని తగ్గించడం లో తోడ్పడి బరువుని అదుపులో ఉంచు తుంది. పంచదార కంటే శరీరానికి శక్తిని ఇవ్వడంలో బెల్లం మరింత సమర్ధవంతంగా పని చేస్తుంది. పంచదారలా ఒక్కసారిగా కాకుండా శరీరానికి ఎక్కువ సమయం కార్బో హైడ్రేట్‌లను ఇవ్వగలుగుతుంది. అందువలన రక్తంలో ఒక్కసారిగా షుగర్‌ ‌స్థాయి పెరగదు. అలాగే బెల్లం శరీరంలో అలసటని, బలహీ నతని పోగొడుతుంది. బెల్లంలో ఇన్ని అద్భుత గుణాలుండటం విశేషమే. అయితే ఇందులో కేలరీలు ఎక్కువగా ఉండటం వలన తగిన మోతాదులో మాత్రమే తీసుకుంటే మంచిది.

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

కెరీర్ లో గుడ్ విల్ పెంచుకోవడం ఎలా ? 5 మార్గాలు !

కెరీర్ లో గుడ్ విల్ పెంచుకోవడం ఎలా ? 5 మార్గాలు ! ముందు గా , పున్నమి పాఠకులకు లేటు గా అయినా, నూతన సంవత్సర & సంక్రాంతి శుభాకాంక్షలు ! సంస్థలలో పని చేసే కొందరు ఉద్యోగులు, చాలా త్వరగా గుర్తింపు, ‘ వెయిట్ ‘ , ఇంఫ్లూయెన్సు, మంచి గుడ్ విల్ సంపాదించుకుంటారు ! అది అందరి వల్లా కాదు ! వారు మీటింగ్ లలో ఏదైనా సమస్యలు లేవనెత్తినా, లేదా పరిష్కారాలు సూచించినా , సీనియర్ లు, పై అధికారులూ, వారి మాటలు వింటారు , వారిని సీరియస్ గా తీసుకుంటారు . అలాంటి వారు, హోదా, అధికారం సూచించే పై పొజిషన్ లలో లేక పోయినా, వారి మాటకు వెయిట్ ఉంటుంది . దీనిని మేనేజిమెంట్ పరిభాభ లో ‘ గ్రావిటాస్ ‘ ( ఇంగ్లీష్ ) అంటారు ! మనం మన భాష లో దీనిని ‘ గుడ్ విల్ ‘ అందాము అయితే, లీడర్ షిప్ క్వాలిటీస్ లాగా, ఈ ‘ గ్రావిటాస్ ‘ అనేది  పుట్టుక తో రాదు ! పెంపొందిచుకో వచ్చు సంస్థలలో పని చేసే ప్రతి ఉద్యోగీ , కష్టానికి తగ్గ ప్రతిఫలం , జీతం తో పాటు , కొంత వ్యక్తిగత గుర్తింపూ , ఆఫీసు లో తన మాటకు విలువ ఇవ్వాలనీ , కోరుకుంటారు . స్త్రీలయినా పురుషులయినా . దీనిలో తప్పేమీ లేదు .ఈ గుడ్ విల్ పెంపొందిచుకోవడానికి కొన్ని మార్గాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం ‘ఇలా చేస్తే, అలా ఫలితం వస్తుంది ‘ అని నేను గ్యారంటీ ఇవ్వలేను . కానీ , గుడ్ విల్ పెరిగే అవకాశాలు మెరుగవుతాయి. ఇది మీరు ఆత్మ విమర్శ చేసుకోవడానికి కూడా ఉపయోగ పడుతుంది . వీటిలో మీరు ఏవేవి చేస్తున్నారు  ? ఏవేవి చేయటం లేదు ? అలా ! పని చేసే సంస్థలలో గుడ్ విల్ లేదా గ్రావిటాస్,  పెంచుకోవడానికి మార్గాలు. (1) మొదట గా సమయ పాలన . ఆఫీస్ టైం 9.30 కి అనుకోండి . 9.40 కి కాకుండా , 9.20 కల్లా  వచ్చేయడం అలవాటు చేసుకోండి . 9.30 లోగా పని మూడ్ లో కి , ఫ్లో లోకి వచ్చేయండి . (2) మీరు సేల్స్ లో కానీ , షాపు లో కౌంటర్ సేల్స్ లో కానీ , కస్టమర్ సర్వీసు లో కానీ , బిజినెస్ డెవలప్మెంటు లో కానీ ఉన్నారా ? మీకు టార్గెట్ లు ఉన్నాయా ? లేక మీ ఉద్యోగం లో బాగా చేశారు అనడానికి కానీ , బాగా చేయలేదు అనడానికి కానీ , ఈ యీ ఫలితాలు సాధించారు/  సాధించ లేదు అనడానికి పనితనానికి కొలబద్దలు ( కీ రిజల్ట్ యేరియాస్ ) ఉన్నాయా ? ఆ ఫలితాలు సాధించడానికి మీరు చేయవలసిన పనులు ఏవేవి ? ( కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్ లు ) .  ఈ పనులను బాగా చేయండి . మన ఉద్యోగం ద్వారా మన పై అధికారులు ఏమేమి ఫలితాలు మన నుంచి ఆశిస్తున్నారు ? అనే దాని పైన స్పష్టమైన అవగాహన ఉన్న వారు త్వర గా క్యారీర్ లో పైకి వెళతారు . (3) మన వృత్తి విలువల పట్ల మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి . అసలు మనకేమి కావాలి ? ఎందుకు కావాలి ? ఇలా మనని మనం అర్ధం చేసుకుంటే, ప్రంచాన్ని అర్ధం చేసుకోవడం సులభం అవుతుంది . ఉదాహరణకి ” ఎవరైనా నన్ను వర్ణించే టప్పుడు ( నేను వారి సమక్షం లో లేనప్పుడు ) , వారు నన్ను ఎలా వర్ణించాలని నేను ఆశిస్తాను ? ఏ యే గుణగణాలని వారు ప్రశంసా పూర్వకం గా చెప్పాలని నేను ఆశిస్తాను ? ” అని మీకు మీరు ప్రశ్న వేసుకోండి . నాలుగైదు అలాంటి వృత్తి విలువలు రాసుకోండి ఏ పేపర్ మీద అయినా . ఆ విలువలు దైనందిక వృత్తి జీవితం లో పాటించండి . వృత్తి విలువల కు ఉదాహరణలు : ఫలితాలు, కనుగోలుదారుల సంతృప్తి , కంపెనీ వృద్ధి , నిజాయితీ, సేవా భావం , మంచి టీం ప్లేయర్  గా నలుగురి పని లో సహాయ పడడం , పని పట్ల వ్యక్తిగత నిబద్ధత , కష్టించి పని చేసే స్వభావం , వ్యాపారం లో నైతిక విలువలు , మాటకు కట్టు బడడం . ఇవన్నీ వృత్తి విలువలకు ఉదాహరణలు . (4) ఒక్కో సారి మనం బాగానే చేస్తున్నాము అన్న భ్రమ లో ఉంటాం . కానీ మన చుట్టూ ఉన్న వారు అలా అనుకోక పోవచ్చు ! ఆ సమన్వయం కుదరడానికి ‘ ఫీడ్ బ్యాక్ ‘ ను ఆశ్రయించాలి . మనం పని బాగానే చేస్తున్నామా ? ఇంకా ఏమైనా మెరుగు పరుచుకోవచ్చా ? పని మరింత తక్కువ సమయం లో చెయ్యడానికి , మరింత నాణ్యత పెంచ డానికి , మరిన్ని మెరుగైన ఫలితాలు రాబట్ట డానికి , మరింత తక్కువ ఖర్చు తో చేయడానికి , మనం అదనం గా ఏమైనా చేయ గలమా ? ‘ కొంతమంది శ్రేయోభిలాషుల తో ఈ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి . దానిని మన దైనందిక జీవితం లో పాటించాలి. (5) చొరవ : ఒక్కో సారి మన సంస్థ క్లిష్ట పరిస్థితులలో ఉంటుంది . మనని ఒక గంట అదనం గా పని చెయ్యమనో ( ఒక నెల రోజులు, 2 నెలలు ) , లేదా, వారం పని 5 రోజులలో చెయ్యమనో , మనం చేసేది కాక అదనపు పని ‘ ఎవరు తీసుకుంటారు ? ‘ అని మీటింగు లో పై అధికారులు అడిగినప్పుడు ‘ నేను చేస్తాను ! ‘ అని అందరికంటే ముందుగా చెయ్యి పైకి ఎత్తండి ! దాని వల్ల అప్పుడు మీకు రూపాయి అదనపు జీతం రాక పోయినా కూడా ! ఫలితాలు దీర్ఘ కాలం లో ఉంటాయి . పై 4 విషయాలు పాటిస్తే , మనం పని చేసే చోట మన గుడ్ విల్ పెంచుకోవచ్చు . అది మన క్యారీర్ లో మరింత ముందుకు వెళ్ళడానికి సహాయ పడుతుంది . ఇవే ఫైనల్ అని కాదు . పైవి కాక , మరే లక్షణాలు అయినా మన గుడ్ విల్ పెంపొందిస్తాఇ అని మీరు అనుకుంటే, ఈ క్రింది అడరసులకి మెయిల్ చెయ్యండి . మీ ఫీడ్ బ్యాక్ . మా ఆర్టికల్ ల నాణ్యతని మీ ఫీడ్ బ్యాక్ ద్వారా మరింత మెరుగు పరుచుకుంటాము . essence.training@yahoo.com  & punnami.news@gmail.com 2021 లో మీకు ఆరోగ్యాలు  బాగుండాలని , మీకు అంతా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ,

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

2 ‌సం।।లోపు పిల్లలకు టి.వి.చూపించకండి –

2 ‌సం।।లోపు పిల్లలకు టి.వి.చూపించకండి – 2 గం।।లకు మించి పెద్దలు టి.వి.చూడకండి పిల్లలు, పెద్దలు, ఓ టి.వి. ఇవే నేడు ఎక్కడ, ఏ కుటుంబంలో చూసినా కనిపించే దృశ్యాలు. పిల్లలు కార్టూన్లు, వీడియో గేమ్స్‌లో తలమునకలై పోతుంటే పెద్దలు వీళ్ళు టి.వి.ఎప్పుడు వదులుతారా? సీరియల్స్ ‌వచ్చే టైమ్‌ అయిందని తహతహలాడుతుంటారు. ఒకరికి నచ్చిన ఛానల్‌ ‌మరొకరికి నచ్చదు. ఇంట్లో పిల్లల్లో గొడవ, పిల్లలు, పెద్దల మధ్య గొడవ, సమయం దొరికి నపుడు ఇంటిల్లిపాది హాయిగా కథలు కబుర్లు చెప్పుకునే రోజులకు కాలం చెల్లింది. ఇప్పుడు తీరిక కాలమంతా టీవీ కాలమే. పిల్లలకు శారీరక ‘వ్యాయామం’ నిచ్చే సాంప్రదాయపు ఆటలకు స్వస్తి పలికి వీడియో గేమ్‌లకు బానిసలైపోయి చెడిపోతున్నారు. మనవాళ్ళు టి.వి.లో బొమ్మలు చూపిస్తూ పిల్లలు బోసినవ్వులు రువ్వుతుంటే అవి చూసి మురిసిపోతుంటారు. రెండు సంవత్సరాల లోపు పిల్లలు టి.వి. చూసినందువలన మెదడు అభి వృద్ధిలో పెరుగుదల తగ్గిపోతుందని ఇటీవల ఒక సర్వేలో ‘‘అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ‌పిడియాట్రిక్స్’’ ‌తెలిపింది. అంతేనా! 2 సం।। పై బడిన పిల్లలు, పెద్దలు కూడా రెండు గంటలకు మించి టీవీ చూడకూడదని హెచ్చరించింది. టి.వి.చూడడం వలన కొన్ని లాభాలు ఉన్నా ఎక్కువ మోతాదులో నష్టాలే ఎక్కువ. అందుకే దీనిని ‘ఇడియట్‌ ‌బాక్స్’ అని కూడా అంటారు. కొంత జ్ఞానాన్ని, వినోదాన్ని పంచినా సోమరితనము, స్థూలకాయమూ లాంటి శారీరక రుగ్మతలు స్థూలకాయం వలన బీపీ, కొలెస్ట్రాల్‌, ‌కొలెస్ట్రాల్‌ ‌మూలాన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతే కాదు టివిల్లో కనిపించే కుట్ర, కుతంత్రాలు, నేరాలు – ఘోరాలు, హత్యలు-అత్యాచారాలు లాంటి జుగుప్సాకరమైన దృశ్యాలు చూడడం వలన క్రమశిక్షణ లోపించి నేరప్రవృత్తి పెరిగి యువత పెడధోరణులు పట్టే అవకాశం ఎక్కువ. అందువల్ల 2 సం।।లోపు పిల్లలను అసలు టి.వి.ని చూడనివ్వ కండి. పెద్దలు కూడా 2 గం।।లకు మించి టి.వి.చూడకండి. డా।। ఎం.వి.రమణయ్య, నెల్లూరు.

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

అత్తగారూ- అరిసెలు (కథ)

అత్తగారూ- అరిసెలు (కథ) ‘‘‌పండుగపోయి  వారం అవుతుంటే ఇప్పుడేం అరిసెలత్తయా? అన్నాన్నేను ఉండ బట్టలేక ‘‘ఏం? చేసు కోకూడదా? తిన కూడదా? నా నోరు చవిచెడింది. తినాలనుంది’’ అంది పెంకిగా మా అత్తగారు సక్కుభాయమ్మ (భా అనే అక్షరం పలికేటప్పుడు వత్తి పలక్క పోయామో అయి పోయామే ఆ మాత్రం తెలుగు పలకడం రాక పోతే ఊరుకోండి భాషని కైమా చెయ్యబాకండి వెనకటి మా మేనత్త పినతల్లి కోడం కొత్తగా పెళ్లయ్యి పుట్టింటి నుండి అత్తింటికి వచ్చింది. కొత్త పిల్లగదా వాతా వరణం కొత్తకదా వాళ్ల మామయ్యని చూసి నమస్కారం అందట ఇక చూస్కో ఆ పిల్లని గోడ కుర్చీ వేయించారు. మెడలో పూలదండలు అలానే ఉన్నాయ్‌ అలాంటి ఆచారం, సాంప్ర దాయం నుండి వచ్చాన్నేను అంటూ ఇంకా కొన్ని ఉదాహరణలతో ఊదరగోడుతుంది. పొగ బెడుతుంది. వచ్చిన వాళ్లు ఎలాగో తప్పించుకుని వెళతారు మరినేనా? ఆమె కోడల్నయినందుకు సచ్చినట్లు పడి ఉండాలి ఉంటాను ఏ మాత్రం నిరసనగా కళ్లు వాల్చనా కనుక్కునేస్తుందండోయ్‌ ‌మా వారు రాగానే ఏరా కాముడూ! నీ పెళ్లానికి ఇంత నిర్లక్ష్యం ఏమిట్రా? నా మాటని మరీ బొత్తిగా ఎడంచేత్తో తీసిపారేస్తుంది అంటూ మా వారికి మా అత్త సంగతి తెలుసు కాబట్టి ఆవిడ ముందు నన్ను కేకలేస్తారు. నాకు కన్ను గీటుతూ. ‘‘అది కాదత్తయ్యా! బుచ్చిరెడ్డి పాళెం నుండి మీ అక్కగారు పంపినవే మొన్నటి దాకా తిన్నాం ఇంకా మిగిలితే సంపూర్ణమ్మ (మా పని మనిషి) కిఇచ్చాం. ‘‘నా మాట పూర్తికాక ముందే (ఎవరి మాటని పూర్తిగా చెప్పనిస్తుంది గనక)’’ ఇస్తే ఇచ్చాం లేద్దూ రెక్కలు ముక్కలు చేసుకుని మన ఇంటెడు చాకిరీ చేస్తుంది. ఆ మాత్రం ఇస్తే పోయేదేమిటి? నీ పొదుపు నీపుట్టింట్లో చూపించు ఇక్కడకాదు మాది ధారాళంగా ఇచ్చుకునే వంశం… అంటూ తన పూర్వచరిత్ర తిరగతోడుతుంది. ఇక నేను సచ్చానే సంపూర్ణమ్మకు ఎవరు ఇవ్వొద్దన్నారు. అలా జంబాలు పలుకుతుంది గానీ నేనెప్పుడన్నా మా పని మనిషి కూతురు భార్గవి తలనొప్పక్కా అంటే శారిడాన్‌ ‌మాత్ర ఇచ్చి వేడి వేడి కాఫీ కలిపి ఇస్తాను ఆ బాదం చెట్టుకింద కూర్చుని తాగిరా, కాసేపు ఆ అరుగు మీద రెస్ట్ ‌తీసుకో అంటాను. మా అత్తగారు ఆ సమయంలో ఏమంటారో తెలుసా అండీ… ఛఛ… మానం మర్యాద మంట కలిసిపోతున్నాయ్‌. ‌పనోళ్లని అంతచనువిస్తా రా? ఎవరైనా? అలానే నెత్తినెక్కించుకుంటారా ఎక్కడైనా? మరీ విడ్డూరం’’ అంటూ చేతులు బార్లా చాపి నా మీద ధ్వజమెత్తుతుంది. సాధింపు సాయంత్రం మా వారు వచ్చేదాకా కొనసాగుతుంది. ఇంతకీ అరిసెల సంగతి మర్చిపోయాం. వాస్తవంగానండీ మా అత్తగారికి ఒక్క పని చేతకాదు ఆ రోజుల్లో ఈమె కాపురాని కొచ్చిన ప్పుడు మామామయ్యగారి మేనత్తలు తలచెడి ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఇంకేముంది. పనంతా వాళ్లే చేసేవాళ్లు. ఈమెని సున్నితంగా సుకుమారంగా చూసుకున్నారు. అలా రాణి లాగా దర్పం వెలగబెట్టి తనకి ఏ పనీ చేతకాదని ఎవరైనా కనుక్కుంటారని ఆ ఏముందేమరిగా అవి తీసి ఇందులో పొయ్యి ఇవి తీసి అందులో పొయ్యి పోపు గింజలు దట్టించి వెయ్యి నూనె కాస్తా పోయ్యవే నీ అబ్బ సొమ్మేంపోదు ఆ యాలకులు ఇలా పట్రండి. చిదిపి ఇందులో వేద్దాం జీడిపప్పు వేయించారా పక్కన పెట్టు కోండి (ఈలోపు సగం ఆమె నోట్లోకే వెళ్లి పోతాయ్‌ ‌పుటకూ పుటకూమంటూ ముని పళ్లతో నమిలేస్తుంది. ఆ వెయ్యి… డాల్డా కలపకేవ్‌ ‌నాకస్సలు నచ్చదు. ఆ పసుపులేటి వారి గోశాలకెళ్లి ఆవు నెయ్యి తెప్పించకూడదే అన్నీ నేనే చెప్పి చావాలి అంతా నేనే చూసు కోవాలి అంటూ ఉస్సూబుస్సూమంటూ తన భారీ శరీరాన్ని కుర్చీలో ఇరికిస్తుంది. అక్కడి నుండే తెప్పించానత్తయ్య అని నేనంటే ముందుగా చెప్పొచ్చుకదే నన్ను ఆయాసపెట్టి తమాషా చూడకపోతే అని మళ్లీనన్నే అం టుంది. నేను ఒక్క నవ్వు నవ్వి పక్కకెళ్లి పోతాను. అలా పైపైన నటనలతో వంటలూ, పిండి వంటలూ అన్నీ తనే చేస్తున్నట్లు హడావిడి పెట్టిసి అంతా అయ్యాక రుచి చూస్తూ ఆ నేను చెప్పాకదా ఆ బాదం పప్పుపొడి ఉడుకు తుండగా వెయ్యమని అందుకే ఇంత రుచి వచ్చింది. చేసిన వాళ్లు నోళ్లు వెళ్లబెట్టి, నావైపు మీ అత్త భలే గడుసుదమ్మా అని వాళ్ల సంభా వన వాళ్లు తీసుకుని చక్కాపోతారు. అలా ఇప్పుడు అరిసెలకు పెట్టింది టెం డర్‌! ‌మా మేనత్త కూతురు సుబ్బరత్నమ్మ మేముంటున్న బాలాజీనగర్‌కి మూడో వీధిలోనే ఉంటుంది. ఆవిడని పిలిపించమని కూచుంది. ఆవిడకు పిండి వంటలు యమాగావచ్చు. మా అత్తగారు పైపై అజమాయిషీ చేసి క్రెడిటంతా కొట్టెయాలని ప్లాను పైగా నాకు రాదని కాదేవ్‌ ‌మీ వదిన్ని పిలవమనటం నాకు చేతి కింద మనిషి ఉంటేగానీ తోచదు ఎంతటి వంటైనా చిటికెలో చేసేస్తాను. అదీగాక మీ సుబ్బరత్నమ్మ వదిన నా దగ్గర నేర్చుకున్నట్లూ ఉంటుందుని పోనీ పాపం పిల్లలుగలది నా దగ్గర నాలుగు వంటలు నేర్చుకుంటే పిల్లలకి చేసి పెడుతుంది. అంటూ ఎంతో ఉదారంగా పలుకుతుంది. మా సుబ్బరత్నమ్మ వదినకి కబురుపంపాను. టైఫాయిడంటమ్మా అంటూ వచ్చింది సం పూర్ణమ్మ. ‘‘అయ్యో! అయినా ఏంలే మానుకుంటానా ఏమిటి? తినాలని పించింది తినాల్సిందే నమ్మోయ్‌ ఎలా పెరిగాను ఎలా తిన్నాను ఆ అవన్నీ ఇప్పుడెందుకులే సరేనేవ్‌ ‌సంఫూర్ణా! ఇలారా! నీకు నేర్పిస్తాను అరిసెలోత్తేది అంది. బాగుంది మా ఆయనకి పళ్లు పీకించటానికి పోతున్నా రేపొస్తానికాడికి ఆ అరిసెలు బురి సెలు వత్తటం నాకు చేతరాదసలు అంటూ సంపూర్ణ తప్పించుకోబోయింది. ‘‘ఓసి నీ సోద్యంకూలా! రేపు భార్గవికి పెళ్లి చేశాక అల్లుడొచ్చి అరిసెలు కాల్చత్తా! అంటే ఏం కాల్చి పెడతావే పిడత కింద పప్పు మీ పక్కనున్న సుజాతమ్మ బర్రెల దగ్గరి పేడ వత్తి పిడకలు కాల్చి పెట్టాల్సిందే ఏం సోయగం పోతున్నావే చక్కగా పిండి వంట నేర్పుతాను రావే అంటే బాపనోడి పెళ్లికి సాయిబులోడు మంత్రాలు చదివినట్టు చదివావ్‌గదే సరే ఏంచేద్దాం! మంగా! నువ్‌రావే నీకన్నా నేర్పిస్తాను అంటూ నన్ను తగులుకుంది. నా బిక్క ముఖం చూసి సంపూర్ణ ‘‘వామ్మో మంగమ్మ! చెప్పటం మరి చాను మీ వదిన నన్ను యమ అర్జంటుగా రమ్మంది మీ అన్నకి కాఫీ కలిపిచ్చే దిక్కుకూడా లేక ఉసూరుమంటూంది. ఏదన్నా ఇంతకూ రాకన్నాకల బెట్టి రమ్మని పిల్చింది నిన్ను మీ అత్తగారి అరిసెల్లోపడి ఏమారాను బేగీపోమ్మా పాపం’’ అంది కన్నుగీటుతూ నాకర్థమైంది అయ్యో వదినా! అంటూ గబగబ పైటసర్దుకుని చీరకు కుచ్చిళ్లు సరిచేసుకుని వస్తానత్తయ్యా అంటూ ఒకటే దౌడు తీశాను. ఆమె ఊ ఈ అని అనకముందే! కావాలనే రాత్రి 9గంటలకి వచ్చాను ఎవ్వరూలేరని ఊరుకుని ఉంటుందని అనుకున్నాను హాల్లో తలుపులు వేసి ఉన్నంధువల్ల కాబోలు పొగ చుట్టుకునిపోయి ఉంది. వంటిల్లంతా పొగ ఇంతకీ మా అత్తగారు ఎక్కడున్నారా అని చూద్దునుగదా జగన్మోహినిలో పొయ్యి ముందు కూర్చుని కాళ్లు పొయ్యిలో పెట్టి బాణలిలో ఏవో దేవుతున్న దెయ్యంలాగా పెరట్లో పొయ్యి ముందు కూర్చుని గరిటెతో దబరలో ఏదో కలియబెడుతుంది. శబ్ధానికి ఇటు తిరిగింది. ‘‘ఏంటత్తయ్యా ఇంటి నిండా పొగ?’’ ఆ పిండి వంటలు చేస్తుంటే ఆ మాత్రం రాదూ? అన్నది పక్కనే చాప మీద తెల్లగా వడియాల్లాగా ఏవో ఉంటే ఏంటత్తయ్యా అన్నాను. ఆ మరీ చోద్యమేనీది అరిసెలు! అది గరిటిని ఇంకా బలంగా తిప్పుతూ అరిసెలా? అని ఆశ్చర్యపోతుంటే ‘‘పిండి పాకంలో కలవలేదే విరిగిపోయింది అరిసె షేపులో రాలేదనుకో బాణలిలో అరిసె వేయటం ఊడిపోవటం ఆ పిండినంతా కాల్చిదేవేను ఏమైతది గిన్నెలో వేసుకుని స్పూన్‌తో తింటే సరి! ‘‘ఏంటి అరిసెలు స్ఫూన్‌తో తినాల్నా?’’ అన్నాన్నేను ‘‘ఇప్పుడదే ఫ్యాషన్‌లేవే! అంటుంటే నేనేమంటాను. కోలపల్లి ఈశ్వర్‌ ‌నెల్లూరు.

Featured

రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ సంక్రాంతి పండుగ ను తలపిస్తుంది :ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి

మనుబోలు( పున్నమి విలేఖరి)17,జనవరి: మనుబోలు మండలం అక్కంపేట గ్రామం లో ఆదివారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగింది లబ్ధిదారులకు “నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు” పథకంలో భాగంగా ఆదివారం సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ సంక్రాంతి పండుగను తలపిస్తుందని అన్నారు. పండుగ వాతావరణంలో పట్టాల పంపిణీతో ప్రజలలో ఆనందోత్సాహాలు నెలకొన్నందని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 10 వేల కోట్లు వెచ్చించి, 30 లక్షల 75 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో 18వేల కుటుంబాలకు ఇళ్లస్థలాలు అందించడం నాకు దక్కిన వరంగా భావిస్తున్నానని అన్నారు. తెలుగుదేశం నాయకులు ఎన్ని విమర్శలు గుప్పించినా, అడ్డుకోవడానికి ఎంత రాద్ధాంతం సృష్టించినా, ఏ మాత్రం వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ప్రకడ్బందీగా ఇళ్ల పట్టాల పంపిణీని పూర్తి చేయబోతున్నామని మరోసారి గుర్తుచేశారు.ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నిర్ధారించిన మూడు విధానాలలో లబ్ధిదారుడు కోరుకున్న విధంగా ఇళ్లు నిర్మించడానికి సిద్దంగా ఉన్నామన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎన్నడూ జరగని రీతిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుతున్నామన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో రాబోవు రోజుల్లో వ్యక్తిగత సమస్యలకు తప్ప, గ్రామ అవసరాలకు ఒక్క అర్జీ కూడా ఇవ్వవలసిన అవకాశం రాకుండా, అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.రెండు సార్లు శాసన సభ్యునిగా అవకాశమిచ్చిన నియోజకవర్గ ప్రజలకు ఇంటి బిడ్డలా సేవలు అందించి, రుణం తీర్చుకుంటానని అన్నారు .పెన్షన్లు రేషన్ బియ్యం ఇంటికి వద్దకు అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుంది అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలను జగన్మోహన రెడ్డి చేస్తున్నారని తెలిపారు. అధికారంలో లేనప్పుడు సోమిరెడ్డికి భయపడలేదని ఇప్పుడు ఎందుకు భయపడుతానని ఆవేశంగా ప్రసంగించారు. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాలు కనిపించేది లేదని విమర్శించారు. ప్రభుత్వంలేఅవుట్ను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి తొమ్మిది అంకణాల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలకు భయపడేది లేదని ఆవేశంగా ప్రసంగించారు అమ్మ ఒడి పథకం తో సంక్రాంతి పండుగ ఇంటికి వచ్చిందని తెలిపారు. అనంతరం అక్కంపేట మాజీసర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలోఎమ్మెల్యే కాకాని అక్కంపేట లో కిరణ్ రెడ్డి మాట ఇస్తే తప్పే పరిస్థితి లేదని తెలిపారు. గ్రామంలో పేదలందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ను సత్కరించి పట్టు వస్త్రాలను అందజేసి గజమాలతో ఎమ్మెల్యే ను సత్కరించారు. ఫ్లెక్సీలతో ఎమ్మెల్యేకుఅడుగడుగునా మేళతాళాలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికివైకాపా నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, కడి వేటి చంద్రశేఖర్ రెడ్డి ,బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్, చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అనమాల ప్రభాకర్ రెడ్డి,ఆవుల తులసిరామ్ యాదవ్,గుంజి రమేష్ ,ప్రదీప్ కుమార్ రెడ్డి అధికారులతోపాటు మండల వ్యాప్తంగా వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.సిఐ శ్రీనివాసులు రెడ్డి ఎస్సై ముత్యాలరావు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.