Thursday, 5 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు ఖ్యాతిని చాటిన వ్యవసాయశాఖ

నెల్లూరు, 25 ఫిబ్రవరి (‌పున్నమి ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పి.ఎం కిసాన్‌ అవార్డు సొంతం చేసుకుని వ్యవసాయ రంగంలో నెల్లూరు జిల్లా రాష్ట్ర ఖ్యాతిని దేశమంతా చాటింది. న్యూఢిల్లీ లోని పుసా ఏరియాలో ఏపీ షిండే హాల్‌ ‌లోని చీ• కాంప్లెక్స్ ‌లో నిర్వహించిన ప్రధాన్‌ ‌మంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌చేతుల మీదగా జిల్లా కలెక్టర్‌ ‌శ్రీ కె.వి.ఎన్‌. ‌చక్రధర్‌ ‌బాబు.., పీఎం కిసాన్‌ ‌జాతీయ అవార్డును అందుకున్నారు. పీఎం కిసాన్‌ ‌పోర్టల్‌ ‌కి వచ్చిన గ్రీవెన్స్ ‌పరిష్కరించడంలో నెల్లూరు జిల్లా దేశంలోనే మొదట స్థానంలో నిలవడంతో జిల్లాకు కేంద్ర వ్యవసాయ శాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌ ‌కుమార్‌, ‌నెల్లూరు వ్యవసాయ శాఖ జెడి ఆనంద కుమారి, ఎ.డి. అనిత పాల్గొన్నారు.

Featured

దాడికి పాల్పడ్డ టీడీపి నేతను అరెస్టు చేయాలి:బిజెపి జిల్లా నేత బోలా డిమాండ్

మనుబోలు (పున్నమి విలేకరి)24ఫిబ్రవరి : బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పై దాడి చేసినవారిపైచట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని బిజెపి జిల్లా నేత బోలా శ్రీనివాసులు డిమాండ్ చేశారు అమరావతి ఉద్యమం పేరుతో జేఏసీ నాయకులుగా చెలామణి అవుతూ తెలుగు దేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు గా మారి ప్రజలను తప్పు దారి పట్టిస్తూ అమరావతి కి అన్యాయం చేస్తున్నారని మీడియా సాక్షిగా చెప్పినందుకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి‌ష్ణువర్థన్ రెడ్డి గారిపైన దాడి చేయడం హేమమైన చర్య అన్నారు ఇలాంటి దాడులకు బిజెపి భయపడదు అన్నారు మతిలేని వ్యక్తులను, మూర్ఖపు వాదనలు చేసే వారిని, సంస్కారం లేని వారిని టీవి లైవ్ డిబెట్ లో మాట్లాడనీవద్దు అది మీడియా వారి బాధ్యత.. అన్నారు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు, ఆయనా ఆ పార్టీ తీరు మారలేదు. క్రమశిక్షణ లేని పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంథ్రప్రదేశ్ లో రాబోయే కాలంలో పూర్తిగా మునిగిపోయే పార్టీ అన్నారు నాయకుల తీరు విచక్షణ లేని వారిగా ఉంటుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి గారి పై ఎ.బి.ఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లైవ్ డిబెట్ లో టీడీపీ నాయకుడు శ్రీనివాస రావు భౌతిక దాడి చేసిన చర్యకు అతణ్ణి వెంటనే అరెస్టు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో నెహ్రూ యువకేంద్రం లో వైస్ ప్రెసిడెంట్ గా యున్నారు. ఇలాంటిగౌరవ పూర్వకమైన వారు పట్ల. విచక్షణ రహితంగా కొట్టడం సభ్యసమాజం తలవంచేకోనే విధంగా ఉందని . కావున శ్రీనివాసరావు పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

అనంతసాగరం హై స్కూల్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంఈఓ

అనంతసాగరం మండలం: అనంతసాగరం లోని ఉన్నత పాఠశాలలో పరిశీలించిన ఎం ఈ ఓ. పాఠశాలలో జగనన్న గోరుముద్ద కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పెట్టే భోజనం ఎంతో నాణ్యంగా ఉందని ప్రతిరోజు మెనూ కరెక్ట్గా పాటిస్తున్నారని పిల్లలకు రుచికరమైన భోజనం అందిస్తున్నారని, ఉన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీ ప్రసన్న గారు చాలా బాధ్యతగా శ్రద్ధగా పర్యవేక్షిస్తూ పిల్లలకు నాణ్యతతో కూడిన భోజనం అందేలా శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ పరిస్థితులు పరిస్థితులపై విద్యార్థులను అడగగా ఉదయం 8:30 నుంచి కూడా స్కూల్ ప్రారంభమవుతుందని ఉపాధ్యాయులు పిల్లలకు చాలా బాగా విద్యాబోధన చేస్తున్నారని ని ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే నివృత్తి చేస్తున్నారని, జగనన్న గోరుముద్ద ద్వారా మంచి రుచితో కూడిన భోజనాన్ని అందిస్తున్నారని రాష్ట్ర సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిజంగా తన మేనమామ కంటే ఎక్కువగా తమ కోసం ఎన్నో కార్యక్రమాలు పథకాలు తీసుకువస్తున్నారని తమ విద్య కోసం ఎంతగానో కృషి చేస్తున్నానని తమ సీఎం మామకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

పాత మినగల్లు లో కూలిన పంటకాలువ వంతెన…….

బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 22 ( పున్నమి విలేఖరి ) మండలంలోని పాత మినగల్లు ఇసుక రీచ్ నుండి నిత్యం టిప్పర్లు తిరుగుతుండడంతో గ్రామ శివారులో పంట కాలవపై ఉన్న బ్రిడ్జి సిదిలావస్తకు చేరింది. ఓ ఇసుక టిప్పర్ బ్రిడ్జి మీద నుండి వెలుతుండగా హటాత్తుగా బ్రిడ్జి కూలిపోయింది. అదృష్టవశాత్తు టిప్పర్ బ్రిడ్జి దాటగానే ఈ బ్రిడ్జి కూలడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ బ్రిడ్జి కూలడంతో కాలువ అవతల రోజూ పొలం పనులకు వెళ్లే ప్రజలంతా అవస్తపాడాల్సిన పరిస్తితి ఏర్పడింది. దీంతో కాలువ అవతలకు వెళ్లాలంటే చుట్టూతిరిగి వెళ్లాలని గ్రామంలోని పలువురు ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల సమస్యలే మా ఊపిరి : జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త పల్లి అనిల్ కుమార్ రెడ్డి

జాప్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులుగా.. మళ్లీ పున్నమరాజు, యుగంధర్ రెడ్డిలు ఎన్నిక *విజయవాడ: అనంతపురం ఫిబ్రవరి 21 జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులుగా మళ్లీ తిరిగి పున్నమరాజు, యుగంధర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు విజయవాడలో ని జాప్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నాడు అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులుగా పున్నమరాజు, యుగంధర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనంతపురం జిల్లాకు చెందిన కొత్తపల్లి అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించి ఉపాధ్యక్ష పదవిని లభించేలా చొరవ చూపిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు పున్నమరాజు, యుగందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయి నాయకత్వం సూచనల మేరకు అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలతో పాటు ప్రధానంగా పెండింగ్ లో ఉన్న అక్రిడేషన్ల సమస్య పరిష్కారానికి కృషి చేయడమే గాకుండా ఈ విషయంలో అర్హులయిన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేందుకు పోరాడుతానని హామీ ఇచ్చారు.

Featured బిజినెస్

విసిగించకుండా ‘ ఫాలో అప్‌‘ ‌చెయ్యడం ఎలా?

(‌పున్నమి ప్రతినిధి) : వ్యాపారంలో కానీ, పర్సనల్‌ ‌లైఫ్‌లో కానీ, ఉద్యోగంలో కానీ, మనం ఫలానా పని చేసి పెట్టమనో, ఫలానా పనిలో సాయం కావాలి అనో ఎవరినో అడుగుతాం. అది సోమవారం. ‘హా, బుధవారానికల్ల పని ఖతం ‘(ఎవరు ఖతం? మనమా? పని కాక పోతే మనం ఖతం!) అని హామీ ఇస్తారు. బుధవారం నాడు అటువైపు నుంచి ఉలుకూ పలుకూ ఉండదు. ఫోన్‌ ఉం‌డదు. చడీ చప్పుడూ ఉండదు. అప్పడు మనం వారికి గుర్తు చేయాలి. మెయిల్‌ ‌రూపంలోనో, ఒక ఫోన్‌ ‌కాల్‌ ‌చేసో, లేదా అటు వైపు వెళ్ళినప్పుడు పలకరించడమో, లేదా ఒక ఫోన్‌ ‌మెసెజి ద్వారా నో. దీనినే మనం ఫాలో అప్‌ అం‌టాము. వ్యక్తిగత జీవితంలోనూ, పనిలోనూ, వ్యాపారంలోనూ ఫాలో అప్‌ అవసరం! అయితే, అది ఎంతో కళాత్మకంగా ఉండాలి. పట్టి పీడించడంలా ఉండ కూడదు! అది ఎలానో మనం ఈ వారం చూద్దాం. ఒక వేళ మీరు సేల్స్‌లో ఉన్నారు అనుకోండి. మీ కష్టమరు ‘వచ్చే వారం చూద్దాంలే!’ అంటారు. ‘వచ్చే నెల’ అంటారు. ఆ టైంలో ఫోన్‌ ‌చేస్తే రెస్‌పాన్స్ ఉం‌డదు. ఒక మిత్రునికి ఒక పనిలో సాయం అడుగుతారు. ‘ఆ శాఖలో నా క్లాస్‌మేటు ఉన్నాడు! చిటికలో పని అయిపోతుంది! అంటాడు. ఆ బుధవారం రానే వస్తుంది, ఇతని నుంచి సౌండు ఉండదు! ‘నాన్నా ! శుక్రవారం కల్లా ఆన్‌లైన్‌లో నా ఫీజు కట్టాలి’ అని అమ్మాయి అంటుంది. శుక్రవారం వస్తుంది, పని వత్తిడిలో తండ్రి మరిచిపోతాడు. నాన్నకు గుర్తు చెయ్యాలంటే భయం! ఎలా? ఫాలో అప్‌ ‌చెయ్యకుండా ఆపలేము. కానీ అది వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఇలా ప్రయత్నించడి. (1) మనకు ఒక వ్యక్తి 4 రోజులలో మీ పని అయి పోతుంది అని చెప్పారు అనుకోండి. ‘‘అయితే ఒక సారి శుక్రవారం మీకు గుర్తు చేస్తాను సర్‌. ‌ఫోన్‌ ‌ద్వారా కానీ, మెసేజి ఇచ్చి కానీ’’ అని ముందరే అనుమతి తీసుకోండి. (2) ఫాలో అప్‌కి ఫోన్‌ ‌చేసినప్పుడు, నేరుగా విషయంలోకి రండి. సున్నితంగా. ‘‘మీకు గుర్తు చెయ్యడానికి ఫోన్‌ ‌చేసాను సర్‌ / ‌మేడం’’ అనకండి. ఇగో దెబ్బ తినవచ్చు . (3) ఫోన్‌ ‌వారు లిఫ్ట్ ‌చెయ్యక పోతే, బిజీగా ఉన్నారు అని అర్ధం చేసుకుని ఒక మెసేజి పెట్టండి. ఇమెయిల్‌ అయినా ఫరవా లేదు. (4) మనకి బిజినెస్‌ ఇస్తానన్న వ్యక్తి లేక సాయం చేస్తాను అన్న వ్యక్తి, ఆ మాట మీద నిలబడ వచ్చు, లేదా నిలబెట్టుకోలేక పోవచ్చు. కానీ మనం అడిగే విధానం మాత్రం పాజిటివ్‌గా ధ్వనించాలి !! ఉదాహరణకి ‘‘ మొన్న మనం అనుకున్నాం కద సార్‌? ‌పెండింగ్‌ ‌పేమెంటు విషయం పూర్తి చేద్దామని? ఈ రోజు చేసేద్దామా?’’ అని అడగండి.! (5) ఇలా మాత్రం అడగకండి ! ‘‘మొన్న సోమవారం కలిసినప్పుడు, ఈ రోజు చెక్కు ఇస్తాము అన్నారు! ఈరోజైనా కుదురుతుందా లేదా?’’ ఇలా! సందేహిస్తున్నట్లు అడగకండి! మరింత టైం తీసుకుంటారు. (6) ఫోన్‌లో అయితే, మీ కంఠం ఆహ్లాదకరంగా ఉండేటట్టు చూసుకోండి (మనసులో మండిపోతున్నా సరే!). (7) కొన్ని సందర్భాలలో డెడ్‌ ‌లైన్‌కి ముందరే ఫాలో అప్‌ ‌మంచిది. అది ఆ పని ఎంత కీలకమైనది? దాని ప్రాధాన్యాన్ని బట్టి ఉంటుంది. ఉదా:ఒక వ్యక్తి మీకు ‘గురువారం సాయంత్రానికల్లా పని అయిపోతుంది’ అని హామీ ఇచ్చారు అనుకోండి. అతను మహా బిజీగా ఉండి మరచి పోవచ్చు. బుధవారం ప్రొద్దున్నే ఫోన్‌ ‌చేసి, చాకచక్యంగా, లౌక్యంగా ‘ మేడం / సార్‌ ! ఈ ‌హోదాలో మీరు చాలా బిజీగా ఉంటారు అని నాకు తెలుసు. అందుకే కొంచెం గుర్తు చేయడానికి! రేపూ సాయంత్రానికల్లా మన పని అవుతుందన్నారు కదా? ఆ విషయం’! అని గుర్తు చేయండి. అవతలి వ్యక్తి మీకంటే వయసులోనూ, అధికారం లోనూ పైన ఉంటే, ఈ పని చాలా జాగ్రత్త గా చేయాలి! పని కాదు అని తెలిసిన తరువాత : ఇంత ప్రయత్నం చేసినా, ఒక్కోసారి మనం అనుకున్న పని కాదు. అలాంటప్పుడు ఇక ఆ వ్యక్తి ని ఫాలో అప్‌ ‌చెయ్యడం వదిలేయాలి . ఆ వ్యక్తి వల్ల కాదు. ఇబ్బంది పెట్ట వద్దు ! ఒక్కో సారి మన విషయం లో కూడా అలా జరగ వచ్చు . మనం ఎవరికో ఏదో సహాయం చేస్తాము అని మనసుతో ప్రామిస్‌ ‌చేస్తాము . కానీ ఆ తరువాత మన పరిస్థుతులు అనుకూలంగా లేక పోవచ్చు ! ఇవి వ్యాపారంలో సహజం ! (8) పని కాకపోయినా వారితో సత్సంబంధాలు చెడగొట్టుకోకండి. ఈ రోజు కాకపోతే, భవిష్యత్తులో ఉపయోగ పడగలరు . ‘‘ ఫర్వాలేదు సార్‌, ‌నేను అర్ధం చేసుకోగలను. గుడ్‌డే ‘అని విష్‌ ‌చేసి ఫోన్‌ ‌పెట్టేయండి

Featured ఆంధ్రప్రదేశ్

అనంత సాగరంలో అనంత సాగరంలో పోస్టల్ డిపార్ట్మెంట్ వారి డిజిటల్ సేవ మేలా

గ్రామ గ్రామానికి విస్తరింప చేస్తున్న పోస్టల్ డిజిటల్ సేవ పోస్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన సూపర్నెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నెల్లూరు :కె.వెంకటేశ్వర్లు అనంతసాగరం మండలం: అనంతసాగరం గ్రామంలో డిజిటల్ సేవా మేళాను ప్రారంభించిన ఎస్ పీ కే వెంకటేశ్వర్లు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో పథకాలను ప్రారంభించిందని ఈ పథకాలను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని నూతనంగా డిజిటల్ సేవా మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఢాక్ పే యు పి ఐ ఆధారిత సేవలు కూడా ప్రారంభించిందని మీ ఇంటి ముందుకే మీ బ్యాంకు అనే వినూత్న సేవలను కూడా తీసుకు వచ్చిందని ఈ పథకం ద్వారా ఏ బ్యాంకు నుండి అయినా మీ ఇంటి వద్ద నుండి ఆధార్ ఎనేబుల్ సర్వీస్ ద్వారా వంద రూపాయల నుండి రోజుకు పది వేలు తీసుకునే సౌలభ్యం ఉందని ఇంకా 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే వినూత్న పథకంతీసుకువచ్చిందని ఈ అకౌంట్ ద్వారా అత్యధిక వడ్డీ పొందే అవకాశం ఉందని 11 ఏళ్ళ పైబడిన ఆడపిల్లలకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉందని దీనికి కూడా అధిక వడ్డీ లభిస్తుందని ఇన్కమ్ టాక్స్ రాయితీ కూడా లభిస్తుందని తెలిపారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కేవలం 70 రూపాయలు రుసుముతో ఆధార్ వేలిముద్రలు ద్వారా మా పోస్ట్ మాన్ మీ ఇంటి దగ్గరికి వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అనేది కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఆధార్ సేవలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఈ సేవలు కూడా ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తోందని ఈ పథకాలను కూడా ప్రజలు ఉపయోగించుకుని లబ్ది పొందాలని చెప్పారు. 1995 లో గ్రామీణ తపాలా బీమా ప్రారంభించిందని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అతి తక్కువ ప్రీమియంతో అందిస్తుందని ఈ టీ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమానికి ఆత్మకూరు ఏ ఎస్. పి .ఎస్ ఆర్ కే హెచ్. ప్రసాద్ ,అనంతసాగరం ఎస్.పి. ఎం.ప్రవీణ్ చైతన్య మరియు పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి వెంకటాచలం,ఫిబ్రవరి 15 (పున్నమి విలేఖరి): ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన వెంకటాచలం మండలంలోని చెముడుగుంట చెరువు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బుజబుజ నెల్లూరుకు చెందిన షేక్ మస్తాన్ కుమారుడు షేక్ సలీమ్ (13), పార్లపల్లి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు వెంకట సాయి (14), మోపూరు రాజా కుమారుడు రాజేష్ (13) ఆదివారం సెలవు కావడంతో చెముడుగుంట హైవే ని ఆనుకొని ఉన్న చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. సరదాగా ఈతకోసం దిగిన చిన్నారులు ఒకరి తర్వాత ఒకరు మునిగిపోవడంతో మృతి చెందారు. పొద్దుబోయినా ఇంటికి పిల్లలు రాకపోయేసరికి తల్లిదండ్రులు, సమీప బంధువులు చుట్టుపక్కల ప్రాంతాలు గాలించారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో చెముడుగుంట పంచాయతీ నక్క కాలనీ చెరువు గట్టుపైన ఉన్న చిన్నారుల సైకిళ్ళు, బట్టలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ సీఐ రామకృష్ణ, వెంకటాచలం ఎస్ఐ కరీముల్లా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి కావడంతో ఎంత సేపు గాలించినా ఆచూకీ కానరాలేదు. సోమవారం ఉదయం మరోసారి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడూ తమ కళ్ల ముందే ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలను ఒక్కసారిగా మృతదేహాలుగా చూసిన తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Featured ఆంధ్రప్రదేశ్

జొన్నవాడ లో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం

బుచ్చిరెడ్డిపాలెము ఫిబ్రవరి 12 ( పున్నమి విలేఖరి ) ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడలో వెలసిఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్లు శుక్రవారం ప్రత్యేక పుష్పాలంకరణలో వెండి నందివాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరు వాస్తవ్యులు రామిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి ధర్మపత్ని శ్రీమతి ఈశ్వరమ్మ మరియు వారి కుటుంబసభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం ఉభయకర్తలను శ్రీవార్ల శేష వస్త్రములతో సత్కరించారు. అధిక సంఖ్యలో భక్తులు గ్రామోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈకార్యక్రమంలో చీమల రమేష్ బాబు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి, దేవస్థాన సూపరింటెండెంట్ వి గిరికృష్ణ పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

సీనియర్‌ ఉద్యోగులు , ఆరోగ్య సమస్యలు – కంపెనీ సహకారం

(పున్నమి ప్రతినిధి) : క్రితం వారం, కరోనా ప్యాండమిక్‌ ‌సమయంలో ఉద్యోగులకు ఇవ్వ దగిన శెలవుల గురించి చర్చించుకున్నాం. ఉద్యోగుల ఆరోగ్యం అనేది, ఉద్యోగులకే కాక, సంస్థాగతంగా కంపెనీలకు కూడా చాలా ముఖ్యం. చాలా సంస్థలలో మధ్య వయసు ఉద్యోగులు ఉంటారు. సీనియర్‌ ‌హోదాలోనో, కీలకమైన పొజిషన్‌ ‌లలోనో ఉంటారు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, వారి వయసు ఒక 45 దాటి ఉంటుంది అనుకోండి. చాలా మంది మీకు చెప్ప లేని, చెప్పని, చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలతో సతమతమౌతూ, ఎలాగోలా ఉద్యోగంలో విధులు నిర్వహిస్తూ, బండి ఈడుస్తూ ఉంటారు. పెద్ద సంస్థలు అయితే, ఆరోగ్య బీమా ఇస్తాయి. చిన్న కంపెనీలు అవి కూడా ఇవ్వలేవు. అలా అని వారికి వైట్‌ ‌రేషన్‌ ‌కార్డు కూడా ఉండదు. ఆరోగ్యశ్రీకి కూడా అర్హులు కారు. ఇటువంటి, ప్రభుత్వం నుంచో, కంపెనీ నుంచో సమాజం నుంచో ఎలాంటి సపోర్టూ లేని మధ్య తరగతి ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వస్తే. ఇటీవలి ఒక సర్వే ప్రకారం, 45 దాటిన ఉద్యోగు లలో, 60 శాతం మంది ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధ పడుతూ ఉంటారట! అలాంటి పరిస్థితులలో, మేనేజర్‌గా, లేక ఒక పై అధికారిగా మీరేమి చేయగలరో ఈ వారం కొన్ని సూచనలు. (1) అందరూ వారి ఆరోగ్య సమస్యలను పై అధికారులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వారిని బలవంతం చెయ్యవద్దు. వారు ఎంత చెబితే, అంత వినండి. మీ సంస్థ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లభిస్తాయో వారికి చెప్పండి. కొన్ని కంపెనీలకి కొన్ని ఆసుపత్రుల వారు, లేక డాక్టర్‌లు తెలిసి ఉంటారు. కంపెని ద్వారా వెళితే, కొంత డిస్కౌంటుతో ఆరోగ్య పరీక్షలు చేయడమో, హాస్పిటల్‌ ‌ఫీజు కొంత తగ్గించడమో చేస్తారు. అలాంటి అవకాశం మీ దగ్గర ఉంటే వారికి చెప్పండి. అతడి / ఆమె ఆరోగ్య సమస్యకి సంబంధించి మీకు బాగా తెలిసిన పేరున్న డాక్టర్‌ ఉం‌టే, వారి రిఫరెన్సు ఇవ్వండి. (2) శెలవు ఇవ్వలేకపోతే, ఇంటి దగ్గర నుంచి పని చేసే అవకాశం ఉందేమో చూసి, అలాంటి పని కల్పించండి. (3) వారు మార్కెటింగ్‌, ‌సేల్స్ ‌లాంటి ఫీల్డ్ ‌వర్క్‌లో ఉంటే, ఆరోగ్య కారణాల వల్ల తాత్కాలికంగా తిరగ లేక పోతే, ఆఫీసులో కూర్చుని, టెలి మార్కెటింగ్‌, ‌లేదా పేమెంటు ఫాలోఅప్‌ ‌లాంటి పనులు అప్పగించవచ్చు. (4) పూర్తి 8 గంటలు పని చేయలేకపోతే, రోజుకు ఒక నాలుగైదు గంటలు పని చేయగ్లరేమో అడగండి వారు కోలుకునే దాకా. ఆరోగ్య సమస్య నుంచి బయట పడగలగడం అనేది ఒక మైండ్‌గేం. ‘‘ నాకు కంపెనీ సపోర్టు ఉంది. మా పై అధికారి సపోర్టు ఉంది’’ అనే భావంతో వారు త్వరగా కోలుకోగలుగుతారు. మందులు వారి శరీరం పై బాగా పని చేస్తాయి. ఇక మీరు చెయ్య కూడనివి !! ఒక ఉద్యోగి (ని) మీ దగ్గర ఆరోగ్య సమస్యలు ఏకరువు పెట్టుకున్నప్పుడు, మీకు ఏమి చెయ్యాలో తెలియక పోతే, లేదా మీ అధికార పరిధుల గురించి క్లారిటీ లేక పోతే, మీ పై అధికారులను సంప్రదించండి. మీ పై సూపర్‌ ‌వైజర్‌లకి తెలియకుండా, మీరు ఎలాంటి హామీలు ఇవ్వవద్దు, కంపెనీ తరఫున! వారు చెబుతున్నారు కదా అని, వారి దగ్గర మీ ఆరోగ్య సమస్యలు ఏకరువు పెట్టకండి ! అది వారికి ఏ విధంగానూ సహాయం చెయ్యదు! ఇవి చేయకూడనివి. వయసు రావడం, ఆరోగ్య సమస్యలు ఉండడం సహజం. కానీ, గత 20 సంవత్సరాలుగా మీ దగ్గర పని చేసే ఉద్యోగిని ఇలాంటి సమయాలలో ఎలాగోలా కాపాడుకోలేక పోతే, కంపెనీకి ఉపయోగ పడే దశాబ్దాల నైపుణ్యాన్ని, అనుభవాన్నీ కోల్పోతాం. దాని ప్రభావం వ్యాపారం మీద కూడా ఉంటుంది. వ్యాపారంలో లాభాపేక్షని, టార్గెట్‌ ‌లని, కొంత ఉద్యోగుల సంక్షేమాన్నీ బ్యాలన్సు చేయడం, వ్యాపారస్థులకు ఒక ఛాలెంజ్‌! ‌మీ మీ వ్యాపారాలలో మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.