Friday, 6 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

స్వామి అమ్మవార్లను దర్శించుకున్న… దేవాదాయశాఖ విశ్రాంత కమిషనర్

బుచ్చిరెడ్డిపాలెం మార్చి 28 ( పున్నమి విలేఖరి ) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని జొన్నవాడ గ్రామంలో వెలసివున్న శ్రీ మల్లిఖార్జున స్వామి సమేత కామాక్షితాయి దేవస్థానమునకు దేవాదాయశాఖ విశ్రాంత కమీషనరు ఎన్ ముక్తేశ్వర రావు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని స్వాగతించి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి అనంతరం వారిని శేష వస్త్రముతో సత్కరించి, తీర్థ ప్రసాదములు అందజేసారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఆగి ఉన్న లారీని ఢీకొన్న టెంపో…. ఏడుగురు దుర్మరణం…..

బుచ్చిరెడ్డిపాలెం మార్చి 28 ( పున్నమి విలేఖరి ) మండలంలో దామరమడుగు వద్ద లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులు తమిళనాడు వాసులు. చెన్నై నుంచి వచ్చిన వీరంతా ఆధ్యాత్మికయాత్ర ముగించుకుని నెల్లూరుకు పయనమయ్యారు. తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో దామరమడుగు శివారులోకి రాగానే పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగిఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపో ముందు భాగం నుజ్జునుజ్జవడంతో డ్రైవర్‌ గుర్నాథంతో పాటు, వాహనంలో ముందుకూర్చున్న మరో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరొకరు మృతి చెందారు. 8మంది గాయాలతో బయటపడ్డారు.. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 15 మంది ఉన్నారు. సమాచారమందుకున్న సీఐ సురేశ్‌బాబు మరియు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. డ్రైవర్‌ నిద్రమత్తు, పొగ మంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Featured

అనంతసాగరం మండలం: అనంతసాగరం ఎస్ఐ ఎన్. ప్రభాకర్ గారు తన సిబ్బందితో కలిసి అనంతసాగరం బస్టాండ్ సెంటర్ నుండి గంగుంట క్రాస్ రోడ్డు వరకు కరోనా పై అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత అధికారుల సూచన మేరకు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండడంతో వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని దగ్గర్లోని ఆత్మకూరు పట్టణంలో నెల్లూరు పాలెం నందు కూడా ఒక కేసు నమోదు అయిందని రెండవ దశ మొదలవడంతో ప్రజలలో మళ్లీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అలాగే ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు కూడా మా మాస్కులు ధరించాలని వాహనాలు నడిపే వారు కూడా తప్పనిసరిగా మాస్కులను ధరించాలని అలా లేనియెడల వారికి ఫైన్ విధించడం జరుగుతుందని తెలిపారు. అనంతసాగరం మండల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని వ్యక్తిగత దూరం పాటించాలని శానిటైజర్లు వినియోగించుకోవాలని,2020లో కరోనా కట్టడిలో ప్రజలు ఎలా సహకరించారో అదేవిధంగా ఇప్పుడు కూడా సహకరించి కరోనా మహమ్మారికి దూరంగా ఉండాలని కోరారు.

Featured ఆంధ్రప్రదేశ్

దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ రద్దు చేయాలి

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆద్వర్యంలో ఏపీ జేఏసీ పిలుపు మేరకు వివిధ సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమానికి సంఘీభావంగా ఈ రోజు మధ్యాహ్నం12.30 నిముషాలకు బోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం జేఏసీ చైర్మన్ సీ హెచ్ వీ ఆర్ సీ శేఖర్ రావు అధ్యక్షతన దర్గామిట్టలోని స్థానిక యన్ జీ ఓ భవనం నందు నిరసన కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి శేఖర్ రావు మాట్లాడుతూ మా ప్రధాన డిమాండ్లు రైతు వ్యతిరేక చట్టాలను నిలుపుదల చేయాలని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటీకరణను ఆపాలనీ, దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ రద్దు చేయాలనీ, ఉద్యోగాల కల్పన చేస్తూ, కార్మికుల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలనీ, మన హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న ఈ పోరాటంలో ఏపీ టీయఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.వెంకటేశ్వరరావు ,జిల్లా యన్ జీ ఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యన్ ఆంజనేయ వర్మ, అసోసియేట్ అధ్యక్షులు యన.గిరిధర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మన్నేపల్లి పెంచలరావు, కోశాధికారి బి.వెంకటేశ్వర్లు,జిల్లా ఉపాధ్యక్షులు జి.రమేష్ బాబు, యల్.పెంచలయ్య, యన్.మధు, సంయుక్త కార్యదర్శులు కే.రాజేంద్రప్రసాద్, ఈ.విజయకుమార్,జి.రామకృష్ణ, నగర అధ్యక్షులు యన్.వెంకటస్వామి, కార్యదర్శి చిలకా రామకృష్ణారెడ్డి,చెంచయ్య, సుబ్బరాయుడు, శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా లోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

ఉద్యోగ ఇంటర్‌వ్యూలో కష్టమైన ప్రశ్నలు , కొన్ని జవాబులు

ఉద్యోగ ఇంటర్‌వ్యూలో కష్టమైన ప్రశ్నలు , కొన్ని జవాబులు ఈ వారం ఆర్టికల్‌, ఉద్యోగ వేట లో ఉన్న మహిళలు, పురుషుల కోసం. యువత, ఫ్రెషర్స్ ‌మరియు అనుభవం ఉన్న ఉద్యోగాభ్యర్ధుల కోసం. సో మిత్రులారా, మీరు ఉద్యోగం వేటలో, అప్లికేషన్‌ ‌పెట్టు కున్నారు. వారు ఇంటర్‌ ‌వ్యూకి పిలిచారు. మొదటి రౌండు ఫిల్టరింగు, ఫంక్షనల్‌ ‌రౌండు, హెచ్చార్‌ ‌రౌండు ఇంటర్‌ ‌వ్యూలు అయి పోయాయి. వారు అడిగే అడ్డమైన ప్రశ్నలకు జవాబులు చెప్పారు. జనాభా ఎక్కువా, ఉద్యోగాలు తక్కువా ఉన్న మన భారత దేశంలో, అడిగేవాడికి (కంపెనీ వారికి) చెప్పేవాడు/చెప్పే ఆమె (అభ్యర్ధి(ని) లోకువ! ‘‘ఇంకో 5 ఏళ్ళ తరువాత నువ్వు ఫ్యూచర్‌లో ఎక్కడుంటావు, నీ ప్రణాళిక ప్రకారం ‘‘రేపేమి జరుగుతుందో ఎవరికి ఎరుక? కరోనా వచ్చి , మనని ఈ చొప్పదంటు ప్రశ్న అడిగిన హెచ్చార్‌ ‌మేనేజర్‌ ఉం‌టాడో, పోతాడో, నాలుగో రౌండులో మనకి కొత్త మొహం తగులుతుందో తెలియదు ! 5 ఏళ్ళ తరువాత మనం ఎక్కడుంటామట? ఇప్పుడు మీరివ్వబోయే ఉద్యోగం సరిగా చేయగలనా? లేదా? అది నిర్ధారించుకోండి? – అని చెప్పాలి అనిపిస్తుంది. అవసరం మనది కనుక నోటికి కుట్లేసుకుంటాము! ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు, మీ పంచ వర్ష ప్రణాళికలు ఏవైనా గానీ, బయట పెట్టే అవసరం లేదు! ‘‘ఈ కోవిడ్‌ ‌వచ్చాక రేపు ఏమి జరుగుతుందో తెలియదు. నేను అంత దూరం ఆలోచించ లేదు. ప్రస్తుతం ఈ ఉద్యోగానికి వచ్చాను. ఎంపిక అయితే బాగా చేయాలని ఉంది. ‘‘అంత వరకే చెప్పండి. ప్రస్తుతం ఈ ప్రపంచం ఉన్న పరిస్థితిలో ఈ సమాధానం ఓకే. మరొక పిచ్చి ప్రశ్న అడుగుతారు. మీ బలాలు ఏమిటి? ‘‘అని చెప్పవచ్చు. ‘‘మీ బలహీనతలు ఏమిటి?’’ అని కూడా అడుగుతారు !! ఏమి చెబుతాం? బలహీనత అని తెలిస్తే అది బలహీనత లాగ ఉండి పోదు కదా? దానిని ఇంప్రూవ్‌ ‌చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. ‘‘నా బలహీనతలు ఏమిటో నాకంటే, నన్ను గమనించే ఇతరులకే బాగా తెలుస్తాయి. నాకు సహోద్యోగులు ఎవరైనా ఫీడ్‌ ‌బ్యాక్‌ ఇస్తే, తప్పని సరిగా దానిని స్వీకరించి సరి చేసుకుంటాను’’ అని చెప్ప వచ్చు. ‘‘అలాంటి సందర్భం ఇది వరలో ఎప్పుడైనా వచ్చిందా?’’ అని ప్రశ్నిస్తే, మీకు అటువంటిది జరిగిన సందర్భం షేర్‌ ‌చేసుకోచ్చు. ఉదాహరణకి ‘‘ నాకు బిగ్‌ ‌డాటా మీద అంత అనుభవం లేదు. మెరుగు పరుచుకొమ్మని చెప్పారు. అకాడమీలో చిన్న కోర్సులో చేరాను. ‘‘అనో లేదా పది మందిలో మాట్లాడేటప్పుడు నెర్వస్‌గా ఉన్నావు’’ అని చెప్పారు. ప్రాక్టీసు చేస్తున్నాను అనో, చెప్పవచ్చు. దాని వల్ల వచ్చే ఉద్యోగం రాకుండా పోదు. ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్న. ‘మీ బలహీనతలు ఏమిటి?’ అనేది. అవి లేని మనుషులు, ఉద్యోగులూ, ఉండరు. ‘నాకు బలహీనతలు లేవు’ అని చెప్పలేము! అలా అని ‘‘నన్ను ఇంటర్‌వ్యూ చేసే వారు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే నాకు భలే కోపం!’ అని నిజాలూ చెప్ప లేము ! కాస్త గడుసుగా దాట వేయాల్సిన ప్రశ్న. నీ కెంత జీతం కావాలి? – అస్సలు కమిట్‌ ‌కాకండి . ‘‘ఈ ఉద్యోగానికి, మీ కంపెనీ పేరుకీ, ఈ పొజిషన్‌కీ, నా నుంచి మీరు ఆశించే పనికీ, నా అనుభవానికీ- తగినంత జీతం ఇస్తారనే భావిస్తాను. ఒక వేళ మీరు నన్ను సెలెక్ట్ ‌చేసుకుంటే – ఎంత ఇస్తారో మీరే ఆఫర్‌ ఇవ్వండి ! ‘‘ అని అది వాళ్ళ మీదే తోయండి. వారు ఇచ్చేది చాలక పోతే మరి కాస్త ఇమ్మని అడగవచ్చు. కాని మీ అంతట మీరు ‘నాకు ఇంత కావాలి’అని కమిట్‌ ‌కాకండి. రెండు విధాలుగా నష్ట పోవచ్చు! ఒక వేళ మీరు అడిగినది, వారు ఇవ్వదలుచుకున్న దానికన్నా ఎక్కువ అయితే, వారు మీకు ఆఫర్‌ ఇవ్వక పోవచ్చు. ఒక వేళ వారు ఇవ్వదలుచుకున్నది, మీరు అడిగిన దానికన్నా ఎక్కువ అయితే, మీకు ఉద్యోగం వస్తుంది కాని, మీరు నష్టపోవచ్చు! కాబట్టి మీరు కమిట్‌ ‌కాకండి! ఈ విధంగా, ఉద్యోగం కోసం జరిగే ఇంటర్‌ ‌వ్యూలలో అడిగే చిక్కు ప్రశ్నలని, చొప్పదంటు ప్రశ్నలని తెలివిగా ఎదుర్కోండి, అవసరం అయితే, దాటెయ్యండి. ఉద్యోగం వేటలో మీకు విజయం కలగాలని కోరుకుంటూ…

Featured ఆంధ్రప్రదేశ్ సక్సెస్ స్టోరీస్

‌ప్రతివారికి ఓ సామాజిక విలువ ఉంటుంది

‌ప్రతివారికి ఓ సామాజిక విలువ ఉంటుంది ప్రకృతి ప్రకారం అయితే మన పుట్టుకకు ఒక ప్రయోజనం, సార్థకత, అంటూ ఏమీ లేవు. మనం పుట్టినా పుట్టక పోయినా ఈ ప్రకృతికి వచ్చిన నష్టం ఏమీ లేదు. దాని పాటికి అది సాగి పోతూ ఉంటుంది. కోటాను కోట్ల జీవరాసులు ఈ నేల మీద పుడుతూ వుంటాయి, గిట్టుతూ ఉంటాయి. ప్రకృతి నియ మాలను తు.చ. తప్పకుండా వాటి పని అవి నిర్వర్తించి నిష్క్రమిస్తాయి. ఆ కోణంలో చూసిన ప్పుడు మనిషి జీవితం కూడా ఒక పురుగు, ఒక పక్షి, ఒక జంతువు లాంటిదే. మానవ జాతి కూడా మరో జీవ జాతి లాంటిదే. ప్రకృతిని పక్కన పెట్టి మనం మన దృష్టితో చూసుకున్నప్పుడు మన పుట్టుక ఇతర జీవ జాతుల మాదిరి సాధా సీదాగా ఉండదు. మనిషి తల్లి కడుపులో పడింది మొదలు తన ప్రమేయం లేకుండా అనేక అంశాలు పుట్ట బోయే బిడ్డ చుట్టూ అల్లుకొని ఉంటాయి. కుటుంబ నేపథ్యం, సామాజిక స్థాయి, ఆర్థిక స్థితిగతులు, వారసత్వపు కళాచారాలు (సంస్కృతి) మొదలయిన ఆపాదింపులతో పుట్టే సమయానికి బిడ్డలకు తెలియకుండానే ఒక సామాజిక ‘‘విలువ’తో పుడ తారు. మిగతా జీవుల పుట్టుకలకు మనిషి పుట్టుకకు తేడా ఇదే. ఈ విలువ ఒక్కొక్క బిడ్డకు ఒక రకంగా ఉంటుంది. ఒక బిడ్డ పుట్టుక కోసం ఆ జాతి మొత్తం (రాజకీయ వారసత్వం కోసం) ఎదురు చూడవచ్చు. తల్లిదండ్రుల సామాజిక ప్రాధాన్య తను బట్టి ఒక బిడ్డ పుట్టుక ఒక ప్రపంచ వార్త కావచ్చు. అలాంటి మరో బిడ్డ తల్లికి అవసరం లేకుండా పుట్టి కుప్పతొట్టి పాలు కావచ్చు. ఈ రెండు పుట్టుకలు ప్రకృతికి ఒకటే. కానీ ఒక పుట్టుక అత్యంత విలువగా, మరొకటి పనికిరాని పుట్టుకగా సమాం పరిగణిస్తుంది. అంటే ప్రకృతికి భిన్నంగా సమాజం ఉం టుంది. సమాజం అంటే ఏమిటి? సమాజం అంటే ‘తను’ కాక మిగిలిన జనం. అంటే కుటుంబం, చుట్టాలు, ఇరుగు, పొరుగూ, ఊరు, ప్రాంతం, దేశం, ఖండం వెరసి మొత్తం నేలపై ఉన్న మానవ జాతి. పుట్టుక, చావుల నడుమ కొంత కాలం బతుకు వెళ్ళదీయాలి. మిగతా జీవులు అయితే ప్రకృతిలో వెళ్ళదీస్తాయి. మానవుడు మాత్రం ప్రకృతితోపాటు తనలాంటి వ్యక్తుతో నిండి ఉన్న సమాజంలో నెట్టుకు రావాలి. సమాజంలో మనిషి ఒంటరి కాదు. మనుషుల మధ్య సంబంధాలు తప్పని సరి. ఇవి లేని మనిషిని భూమ్మీద ఊహించలేము. సంబంధాలు అనేక రకాలు. సంబంధాలు అంటే ‘తన’కు ఇతరుల పట్ల వున్న ‘పట్టింపు’ (శీఅవతీఅ) అలాగే తన పట్ల ‘ఇతరులు’ పట్టింపు. ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధాలు సజావుగా ఉన్నాయా లేవా అనేది ఇరు వైపుల నుండి ఒకరి పట్ల ఒకరికి ఉండే పరస్పర ‘పట్టింపు’ ఆధారంగా ఉంటాయి. పట్టింపు అనేది ఏ రూపంలో అయినా ఉం డవచ్చు. మచ్చుకు కొన్ని పట్టింపులు- ఇష్టం, ప్రేమ, అభిమానం, బాధ్యత, గౌరవం, చీదర, వ్యతిరేకత, ఈసడింపు, పగ, శత్రుత్వం, సంఘీ భావం ఇలా ఏదైనా కావొచ్చు. మన పట్ల ఎదుటి వారి ప్రవర్తనను బట్టి ఈ ‘అనిపింపులు’ (ఖీవవశ్రీఱఅస్త్ర) పుడతాయి. అలాగే మన ప్రవర్తన వల్ల ఎదుటి వారిలో ఈ తరహా అనిపింపులు పుడతాయి. ఒక వ్యక్తి పట్ల ఏదో ఒక అనిపింపు మాత్రమే ఉండాలనేం లేదు. ఒకటి కంటే ఎక్కువ అనిపింపుల కలగాపులపుగా ఉండ వచ్చు. మచ్చుకు- తండ్రిగా కొడుకు పట్ల బాధ్యత, కొడుకు చెడు చేష్టాల వల్ల వ్యతిరేక అనిపింపు. ఒక వ్యక్తి పట్ల మనకు ఉండే ఈ అనిపింపుల కలయికలతో ఏర్పడే ‘ఉమ్మడి అనిపింపు’ (శీఎఎశీఅ ఖీవవశ్రీఱఅస్త్ర) ను బట్టి ఎదుటి వ్యక్తికి మన మనసులో ఒక ‘‘మానవ విలువ’’  ను ఆపాదిస్తాము. ఒక వ్యక్తి ఎదుటి వారిని కొలవటానికి సరిగ్గా ఈ విలువనే ఉపయోగిస్తాడు. ఇది సదరు వ్యక్తిపట్ల తను ఏర్పాటు చేసుకున్న నిజమైన విలువ. దీన్ని బైటకు వెళ్ళబెట్టి వచ్చు లేకపోనూ వచ్చు. మానవ సంబంధాలు ఈ విలువ మీదే ఆధారపడి ఉంటాయి. ఇతరులతో మనకు ఉన్న మానవ సంబంధాలు రెండు రకాలుగా ఏర్పడతాయి. మొదటిది ‘కుటుంబ’ నేపథ్యం. ఇందులో సహజంగా సంక్రమించే రక్త సం బంధాలు, సామాజికంగా(పెళ్ళిళ్ళ ద్వారా) కలుపుకున్న చుట్టిరికాలు ఉంటాయి. రెండోది ‘పరిచయ’ నేపథ్యంలో ఏర్పడే ఇరుగూ పొరుగు, స్నేహి తులు, సహ ఉద్యోగులు తదితరులు. ఈ రెండు రకాల వ్యక్తులతో మనకు నేరుగా పరిచయం, సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఇవి కాక మూడో రకం బంధ వ్యాలు కూడా ఉంటాయి కానీ అవి నేరుగా వుండవు. కేవలం ఒకే వైపు ఆరాధన, ఇష్టం ఉంటాయి. మచ్చుకు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులుకు ఉండే అభిమానులు. ఎలా ఏర్పడినా మానవ సం•ం ధాలను విస్మరించి ఏ మనిషినీ ఊహిం చ లేము. ప్రకృతి పరంగా మనకు ఏ విలువ లేక పోయినా సమాజ పరంగా ప్రతి వారికి ‘సామాజిక విలువ’ అనేది ఉండి తీరుతుంది. మనం ఆ విలువ తోనే ఇతరులను కొలుస్తాము. మనల్ని ఇతరులు కొలుస్తారు. ఈ విలువ ముందు చెప్పినట్టు పుట్టుకతో రావచ్చు లేదా పుట్టాక సంపాదించుకోవచ్చు. – డా।।శ్రీనివాస తేజ

Featured ఆంధ్రప్రదేశ్

కరోనా రెండవ దశ కట్టడికై ఈ చర్యలు చేపట్టాలి

‌ప్రభుత్వాన్ని కోరిన ప్రజా ఆరోగ్య వేదిక గత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా విజ్పింబించి , మన రాష్ట్రాన్ని కూడా కుదిపేసిన కరోనా మహమ్మారిని మరియు దాని వల్ల సంభవించిన మరణాలను ప్రభుత్వం సమర్ధవంతంగా సకాలంలో తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా మొదటి దశని కట్టడి చేయగలిగామని ప్రజా ఆరోగ్య వేదిక తెలియచేస్తున్నది. ఇప్పుడు మళ్ళీ కరోనా రెండవ దశ తీవ్ర రూపం దాల్చుతుంది. ప్రస్తుతం రెండవ దశ కరోనా సంఖ్యలో మనదేశం ప్రపంచం లో మూడవ స్థానంలో ఉంది. అనేక రాష్ట్రాలలో తీవ్ర రూపం దాల్చి రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో పరిస్థితులు విషమించడం వల్ల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల మళ్ళీ లాక్డవున్లు మరియు కఠిన మైన కట్టడి చర్యలు ఇప్పటికే తీసకుంటున్నాయి. మనరాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నందువల్ల కరోనా రెండవ దశ కట్టడికై ఈ క్రింది చర్యలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డికి ప్రజా ఆరోగ్య వేదిక విజ్ఞప్తి చేయుచున్నది. 1. టెస్ట్, ‌ట్రేస్‌ ‌మరియు ట్రీట్‌ (‌టిటిటి) కార్యక్రమాన్ని మళ్ళీ పూర్తిగా అమలు చేయాలి. టెస్టుల సంఖ్యని పెంచాలి. 2. కాంటాక్ట్ ‌సోర్సు వ్యక్తులను గుర్తించాలి. 3.వ్యాధి గ్రస్తులకు ప్రభుత్వ అ ఆధ్వర్యంలో పూర్తి వైద్యం అందించాలి. 4.కోవిడ్‌ ఆసుపత్రుల సంఖ్యను పెంచి తగినంత మంది వైద్యులు మరియు వైద్యేతర సిబ్బందిని నియమించాలి. 5. మందులు, పిపిఈ కిట్లు, లేబరేటరీలు లాంటి మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. 6. ప్రజలందరితో, వ్యాక్సిన్‌ ‌తీసుకున్న వారితో సహా ఎస్‌ఎంఎస్‌ (‌భౌతిక దూరం, మాస్కులు వాడటం మరియు చేతులు సానిటైజ్‌ ‌చేసుకోవడం) విధానాన్ని కచ్చితంగా అమలు చేయించాలి. 6. ‌ప్రజలందరితో, వ్యాక్సిన్‌ ‌తీసుకున్న వారితో సహా ఎస్‌ఎంఎస్‌ (‌భౌతిక దూరం, మాస్కులు వాడటం మరియు చేతులు సానిటైజ్‌ ‌చేసుకోవడం) విధానాన్ని కచ్చితంగా అమలు చేయించాలి. దీని అమలు కోసం ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. 7.కాలేజీ, స్కూళ్ళ యాజమాన్యాల వైఫల్యం మరియు విధానం సరిగా అమలు చేయక పోవడం వల్ల కరోనా వ్యాధి పెరుగుదలకు పాఠశాలలు మరియు కళాశాలలు కేంద్రంగా మారుతున్నాయి. కనుక ఎస్‌ఎంఎస్‌ ‌విధానం సరిగా అమలు చేయని యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అవసరమైతే తాత్కాలికంగా స్కూళ్ళు కాలేజీల నిర్వహణను నిలుపుదల చేయాలి. 8.బారులు, మధ్యం దుకాణాలు, మాల్స్, ‌బజారులు, పబ్లిక్‌ ‌మరియు ప్రయివేట వాహనాలలో ప్రయాణీకుల పట్ల, బస్‌ ‌స్టేషన్‌, ‌రైల్వే స్టేషన్‌ ‌ప్రాంగణాల వద్ద కోవిడ్‌ ‌కట్టడి ప్రోటోకాల్‌ అమలు చేయాలి. అమలు చేయని వారిపై చర్యలు తీసుకోవాలి 9. కరోనా వ్యాక్సిన్‌ ‌ప్రజలందరికీ ఉచితంగా అందించాలి. 10. కరోనా వ్యాక్సిన్‌ ‌వేయించుకోవడానికి ప్రజలు భయ పడుతున్న కారణంగా ప్రజలందరూ వేయించుకునే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలి. 11. గ్రామస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం వైద్యుల పర్యవేక్షణ లేకుండానే జరుగుతుంది. అలా కాకుండా ప్రాథమిక వైద్య సదుపాయాలతో, అంబులెన్స్ అం‌దుబాటులో, వైద్యుల ఆధ్వర్యంలోనే కరోనా వ్యాక్సిన్‌ ‌నేషన్‌ ‌జరిగే విధంగా చూడాలి. 12. కరోనా మొదటి దశలో వైద్య సేవలు అందించిన డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకుని కరోనా వైద్యాన్ని ప్రజలకు అందించే విధంగా చూడాలి.

Featured

అనంత సాగరంలోకరోనా సెకండ్ వేవ్ పై అవగాహన ర్యాలీ

అనంతసాగరం మండలం: గ్రామంలోని ఉన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీ ప్రసన్న గారు విద్యార్థినీ విద్యార్థులతో కలిసి కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో ప్రజలను జాగృతం చేసే ఈ విధంగా ర్యాలీ నిర్వహించారు .ఈ సందర్భంగా హెచ్ఎం లక్ష్మీ ప్రసన్న గారు మాట్లాడుతూ రెండో విడత కరోనా విజృంభిస్తుండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలోని అన్నీ వీధులను విద్యార్థినీ విద్యార్థులతో కలిసి కోవిద్ 19 గురించి జాగ్రత్తలు వివరిస్తూ మాస్కు తప్పని సరిగా ధరించాలని, శానిటైజర్ లు వాడాలని వ్యక్తిగత దూరం పాటించాలని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నినాదాలు చేస్తూ గ్రామమంతా ర్యాలీగా ప్రచారం చేయడం జరిగింది అనంతరం తమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 60 మందికి covid 19 పరీక్షలు చేయించడం జరిగిందని తెలిపారు. పిల్లలు అందరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని ఆరోగ్యంగా ఉండాలని కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలలో కరోనా వ్యాక్సిన్ పై గల అభిప్రాయాలను అనుమానాలను తొలగిపోయేలా పిల్లలకు వివరించి వారి ద్వారా కరోనా వ్యాక్సిన్ తమ తల్లిదండ్రులు చుట్టుపక్కల వారు 45 సంవత్సరాలు పైబడిన వారు తీసుకునేలా వివరించాలని చెప్పారు .గత పది రోజుల నుంచి కూడా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం లో భాగంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాటిలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగిందని తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్ పిల్లలకు

‌ప్రతి దానికి సమయం ఉంటుంది

అనగనగా ఓ కుర్రవాడు. అతనికి ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా సంపాదించాలని తెగ కోరికగా ఉండేది. తన దాహాన్ని తీర్చేందుకు తగిన గురువు ఎక్కడ దొరుకుతారా అని, ఎదురుచూస్తూ ఉండేవాడు. ఇక ఎలాగైనా సరే… ఓ గొప్ప గురువు దగ్గరకి వెళ్లి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాలని బయల్దేరాడు. కుర్రవాడు అలా బయల్దేరాడో లేదో… అతని ఊరి చివరే ఒక పెద్దాయన కనిపించాడు. వెంటనే ఆయన దగ్గరకి వెళ్లి ‘నేను ఓ గొప్ప గురువు దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను. మీకు అలాంటి గురువు ఎవరన్నా ఉంటే చెప్పగలరా!’ అని అడిగాడు. ‘ఓ దానిదేం భాగ్యం! నాకు తెలిసిన కొందరి పేర్లు చెబుతాను. వారి శిష్యరికంలో నీకు లాభం లభిస్తుందేమో చూద్దాం,’ అంటూ కొన్ని పేర్లు చెప్పాడు. పెద్దాయన చెప్పిన మాటలను అనుసరించి కుర్రవాడు ఆయా గురువులను వెతుక్కుంటూ బయల్దేరాడు. కానీ అదేం విచిత్రమో! ఎవ్వరి దగ్గరా తనకి కావాల్సిన జ్ఞానం లభించలేదు. అతని జ్ఞాన దాహం చల్లారలేదు. అలా ఒకరి తర్వాత ఒకరిని వెతుక్కుంటూ, గాలిపటంలా దేశమంతా తిరుగుతూ తన యాత్రలను సాగించాడు. ఎక్కడా అతనికి తగిన బోధ లభించలేదు. అలా ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు గడిచిపోయాయి. అతని ప్పుడు కుర్రవాడు కాదు, యువకుడు! చివరికి నిరాశగా కాళ్లీడ్చు కుంటూ తన ఊరివైపు బయల్దే రాడు. యువకుడు ఊళ్లోకి అడుగుపెడుతుండగానే అతనికి ఒకప్పుడు తారసపడిన పెద్దాయన కనిపించాడు. కానీ ఎందుకనో ఆ పెద్దాయన మొహం చూడగానే ఆయన గొప్ప జ్ఞానిలా తోచాడు. ఆయన దగ్గరకి వెళ్లి మాట్లాడుతున్న కొద్దీ… తను ఇన్నాళ్లుగా వెతుకుతున్న గురువు ఆయనే అనిపించింది. ‘నేను పదేళ్ల క్రితం గురువుని వెతుక్కుంటూ మీ దగ్గరకి వచ్చినప్పుడే… మీరు నన్ను శిష్యుడిగా ఎందుకు స్వీకరించలేదు! నా జీవితంలో పదేళ్లు వెతుకులాటలో వ్యర్థం కాకుండా ఉండేవి కదా!’ అంటూ నిష్టూరమాడాడు యువకుడు. యువకుని మాటలకు పెద్దాయన చిరునవ్వులు చిందిస్తూ…. ‘నువ్వు పదేళ్ల క్రితం చూసినప్పటికీ, ఇప్పటికీ నేను పెద్దగా మారలేదు. మారింది నువ్వే! ప్రపంచమంతా తిరుగుతూ తిరుగుతూ నువ్వు అన్ని రకాల వ్యక్తులనూ చూశావు. ఏ మనిషి ఎలాంటివారు అని బేరీజు వేయగలిగే విలువైన నైపుణ్యాన్ని సాధించగలిగావు. ఆ నైపుణ్యంతోనే ఇప్పుడు నన్ను గుర్తించగలిగావు. అందుకే ఈ పదేళ్లు నాశనం కానేకాదు. ఏ విషయం మీదైనా ఆసక్తి ఉంటే సరిపోదు. దాన్ని నెరవేర్చుకోగలిగే నైపుణ్యం కూడా సాధించాలి. అప్పుడే నీ లక్ష్యాన్ని సాధించగలిగే అర్హత ఏర్పడుతుంది,’ అంటూ యువకుడిని తన శిష్యునిగా స్వీకరించాడు.

Featured ఆంధ్రప్రదేశ్ భక్తి

భక్తులు గుడి గడపకు ముందుగా ఎందుకు నమస్కరిస్తారు

సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద గర్భగుడిలోకి వెళ్లే ముందు ఉండే గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. వాస్తవానికి ఇళ్లకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు. ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అని శీశీశ్రీ అమరేంద్ర స్వామి వారిని అడుగగా.. ఈ క్రింది విధంగా సెలవిచ్చారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతం గానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయము గానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రి గానూ అవతరించారు. ఆ భక్తుల కోసం, వారి కోరిక ప్రకారం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ పర్వత రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి. ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా అది ఎంతో పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని వేడుకుంటూ గడపకు నమస్కరిస్తారని వేద పండితులు చెబుతారు. అందుకే ఆలయంలోని ప్రధాన గడప తొక్కకూడదని… కేవలం కుడి కాలు ముందు పెట్టి దాటాలని పెద్దలు సూచిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.