Wednesday, 11 March 2026

Blog

ఖమ్మం

ఏదులాపురం లక్ష్యం ‘నంబర్ వన్’.. కాంగ్రెస్‌తోమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గ్యారెంటీతో పాలేరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందినే అభివృద్ధి సాధ్యం!

ఖమ్మం జనవరి (పున్నమి దిన పత్రిక జిల్లా ప్రతినిధి) పాలేరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారని, రానున్న రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ‘నంబర్ వన్’గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి గారు స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను దయాకర్ రెడ్డి గారు పంపిణీ చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని 105 మంది లబ్ధిదారులకు రూ.32,63,000, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 73 మంది లబ్ధిదారులకు రూ.30,14,000 విలువైన చెక్కులను అందజేశారు. మొత్తం రూ.62.77 లక్షల సీఎంఆర్‌ఎఫ్ నిధులు పంపిణీ చేయడం విశేషం. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏదులాపురంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఆ ప్రాంతాన్ని రాష్ట్రం గర్వించేలా అభివృద్ధి చేసే బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్వయంగా తీసుకుంటారని భరోసా ఇచ్చారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిర్వచనం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా, ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళలకే అప్పగించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మహిళలను కేవలం ఓటర్లుగానే కాకుండా పాలకులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో చైర్మన్ స్థానాల్లో మెజారిటీ సీట్లను మహిళలకు కేటాయించిందని గుర్తు చేశారు. ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఖమ్మం

సత్తుపల్లిలో జనసేనలోకి భారీ చేరికలు జిల్లా కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన అక్బర్, ఉమాదేవి తదితరులు

ఖమ్మం జనవరి (పున్నమి దినపత్రిక జిల్లా ప్రతినిధి) ఈరోజు సత్తుపల్లిలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన అక్బర్, ఉమాదేవి గార్లు తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మిరియాల రామకృష్ణ గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే సత్తుపల్లి మున్సిపాలిటీలో కూడా మొత్తం 23కి 23 వార్డులలో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతుందని ప్రకటించారు. కార్యకర్తలంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేసి జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆళ్ళ నరేష్, సింగపోగు అప్పారావు, వలపుల నాగబాబు, కంచర్ల గోపాలరావు, మహమ్మద్ సైఫ్ అలీ ఖాన్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బిజినెస్

క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరం – వినియోగదారులపై పెరుగుతున్న ఆర్థిక భారం

న్యూ ఢిల్లీ జనవరి (పున్నమి ప్రత్యేక ప్రతినిధి) భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, వాటిపై విధిస్తున్న అధిక వడ్డీ రేట్లు మరియు పెనాల్టీ ఛార్జీలు సాధారణ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతున్నాయి. ప్రస్తుతం దేశంలో అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ కార్డులపై వార్షికంగా 24 శాతం నుంచి 48 శాతం వరకు, కొన్ని సందర్భాల్లో 55 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను వసూలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. సమయానికి బిల్లు చెల్లించలేకపోయిన వినియోగదారులపై భారీ పెనాల్టీలు, ఆలస్య రుసుములు విధించడం వల్ల వారు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఇది ముఖ్యంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అవసరాల కోసం తీసుకున్న క్రెడిట్, చివరకు ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులను దోపిడీ రుణ విధానాల నుంచి రక్షించేందుకు అమెరికాలో కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. అక్కడి ప్రభుత్వం క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10 శాతానికి పరిమితం చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకురావడం విశేషం. ఇది వినియోగదారుల హితాన్ని కాపాడే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో కూడా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. RBI మార్గదర్శకాలకు అనుగుణంగా, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేలా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారిని కలిసి వినియోగదారుల తరఫున వినతిపత్రం అందజేయడం జరిగింది. క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ తీసుకురావడం ద్వారా లక్షలాది మంది వినియోగదారులకు ఆర్థిక భద్రత కలుగుతుందని, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ వ్యవస్థకు ఇది దోహదపడుతుందని కోరారు.

విశాఖపట్నం

విశాఖ ఉక్కు లో సమ్మె సైరన్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె నోటీసు స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం, జనవరి 22, (పున్నమి ప్రతినిధి) విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె నోటీసును స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు గురువారం యాజమాన్యానికి అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తారీకు ఉదయం 6 గంటల నుండి 13 వ తారీకు ఉదయం 6 గంటల వరకు సమ్మె నిర్వహిస్తున్నామని వారు అన్నారు. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100% వ్యూహాత్మక అమ్మకాన్ని తక్షణమే ఉపసంహరించుకొని సెయిల్ లో దీనిని కలపాలని లేదా సొంత గనులు కేటాయించాలని దీనిని బలోపేతం చేయడానికి ఆప్ స్ట్రీమ్ డౌన్ స్క్రీన్ లను ఆప్టిమైజేషన్ చేయాలని వారి డిమాండ్ చేశారు. దీనిని బలహీనపరిచే విధంగా ఈవోఐ లను ప్రకటించిన ప్రభుత్వ యాజమాన్యాలు దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు అన్నారు. అలాగే కార్మికులకు పూర్తి జీతాన్ని చెల్లించాలని, ప్రొడక్షన్ లింక్ జీతాలను చెల్లించే సర్కులర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, బకాయి పడిన 355% జీతాన్ని చెల్లించాలని, నిలుపుదల చేసిన హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని, ఉక్కు నగరంలో కరెంటు చార్జీలు తగ్గించాలని, ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని. గ్రాట్యుటీ 25 లక్షలు గా చెల్లించాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో నిర్వాసితులచే ఖాళీలు భర్తీ చేయించాలని, ప్లాంట్లో భద్రత మరియు హాస్పటల్ సౌకర్యాలను మెరుగుపరచాలని తదితర డిమాండ్లతో ఈ సమ్మె చేస్తున్నామని వారు వివరించారు. మన జీతాలు హక్కుల కోసం జరుగుతున్న ఈ సమ్మెలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు కె ఎస్ ఎన్ రావు, రమణమూర్తి, జె అయోధ్యరామ్, దాలి నాయుడు, సిహెచ్ సన్యాసిరావు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోం – సీపీఎం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చి నిర్వీర్యం చేస్తే సహించబోమని మనుబోలు మండల సీపీఎం కార్యదర్శి దేవదానం హెచ్చరించారు. బుధవారం మండలంలోని మడమనూరు గ్రామంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. గాంధీజీ పేరును తొలగించడం జాతి అవమానమన్నారు. కొత్త చట్టంతో రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందన్నారు. వేతనాన్ని కనీసం రూ.400 చేయాలని, రైతులతో ఉపాధి హామీ చట్టాన్ని అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బీసీ భాస్కర్ పాల్గొన్నారు.

గూడూరు

జాబ్ మేళాకు అనూహ్య స్పందన

గూడూరు: పట్టణంలోని ఎస్. కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జెకెసి మరియు సిఐఐ- ఎంసిసి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలు అయిన టాటా ఎలక్ట్రానిక్స్, హోసూర్, టి.వి.ఎస్, ఎం.ఆర్. ఎఫ్, డైకిన్, బ్లూ స్టార్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందారు. మొత్తం 44 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 26 మందిని ఎంపిక చేసినట్లు వివిధ సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఇలాంటి జాబ్ డ్రైవ్ల ద్వారా అవకాశాలను అందిపుచ్చుకొని తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించుకోవాలని సూచించారు. అదేవిధంగా పట్టణ సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కష్టపడి తమ నైపుణ్యాలను పెంపొందించుకొని జీవితాలకు బంగారు బాట వేసుకోవాలని, అదేవిధంగా వచ్చిన అవకాశాలను చేజార్చుకోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, జెకెసి కోఆర్డినేటర్ డాక్టర్ కే. కోటేశ్వరరావు, పట్టణ సీఐ శ్రీనివాసులు, వివిధ సంస్థల ప్రతినిధులు అయిన విమల ప్రియ, నాగరాజు, తులసి, యమున, జయప్రకాష్, నాగరాజు, హెచ్ఆర్ మేనేజర్లు, కళాశాల సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

గొల్లపల్లి, వెంకట్రావుపల్లి పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ షూస్ పంపిణీ

ఇల్లంతకుంట/పున్నమి ప్రతినిధి/ జనవరి 22 పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ లు పంపిణి చేసిన గొల్లపల్లి మరియు వెంకట్రావ్ పల్లె సర్పంచ్ లు రడం లక్ష్మి (ప్రవీణ్ )చల్ల నవీన్ రెడ్డి నేడు ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా స్కూల్ యునఫామ్ లు షూస్ మరియు అబకాస్ బుక్స్ గౌరవ సర్పంచ్ రడం లక్ష్మి (ప్రవీణ్ ) మరియు సర్పంచ్ నవీన్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి సర్పంచ్ లక్ష్మి(ప్రవీణ్ ), చల్ల నవీన్ మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయి కి ఎదుగాలని అన్నారు.మన గ్రామంలోని పాఠశాలకు మా వంతు సహాయాసహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి సతీష్, ఇరు గ్రామాల ఉప సర్పంచ్ లు ఓరుపుల లక్ష్మన్, అనగోని అవినాష్, వార్డ్ సభ్యులు పత్రీ అంజయ్య, ముద్దాల అజయ్,మంద అనిల్ ,మంద రాజు, ఓరుపుల చంద్రయ్య, ఎద్దు భూమయ్య, చిగుర్ల అనిల్ రడం విజయ్, ఓరుపుల వంశీ, ఉపాధ్యాయులు, విద్యార్థులతల్లితండ్రులు,తదితరులు పాల్గొన్నారు

కామారెడ్డి

డాక్టర్ల నిర్లక్ష్యంతో 4 రోజుల బాలుడు మర్మభూమికి!!

కామారెడ్డి, 22 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన!చోటుచేసుకుంది. డాక్టర్ల అతి నిర్లక్ష్యంతో నాలుగు రోజుల నవజాత శిశువు మృతి చెందాడు. కామారె డ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బంధువులు డాక్టర్లపై తీవ్ర ఆరోపణలు చేస్తుంటే, ఆసుపత్రి వర్గాలు కుటుంబం నిర్లక్ష్యమే కారణమని వినుపిస్తున్నా యి. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన ఒగ్గు గంగా జమున (గర్భిణి) డెలివరి కోసం ఈనెల 19న కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి లో చేరింది. పరీక్షల్లో ఆమె బీపీ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని తేలడంతో, డాక్టర్లు “ఉదయం ఆపరే షన్ చేస్తాం” అని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఉదయం 6:30 గంటలకు ఆపరేషన్ విజయవం తమై, మగ శిశువు జన్మించాడు.కానీ బాలుడు బరువు తక్కువగా ఉందని చిన్నపిల్లల వార్డులో డాక్టర్లు పరీక్షించి, రెండు గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచారు. అయినా, తర్వాత రెండు రోజులు డాక్టర్లు పట్టించుకోకపోవడంతో శిశువు ఆరోగ్యం విషమించింపజేసింది. బంధువులు ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, వారు బాలుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు పరీక్షించి, “శిశువు 5-6 గంటల ముందే చనిపోయాడు” అని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు! కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనై, మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి డాక్టర్లను నిలదీశా రు.మా బాలుడు ఎలా చనిపోయాడు? అని ప్రశ్నిం చగా, సమాధానం రాకపోవడంతో ఆందోళన చేపాట్టారు. ఒక నవజాత శిశువు చనిపోతే కనీసం పట్టించుకోవాలి.. ఇక్కడ ఏమీ లేదు!” అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసు పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు విచారణ చేసినప్పుడు, డాక్టర్లు కుటుంబం నిర్లక్ష్యంతో ప్రైవే ట్ ఆసుపత్రికి తీసుకెళ్లడంతోనే మృతి సంభవించిం ది” అని సమాధానమిచ్చారు.ఈ ఘటనపై కుటుం బ సభ్యులు డీఎంఎచ్ఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నపిల్లలకు సరై న చికిత్స లేకపోవడం ఇక్కడి నిజం కాజేస్తోందా? స్థానికుల్లో కోపం, ఆందోళన చెలరేగింది.

వరంగల్

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మిర్చి ఘాటు క్వింటా 29 వేలు

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు రికార్డు సృష్టించిన్నాయీ గురువారం జరిగిన వేలంలో US 341 రకం మిర్చి ఏకంగా కింటాకు 29 వేల అత్యధిక ధర పలికింది, గత సోమవారం రూ 20 వేలు గా ఉన్న ధర నాలుగు రోజులలో రూ 9 వేలు పెరగడం విశేషం , ఉమ్మడి జిల్లాలలో దిగుబడులు తగ్గడం అంతర్జాతీయంగా ఎగుమతులకు డిమాండ్ పెరగడమే ఇ ధరల పెరుగుదలకు కారణమని ప్రముఖ వ్యాపార వేత్త , గజేంద్ర ఎంటర్ప్రైజెస్ సురేందర్ గారు తెలిపారు

తూర్పు గోదావరి

పుంత రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి ప్రతినిధి సీనియర్ రిపోర్టర్ 9989086083. గోపాలపురం మండలం భీమొలు గ్రామం సమీపంలో ఉన్న పుంత రోడ్డు కు ఇంత కాలానికి మోక్షం లభించింది ఎమ్మెల్యే మద్యపాటి వెంకట్రావు సహకారంతో ఈ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ నిధులు 20 లక్షలు మంజూరయ్యాయి రెండు కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణానికి కుటమి నాయకులు బుధవారం భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో టిడీపీ మండల అధ్యక్షుడు రాము భీమొలు గ్రామ అధ్యక్షుడు అప్పారావు కూటమి నాయకులు పాల్గొన్నారు END.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.