Wednesday, 11 March 2026

Blog

భద్రాద్రి కొత్తగూడెం

బీజేపీకి సీనియర్ నాయకుడు నూనె హనుమంతరావు రాజీనామా అశ్వారావుపేటలో మళ్లీ తెరపైకి వచ్చిన వర్గపోరు

కొత్తగూడెం జనవరి (పున్నమి దినపత్రిక జిల్లా ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు నూనె హనుమంతరావు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కొనసాగుతున్న వర్గపోరుతో విసిగి వేసారి పోయిన ఆయన ఆదివారం అధికారికంగా తన రాజీనామాను ప్రకటించారు. గతంలో కూడా పార్టీలో నెలకొన్న వర్గ పోరుల కారణంగా హనుమంతరావు ఒకసారి బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం వర్గ విభేదాలు తగ్గాయని భావించి తిరిగి పార్టీలో చేరి క్రియాశీలంగా పని చేశారు. అయితే, మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఇక పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి కొత్తగూడెం జిల్లా పర్యటన నేపథ్యంలో హనుమంతరావు రాజీనామా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో బీజేపీ అంతర్గత పరిస్థితులపై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సాహితీ

ఓటు హక్కు – సద్వినియోగ వాక్కు (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

భారత ఎన్నికల కమీషన్ స్థాపనకు గుర్తుగా ఏటా జనవరి 25న మన దేశంలో “జాతీయ ఓటర్ల దినోత్సవం” జరుపుకుంటాము. ఎన్నికల సమయంలో ఓటర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ఓటుహక్కు ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) సందర్భంగా పాఠకుల కోసం … ఈ కవిత నిర్ణీత వయస్సు వచ్చిన ప్రజలందరికి ఉన్న హక్కు ఓటు ఉత్తమ నాయకుని ఎంపికతో పాటు ఉత్తమ ప్రభుత్వ పరిపాలనకు రూటు … ఓటు ఓటు విలున అమూల్యం అందమైన పాలనకు వజ్రతుల్యం. ఓటేయ్యడానికి నోటుకు ఆశ పడితే పొరపాటు మందు కోసం ముందుకెలితే మతిపోటు నాయకుని ఎంపికకు కాకూడదు రేటు అనర్హులను గెలిపిస్తే బ్రతుకంతా చీకటి కాటు. ఓటు నైతిక విలువల రూటైతే పాలన ఎంతో స్వీటు. *ఆలోచించు మిత్రమా.. ఓటరుగా నీ పయనం ఎటు?…* ఓటుపై అవగాహన సంక్షేమ సమాజాన ఆదరణ నాయకత్యంపై జనసమోహ పరిశోధన అర్హునికి ఓటు వేయడమే మన కర్తవ్య నిర్వహణ వర్తమాన భవిష్యత్ తరానికి చెదరని అభినందన. మంచి నాయకులను నాయకత్వాన్ని కోరుకుందాం మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుందాం. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుందాం *జైహింద్*

నిర్మల్

ముస్తాబైన సమ్మక్క -సారలమ్మ గద్దెలు

ముధోల్,జనవరి 24 ( తెలంగాణ పున్నమి ప్రతినిధి నిర్మల్ ):ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ తాం డ గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వ హించే సమ్మక్క -సారలమ్మ జాతరకు గద్దెలు ముస్తాబైనట్లు దేవదాయ స్థాప కులు రేణుకమ్మ సోమవారం ఒక ప్రక టనలో తెలిపారు. ఈ జాతరకు నియోజకవర్గ కేంద్రమైన ముధోల్, బా సర,తానూర్, కుంటాల, లోకేశ్వరం, కుబీర్, బైంసా, నిజామాబాద్, హైదరా బాద్ పట్టణాల నుండి కాకుండా మహా రాష్ట్ర లోని ముంబై, ధర్మబాద్ ప్రాంతా ల నుండి భారీగా సంఖ్యలో భక్తులు స మ్మక్క- సారాలమ్మలను దర్శించుకుం టారు. సమ్మక్క -సారలమ్మలు కోరిన కోరికలు తీర్చి అమ్మవారిని భక్తుల న మ్మకం. ఈనెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు సమ్మక్క -సారలమ్మ జాతర జరుగుతుందన్నారు. సమ్మక్క -సారలమ్మ గద్దెలను 28తేదీన బుధవారం కనక పనం శ్రీ సరళమ్మ గద్దెపైకి వచ్చును, 29 న గురువారం తేదీన శ్రీ సమ్మక్క దేవత గద్దె పైకి వచ్చును, 30న తేదీన శుక్రవారం భక్తులు సమ్మక్క- సారలమ్మ దేవతలకు ఓడి బియ్యం నిలువెత్తు బంగారం, బోనాలు మేకల తో మొక్కులను సమర్పించబడును. చివరి రోజైన 31వ తేదీన శనివారం సమ్మక్క-సారలమ్మ తిరిగి వనప్రవేశం గా వెళతారు. దీంతో ఈ జాతర నాలు గు రోజులపాటు ఎంతో వైభవంగా జరుగుతుందని దేవాదాయ ధర్మకర్త రేణుకమ్మ ధర్మకర్తలు పూజారులు జాదవ్ సతీష్, సత్యవతి నిర్వాహకులు తెలిపారు.

ఖమ్మం

స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి డీఈవో కార్యాలయంలో ఇద్దరికి మెమోలు

ఖమ్మం, జనవరి (పున్నమి దినపత్రిక జిల్లా స్టాఫర్) విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన స్కూల్ అసిస్టెంట్‌పై జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని కఠిన చర్యలు తీసుకున్నారు. ఖమ్మం నగరంలోని మామిళ్లగుడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బానోత్ గౌతమిని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ, నగరంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థకు సంబంధించిన అడ్మిషన్ ప్రమోషన్లు చేయడం, పాఠశాల సమయాల్లో రీల్స్ చేస్తూ సమయం వృథా చేయడం వంటి ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఈ విషయమై గతంలో పలుమార్లు ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ ఆమె తన తీరు మార్చుకోకపోవడంతో సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు డీఈవో తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మాత్రమే కృషి చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు. ఇదే సమయంలో డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఇద్దరు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఒకరు కార్యాలయ సమయాన్ని పాటించకుండా మధ్యాహ్నమే ఇంటికి వెళ్లడం, మరొకరు ఫైల్స్ ఆలస్యం చేస్తూ డీఈవో టేబుల్‌పై ఉన్నాయని అబద్ధాలు చెప్పినట్లు గుర్తించడంతో మెమోలు ఇచ్చినట్లు తెలిపారు. కార్యాలయ సిబ్బంది సమయపాలనతో పాటు అంకితభావంతో విధులు నిర్వహించాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డీఈవో హెచ్చరించారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గోదావరి పుష్కరాలు: చంద్రబాబు అప్పుడే మొదలెట్టేశారు!

ప్రతి 12 సంవత్సరాలకు జరిగే గోదావరి నదీ పుష్కరాలు వచ్చే ఏడాది జరగనున్నాయి. గోదావరి నది ప్రవహించే ప్రతి రాష్ట్రంలోనూ ఈ పుష్కరాలు నిర్వహించినా, ప్రధాన ప్రాంతం మాత్రం (అంటే సముద్రంలో కలిసే అంతిమ ప్రాంతం) రాజమండ్రి సమీపంలోనే ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరం అంటేనే అధిక ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో అంటే 12 ఏళ్ల కిందట కూడా టీడీపీ హయాంలోనే గోదావరి పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు వచ్చే ఏడాది మరోసారి కూడా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలోనే ఇవి జరగనున్నాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఏడాదిన్నర ముందే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ పుష్కరాలను ప్రపంచ స్థాయిలో నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. గోదావరి పుష్కర పనులపై తొలిసారిగా చంద్రబాబు శుక్రవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలపై చర్చించారు. గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఈ పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ పుష్కరాల నిమిత్తం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు వస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా 139 ఘాట్లను నిర్మించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధం? కూటమి ప్రభుత్వం కీలక అడుగులు

ఆంధ్రప్రదేశ్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత, విద్యపై సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం పరిశీలనలో ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. దావోస్ వేదికగా మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో అమలులో ఉన్న ‘అండర్-16 సోషల్ మీడియా చట్టం’ను ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిబంధన అమలులోకి వస్తే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా యాప్‌ల వినియోగంపై పిల్లలకు కఠిన ఆంక్షలు విధించనున్నారు. వయస్సు ధృవీకరణ విధానం తప్పనిసరి చేయడం, తల్లిదండ్రుల అనుమతి లేకుండా అకౌంట్లు తెరవకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలు చర్చలో ఉన్నాయి. అలాగే, నిబంధనలు ఉల్లంఘించిన టెక్ కంపెనీలపై భారీ జరిమానాలు విధించేలా చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. పిల్లలు ఆన్‌లైన్ వేధింపులు, అసభ్య కంటెంట్, డిజిటల్ వ్యసనాలకు గురికాకుండా కాపాడడమే ఈ ప్రతిపాదిత విధానத்தின் ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

నారాయణపేట

జనవరి 26 సోమవారం నుంచి కున్సి గ్రామంలో జములమ్మ దేవి జాతర మహోత్సవం

నారాయణ పేట జిల్లా క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ జములమ్మ దేవి 10 వ జాతర మహోత్సవం జనవరి 26 27 తేదీలో భక్తిశ్రద్ధల మధ్య జరగనుంది. 26 తేదీ సోమవారం నాడు ఉదయం గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. రథోత్సవాన్ని మహిళలతో లాగడం ఇక్కడి విశేషం . ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

E-పేపర్

నిరుపేద కుటుంబానికి 1, లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

*నిరుపేద కుటుంబానికి 1, లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు* *మేడిపల్లి నక్కర్త గ్రామ ప్రజలు.* సర్పంచ్, ఉప సర్పంచ్ ఆడాల గణేష్ తదితరులు..* పున్నమి న్యూస్ ప్రతినిధి: 24 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : చనిపోయిన నరసింహ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ 1లక్ష రూపాయల ఆర్థిక సహాయం* *మేడిపల్లి నక్కర్త గ్రామ వాస్తవ్యులు ఇటీవల కందడి నరసింహ గత కొన్ని రోజుల క్రితం చనిపోయిన సందర్భంగా తన పిల్లలు అనాధలుగా మిగిలిపోవడంతో వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ముందుకు వచ్చి చందాలుగా సేకరించి* “1లక్ష రూపాయలు” *మేడిపల్లి నకర్త సర్పంచ్ ముచ్చర్ల సుగుణ సంపత్, మోటి శ్రీశైలం మాజీ సర్పంచ్ ఎరుకలి బాలరాజ్ గౌడ్, ఉప సర్పంచ్ దింది మధుకర్ రెడ్డి, చిగురంతా సికిందర్ రెడ్డి, ఏవిజి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్ గారి చేతుల మీదుగా “పెద్ద కురుమ కలకొండ బీరప్ప”కి ఆ కుటుంబం తరఫున వారికి అందజేయడం జరిగింది.కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేస్తూ…* *ఈ కార్యక్రమం లో పార్టీ ఉపాధ్యక్షులు జమ్మ గుండాలు, వార్డు సభ్యులు మొక్కపల్లి మహేష్, ముచ్చర్ల ప్రకాష్, బన్ని జంగయ్య, బేత జంగయ్య,గడ్డం మల్లేష్, కలకొండ మల్లేష్, బండ రాజు,ఏరకలి కృష్ణ, జమ్మ శివ,మొరుగు మహేష్, బండ బీరప్ప, పోలే జంగయ్య పాల్గొన్నారు.*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీస్పీ రాష్ట్ర మహిళ క్రాకటూరు పుష్పంజలి, మరియు పార్టీ వారు

కావలి నియోజకవర్గం లోని అల్లూరు మండలం వెలిచర్ల గ్రామానికి సంబంధించిన భూ సమస్యలను అధికారులతో కలిసి భూములను సందర్శించి సమస్య ఫై ప్రాతి నిద్యం చేశారు అనంతరం ఆ గ్రామ ప్రజలను సమావేశపరిచి బహుజన పార్టీ గురించి, మాయావతి గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అధికారులు, బీస్పీ రాష్ట్ర మహిళ పుష్పంజలి,కన్వీనర్ టీ కృష్ణా,మరియు అడ్వైజర్, తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ నో షో..! ఐసీసీ సంచలన నిర్ణయం

2026 ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ జట్టు తప్పుకుంది. భారత్లో తమకు భద్రతా ముప్పు ఉందని పేర్కొంటూ తమ మ్యాచ్‌లను పూర్తిగా శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేందుకు ఐసీసీ ఇచ్చిన 24 గంటల గడువును కూడా బంగ్లాదేశ్ అంగీకరించలేదు. ఫలితంగా ఐసీసీ నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు ఈ మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపింది. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.