Wednesday, 11 March 2026

Blog

కామారెడ్డి

రామారెడ్డి గ్రామంలో ఘణతంత్ర దినోత్సవ ఉత్సవాలు

రామారెడ్డి పాలకవర్గం సభ్యులు జాతీయ నాయకుల విగ్రహాలకు అలంకరాలు! కామారెడ్డి, 25 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : దేశ ఘణతంత్ర దినోత్సవ పురస్కరించుకుని రామారెడ్డి గ్రామంలో ఉత్సాహం హృదయాలను కదిలించింది. గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపస ర్పంచ్ నవీన్‌ల నేతృత్వంలో పాలకవర్గం సభ్యులు జాతీయ నాయకుల విగ్రహాలకు ప్రత్యేకంగా రంగు లు వేయించారు.ఈ కార్యక్రమం గ్రామస్తుల్లో దేశ భక్తి భావాలను మరింత బలపరిచింది.ఆదివారం ఉదయం నుంచే రామారెడ్డి గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్లు. సర్పంచ్ బండి ప్రవీణ్‌కు సహచరులైన ఉపసర్పంచ్ నవీన్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మొత్తం సమీపంలో ఏర్పడి మహాత్మా గాంధీ, శుభాష్ చంద్రబోస్, డా.బి.ఆర్. అంబేద్కర్, బాబు జగజీవన్ రావ్, నెహ్రూ వంటి జాతీయ నాయకుల విగ్రహాలకు విశేషంగా రంగు లు వేయించారు. తిరంగా గుండెల్లో దేశభక్తి మంచి పాటవుతుందని సర్పంచ్ ప్రవీణ్ అన్నారు.ఈ ఉత్సవాలు గ్రామంలో ఐక్యత, దేశభక్తిని పెంపొం దించాయి.మా గ్రామ పాలకులు దేశ స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా జరుపుకోవడం మేము గర్వపడుతున్నాం అని గ్రామస్తులు చెప్పుకొని సంతోషించారు. ఘణతంత్ర దినోత్సవం ద్వారా ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేసుకున్నారు. రామారెడ్డి గ్రామ పాలకులు ఇలాంటి కార్యక్రమా లతో గ్రామీణ అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమా ల్లో ముందంజలో నిలుస్తున్నారు. ఈ ఘనోత్సవం గ్రామ ప్రజల్లో దేశభక్తి జ్వాలను రగిలించింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శివాలయ పునర్నిర్మాణానికి సహకరించాలి: అర్చకులు ఫణింద్రశర్మ, సాయికుమార్ శర్మ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలులోని శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్నిర్మాణానికి అందరూ సహకరించాలని అర్చకులు ఫణింద్ర శర్మ, సాయికుమార్ శర్మలు కోరారు. ఆదివారం శివాలయం ప్రాంగణంలో కమిటీ ఏర్పాటు చేసి గ్రామస్తులతో చర్చించారు. ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ అభివృద్ధికి మద్దతు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తే చర్యలు ఎస్సై ఇంద్రసేనారెడ్డి

ఉదయగిరి Date:25-1-2026 సామాజిక మద్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై కే ఇంద్రసేనారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు ఉదయగిరి అడవుల్లో పెద్ద పులి సంచరిస్తుంది నిర్ధారణమైంది అయితే గత రెండు రోజులుగా సామాజిక మద్యమాల్లో ఓ పెద్దపులి ఆవు దూడను చంపేస్తున్న వీడియో సామాజిక మద్యమాల్లో వైరల్ అవుతుందన్నారు అయితే ఆ వీడియో ఉదయగిరి ప్రాంతానికి సంబంధించింది కాదన్నారు ఇలాంటి తప్పుడు వీడియోలను వైరల్ చేస్తే ప్రజలను భయభ్రాంతులను గురి చేసిందన్నారు ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పదన్నారు

E-పేపర్

రాయపోల్ గ్రామ శాఖ అధ్యక్షులు గా బాసిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి నియామకం

*రాయపోల్ గ్రామ శాఖ అధ్యక్షులు గా బాసిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి నియామకం* *ఈరోజు రాయపోల్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంకాల కరుణాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.* ఈ సమావేశం లో నూతన గ్రామ శాఖను ఎన్నుకోవడం జరిగింది. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా బాసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులు గా రాసూరి నర్సింహా. మచ్చ తిరుమలేష్. దొర్నాల రాజు. చింతల నవీన్ మరియు ప్రధాన కార్యదర్శులు గా ఉడుగుల రాకేష్ మరియు దొర్నాల ఆనంద్ మరియు కోశాధికారి గా బుయ్య శివశంకర్ కార్యదర్శులు గా అచ్చన రమేష్. కానుగుల లాలయ్య. హనుమండ్ల సురేష్. అంకర్ల నర్సింహా మరియు కార్యవర్గ సభ్యులుగా దొర్నాల బాలయ్య. కానుగుల సత్తయ్య. చెరుకు జంగయ్య ను గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో…. రాష్ట్ర సేవాదళ్ ఉపాధ్యక్షులు మంకాల దాసు 4వ వార్డు మెంబర్ డొంకని మహేందర్ గౌడ్ PACS డైరెక్టర్ జిలకపల్లి ప్రభాకర్ రెడ్డి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

పోతగల్ గ్రామంలో దానివేణి ఎల్లవ్వకు నివాళులు అర్పించిన మెంగని మనోహర్.

ముస్తాబాద్/ పున్నమి ప్రతినిధి/ జనవరి ఈ రోజు పోతగల్ గ్రామంలోని పెద్దమ్మల కాలనీకి చెందిన దానివేణి ఎల్లవ్వ (మృతురాలు) చనిపోవడంతో, ఆమె పార్ధివ దేహానికి కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని భుజాన మోసి అంత్యక్రియల్లో పాల్గొని మానవీయతను చాటుకున్నారు. గ్రామ ప్రజలు ఆయన సేవాభావాన్ని ప్రశంసించారు. ఎల్లవ్వ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు

E-పేపర్

హామీలు ఇవ్వడమే కాదు, ఇచ్చిన మాటను నెరవేర్చడమే అసలైన ప్రజాసేవ”

*24 గంటల్లో బోరు వేయిస్తామని మాయ మాటలు చెప్పి తప్పించుకున్న ఎమ్మెల్యే!* *72 గంటల్లో బోరు వేయించి మాట నిలబెట్టుకున్న బంటన్న!!* ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు, ఇంద్రానగర్ కాలనీ వాసులు — మాజీ ఎమ్మెల్యే *మంచిరెడ్డి కిషన్ రెడ్డి*అన్ని మౌలిక వసతులు కల్పించారని, కేవలం తాగునీటి బోరు ఒక్కటే అవసరమని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ని సంప్రదించారు. 24 గంటల్లో బోరు వేయిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఆ మాటను నిలబెట్టుకోకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర నిరాశతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు *మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి)* ని కలిసి తమ సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన ప్రశాంత్ రెడ్డి గారు బోరు బండిని పంపించి, పనులు ప్రారంభింపజేసి — నీరు వచ్చే వరకు నిరంతరం కొనసాగించారు. ఈ సందర్భంగా నీరు పడటంతో కాలనీ వాసులు ప్రశాంత్ రెడ్డి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ — “హామీలు ఇవ్వడమే కాదు, ఇచ్చిన మాటను నెరవేర్చడమే అసలైన ప్రజాసేవ” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు జెర్కొని రాజు, మాజీ కౌన్సిలర్లు మంద సుధాకర్, శంకర్ నాయక్, వార్డు అధ్యక్షులు నౌసు శివ, కొండ్రు మురళీ కృష్ణ, చింతపట్ల ఉదయ్, డోంకి చందు,కొండ్రు మహేష్, జలేందర్ నాయక్, సురేష్, కొండ్రు రవి కాలనీ వాసులు ఆలంపల్లి బాబు, కందుకూరి శ్రీనివాస్,కప్పటి నర్సింగ్ రావు, ఆలంపల్లి బాషా, కందుకూరి బాలు, గోరేమియా, డాక్టర్ ప్రభాకర్ సర్, పెద్ద ఎత్తున పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నాందేడ్ చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ప్రభుత్వ అతిదీ హోదాలో స్వాగతించిన మహా రాష్ట్ర ప్రభుత్వం శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ అత్మర్పణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ శిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ అత్మర్పణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ని ప్రభుత్వ అతిదిగా మహారాష్ట్ర సర్కార్ స్వాగతం పలికారు నాందేడ్ లోని శ్రీ గురు గోవింద్ విమానశ్రమoలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజ్య సభ సభ్యులు, శ్రీ అశోక్ చవాన్,ఆయన కుమార్తె శాసన సభ్యురాలు,శ్రీ జయ చవాన్ శాసన మండలి సభ్యులు శ్రీ రాజార్ కర్, జిల్లా కలెక్టర్ శ్రీరాహుల్ తో కలవడం జరిగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఏఎంసీ డైరెక్టర్ బోలా శీను.

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి) జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గం ఏఎంసీ డైరెక్టర్ బోలా శీను ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వించదగినదని అన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి గౌరవం, బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించేది ఓటరేనని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

గూడూరు

ఎస్ కే ఆర్ కళాశాల విద్యార్థులకు ప్రశంసలు

జనవరి 25 @ గూడూరు స్థానిక ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో జరిగిన వివిధ పోటీలలో గెలుపొందిన విషయం విధితమే. అయితే విజేతలు అయిన విద్యార్థిని విద్యార్థులు బిఏ రెండవ సంవత్సరం చదువుతున్న ఆర్. శ్రీనివాసులు, బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న పి. శిరీష లు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం లో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఎలక్షన్ ఆఫీసర్ అయిన డా. ఎస్. వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. అదేవిధంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో డిబేట్లో పాల్గొని ప్రధమ బహుమతి పొందిన బీకాం మూడో సంవత్సరం చదువుతున్న ఎ. సూర్య మౌనిక మండల రెవెన్యూ అధికారిచే ప్రశంసా పత్రము మరియు బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి అధ్యాపక సిబ్బంది మరియు అధ్యాపకేతర సిబ్బంది విజేతలైన విద్యార్థులను అభినందించారు.

భద్రాద్రి కొత్తగూడెం

కొత్తగూడెం సింగరేణిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి

కొత్తగూడెం జనవరి (పున్నమి దినపత్రిక జిల్లా ప్రతినిధి) కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి గారు ఆదివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ అధికారులతో పాటు భాగస్వామ్య పక్షాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి, సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై వివరంగా చర్చించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తిని పెంచడమే కాకుండా నాణ్యతను మెరుగుపరచడం ద్వారా సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తి ద్వారా సంస్థ ఆర్థికంగా బలపడడమే కాకుండా, దేశంలో ‘ఆత్మనిర్భర భారత్’ లక్ష్య సాధనకు సింగరేణి కీలక పాత్ర పోషించాలన్నారు. వచ్చే మూడేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బొగ్గు రంగంతో పాటు దేశంలోని వివిధ రంగాల్లో విస్తృత సంస్కరణలు అమలుకానున్నాయని తెలిపారు. ఈ సంస్కరణలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడానికి అధికారులు, ఉద్యోగులు, భాగస్వామ్య పక్షాలు అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సమావేశం సింగరేణి భవిష్యత్ దిశను నిర్దేశించే కీలక ఘట్టంగా మారిందని అధికారులు అభిప్రాయపడ్డారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.