కామారెడ్డి
ప్రజలు ఓటు ఆయుధంతో ముందుకు! కామారెడ్డి, జనవరి 25: (పున్నమి ప్రతినిధి) రామారెడ్డి మండలంలో 16వ జాతీయ ఓటర్స్ డే సందడి సంనాదంగా మారింది! తహసీల్దారు ఉమా ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్యక్రమం ప్రజల్లో ఓటు అవగాహనను మరింత బలపరిచింది. మండల కేంద్రంలో ప్రధాన వీధులు ర్యాలీతో, నినాదాలతో మునిగిపోయాయి. “ఓటు మా హక్కు.. నిర్భయంగా వాడుకుంటాం!” అంటూ సామాన్య ప్రజలు, అధికారులు కలిసి గట్టిగా ప్రకటించారు.బస్టాండ్ నుంచి చౌరస్తా వరకు ఘన ర్యాలీ నిర్వహించారు.రామారెడ్డి బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ, ప్రధాన వీధుల గుండా చౌరస్తా వరకు సాగింది. ఈ ర్యాలీలో మహిళలు, యువకు లు, పిల్లలు ముందుండి ఉత్సాహంగా నడిచారు. రతాల చౌరస్తా వద్ద అందరూ మానవహరంగా ఏర్పడి, “ఓటు హక్కును నిర్భయంగా వాడుకోవా లి.. డెమోక్రసీ కాపాడుకుంటాం!” అని గట్టి నినాదా లు చేశారు. స్థానికులు ఈ ఉత్సవాన్ని చూసి ఆనం దంలో మునిగారు. ఒక మహిళా ఓటరు అంటూ.. “మా ఓటే మా ఆయుధం, ఎవరూ ఆపలేరు!” అని ఉత్సాహంగా చెప్పుకున్నారు.తహసీల్దారు ఉమా పిలుపు: ఓటు మిస్ కాకుండా ప్రతి ఓటరూ తమ ఓటు ఆయుధాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి. డెమోక్రసీ బలోపేతానికి ఓటే మూలం. ఎవరూ భయపడకుండా, 100% ఓటింగ్ పాల్గొనాలని గట్టి పిలుపు నిచ్చారు.ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో రికార్డు ఓటింగ్ రావాలి” అని ఆమె సూచించా రు.అధికారులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొ న్నారు. రెవెన్యూ అధికారులు, సంబంధిత సిబ్బం ది, వార్డు సభ్యులు అందరూ కార్యక్రమాన్ని విజ యవంతం చేశారు. మండలంలో ఓటర్ లిస్ట్ సమీ క్షలు, అవగాహన కార్యక్రమాలు మరింత ఊపందు కునేలా ఈ ఉత్సవం మార్గదర్శకంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సంబంధిత అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.