Tuesday, 10 March 2026

Blog

కడప

జోరుగా మద్యం అమ్మకాలు

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్యం మాంస విక్రయాలు చేయకూడదని చట్టాలు చెబుతున్నాయి కానీ అవేవీ పట్టనట్లు మద్యము మరియు మాంస విక్రయాలు యదేచ్చగా కొనసాగాయి ప్రొద్దుటూరు లోని పలు బ్రాందీ షాపులు మద్యం విక్రయాలను చేశారు అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు ఈ అధికారుల తీరుపై ప్రజలు వాపోతున్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు తహసీల్దార్ నాగరాజు జెండా ఎగర వేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

దుత్తలూరు మండలంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా తహసీల్దార్ నాగరాజు మన జాతీయ జెండా ఎగర వేసారు, ఆనంతరం,77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తహసీల్దార్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగం సృష్టించాడు జనవరి 26న మనకు పూర్తి స్వతంత్రం వచ్చినప్పటికీ మనదేశంలో కుల మత భేదాలు లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ఉండాలని ఆనాడు మన దేశానికి త్యాగం చేసిన త్యాగమూర్తులను గుర్తు చేసుకుంటున్నాం కనుక మన దేశంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నతమైన చదువుల్లో అభ్యసించి మనం అందరం కూడా వారి అడుగు జాడల్లో నడవాలని చదువుతున్న చిన్నారులు ఉన్నతమైన స్థానంలో ఉండాలని 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో దుత్తలూరు సిద్ధార్థ స్కూల్ కరస్పాండెంట్ శంకర్, చిన్నారులు, టీడీపీ కార్యకర్తలు, తహసీల్దార్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు

ఖమ్మం

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఖమ్మం జనవరి (పున్నమి దిన పత్రిక జిల్లా స్థాఫర్) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, రాజకీయ పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. ఖమ్మం నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయగా, తుమ్మల క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ రాదోడ్, పోతుల వీర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 53వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి ధనియాకుల శ్రీలత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ ప్రతినిధి అన్నం శ్రీనివాస్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ, సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, పిల్లల మర్రి వెంకట్, అల్లిక అంజయ్యలతో పాటు రెండవ పట్టణ బాధ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, తెలుగుదేశం, జనసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యాలయాల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు జాతీయ జెండాలను ఎగురవేయగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లాస్థాయి రిపబ్లిక్ డే అవార్డు అందుకున్న గురువా రెడ్డికి మనుబోలు నుంచి అభినందనలు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం నుంచి రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన వేడుకల్లో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ గురువా రెడ్డి గారు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గర్వకారణమని పొన్నూరు అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మనుబోలు సాగునీటి సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్న పొన్నూరు అశోక్ మాట్లాడుతూ, గురువా రెడ్డి గారి సేవలు జిల్లాకు ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు. ఈ అవార్డు మరింత సేవాభావంతో పనిచేయడానికి ప్రోత్సాహం కలిగిస్తుందని పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామo లో 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సిఐటియు దుత్తలూరు మండల ప్రధాన కార్యదర్శి, స్కూల్ చైర్మన్

దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామంలోని ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తురకపల్లి స్కూల్లోని హెచ్ఎం సంధ్యారాణి, దత్తాత్రేయ, దుత్తలూరు మండల సిఐటియు ప్రధాన కార్యదర్శి నేలటూరి సింహాద్రి, స్కూల్ చైర్మన్ పోల్ అంకిరెడ్డి, పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐటియు దుత్తలూరు మండల ప్రధాన కార్యదర్శి సింహాద్రి మరియు పోలు అంకి రెడ్డి వారు మాట్లాడుతూ, 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది 1950 జనవరి 26న భారతదేశ సార్వభౌమ రాజ్యాంగం ప్రకటించింది ఈ రోజున మన భారతదేశ స్వతంత్ర పొందిన తర్వాత మన దేశాన్ని ఒక గణతంత్ర రాజ్యాంగం ప్రకటించుకుంది మన దేశ స్వతంత్ర సమరయోధులను, మన దేశం స్వాతంత్ర తెచ్చిన వీరులను, మన దేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటున్నాం అని వారు మాట్లాడారు

ఆంధ్రప్రదేశ్

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో కళాశాలలో పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం అసువులు బాసిన నేతల గురించి స్మరించుకోవడం జరిగింది వారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవడం జరిగింది Uploaded Video:

ఆంధ్రప్రదేశ్

అర్హులైన జర్నలిస్టులందరికీ* *అక్రిడిటేషన్లు మంజూరయ్యేలా కృషి చేద్దాం: కె.ఎస్. రంగశాయి*

* అమరావతి జనవరి ( పున్నమి ప్రతినిధి) – *స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎస్. రంగశాయి* – *అక్రిడిటేషన్ కమిటీల సభ్యులుగా నియమితులైన అసోసియేషన్ ప్రతినిధులకు శిక్షణా సదస్సు* *విజయవాడ:* అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరయ్యేలా కృషి చేయాలని స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎస్. రంగశాయి అన్నారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కమిటీల సభ్యులుగా నియమితులైన అసోసియేషన్ ప్రతినిధులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగశాయి ప్రసంగిస్తూ.. అక్రిడిటేషన్ జీవోలోని నిబంధనలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకుని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడటమే కాకుండా.. అక్రిడిటేషన్ల జారీలో చిన్న, మధ్య తరహా పత్రికలకు అన్యాయం జరక్కుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జీవోలో ఉన్న కొన్ని నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను సమాచార శాఖ డైరెక్టరు దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. ఎంప్యానల్డ్ పత్రికలకు అక్రిడిటేషన్ల సంఖ్యను పెంచాలని, నాన్ ఎంప్యానల్డ్ పత్రికలకు రాష్ట్ర స్థాయిలో కనీసం ఒక్క అక్రిడిటేషన్ అయినా మంజూరు చేయాలని అన్నారు. ఈ అంశాలపై ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో అసోసియేషన్ నుంచి చేసిన ప్రతిపాదనలకు డైరెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కమిటీల సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అసోసియేషన్ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని కోరారు. ఎంప్యానల్మెంట్ పెండింగ్ ఫైళ్లు, ఇతర సమస్యల గురించి త్వరలోనే ఐ అండ్ పీఆర్ డైరెక్టరును కలిసి పరిష్కారమయ్యేలా చూస్తామని రంగశాయి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. గోపీనాథరావు, ఉపాధ్యక్షుడు కొత్తపల్లి అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్రస్థాయి అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు నిట్టల శ్రీనివాస్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, 26 జిల్లాల అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఉత్తమ అర్చకునిగా మునగలేటి రమేష్ శర్మకు రాష్ట్ర ప్రభుత్వ ప్రశంస

ఖమ్మం, జనవరి (పున్నమి దిన పత్రిక జిల్లా స్టాఫర్) గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా డి.డి.ఎన్ అర్చక సంఘం అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మను ఉత్తమ అర్చకునిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనీదీప్ దురిశెట్టి చేతుల మీదుగా రమేష్ శర్మ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల రమేష్ శర్మ హర్షం వ్యక్తం చేస్తూ, తనను ఉత్తమ అర్చకునిగా ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ గౌరవానికి సహకరించిన దేవాదాయ ధర్మదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ వీరస్వామి గారికి, కార్యాలయ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అర్చక ఉద్యోగ సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వర్లు గారికి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చక సంఘం అధ్యక్షులు దాములూరు వీరభద్రం శర్మ గారికి, రాష్ట్ర డి.డి.ఎన్ సంఘం ప్రధాన కార్యదర్శి అన్నావజ్జల ప్రసాద్ శర్మ గారికి, జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి యం.భర్గవాచార్యులు గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులకు మరియు ఖమ్మం జిల్లా డి.డి.ఎన్ అర్చకులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు

వనపర్తి

ఘనంగా,77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాల

*77వ గణతంత్ర సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాలలో* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 26 /1/ 2026* *77వ గణతంత్ర సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాల గణపురం మండలం యందు ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప తెలియజేశారు, జాతీయ పతాకావిష్కరణ తర్వాత వారు మాట్లాడుతూ ఇటీవల నూతనంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఎన్నిక కాబడిన వారందరినీ శాలువాతో సన్మానించడం జరిగింది. వారందరు ఉన్నత పాఠశాలలో ముఖ్యంగా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసేందుకు మిగిలిపోయిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేయాలని వారు కోరారు పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేయాలని, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని, 10వ తరగతి విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు పొందాలని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు, సర్పంచ్ బాల లింగయ్య మాట్లాడుతూ మేము పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భద్రయ్య వార్డు మెంబర్లు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు,ప్రతిభ కనబరిచారు, ప్రతిభ కనబరిచిన వారందరికీ బహుమతుల ప్రధానోత్సవం అందించారు*

వనపర్తి

ఘనంగా,77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాల

*77వ గణతంత్ర సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాలలో* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 26 /1/ 2026* *77వ గణతంత్ర సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాల గణపురం మండలం యందు ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప తెలియజేశారు, జాతీయ పతాకావిష్కరణ తర్వాత వారు మాట్లాడుతూ ఇటీవల నూతనంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఎన్నిక కాబడిన వారందరినీ శాలువాతో సన్మానించడం జరిగింది. వారందరు ఉన్నత పాఠశాలలో ముఖ్యంగా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసేందుకు మిగిలిపోయిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేయాలని వారు కోరారు పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేయాలని, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని, 10వ తరగతి విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు పొందాలని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు, సర్పంచ్ బాల లింగయ్య మాట్లాడుతూ మేము పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భద్రయ్య వార్డు మెంబర్లు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు,ప్రతిభ కనబరిచారు, ప్రతిభ కనబరిచిన వారందరికీ బహుమతుల ప్రధానోత్సవం అందించారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.