వార్త ముఖ్యాంశాలు
- యలమంచిలి పాఠశాలల్లో విద్యార్థుల చిత్రకళా ప్రతిభకు ప్రోత్సాహం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని యలమంచిలి శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో నవంబర్ 17న వివిధ పాఠశాలల్లో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.
- ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను రంగుల చిత్రాల ద్వారా ప్రదర్శించారు.యలమంచిలి స్టేషన్ రోడ్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్.
- భవానీ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు.
యలమంచిలి పాఠశాలల్లో విద్యార్థుల చిత్రకళా ప్రతిభకు ప్రోత్సాహం
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని యలమంచిలి శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో నవంబర్ 17న వివిధ పాఠశాలల్లో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను రంగుల చిత్రాల ద్వారా ప్రదర్శించారు.యలమంచిలి స్టేషన్ రోడ్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్. భవానీ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, కిషోర్ పాల్గొన్నారు. అలాగే కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు జి. మంగపతిరావు ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ఉపాధ్యాయులు సీహెచ్. రాజేశ్వరి, రామలక్ష్మి, అల్లూరి సూర్యకళ, భవానీ, తులసి, మల్లిక పాల్గొన్నారు.విద్యార్థుల్లో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికితీసి, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingపత్రిక / వెబ్‌సైట్