Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

35లో 33 కూటమి ఖాతాలో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
35లో 33 కూటమి ఖాతాలో

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లాలోని 35 జడ్పీటీసీ స్థానాల్లో 33 కూటమి గెలుచుకోవడం ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు.
  • నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో విజేతలను అభినందించారు.
  • గ్రామ సమస్యలను స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి, జడ్పీ సమావేశాల్లో చర్చించాలని సూచించారు.

నెల్లూరు జిల్లాలోని 35 జడ్పీటీసీ స్థానాల్లో 33 కూటమి గెలుచుకోవడం ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో విజేతలను అభినందించారు. గ్రామ సమస్యలను స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి, జడ్పీ సమావేశాల్లో చర్చించాలని సూచించారు. గెలుపు ధీమాతో ఏమరుపాటు వద్దని, 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

ఈ ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్, మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామరెడ్డి, డీసీసీబీ చైర్మన్ ధనుంజయ రెడ్డి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, ఏపీఈఎంసీఎల్ చైర్మన్ దినేష్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, కర్నాటి ఆంజనేయ రెడ్డి కూడా హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *