Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

*33 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్‌కు ముగింపు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*33 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్‌కు ముగింపు*
Oplus_16908288

*33 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్‌కు ముగింపు*
*TSNPDCL సబ్ ఇంజనీర్ చిలక వెంకటేశ్వర్లు పదవీ విరమణ*
*విద్యుత్ శాఖలో సేవలందించిన వెంకటేశ్వర్లు కు శుభాకాంక్షలు వెల్లువ*

ఏన్కూరు:

విద్యుత్ పంపిణీ రంగంలో 33 సంవత్సరాలుగా నిస్వార్థంగా సేవలందించిన చిలక వెంకటేశ్వర్లు సబ్ ఇంజనీర్, TSNPDCL తన సుదీర్ఘ ఉద్యోగ జీవితానికి ముగింపు పలుకుతున్నారు.

ది. 30-06-2026 నాటికి 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని పదవీ విరమణ చేయనున్నారు.

33 ఏళ్ల సర్వీస్ కాలంలో ఆయన ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, ఎలాంటి విద్యుత్ అంతరాయాలైనా తక్షణమే పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేశారని సహోద్యోగులు, ప్రజలు కొనియాడుతున్నారు.

పదవీ విరమణ సందర్భంగా వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, TSNPDCL సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు “మీ భవిష్యత్తు ఆరోగ్యంగా, ఆనందంగా, సుభిక్షంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము” అంటూ వారికి శుభాశీస్సులు తెలిపారు

సుదీర్ఘ సర్వీస్ తర్వాత పొందుతున్న ఈ విశ్రాంతి జీవితం ఆయనకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఏన్కూరు విద్యుత్ శాఖ ఏ ఈ ఉమా కాంత్ అధికారులు మరియు సిబ్బంది అందరూ ఆకాంక్షిస్తున్నారు.

*33 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్‌కు ముగింపు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *