Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

#227175

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

కామ పిశాచి చేతిలో ఆదివాసీ బిడ్డ దారుణ హత్య

నిందితుడిని కఠినంగా శిక్షించాలి – శిరీష కుటుంబానికి రూ.కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

తిమ్మంపేట ఆదివాసీ JAC కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ

తిమ్మంపేట, ములకలపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివాసీ యువతి, నర్సు శిరీష దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తిమ్మంపేట ఆదివాసీ JAC కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

విధులు ముగించుకుని విశ్రాంతి తీసుకుంటున్న శిరీషపై నిందితుడు సైనాఉల్లా దాడి చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహంపై కూడా అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిజాలు వెలుగులోకి తీసుకురావాలని JAC డిమాండ్ చేసింది.

ఆదివాసీ బిడ్డకు జరిగిన ఈ దారుణంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. నిందితుడికి చట్టప్రకారం అత్యంత కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రుల్లో పనిచేసే మహిళా సిబ్బందికి పూర్తి భద్రత కల్పచాలి . ఆదివాసీ యువతికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

JAC ప్రధాన డిమాండ్లు

• నిందితుడిని కఠినంగా శిక్షించాలి.
• శిరీష కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలి.
• కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
• శిరీష కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలి.
• మహిళా ఉద్యోగులకు, ముఖ్యంగా ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి భద్రత కల్పించాలి.

ఆదివాసీ బిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు.
శిరీష కుటుంబానికి న్యాయం చేయాలి – నిందితుడిని కఠినంగా శిక్షించాలి.

ఈ కార్యక్రమంలో JAC కమిటీ నాయకులు తుర్రం శ్రీనివాస్, మడకం సతీష్, సోడే కేశవరావు, రవ్వ నరేష్, గడ్డం సామేలు, సోయం రాజు, కొండ్రు మధు, కొండ్రు నాగరాజు, సోయం మహేష్ తదితరులు, మహిళలు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *