Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

#227175

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

🐟 *ములకలపల్లి సంతలో చేపలు కొంటున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు*
ములకలపల్లి మండల పర్యటనలో భాగంగా గౌరవ అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జారే ఆదినారాయణ గారు,ములకలపల్లి స్థానిక సంతను సందర్శించారు. ఈ సందర్భంగా సంతలోని వ్యాపారులు, ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం స్థానికంగా విక్రయిస్తున్న చేపలను స్వయంగా కొనుగోలు చేశారు. సాధారణ ప్రజలతో కలిసిమెలిసి, స్థానిక మార్కెట్‌లో సామాన్యుడిలా వ్యవహరించిన ఎమ్మెల్యే గారి తీరు అక్కడి ప్రజలను ఆకట్టుకుంది.

ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకుంటూ.. స్థానిక వ్యాపారులకు, ప్రజలకు అండగా నిలవడమే ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత అనే విధంగా ఎమ్మెల్యే గారి పర్యటన కొనసాగింది.

ప్రజలతో మమేకమై.. ప్రజల మనిషిగా నిలుస్తున్న మన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు. ❤️🙏🫶
ఈ కార్యక్రమంలో పాల్గొన్నజిల్లా నాయకులు బత్తుల అంజి గారు,MD జహీరుద్దీన్ గారు, అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలకుర్తి సుమిత్ గారు,సోయం నాగరాజు ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్, తదితరులు పాల్గొన్నారు…..

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *