Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

✍️అంజూరుపాలెంలో ఘనంగా పంచాయతీ కార్యాలయం, బ్రిడ్జి ప్రారంభం✌️💐

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

✍️*కేవీబీపురం: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. కేవీబీపురం మండలం అంజూరుపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం, బ్రిడ్జిని శనివారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.*🙏

✍️🙏*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. పంచాయతీ కార్యాలయం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభతరం అవుతాయని, బ్రిడ్జి నిర్మాణంతో రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు.*🙏

💐🙏గ్రామ అభివృద్ధిలో పంచాయతీ కార్యాలయం, బ్రిడ్జి ప్రారంభం మరో ముందడుగు అని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

✍️💐కార్యక్రమంలో కేవీబీపురం మండలానికి చెందిన పెద్దలు శ్రీ రామాంజులు నాయుడు, తెరణి జయరాం రెడ్డి, కనపర్తి గోపినాథ్ రెడ్డి, అవసరం సురేష్, బాలాజీ, శిరణీయం చంద్రబాబు, రమేష్, ప్రవీణ్ తదితరులతో పాటు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, యువకులు, కార్యకర్తలు, మహిళలు, పత్రికా మరియు మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

✍️గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు..
ప్రజల సౌకర్యాల కోసం నిరంతరం కృషి! ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం 💐🙏

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *