Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

*ఒకే ఒక్క వంతెన… మారిన వేల జీవితాలు!..*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*ఒకే ఒక్క వంతెన… మారిన వేల జీవితాలు!..*

దశాబ్దాల కలకు వారధి… జయలక్ష్మిపురం ప్రజలకు బతుకుబాట….*

*రైతన్నకు పొలంబాట…* *మూగజీవాలకు మేతబాట…* గ్రామస్తులకు విపత్తుల నుంచి విముక్తి
*— అభివృద్ధికి ఆదిమూలం ఒక చిరునామా*!
~~~~~~~~~~~~~~~~
*ప్రజల కన్నీరును తుడిచి… ప్రతి సమస్యకు పరిష్కారం చూపే నువ్వేనయ్యా మా నాయకుడివి ఆదిమూలమన్న నువ్వు చల్లంగా ఉండయ్యా సామి…:-🙏* రైతులు, గ్రామస్తులు, పశు రైతులు.
~~~~~~~~~~~~~~~~
కేవీబీపురం మండలం :-
ఒక వంతెన అంటే కేవలం రెండు ఒడ్డులను కలిపే నిర్మాణం కాదు… అది రెండు ప్రాంతాలను, రెండు తరాల ఆశలను, వేల కుటుంబాల జీవితాలను కలిపే అభివృద్ధి వారధి!…
~~~~~~~~~~~~~~~~
దశాబ్దాలుగా వర్షాకాలం వస్తే నది ఉధృతితో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితి… పంట పొలాలకు వెళ్లలేక రైతన్న పడే వేదన… వేలాది మూగజీవాలకు మేత అందించేందుకు పశుపోషకులు పడే అవస్థలు… ప్రతి ఏటా తుఫాన్లు, వరదల సమయంలో జలదిగ్బంధనంలో చిక్కుకునే జయలక్ష్మిపురం ప్రజల కన్నీటి గాథ…
~~~~~~~~~~~~~~~~
*ఇవన్నీ ఇక గతం*!
~~~~~~~~~~~~~~~~
కేవీబీపురం మండలం జయలక్ష్మీపురం సమీపంలో దాదాపు రూ.6 కోట్ల వ్యయంతో కాలంగి నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన భారీ వంతెనతో జయలక్ష్మిపురం గ్రామ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది.

*ఇది కేవలం ఒక వంతెన కాదు…గ్రామస్తులకు బతుకుబాట…రైతులకు పొలంబాట…పశుపోషకులకు మేతబాట… భవిష్యత్ తరాలకు అభివృద్ధి బాట!*
~~~~~~~~~~~~~~~~
*పట్టువదలని పట్టుదల… ఫలించిన ప్రయత్నం*
ఈ సమస్యను గుర్తించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సమస్య పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరియు ఉన్నతాధికారులు, ఇన్‌చార్జి మంత్రులు, తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేశారు.
~~~~~~~~~~~~~~~~
సమస్యను చెప్పి చేతులు దులుపుకోవడం కాదు…
పరిష్కారం జరిగే వరకు పట్టువదలకుండా ప్రయత్నించడం…
అదే ప్రజాప్రతినిధిగా ఆదిమూలం ప్రత్యేకత అని స్థానికులు చెబుతున్నారు.
____________________
ఒకప్పుడు వర్షాకాలం వస్తే నది దాటడం ప్రశ్నార్థకంగా మారేది. రైతులు అవతలి వైపున్న తమ పొలాలకు వెళ్లలేకపోయేవారు. పూలు, వరి, వేరుశనగ తదితర పంటలు సాగు చేసే రైతుల ఇబ్బందులు వర్ణనాతీతం.
అంతేకాదు… చుట్టుపక్కల దాదాపు ఎనిమిది గ్రామాలకు చెందిన పశుపోషకులు తమ పశువులకు మేత కోసం నది అవతలికి వెళ్లాల్సి వచ్చేది. నది ఉధృతంగా ఉన్న సమయంలో మేత తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో మూగజీవాలు కూడా ఇబ్బందులు పడేవి.
~~~~~~~~~~~~~~~~
*ఇప్పుడు ఆ పరిస్థితికి శాశ్వత పరిష్కారం లభించింది.*
*ఒక్క వంతెనతో… ఎన్నో సమస్యలకు చెక్!*
ఈ వంతెన అందుబాటులోకి రావడంతో—
జయలక్ష్మిపురం ప్రజలకు వర్షాకాల భయం తగ్గింది.
రైతులకు పంట పొలాలకు వెళ్లే మార్గం సుగమమైంది.
పశుపోషకులకు మేత తరలించడం సులభమైంది.
పంట రవాణాకు మార్గం ఏర్పడింది.
అత్యవసర సమయాల్లో గ్రామానికి రాకపోకలు సులభతరమయ్యాయి.
తుఫాన్లు, వరదల సమయంలో గ్రామస్తులకు భరోసా పెరిగింది.

అందుకే ఈ వంతెనను జయలక్ష్మిపురం ప్రజలు కేవలం నిర్మాణంగా కాకుండా తమ జీవితాల్లో వచ్చిన మార్పుకు ప్రతీకగా చూస్తున్నారు….
~~~~~~~~~~~~~~~~
అంజూరు పాలెం లో మరో అభివృద్ధి అడుగు
కేవలం జయలక్ష్మిపురం వంతెనతోనే కాదు… కె.వి.బి.పురం మండలం అంజూరు పాలెం గ్రామపంచాయతీ ప్రజలకు పాలనా సౌలభ్యం మరింత చేరువ చేసేందుకు నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం పూర్తి కావడం కూడా మరో అభివృద్ధి మైలురాయి.
నూతన భవనాన్ని ఎమ్మెల్యే ఆదిమూలం ప్రారంభించడంతో గ్రామస్తుల్లో ఆనందం వెల్లివిరిసింది.
~~~~~~~~~~~~~~~~
*గ్రామపంచాయతీకి సొంత భవనం ఉండటం అంటే కేవలం ఒక కార్యాలయం ఉండటం కాదు…*

ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడం… పాలన మరింత సులభతరం కావడం… గ్రామ అభివృద్ధికి ఒక స్థిరమైన కేంద్రం ఏర్పడటం.
~~~~~~~~~~~~~~~~
*అభివృద్ధి అంటే ఇదే కదా!*
ప్రజల జీవితాల్లో ప్రత్యక్షంగా మార్పు తీసుకురావడమే నిజమైన అభివృద్ధి.
కాగితాలపై కనిపించే హామీల కంటే…
ప్రజల కళ్లముందు కనిపించే వంతెన గొప్పది.
ప్రసంగాల్లో వినిపించే మాటల కంటే…
రైతు తన పొలానికి సులభంగా చేరుకోవడం గొప్పది.
అభివృద్ధి గురించి చెప్పడం కంటే…
అభివృద్ధిని ప్రజల గడపకు తీసుకురావడమే అసలైన నాయకత్వం.
ఆ కోణంలో చూస్తే జయలక్ష్మిపురం వంతెన ఒక సజీవ అభివృద్ధి సాక్ష్యం.
~~~~~~~~~~~~~~~~
*చంద్రబాబు సహకారం… ఆదిమూలం పట్టుదల*
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారం, నిధుల సమీకరణకు ఎమ్మెల్యే ఆదిమూలం చేసిన ప్రయత్నాలు కలిసివచ్చాయని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు.

ప్రజల అవసరాలను గుర్తించి…
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి…
నిధులు సాధించి…
పనులు పూర్తయ్యేలా కృషి చేయడం…

ప్రజాప్రతినిధి బాధ్యతను ప్రజల పట్ల చిత్తశుద్ధితో నిర్వర్తించడమేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
~~~~~~~~~~~~~~~~
*పేదోడి గుండెచప్పుడు వినే నాయకుడు ఆదిమూలం*……
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకుడు *రామాంజుల నాయుడు గారు మాట్లాడుతూ…*
“ప్రజాసేవే తన శాశ్వత శ్వాసగా, నియోజకవర్గ అభివృద్ధినే ధ్యేయంగా చేసుకుని ఎమ్మెల్యే ఆదిమూలం పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలనే తపన ఆయనలో ఉంది.
పేదోడి గుండెచప్పుడు వినేవాడే ఆదిమూలం… పేదోడి అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసేవాడే ఆదిమూలం గారు…
~~~~~~~~~~~~~~~~
ప్రజలు ఆయనపై ఉంచిన నమ్మకంతో రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే సంకల్పంతో ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉంటూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.

ఎంతోమంది నాయకులు వచ్చారు… వెళ్లారు… తమ వంతు సేవ చేసిన నాయకులు ఉన్నారు. కానీ ఆదిమూలం నియోజకవర్గ అభివృద్ధికి ఒక ఆశాకిరణంగా నిలుస్తున్నారు.
~~~~~~~~~~~~~~~~
*ఏడు పదులు దాటిన వయసులో కూడా* ప్రజల మధ్య తిరుగుతూ, ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏ సమస్య పరిష్కరించాలి? అనే ఆలోచనతో పనిచేయడం ఆయన అంకితభావానికి నిదర్శనం.

సేవ చేయాలనే మంచి మనసు… సేవాభావం… ప్రజలు పిలిస్తే పలికే మనస్తత్వం — ఈ మూడు ఆదిమూలంలో పుష్కలంగా ఉన్నాయి.
~~~~~~~~~~~~~~~~
*కె.వి.బి.పురం మాత్రమే కాదు…* సత్యవేడు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అభివృద్ధికి చిరునామాగా నిలవాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు” అని రామాంజుల నాయుడు పేర్కొన్నారు.
~~~~~~~~~~~~~~~~
నాయకుడు మారితే… అభివృద్ధి దిశ మారుతుంది!
ప్రజలు నాయకుడిని ఎన్నుకునేది కేవలం పదవిలో కూర్చోబెట్టడానికి కాదు…
తమ సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరించే వ్యక్తి కోసం.
జయలక్ష్మిపురం వంతెన కథ కూడా అదే చెబుతోంది.

ఒక సమస్యను గుర్తించడం ఒక అడుగు…
దాని కోసం పోరాడటం రెండో అడుగు…
నిధులు సాధించడం మూడో అడుగు…
పనులు పూర్తయ్యే వరకు పర్యవేక్షించడం నాలుగో అడుగు…
~~~~~~~~~~~~~~~~
*ప్రజల జీవితాల్లో ఆ అభివృద్ధి ఫలాలను చూడటం — అసలైన విజయమనే చెప్పాలి.*
జయలక్ష్మిపురం వంతెన ఇప్పుడు అదే విజయానికి ప్రతీకగా నిలిచింది.
దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది…
రైతన్నకు కొత్త భరోసా వచ్చింది…
పశుపోషకులకు మేతబాట ఏర్పడింది…
గ్రామస్తులకు వర్షాకాల భయం తొలగింది…
అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడింది!
అందుకే ప్రజల మాటల్లో ఒక్కటే వినిపిస్తోంది…
~~~~~~~~~~~~~~~~
“ఒకే ఒక్క వంతెన… మా జీవితాలనే మార్చేసింది!”
అభివృద్ధి కోసం ఆలోచన…
ప్రజల కోసం పోరాటం…
సమస్యల పరిష్కారం కోసం పట్టుదల…
ప్రజాసేవ కోసం అంకితభావం…
ఈ నాలుగు కలిసినప్పుడే ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వస్తుంది.

ఆ మార్పు దిశగా సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిమూలం చేస్తున్న ప్రయత్నాలకు జయలక్ష్మిపురం వంతెన ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది….

*ఒకే ఒక్క వంతెన… మారిన వేల జీవితాలు!..*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *