Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

యలమంచిలి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గొల్లవిల్లి చిన్నాజీ ఎన్నిక..!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యలమంచిలి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గొల్లవిల్లి చిన్నాజీ ఎన్నిక..!!

వార్త ముఖ్యాంశాలు

  • 6 ఓట్ల తేడాతో విజయం..
  • నూతన కార్యవర్గం ఎంపిక..!!!
  • పున్నమి - కే.

6 ఓట్ల తేడాతో విజయం.. నూతన కార్యవర్గం ఎంపిక..!!!

పున్నమి – కే. ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో ) :

యలమంచిలి ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా గొల్లవిల్లి చిన్నాజీ ఎన్నికయ్యారు. గురువారం యలమంచిలిలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడంతో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 42 ఓట్లు నమోదు కాగా, చిన్నాజీ తన ప్రత్యర్థిపై 6 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
నూతన కార్యవర్గంలో కార్యదర్శిగా ధర్మిరెడ్డి అప్పలనాయుడు, గౌరవ అధ్యక్షుడిగా పి.ఎస్.ఎన్. మూర్తి, ఉపాధ్యక్షుడిగా అప్పికొండ గణేష్, కోశాధికారిగా నానేపల్లి సన్యాసిరావు, సహాయ కార్యదర్శిగా పి. లోకేష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా రాచకొండ శ్రీనివాస శర్మ, ఆర్.ఎస్. నాయుడు, ఎం. రాము, ఆదిరెడ్డి, త్రినాథ్ ఎంపికయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పిల్లా రమాకుమారి హాజరయ్యారు. అలాగే రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్. స్వామి, జిల్లా అధ్యక్షుడు కోరాడ చందర్రావు, ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షుడు దాట్ల సుబ్బరాజు, టివియస్ ప్రకాష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కిషోర్, ఆడారి గంగాధర్, నగిరెడ్డి సత్యనారాయణ, పిల్లా శివ, చాకలి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *