Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

యలమంచిలి పురపాలక సంఘం లో స్వచ్ఛతాహి సేవ -2026

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యలమంచిలి పురపాలక సంఘం లో స్వచ్ఛతాహి సేవ -2026

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) యలమంచిలి మున్సిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో సానిటరీ ఇన్స్పెక్టర్ వారి పర్యవేక్షణ లో సఫాయి మిత్రుల భద్రత మరియు సంక్షేమం అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోమలింగపాలెం పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ సి హెచ్.
  • మోహన్ చక్రి హాజరయ్యారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

యలమంచిలి మున్సిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో సానిటరీ ఇన్స్పెక్టర్ వారి పర్యవేక్షణ లో సఫాయి మిత్రుల భద్రత మరియు సంక్షేమం అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోమలింగపాలెం పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ సి హెచ్. మోహన్ చక్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ వర్కర్లు వారు పని చేయు ప్రదేశంలో భద్రత, వారికి ప్రభుత్వం అందజేయ సంక్షేమం గురించి వివరించారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేయుచున్న నమస్తే ప్రోగ్రామ్ లో పబ్లిక్ హెల్త్ వర్కర్లు మరియు వేస్ట్ పిక్కర్ లను నమోదు చేయడం ద్వారా వారికి ప్రభుత్వం అందించినటువంటి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను, నమస్తే ఐడి కార్డులను, పి పి ఈ కిట్లను అందించారు. అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞను చేయించారు.మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ సానిటరీ వర్కర్లు యొక్క పని ప్రదేశంలో వాళ్ళ ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలోమున్సిపల్ మేనేజర్ కె.విజయ్ కుమార్, సానిటరీ సెక్రటరీలు, పబ్లిక్ హెల్త్ వర్కర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *