Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు

వార్త ముఖ్యాంశాలు

  • అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ తాజా ఉత్తర్వుల మేరకు పింఛన్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.
  • రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎప్పటిలాగే ఇంటి వద్ద నగదు రూపంలో అందజేయనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ తాజా ఉత్తర్వుల మేరకు పింఛన్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎప్పటిలాగే ఇంటి వద్ద నగదు రూపంలో అందజేయనున్నారు.

60 నుంచి 79 ఏళ్ల వృద్ధులకు కేంద్ర వాటా రూ.200, రాష్ట్ర వాటా రూ.3,800 కలిపి మొత్తం రూ.4,000 అందుతుంది. 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 బ్యాంకులో, రూ.3,500 నగదుగా అందజేస్తారు. వితంతువులకు వయస్సును బట్టి రూ.300 లేదా రూ.500 బ్యాంకులో జమ చేసి, మిగిలిన మొత్తాన్ని నగదుగా అందించనున్నారు.

వికలాంగులకు మొత్తం రూ.6,000 పింఛన్‌ యథావిధిగా కొనసాగుతుంది. 18 నుంచి 79 ఏళ్ల వారికి రూ.300 బ్యాంకులో, రూ.5,700 నగదుగా, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 బ్యాంకులో, రూ.5,500 నగదుగా అందజేయనున్నారు. దీంతో లబ్ధిదారులకు అందే మొత్తం పింఛన్‌లో ఎలాంటి తగ్గింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *