Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ కాళహస్తి, జులై 24, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని (హాస్టల్) శుక్రవారం నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సందర్శించారు.
  • ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని విద్యార్థినులను స్వయంగా కలిసి, కూటమి ప్రభుత్వం తరఫున వారికి ఉచితంగా బ్లాంకెట్లు (దుప్పట్లు), షూస్‌ను పంపిణీ చేశారు.
  • అనంతరం విద్యార్థినులతో సరదాగా ముచ్చటించిన ఎమ్మెల్యే, హాస్టల్‌లో అందుతున్న వసతులు మరియు రోజువారీ భోజన నాణ్యతపై స్వయంగా ఆరా తీశారు.

శ్రీ కాళహస్తి, జులై 24, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని (హాస్టల్) శుక్రవారం నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని విద్యార్థినులను స్వయంగా కలిసి, కూటమి ప్రభుత్వం తరఫున వారికి ఉచితంగా బ్లాంకెట్లు (దుప్పట్లు), షూస్‌ను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థినులతో సరదాగా ముచ్చటించిన ఎమ్మెల్యే, హాస్టల్‌లో అందుతున్న వసతులు మరియు రోజువారీ భోజన నాణ్యతపై స్వయంగా ఆరా తీశారు. ఈ క్రమంలో వసతి గృహంలో ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డుల కొరత ఉందంటూ విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించారు. వారం రోజుల్లోగా హాస్టల్‌కు కావలసిన కొత్త ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డులను స్వయంగా ఏర్పాటు చేసి ఇస్తానని విద్యార్థినులకు అక్కడికక్కడే హామీ ఇచ్చారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే పేద విద్యార్థినులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా, వారు చక్కగా చదువుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *